Isaiah - యెషయా 62 | View All

1. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

2. జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
ప్రకటన గ్రంథం 2:17, ప్రకటన గ్రంథం 3:12

3. నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

4. విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

5. యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.

6. యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
హెబ్రీయులకు 13:17

7. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు

8. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

9. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.

10. గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

11. ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.
మత్తయి 21:5, ప్రకటన గ్రంథం 22:12

12. పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.



బైబిల్ అధ్యయనం - Study Bible
62:1-12 దేవుని ప్రజల రూపాంతరత ఈ అధ్యాయంలోనూ కొనసాగు తుంది. తమ దేవుని సహాయంతో వారు అవమానం నుండి మహిమకు ఎదుగుతారు. 

62:1 ఇక్కడ “నేను” అంటూ మాట్లాడుతున్న వ్యక్తి అభిషిక్తుడైన సేవకుడు కావచ్చు (61:1-3), లేదా యెషయా ప్రవక్త అయ్యుండవచ్చు. యెరూషలేము ఆధ్యాత్మిక రూపాంతరత పూర్తి అయ్యేవరకు ఈ వ్యక్తి మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు తన ప్రజల మధ్య చేసే కార్యాన్ని వర్ణించే ముఖ్యమైన సాదృశ్యం వెలుగు (58:10; 60:1-3), వెలుగు మెస్సీయకు కూడా సంబంధించినది (10:17; 42:6). 

62:2 పేర్లు, వాటి అర్థాలు వ్యక్తి స్వభావాన్ని లేదా ఖ్యాతిని సూచించడం పరిపాటి. పేరు మార్పు అసాధారణ మైనది కాదు. ఉదాహరణకు, నయోమి (మధురము) అనే పేరు ఆమె పరిస్థితి తారుమారైనప్పుడు మారా (చేదు) అయ్యింది (రూతు 1:20). దేవుడు ఇశ్రాయేలుకు పెట్టిన క్రొత్త పేరు దేవుని ప్రజల స్థితిలో మార్పును తెలియజేస్తుంది (వ.4,12).

62:3 భవిష్యత్తులో ఇశ్రాయేలు పొందబోయే ఔన్నత్యాన్ని కిరీటముతో, పోల్చడం జరిగింది. 

62:4-5 ఒంటరితనాన్ని సూచించే విడువబడినది, పాడైనది అనే ఇశ్రాయేలు పేర్లు, సన్నిహిత సంబంధాన్ని సూచించే హెప్సీబా (ఇష్టురాలు), బ్యూలా (పతివ్రత) అనే పేర్లుగా మార్పు చెందాయి. దేవుడు తన ప్రజలకు భర్తగా ఉన్నాడనే అలంకారిక వర్ణన దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని, వారు ఆయనకు మాత్రమే చెందినవారనే ప్రత్యేకాధికార పరిధిని తెలియజేస్తుంది (61:10 నోట్సు చూడండి). భార్యకు ఒకే భర్త ఉండాలి కాబట్టి. ఇశ్రాయేలుకు దేవుడు ఒకరే ఉండాలి. 

62:6-7 పట్టణం మీదకు వచ్చే ఆపద గురించి లేదా ప్రమాదం గురించి ప్రజలకు సమాచారాన్ని అందించడానికి పట్టణ ప్రాకారముల మీద... కావలివారిని నియమిస్తారు. (52:8-9 నోట్సు చూడండి). దేవుని ప్రజల్ని పరిపాలించే అధిపతుల్ని కావలివారితో పోల్చడం జరిగింది. ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించడం అధిపతుల బాధ్యత. దేవుడు యెరూషలేమును “సర్వభూమికి సంతోషకరముగా” (కీర్తన 48:2) చేసేవరకు కావలివారు ఆయన ననుసరించాలి అని యెషయా ప్రేరేపిస్తున్నాడు. 

62:8-9 దాడిచేసే సైన్యాలు ఎవరిని ఓడిస్తాయో వారి పంటల్ని దోచుకుంటాయి. దేవుని ప్రజలు పాపం చేశారు కాబట్టి వారిని శత్రువులు (ముఖ్యంగా అష్పూరు, బబులోను) దోచుకొనేలా దేవుడు అనుమతించాడు. అయితే, శత్రువులు దోచుకొనడం ఇక ముగిసిపోతుంది.

62:10 యెషయా గ్రంథంలో రాజమాము అనే సాదృశ్యం దేవునికి ఆయన ప్రజలకు మధ్యనున్న ఆటంకాల తొలగింపును సూచిస్తుంది (11:16; 19:23; 33:8; 35:8; 40:3; 49:11). ధ్వజమనే పదం శేష జనం స్వదేశానికి తిరిగి రావడానికి సమావేశమయ్యే చోటును (11:10 నోట్సు చూడండి) లేదా సైన్యం యుద్దానికి బారులుతీరి ఊరేగింపుగా వెళ్లడాన్ని సూచిస్తుంది (13:2 నోట్సు చూడండి). 

62:11 ఈ వచనం, జెకర్యా 9:9 వచనం సంయుక్తంగా మత్తయి 21:5 వచనంలో “జయప్రవేశం" సందర్భంలో కనబడుతున్నాయి. 

62:12. దేవుడు మళ్లీ (వ.2,4) ఇశ్రాయేలు కొత్త పేరు గురించి మాట్లాడుతున్నాడు. ఈ పేర్లు పునరుద్ధరణ తర్వాత దేవుని ప్రజల స్థితిని, దేవుడు వారిపట్ల చూపిస్తున్న శ్రద్ధాసక్తుల్ని సూచిస్తున్నాయి. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |