Romans - రోమీయులకు 14 | View All

1. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.
ఆదికాండము 1:29, ఆదికాండము 9:3

3. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

5. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.

6. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

7. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.

8. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.

9. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను.

10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.
కీర్తనల గ్రంథము 72:2-4

11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
యెషయా 45:23, యెషయా 49:18

12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి.

14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.

15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.

16. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.

17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.

18. ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

19. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.

20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము.

21. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.

22. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.

23. అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.బైబిల్ అధ్యయనం - Study Bible
14:1-15:13 ఈ భాగంలో వర్ణించిన సమస్యకు సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక నేపథ్యం అస్పష్టం. రోమాలోని క్రైస్తవులకు కొన్ని ఆచారాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వారు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చారు. వారు ప్రతిమలను పూజించే నేపథ్యం నుండి వచ్చినవారైతే, బజారులో అమ్మే ఆహారపదార్థాలు, పానీయాలు కళంకమైనవిగా చూచే అవకాశం ఉంది. (1కొరింథీ 8:1-13; 10:23-33తో పోల్చండి). వారు కొన్ని దుర్మతాల నుండి వచ్చినవారైతే, వారు కేవలం శాఖాహారులై ఉండవచ్చు కూడా. అలాగే నేడు ఇస్లాం, యూదుమతం, హిందూమతాల నుండి క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన వారికి, ప్రత్యేక దినాచారాలు, ఆహార నియమాల అలవాట్లు ఉంటాయి. ఆహారం, కాలపట్టికకు సంబంధించిన విషయాలు వారికి ప్రత్యేక ప్రాధాన్యతగా ఉండి, మనస్సాక్షికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఈ వాక్యభాగంలో, పా.ని. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారవ్యవహారాలను అనుసరించాలని కోరేవారివల్ల సమస్య వచ్చివుండవచ్చు అని అత్యధిక వ్యాఖ్యాతలు భావిస్తారు. వేదాంతవేత్తలు ఈ అంశాలను సంశయములు (వివాదాస్పద విషయాలు, గ్రీకు. “అడియాఫోరా") అని పిలిచారు. ఎందుకంటే వారు భిన్నాభిప్రాయాలు అనుమతించారు. కానీ కొందరు విశ్వాసులు మరోవిధంగా భావించే అవకాశం ఉందని సులువుగానే చూడవచ్చు. విశ్వాసుల ఐక్యతను, ఇతరులకు ప్రేమను కనుపరచడం, సువార్త సందేశపు పవిత్రతను నొక్కిచెబుతూ, ఇలాంటి విషయాలపై సంఘం సహించడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయాసపడాలి. 

14:1 విశ్వాసము విషయమై బలహీనుడైన విశ్వాసి, క్రైస్తవ ప్రత్యక్షతలలో క్రమపరచబడని విషయాలను గూర్చి ఎక్కువగా పట్టించుకునేవాడుగా ఉండవచ్చు. బలహీనులైన క్రైస్తవులను ఆహ్వానించాలి గానీ "వివాదాస్పద విషయాల"లో - వారితో వాదములు పెట్టుకోకూడదని పౌలు విశ్వాసులకు ఆజ్ఞాపించాడు. 

14:2 యూదులు సామాన్యంగా శాఖాహారులు కారు, కానీ కొందరున్నారు (ఉదా: దానియేలు; దాని 1:8-12 చూడండి). 

14:3-4 ఒకరినొకరు సహించడం క్రైస్తవ లక్షణం. దేవుడు ప్రతి విశ్వాసిని అతని నేపథ్యాన్ని బట్టి, పరిపక్వతా స్థాయిని బట్టి వచ్చే అంశాలతో సహా స్వీకరిస్తాడు. వారిని పవిత్రపరచడానికి ఆయన సమర్ధుడు. 

14:5 ప్రత్యేక దినములను ఆచరించడం గూర్చిన విషయం కాస్త సంక్లిష్టమైనది. (గలతీ 4:10; కొలస్సీ 2:16 లో “విశ్రాంతి దినము"ను గూర్చిన పౌలు హెచ్చరికలతో పోల్చండి). ఆదివారం విశ్రాంతి దినము కాదు గాని ఆరాధించే కొత్త రోజు అని మార్టిన్ లూథర్ నమ్మాడు, కానీ జాన్ కాల్విన్ మాత్రం విశ్రాంతి దినము ఆదివారానికి మార్చబడిందని నమ్మాడు. ఈ విషయాన్ని గూర్చి ఆలోచించేటప్పుడు, క్రీస్తు ఆదివారం ఉదయం పునరుత్థానుడు కావడం, కొత్త నిబంధనను గూర్చిన అంశాలను మనం పరిగణనలోనికి తీసుకోవచ్చు. 

14:6 మన మతాచారాలు దేవుని యెదుట ఒప్పింపబడినవిగా చేయాలి. మనం ప్రభువుకు చెందినవారమనే నిశ్చయత నుండి మనం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో అనేవి రావాలి. 


14:7-9 మనం మన. స్వంతం కాదు. అందరికీ ప్రభువుగా ఉండటానికి క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. “క్రైస్తవుడు ఎవరికీ లోబడనవసరం లేని పరిపూర్ణ స్వేఛ్చాపరుడు. క్రైస్తవుడు అందరికీ లోబడి, పరిపూర్ణంగా కర్తవ్యాన్ని పాటించే సేవకుడు” అని మార్టిన్ లూథర్ వైరుధ్య వ్యాఖ్య పలికాడు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మనము ప్రభువు వారము. ..


14:10-12 దేవుని న్యాయపీఠము (గ్రీకు. "బేమా") వేరొకచోట “క్రీస్తు న్యాయపీఠము" (2కొరింథీ 5:10) అని పిలిచాడు. అనేకమంది వ్యాఖ్యాతలు దీన్ని ప్రక 20:11-15లోని మహా ధవళ సింహాసనపు తీర్పుకు వేరుగా చూస్తారు. "క్రీస్తు న్యాయపీఠము" వద్ద - తాను చేసిన క్రియలు, వానికి దేవుడిచ్చిన గృహనిర్వాహకత్వపు బాధ్యతల ఆధారంగా, విశ్వాసి బహుమతులు పొందుతాడు లేక బహుమతులు కోల్పోతాడు (1కొరింథీ 3:12-13). దీనికి భిన్నంగా, మహా ధవళ సింహాసన తీర్పులో అవిశ్వాసులకు తీర్పు తీర్చబడుటకై వారు లేపబడతారు. విశ్వాసులు మొదటి పునరుత్థానంలో పాల్గ్పొందుతారు, వారికి శిక్షావిధి లేదు. (రోమా 8:1; ప్రక 20:4-6). ప్రజలంతా దేవుని యెదుట సాగిలపడి, వారి జీవితాలను గూర్చి దేవునికి లెక్క అప్పగిస్తారు. చివరి తీర్పు నుండి తాము తప్పించబడ్డాము కాబట్టి తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చని క్రైస్తవులు తలంచే అవకాశం ఉంది కానీ ప్రభువైన క్రీస్తు తన సేవకుల తప్పొప్పులను విశ్లేషిస్తాడు.

14:13 మన లక్ష్యం విశ్వాసులందరూ ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగడానికి సహాయం చేసేదిగా ఉండాలి గాని వారి అభివృద్ధిని ఆటంకపరచేదిగా ఉండకూడదు.

14:14 పౌలు అద్భుతమైన వ్యాఖ్యలలో ఇది ఒకటి. పరిసయ్యునిగా అతడు పొందిన తర్ఫీదు నేపథ్యం పవిత్రమైన, అపవిత్రమైన వాటి మధ్య తేడాను నొక్కి చెప్పేటట్లు చేశాయి. కానీ ఈ భేదానికి ఇకపై విలువలేదని యేసు అతన్ని ఒప్పించాడు. కాబట్టి పౌలు ఒక కొత్త విధానాన్ని స్వంతం చేసుకున్నాడు. కానీ కొందరు విశ్వాసులు, ముఖ్యంగా యూదు మత నేపథ్యం నుండి వచ్చినవారు ఈ మార్పు చేసుకోలేదని అతడు గుర్తించాడు. ఎదిగిన విశ్వాసులు “బలహీను" లైన విశ్వాసులను (వ.1) ఇలాంటి మార్పు చేసుకోమని నిర్లక్ష్యంగా బలవంతం చేయకూడదు. 

14:15 ఒక బలమైన క్రైస్తవుడు ప్రేమతో జీవించాలి, బలహీనమైన విశ్వాసి మనస్సాక్షిని బాధించకూడదు. మనస్సాక్షి అనేది మనసుకు చెందిన
నైతిక సామర్థ్యం. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవునిచే బోధించబడుతుంది, కానీ తమ మనస్సాక్షికి విరుద్దంగా వెళ్ళమని ఇతరులకు మనం ఎన్నడూ బోధించకూడదు. పాడు చేయకుము అంటే తమ మనస్సాక్షికి విరోధంగా చేయమని లేక నిర్లక్ష్య పెట్టమని మనం ఒకనికి నేర్పిస్తే, అది ఆ వ్యక్తి ఆత్మీయ నాశనానికి కారణం కావచ్చు అని అర్థం.

14:16-17 క్రైస్తవ స్వాతంత్ర్యం ప్రేమ చేత నియంత్రించబడకపోతే దానికి చెడ్డ పేరు వస్తుంది. భోజనం మన జీవితాలలో ఎన్నడూ ముఖ్యమైన విషయం కాకూడదు. కానీ మనం సంఘాలలో నీతియు సమాధానమును...ఆనందమును
ప్రోత్సహించాలి.

14:18-19 మన క్రియలు క్రీస్తుకు సేవచేయాలి, ఇతర క్రైస్తవులు ఎదిగి వర్గిల్లడానికి సహాయపడాలి. 

14:20-21 నిజంగా చెప్పాలంటే సమస్త - పదార్థములు పవిత్రములే (“దేవుడు సృజించిన ప్రతివస్తువును మంచిది. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింపతగినది కాదు”, 1తిమోతి 4:4). అయినప్పటికీ కొందరు అపరిపక్వ విశ్వాసులు మాంసము, ద్రాక్షారసము విషయంలో తొట్రిల్లే అవకాశం ఉంది (1కొరింథీ 8:7-11).

14:22-23. ఈ విషయాలలో క్రైస్తవుని స్వేచ్ఛ, వేరే విశ్వాసికి అభ్యంతర కరంగా ఉండేటట్లు బహిరంగ ప్రవర్తనగా మారకూడదు. ఉదాహరణకు, ఎన్నడూ పందిమాంసం తినని, మద్యం త్రాగని ఒక మారుమనస్సు పొందిన అన్యుడు, ఒక క్రైస్తవుడు ఆ రెండిటిలో ఏది చేయడం చూసినా తొట్రుపడతాడు.


Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |