13:1-9 ఉపమానములు అనే మాట, అనేక రకాల అలంకారిక పదాలను సూచిస్తుంది. యేసు చెప్పిన ఉపమానాలు ఒకే ఒక్క ముఖ్యమైన సత్యాన్ని బోధించే సామాన్యమైన రూపకాలని అనేకమంది వ్యాఖ్యాతలు నొక్కి చెప్పినా, తన సొంత ఉపమానాలకు యేసు చెప్పిన అర్థం/వ్యాఖ్యానం, అవి అనేకమైన, వేర్వేరు సాదృశ్యాల అంశాలు, దానికి సంబంధించిన అనేక సత్యాలను నేర్పిం చేవని సూచిస్తుంది (యేసు ఈ ఉపమానాన్ని వ. 18-23లో వివరించాడు).
13:10-13 యేసు ఉపమానాలకు రెండు భిన్నమైన ఉద్దేశాలున్నాయి: (1) విని, నమ్మడానికి ఇష్టపడేవారికి సత్యాన్ని బయల్పరచడం, (2) కొవ్విన హృదయాలతో (వ. 15) తమ ఇష్ట ప్రకారం సత్యాన్ని తిరస్కరించే వారినుండి సత్యాన్ని దాచడం. యేసు బోధలో దాపరికం అనే అంశం కొంచెం కటువుగా అనిపించవచ్చు. కానీ ఎంత ఎక్కువ సత్యం తెలిస్తే అంత ఎక్కువగా తీర్పులో దేవునికి లెక్క అప్పగించాల్సివస్తుంది (11:20-24) కాబట్టి స్పందించనివారు అని తనకు తెలిసిన వారి పట్ల దేవుని కృపను అది సూచిస్తుంది.
13:14-16 యేసు పరిచర్య ప్రవచనాన్ని ఎలా నెరవేర్చుతుందో మత్తయి తరచూ వివరించాడు. ఇక్కడ యేసు తానే యెషయా 6:9-10 నెరవేర్పును వివరించాడు. ఈ లేఖనాన్ని యేసు సమకాలికులకు ఆపాదించడం, ఇశ్రాయేలు కటువుగా యేసును తృణీకరించడం బహుశా తాత్కాలికమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల హృదయాలు ఏదొకరోజున మెత్తబడతాయనీ, ఇశ్రాయే లులో దేవుడు ఒక నీతిగల శేషాన్ని ఉంచుతాడనీ యెషయా 6:11-13 చూపు తుంది. కాబట్టి రాతివలె నిరోధించడం, శాశ్వత నిరోధం కాదని చూపుతుంది.
13:17 పా.ని. ప్రవక్తలు, పరిశుద్దులు, మెస్సీయ రాకకోసం ఆసక్తితో ఎదురు చూశారు (1 పేతురు 1:10-12 చూడండి).
13:18-23 నాలుగు రకాల నేలలు, నాలుగు రకాల మనుష్యులను, యేసు పట్ల వారి వేర్వేరు స్పందనలను సూచిస్తున్నాయి. మొదటి మూడు రకాలు యేసును పూర్తిగా తిరస్కరించేవారు (7:26-27), ఆయన శిష్యులమని అబ ద్దంగా చెప్పుకునేవారు (7:15-23; 10:35-39). వీరందరూ నిష్ఫలులు. చివరి రకం మాత్రమే సఫలులై ఉంటారు. స్మయలు అనే ఫలాలను ఫలిం చడం శిష్యత్వంలో అవసరమైన భావన (3:8,10; 7:16-20; 12:33; 21:18-19,33-41), కాబట్టి చివరిరకం వారే నిజమైన శిష్యులు. నాటికా లపు ప్రాచీన వ్యవసాయ విధానంలో, విత్తబడిన దానికి 10 నుండి 20 రెట్లు పంటరావడమే గొప్పగా పండడం అంటారు. యేసు ఉపమానంలో వర్ణించిన అద్భుతమైన పంట (నూరంతలు... అరువడంతలు... ముప్పదంతలు), నిజమైన శిష్యులు అద్భుతమైన పరిమాణంలో ఫలాలను ఫలిస్తారని చూపుతుంది.
13:24-30 గురుగులు బహుశా కలుపుమొక్క కావచ్చు. ఇది గోధుమకు సంబంధించిన మొక్క ఆరంభస్థితిలో ఇది గోధుమ మొక్కలాగే కనిపిస్తుంది. కానీ ఇది నిజానికి విషపూరితమైనది. ఇతరుల చేనిలో గురుగులు నాటడాన్ని రోమా చట్టం నిషేధించింది. అంటే యేసు చెప్పిన కథ నిజమేనన్నమాట. పంట ఎదుగుతుండగా, గోధుమలు, గురుగుల వేర్లు, ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి, గోధుమలకు నష్టం కలగకుండా, గురుగులను పీకటం కష్టమయ్యేటట్లు చేస్తాయి. ఈ ఉపమాన వ్యాఖ్యానం కోసం వ.36-43 నోట్సు చూడండి.
13:31-32 ఆవగింజలాగా పరలోక రాజ్యము చాలా చిన్నదిగా, అల్పమైన దిగా ఆరంభమైంది గాని తరువాత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఆవగింజ నాటికాలంలో పాలస్తీనాలోని విత్తనములన్నిటిలో చిన్నది. 13:33 మూడుకుంచముల పిండిని కొంచెం పుల్లని పిండి పులిసేటట్లు చేసే చిత్రం, దేవుని రాజ్యం చిన్నగా ఆరంభమైనా గొప్ప ప్రభావాన్ని చూపుతుందని తెలియజేస్తుంది.
13:34-35 కీర్తన 78లో ఆసాపులాగా, యేసు ఉపమానరీతిగా బోధించి, అంతకు ముందు అర్థం కాని సత్యాలను తన శిష్యులకు బయల్పరచాడు.
13:36-43 గోధుమలు నిజమైన శిష్యులనీ, గురుగులు దొంగశిష్యులనీ ఈ
ఉపమానాన్ని తరచుగా వ్యాఖ్యానిస్తారు. కానీ యేసు వ్యాఖ్యానం, ఇందులోని అంశం సంఘంలో నిజ శిష్యులు, దొంగ శిష్యులు కలగలపి వుండడం కాదు గాని, విశాలమైన లోకంలో మంచివారు, చెడ్డవారు కలిసి వుంటారు అనేది. మెస్సీయ వెంటనే చెడ్డవారిని నాశనం చేసి, నీతిమంతులను విడిపిస్తాడని యూదులలో అనేకులు ఆశించారు. యేసు నిజంగా మనుష్యకుమారుడు (దాని 7:13-14 చూడండి) అయితే, ఇలా ఎందుకు చేయలేదు అని వారు ఆశ్చర్యపోయారు. ఈ ఉపమానంలో యేసు (1) ఆయన కీడుకు కారణం కాడనీ (13:27-28,36-39); (2) లోకమంతా మనుష్యకుమారునిదేననీ, దానిలోనికి చెడును తెచ్చే హక్కు అపవాదికి లేదనీ; (3) రానున్నకాలంలో, మనుష్యకుమారుడు దుష్టులను శిక్షించి నీతిమంతులను దీవించే తన రాజ్యాన్ని సరైన సమయంలో ఈ భూమి మీదికి తెస్తాడనీ వివరించాడు.
13:44-46 పరలోకరాజ్యము చాలా విలువైనదనీ, జ్ఞానులు ఎంత త్యాగం చేసైనా దాన్ని పొందడానికి ఇష్టపడుతున్నారనీ ఈ ఉపమానాలు బోధిస్తు న్నాయి (19:21-26).
13:47-50 వల ఉపమానం, గోధుమలు, గురుగుల ఉపమానానికి సమాంతరంగా ఉంది. (వ.24-30,38-43). యేసును, ఆయన పాలనను తిరస్కరించేవారి నుండి నీతిమంతులు (యేసు శిష్యులు) వేరుచేయబడిన తర్వాత వారిని నిత్యశిక్షకు పంపివేసే అంత్య తీర్పును గురించి ఈ ఉపమానం బోధిస్తున్నది.
13:51-52 యేసు శిష్యులు ఆయన బోధ వినడంవలన, అంతకు ముందు మర్మముగా ఉన్నవి వారికి బయల్పరచబడ్డాయి. కాబట్టి. (వ.34-35), ధర్మశాస్త్రమును బోధించడానికి శాస్త్రులు, పరిసయ్యులకన్నా వారు యోగ్యుల
య్యారు. వారి బోధనా వనరులలో, పాత నిధులు (పా.ని. ఉపదేశాలు), కొత్త నిధులు (యేసు బోధలు) ఉన్నాయి.
13:53 యేసు... చాలించిన తర్వాత అనే మాటలు, సువార్త నిర్మాణశైలిని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. మత్తయి పరిచయంలో "గ్రంథనిర్మా ణం" చూడండి.
13:54 యేసు స్వదేశము నజరేతు (2:22-23 నోట్సు చూడండి). 13:55 ఈ వచనం, దాని సమాంతర వచనాలు (మార్కు 6:3; లూకా 4:22) మాత్రమే కొ.ని.లో యోసేపు, యేసుల వృత్తిని గూర్చి తెలియజేస్తాయి. యూదుల సాంప్రదాయం ప్రకారం, తండ్రులు తమ వృత్తులను కుమారులకు నేర్పించడం తప్పనిసరి. "వడ్లవాడు" (గ్రీకు. "టెక్టాన్") అనే మాట అప్పుడప్పుడూ రాతిపని చేసే తాపీవారికి కూడా ఉపయోగించేవారు. కానీ సామాన్యంగా చెక్కపని చేసే వడ్రంగివారిని సూచిస్తుంది. ఒక ఆరంభ సాంప్రదాయం ప్రకారం, యేసు ముఖ్యంగా కాడి, నాగళ్ళు తయారు చేసేవాడని చెబుతుంది. యాకోబు... యూదా ఇద్దరూ తరువాతి కాలంలో యేసు అనుచరులుగా మారి, కొ.ని.లో పుస్తకాలను రాశారు.
13:56-57 యేసు తనను తాను ప్రవక్త అనీ, ప్రవక్తకంటె ఎక్కువ వాడననీ (12:41) గుర్తించుకున్నాడు. సాధారణంగా ప్రవక్తలు తిరస్కారం పొందేవారు (23:37).