14:1 "8-9 అధ్యాయాల్లో ఉన్న "జ్ఞానం” కాక, ఈ జ్ఞానవంతురాలు ఒక సాధారణ. స్త్రీ. తన యిల్లు కట్టుకొనే ("కుటుంబం” లేదా “సంసారం" - 3:33 నోట్సు చూడండి) జ్ఞానవంతురాలైన స్త్రీని వెదకి భార్యగా చేసుకోమని (31:10) సొలొమోను తన కుమారుడికి ఉపదేశిస్తున్నాడు (1:8). స్త్రీలు కట్టేవారిగా ఉండాలి గానీ నాశనం చేసేవారిగా ఉండకూడదనే ఉపదేశమిది.
14:2 ప్రవర్తించు అంటే “నడచుకోవడం" అని అక్షరార్థం. కుటిలచిత్తుడు సరైన మార్గాన్న నడుస్తున్నట్లు నటిస్తాడు. కానీ అతడు నడిచే త్రోవలు సరైనవికావు (2:15తో పోల్చండి).
14:3 హెబ్రీలో ఈ వచనం మొదటి పంక్తికి “బుద్దిలేనివాడి నోటిలో గర్వమనే బెత్తం ఉంది” అని అర్థం. “బుద్దిలేనివాడి నోట నుండు బెత్తము గర్వమే" అనేది ఒక భావన. మరొక అర్థంలో “బెత్తము” మూఢులను శిక్షించే ఒక సాధనం కూడా (13:24), బుద్దిలేనివాడి నాలుక అతనికే శిక్షను తెస్తుంది.
14:4 లేని చోట అనే మాటను “పవిత్రమైన” అనే భావాన్నిచ్చే “శుభ్రమైన” అని కూడా అనువదించవచ్చు. ఎద్దులు లేకపోతే వాటికి మేత వేసి వాటిని శుభ్రం చేసే పని ఉండదు. అదే విధంగా ఎద్దులు లేనట్లయితే విస్తారము వచ్చుబడి, అంటే మంచి రాబడి కూడా ఉండదు. కొన్నిసార్లు మనం పెట్టే పెట్టుబడి వలన కలిగే ప్రయోజనాల కంటే మనం పెట్టే ఖర్చు, అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి.
14:5 ఒక సాక్షి గుణలక్షణాలను బట్టి అతడు చెప్పే సాక్ష్యమెలా ఉంటుందో చెప్పవచ్చు (6:19; 27:21 తో పోల్చండి).
14:6 అపహాసకుడు చూపే గర్వాన్ని బట్టి (21:24; 1:22 నోట్సు చూడండి) అతడు మొఱ పెట్టినప్పుడు దేవుడు జవాబివ్వడు (3:34). జ్ఞానముకు ముందు వినయం ఉండాలి (15:33). అపహాసకులు ప్రతి విషయాన్నీ సందేహిస్తారు కాబట్టి జ్ఞానాన్ని అభ్యసించలేరు. తెలివిగల వానిలో కపటం ఏమీ ఉండకపోగా
నేర్చుకోడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు (వ. 15,18; 8:9).
14:7 బుద్ధిహీనుడి సమస్య అజ్ఞానం కాదు. సత్యం పట్ల గౌరవం లేకపోవ డమే. అతడెప్పుడూ తనకు. “సౌకర్యంగా ఉండే భ్రమల్ని" కోరుకుంటాడు (డెరెక్ కిడ్నర్).
14:8 బుద్దిహీనులు (హెబ్రీ. ఏవిల్; 1:22 నోట్సు చూడండి) కనపరిచే మూఢత (హెబ్రీ. కేసిల్; 1:7; 5:23 నోట్సు చూడండి) నే వారి మోసకృత్యము అని చెప్పవచ్చు. వారు తమ మూఢత్వం ద్వారా తమను తామే మోసం చేసుకుంటున్నారని, లేక వారు ఇతరులకు చేసే మోసంలో వారి మూఢత్వం స్పష్టమవుతుందని కూడా అర్థం ఇస్తుండవచ్చు.
14:9 యథార్థవంతులు అపరాధ పరిహారార్థబలి అవసరతను గుర్తిస్తారని, మూధులు ఇతరుల దయను పొందరని చెప్పవచ్చు..
14:10 ఎదుటి వ్యక్తి హృదయములోని అనుభూతులను ఎవరూ గ్రహించ లేరు. సహానుభూతి చూపించే ప్రయత్నం మంచిదే (రోమా. 12:15) గానీ, అయితే మన హృదయాలెలా ఉన్నాయో దేవునికి మాత్రమే పరిపూర్ణంగా తెలుసు (15:11; 1రాజులు 8:39; కీర్తన 44:21; లూకా 9:47; 16:15; అపొ.కా.1:24; 15:8), దేవుడు మన శ్రమల్లో మనకు సానుభూతిని చూపిస్తాడు (హెబ్రీ 4:15).
14:11 వర్దిల్లును అంటే “చిగురించును” అని అక్షరార్థం. అది నూతన జీవంతో ఎదుగుతుంది.
14:12 తుదకు గురించి 5:11 నోట్సు చూడండి.
14:13 దుఃఖము అనే మాటకు “బాధ” అని అక్షరార్థం. పైకి కనబడేవి మోసపూరితం కావచ్చు. ఆ విషయముల నిజమైన స్వభావం వాటి అంతంలో బయటపడుతుంది.
14:14 ఇహలోక జీవితంలో అన్ని పరిస్థితులు ధర్మానుకూలంగా కనిపించక పోయినా గానీ, నిత్యత్వంలో ప్రతి వ్యక్తి తాను దేనికి పాత్రుడో దానినే పొందుతాడు. (“తృప్తి పరచబడతాడు” అని అక్షరార్థం). భక్తి విడిచినవాని అనే పదానికి “హృదయాన్ని ప్రక్కకు తిప్పుకున్నవాడు" అని అక్షరార్థం. అతడు ముందు మంచిమార్గంలో నడవడానికే మొదలుపెట్టాడు గానీ తరువాత తన హృదయాన్ని పక్కకు తిప్పుకొన్నాడని అర్థం (హెబ్రీ 6:4-6)
14:15 అపహాసకుడు ప్రతి విషయాన్నీ తృణీకరిస్తాడు. (వ.6 నోట్సు చూడండి), జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. దాని ఫలితంగా అతడు దారి తప్పిపోతాడు. వివేకియైనవాడు దైవిక జ్ఞానంతో తన నడతలను కనిపెడతాడు (అక్షరార్థంగా “అర్థం చేసుకుంటాడు") అని అర్థం.
14:16 జ్ఞానము గలవాడు యెహోవాకు భయపడి కీడు నుండి తొలగును (3:7; 16:6). ఇందుకు భిన్నంగా బుద్ధిహీనుని (హెబ్రీ. కేసిల్) అహంకారం అతణ్ణి ఇరుకున పడవేస్తుంది. బుద్ధిహీనుడు తాను భద్రంగా ఉన్నాననే కృత్రిమ భరోసాతో నిర్భయముగా, ఆత్మవిశ్వాసంతో నడుస్తాడు (1:33 నోట్సు చూడండి). కాని అది సరైన విధానం కాదు.
14:17 త్వరగా కోపపడువాడు ముందు ఆలోచించుకోకుండా ఉద్రేకపూరి తుడై మూర్ఖంగా చెడు పనులు చేస్తాడు (24:8). దుర్యోచనలు గలవాడు (1:4 దగ్గర "వివేచనయు" వివరణ చూడండి) తనలోని దుష్టస్వభావాన్ని బట్టి . ఉద్దేశపూర్వకంగానే చెడు " పనులు చేస్తాడు.. - (24:8). వీరిలో ఎవ్వరూ వర్దిల్లరు. ఆగ్రహావేశాలు గలవాడు మూర్ఖత్వంతో తన జీవితాన్ని చెల్లాచెదురు చేసుకుంటాడు (14:29), దుర్యోచనలు గలవాడు ఇతరులచేత ద్వేషింపబడును (12:2).
14:18 జ్ఞానం లేనివారు (1:4 నోట్సు చూడండి) జ్ఞానాన్ని అభ్యసించడానికి నిరాకరించడం వలన అజ్ఞానంలో ఉండి పోయి సుళువుగా మోసపోతారు, మూఢత్వమే వారి స్వాస్థ్యము (3:35 నోట్సు చూడండి).
14:19 భక్తిహీనులు నీతిమంతుల యెదుట వంగుతారని దీని అంతర్భావం. పూర్వకాలంలో పట్టణాల తలుపునొద్దను (పట్టణ ద్వారాల దగ్గర) తీర్పులు జరిగేవి. అంటే అక్కడ నీతిమంతులు ప్రముఖస్థానాల్లో కూర్చుని (31:23) దుష్టులకు తీర్పు తీరుస్తారని ఇది సూచిస్తుంది. ఇది అన్నివేళలా ఈ జీవితంలో నిజం కాకపోవచ్చు గానీ, నిత్యత్వంలో నిశ్చయంగా జరిగి తీరుతుంది.
14:20 ఇది వాగ్దానం గానీ ధృవీకరణ గానీ కాదు. (తరువాతి వచనం చూడండి). ఇది మానవ స్వభావం గురించిన ఒక సూక్ష్మ పరిశీలన.
14:21 ధన్యుడు గురించి 3:13-18 నోట్సు చూడండి.
14:22 కృపాసత్యముల గురించి 3:3-4 నోట్సు చూడండి.
14:23 వట్టి మాటలు అంటే "పెదవుల మాటలు” అని అక్షరార్ధం (2రాజులు 18:20). భౌతికంగా, మానసికంగా అలసట లేక విసుగు పుట్టించే కఠినమైన పనిని కష్టము అన్నారు. దేవుని దీవెన లేనట్లయితే ఏ కష్టమైనా వృథా అవుతుంది. (10:22; కీర్తన 127:1-2). అయితే, అసహనంతో అజాగ్రత్తగా పనిచేయడం కంటె (21:5), సోమరితనం కంటె (10:5), మోసం కంటె (13:11), శీఘ్రమే డబ్బులు సంపాదించాలనే పథకాల కంటె (28:20) కష్టించి పనిచేయడం (6:6-11) మేలైనది.
14:24 భూషణము గురించి 4:9 నోట్సు చూడండి. బుద్ధిహీనులు (హెబ్రీ. కేసిల్) ఎక్కడ ప్రారంభిస్తారో అక్కడే చివరికి ముగిస్తారు.
14:25 నిజము పలుకు, అబద్దము లాడువాడు గురించి 12:17 నోట్సు చూడండి.
14:26 బహు ధైర్యము గురించి 21:22 నోట్సు చూడండి.
14:27 "జ్ఞానుల ఉపదేశము” బదులు యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట అని ఉండడం మినహా ఈ వచనం 13:14 వచనం లాగానే ఉంది. జ్ఞానానికి మూలం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే కాబట్టి (9:10; 15:33) వీటిని ఒకదాని బదులు మరొకటి ఉపయోగించు కొనవచ్చు.
14:28 తన అనుచరులు తనను విడిచి వెళ్ళిపోయినప్పుడు రాజు వినాశ నానికి, భయభ్రాంతులకు గురి కాగలడు (1సమూ 13:11-12; 30:6; 1రాజులు 12:1-20).
14:29 దీర్ఘశాంతము అంటే “నిదానంగా కోపపడడం" అని- అక్షరార్థం. “సామెతలు" గ్రంథానికి వెలుపల పాత నిబంధనలో ఈ పదాన్ని అన్ని చోట్ల దేవునికి ఉపయోగించడం జరిగింది. (నిర్గమ 34:6; సంఖ్యా 14:18; నెహెమ్యా 9:17; కీర్తన 86:15; 103:8; 145:8; యెషయా 48:9; యిర్మీయా 15:15; యోవేలు 2:13; యోనా 4:2; నహూము 1:3).
14:30 యుక్తమైన దాని కోసం తపన కలిగి ఉండడం లేదా పౌరుషం (పట్టుదలతో కూడిన ఈర్ష్య) కలిగి ఉండడం తప్పు కాదు (సంఖ్యా 25:11; 1రాజులు 19:10; కీర్తన 69:9), అయితే పాపాత్ముల విషయంలోను (3:31; 23:17; 24:1,19), దేవుడు ఇతరులకు ఇచ్చినవాటిని లేదా అప్పగించిన వాటిని చూచి (కీర్తన 106:16; ప్రసంగి 4:4; యాకోబు 3:16) ఈర్ష్యపడకూడదు.
14:31 దరిద్రుని అణచివేసేవారు వాని సృష్టికర్తను అవమాన పరుస్తున్నారు.
14:32. నీతిమంతుడు తన మరణ సమయంలో లేదా మరణానంతరం (హెబ్రీలో అస్పష్టంగా ఉంది) అయినా యెహోవాలోనే ఆశ్రయం పొందుతాడు.
14:33 బుద్ధిహీనుల మధ్య జ్ఞానము (హెబ్రీ. కేసిల్) కనబడవచ్చునేమో గానీ తెలివిగలవాని హృదయంలో జ్ఞానం "నెమ్మది కలిగి నివసిస్తుంది"
14:34 అనేక సామెతలు వ్యక్తిగత నైతికతను ప్రోత్సహిస్తుండగా, ఈ సామెత దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది.
14:35 బహుశా ఇక్కడ పేర్కొన్న సేవకుడు ఇంటిలోని దాసుడు కాక, రాజు ఆస్థానంలో ఒక ఉద్యోగి అయ్యుండవచ్చు.