Proverbs - సామెతలు 6 | View All

1. నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల

2. నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు

3. నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.

4. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

5. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.

6. సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

7. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను

8. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

9. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

10. ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు

11. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు

13. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును.

14. వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.

15. కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.

16. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

17. అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

18. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

19. లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

21. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

22. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

24. చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.

26. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.

27. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?

28. ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?

29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

30. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

31. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

33. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

34. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.

35. ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-2 పూటపడిన అనే మాటకు "వేరొకరు తీసుకున్న అప్పుకు హామీగా (పూచీకత్తు) నిలబడడం” అని అర్థం. అంటే ఋణగ్రహీత ఆ అప్పు చెల్లించకపోతే, ఆ బాకీ తీర్చవలసిన బాధ్యత పూటపడిన వ్యక్తి కుమారుని
మీద పడుతుంది. అప్పుడా కుమారుణ్ణి బంధించి చెరసాలలో వేస్తారు (బ్రూస్ వాల్‌), పరుని చేతిలో నీవు నీ చేయి వేసినయెడల అంటే ఒక ఒప్పందాన్ని అధికారపూర్వకంగా ఖరారు చేసుకుంటూ "ఎదుటి వ్యక్తి అరచేతిలో తన అరచేతి నుంచడం” అనే భంగిమ (రూతు 4:7-8)ను సూచిస్తుంది. అంటే అది ఇప్పటి కరచాలనానికి, ఒప్పందం మీద సంతకం చేయడానికి సమాంతరంగా ప్రాచీనకాలంలో జరిగే విధానం. చెలికాని (పొరుగువాడు) కోసం లేదా స్నేహితుడి కోసం తన స్వంత ఆస్తుల్ని, పేరుప్రతిష్ఠల్ని అపాయంలో పడవేసుకోవడం మంచి పని కాదు (17:18), పరుని విషయంలో ఇది అసలే మంచిది కాదు (11:15; 20:16; 27:13 చూడండి; 22:26 తో పోల్చండి). 

6:3 ఈ వచనంలో కుమారుడు తన పొరుగువాని స్వాధీనంలో ఉన్నాడు (అక్షరార్థంగా “చేతిలో", వ.2 చూడండి). ఎందుకంటే చెలికాడు బాకీ చెల్లించకపోతే దానిని కుమారుడు చెల్లించక తప్పదు. కాబట్టి అతడు త్వరపడి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి తనను విడిచిపెట్టమని బలవంతము చేయాలి. ఆ పొరుగువాడు తనను ఆ హామీ నుండి తప్పించే వరకు నిరంతరం వత్తిడి చేస్తూనే ఉండాలి. 

6:4 పనిచేస్తూ ఉండవలసిన సమయంలో ఒక వ్యక్తి నిద్ర పోవడం, కునుకు తీయడం నాశనానికి దారితీస్తుంది (వ.9-11). 

6:5 ఈ వేటగాడు పక్షుల్ని వేటాడే వ్యక్తి (కీర్తన 91:3; యిర్మీయా 5:26; హో షేయ 9:8). 

6:6 ఏ పనీ, ప్రయత్నమూ లేకుండా జీవితాన్ని గడుపుదామనుకునే వ్యక్తి ఈ సోమరి (20:4; 21:25; 26:14). ఇతనికి తన చేతిని పైకెత్తడానికి కూడా బద్దకమే (19:24). సోమరి పని ఎగగొట్టడానికి రకరకాల సాకులు వెదకుతాడు (22:13), అణచివేతకు, పీడనకు గురైనవారిలాగా కాక (31:9), సోమరి తన బద్దకంచేత పేదరికాన్ని తెచ్చుకుంటాడు కాబట్టి అతడు జాలినొందదగిన వ్యక్తి కాదు. కష్టపడి పనిచేసే వ్యక్తి సోమరికి వ్యతిరేకి (13:4). సోమరి గురించి తండ్రి చెబుతున్న ఉపదేశం అతని సోమరితనానికి వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా కూడా ఉంది (19:25). జ్ఞానం కలిగిన వ్యక్తి పరిశీలన ద్వారా నేర్చుకుంటాడు (24:32; 30:24-28 చూడండి; 1:3 లో "బుద్ధి కుశలత" పై నోట్సు చూడండి). 

6:7-8 వేసవి కాలంలో ఆహారం సేకరించి తమ పుట్టల్లో భద్రపర్చుకునే శ్రామికచీమల గురించి ఈ వచనాలు వివరిస్తున్నాయి. 

6:9 ఎందాక అనే ఈ ప్రశ్న వేయడం దీర్ఘకాలంగా అక్కడ ఏదో చెడు కొనసాగుతూ ఉన్నదని సూచిస్తున్నది (1:22; నిర్గమ 10:3; కీర్తన 74:10 తో పోల్చండి). 

6:10 నిద్రించెదనని... కునికెదనని గురించి వ.4 నోట్సు చూడండి. 

6:11. ఈ సందర్భంలో పేర్కొన్న దారిద్ర్యము ఒక వ్యక్తి తనకు తానుగా తెచ్చుకున్న పేదరికమే (13:18; 28:19). వీరు ఇతరుల అణచివేతకు, దోపిడీకి గురై, పరిస్థితులు తమ చేతుల్లో లేని కారణంగా పేదరికంలో మగ్గుతూ దయ పొందడానికి పాత్రులైన నిర్భాగ్యులు కాదు (19:17). దోపిడిగాడు అనే పదానికి అర్థం “సంచారి" అయినప్పటికీ ఇది దేశదిమ్మరిగా తిరిగే పనికిమాలిన వ్యక్తిని సూచిస్తుంది. మనం ఎదురు చూడని సమయంలో ఆయుధధారుడు హఠాత్తుగా దాడిచేస్తాడు.

6:12 పనికిమాలిన అనే మాటకు హెబ్రీ మూల పదమైన బెలియాల్ అంటే మంచిదైన ప్రతిదానినీ, దేవుని అధికారాన్ని ఎదిరించే తంటాలమారి లేదా ఇబ్బంది కలిగించేవాడు అని అర్థం (16:27; 19:28; 28న 13:7; యోబు 34:18). బెలియాల్ అనే హెబ్రీ పదం పలుచోట్ల “దుష్టులు" అనే అర్థంలో అనువదించారు (ద్వితీ 13:13; న్యాయాధి 19:22; 20:13; 1సమూ 2:12, 2సమూ 20:1). వ.12-14 లు ఈ “పనికిమాలినవాడి" గురించి వర్ణిస్తాయి. హెబ్రీ. “బెలియాల్" అనే పదం అపవాదికి (సాతాను) పర్యాయపదంగా మారింది (2కొరింథీ 6:15).

6:13 శరీర కదలికలు, సైగలతో చేసే భావప్రకటనలు కుట్రపూరితమైనవి, వంచనతో నిండినవిగా కనిపిస్తున్నది. (16:30; యెషయా 58:9). వీటిలో కన్ను గీటడం, కాళ్లతో సైగ చేయడం, వ్రేళ్లతో గురుతులు చూపడం ఉన్నాయి. 

6:14 అతిమూర్ణ స్వభావము గురించి 2:12 నోట్సు చూడండి. జగడములు పుట్టించడం అంటే విరోధాలు వివాదాలు రేకెత్తించడమని అర్థం (6:19; 16:28; యిర్మీయా 15:10) 

6:15 ఇక్కడ హఠాత్తుగా అనే మాటలో ఆశ్చర్యచకితుల్ని చేయడం అనే భావం ఇమిడి ఉంది. (24:22; యెహా 10:9; ప్రసంగి 9:12; యెషయా 47:11). వినాశనం ఎంత వేగంగా వస్తుందో ఆ క్షణమందే అనే మాట నొక్కి చెప్తున్నది (యెషయా 29:5-6; 30:13 చూడండి; యిర్మీయా 4:20 తో పోల్చండి). ఈ వచనంలోని చివరి మాటలకు "ఇంక దీనికి స్వస్థత లేనే లేదు” అనే అర్థం ఉంది. 

6:16 హేయములు గురించి 3:32 నోట్సు చూడండి. 

6:17 అహంకార దృష్టి అంటే "ఉన్నతంగా హెచ్చించుకోవడం” అని అక్షరార్ధం. ఇది దేవుని అధికారాన్ని ధిక్కరించే గర్విష్ఠులైన ప్రజలను గురించి వర్ణిస్తుంది (21:4; 30:13 చూడండి; 2రాజులు 19:22; కీర్తన 18:27; 131:1; యెషయా 10:12; 37:23 తో పోల్చండి). 

6:18 ఇక్కడ కనిపించే లక్షణాల జాబితా మధ్యభాగంలో దుర్యోచనలు యోచించే హృదయము ఉంది. 1:16 తో పోల్చండి. 

6:19 లేనివాటిని పలకటం, అబద్దసాక్షిగా ఉండడం ఈ రెండింటి అర్థం ఒకటే. మరింత స్పష్టత కోసం రెండింటినీ ఇక్కడ ఉపయోగించారు (14:5; 19:5). జగడములు గురించి వ.14 నోట్సు చూడండి.

6:20-24 ఉపదేశాన్ని (ఆజ్ఞ) మన జీవనసారంగా చేసుకున్నప్పుడు అది మనం నైతిక సవాళ్లనెదుర్కొ నేలా చేయగలదు (కీర్తన 119:11). వ.21లో, వాటిని అనే పదం ఉపదేశాన్ని సూచిస్తుంది. జ్ఞానము వ.22లో అది గాను, వ.20లో ఆజ్ఞ, ఉపదేశము గాను ప్రస్తావించబడింది. సాధారణంగా జ్ఞానాన్ని స్త్రీతో పోల్చడం చూస్తాం. ఇక్కడ కనిపించే "నడిపించును” అనే పదం, కీర్తన 23:3 లోని “నడిపించుచున్నాడు” అనే పదం ఒకే అర్థాన్నిస్తున్నాయి. నడవడం, పరుండడం, మేల్కొనడం దైనందిన జీవితంలోని నిత్యకృత్యాలు (ద్వితీ 6:7; కీర్తన 139:2). జీవమార్గములు గురించి 3:22 నోట్సు చూడండి. పర స్త్రీ... ఇచ్చకపు మాటలు గురించి 2:16-17 నోట్సు చూడండి. 

6:25 కనుసైగలు, చూపులు కలపడం తరచుగా లైంగిక పాపాలకు నాందిగా ఉంటాయి (యాకోబు 1:14-16 తో పోల్చండి).

6:26 వేశ్య దగ్గరికి వెళ్లే వ్యక్తికి చివరికి ఒక రొట్టెతునక మాత్రము మిగులు తుంది అనేది భావం. వేశ్య దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఆమెకు రొట్టెముక్క అవుతాడనే భావం కూడా అయ్యుండవచ్చు. ఇది వేశ్యాసాంగత్యం క్షమార్హమైందని చెప్పడం కోసం కాదు (1కొరింథీ 6:15-20), దాని పర్యవసానం దారుణంగా ఉంటుందని పోల్చి చెప్పడం కోసమే. జీవితాన్ని మాత్రమే కాదు, ప్రాణమును సైతం వేశ్య లేదా వ్యభిచారిణి నాశనం చేస్తుంది. 

6:27-29 ఈ వచనాలు శిక్ష అనివార్యమని వివరిస్తున్నాయి. శిక్ష తప్పించు కొనడమంటే ఒక వ్యక్తి నిర్దోషి అనీ, లేదా క్షమార్హుడనీ, లేదా శిక్ష నుండి తప్పించ బడ్డాడనీ అర్థాన్నిచ్చే న్యాయ పరిభాష. అంటే అపరాధం నుండి పాపపుభారం నుండి లేదా శిక్ష నుండి నిర్దోషిగా లేదా శుద్దుడుగా విడుదల కావడం (నిర్గమ 21:19; సంఖ్యా 5:31). శిక్ష తప్పించుకొనక పోవడమంటే శిక్ష అనివార్యమని నొక్కి చెప్పడం (11:21; 16:5; 17:5; 19:5, 9; 28:20 చూడండి; నిర్గమ 34:7; 1రాజులు 2:9; యిర్మీయా 25:29; 49:12 తో పోల్చండి).

6:30-33 దొంగతనం చేసినందుకు శిక్షగా భారీ అపరాధరుసుము చెల్లించాలి. అయితే కొన్ని తప్పని పరిస్థితుల్లో సమాజం దొంగ పట్ల జాలి చూపిస్తుంది. ఏడంతలు అంటే ఏడు రెట్లు అని కాదు, అపరాధ రుసుము మొత్తాన్ని పూర్తిగా చెల్లించడాన్ని సూచిస్తుంది, ఇది దొంగ తస్కరించినదానికి రెండు నుండి అయిదు రెట్లు వరకు ఉండవచ్చు (నిర్గమ 22:1,7,9; లూకా 19:8 తో పోల్చండి), ఆ దొంగ మళ్లీ దొంగతనం చేసినట్లయితే తన ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు. జారత్వం చేసే వ్యక్తి బుద్ధిశూన్యుడు (అక్షరార్ధంగా "హృదయం లేనివాడు” అని అర్ధం - 4:23 నోట్సు చూడండి; 8:5 తో పోల్చండి), అంటే ఆలోచించే జ్ఞానం లేనివాడు. అతను శిక్షతోబాటు ఎన్నటికీ తొలగిపోని అపకీర్తిని కూడగట్టుకుంటాడు.

6:34-35 న్యాయస్థానం అపరాధరుసుమును చెల్లించుటతో సరిపెట్టుకుం టుంది (వ.31). అయితే పౌరుషంగల భర్త ఆ విధంగా సరిపెట్టుకోలేడు (27:4; పరమ 8:6 తో పోల్చండి). ప్రాయశ్చిత్తమేమైన గురించి 18:5 దగ్గర “పక్షపాతం" గురించి నోట్సు చూడండి. వ.35 మొదటి భాగాన్ని “ఎంతటి ప్రాయశ్చిత్తం చెల్లించినా అతడు లెక్కచేయడు" - అని అనువదించవచ్చు. మోసగించబడిన భర్తను శాంతింపజేయడానికి ఎన్ని బహుమానములు ఇచ్చినా ఫలితం ఉండదు.. 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |