Nehemiah - నెహెమ్యా 12 | View All

1. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా

2. అమర్యా మళ్లూకు హట్టూషు

4. ఇద్దో గిన్నెతోను అబీయా.

5. మీయామిను మయద్యా బిల్గా

7. సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు.వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.

8. మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.

9. మరియబక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.

10. యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను.

11. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.

12. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా

13. ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

14. మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

15. హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి

16. ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము

17. అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

18. బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను

19. యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

20. సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు

21. హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.

22. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.

23. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.

24. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.

25. మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వార పాలకులుగా ఉండిరి.

26. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధి కారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.

27. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి

28. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి.

29. మరియగిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.

30. యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.

31. అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.

32. వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.

33. మరియఅజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును

34. యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.

35. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు

36. అతని బంధు వులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారిముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.

37. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి.

38. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.

39. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.

40. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహ ములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.

41. యాజకులగు ఎల్యా కీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.

42. ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.

43. మరియదేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను.

44. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవ చేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయు లనుబట్టియు యూదులు సంతోషించిరి.

45. మరియు గాయ కులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.

46. పూర్వ మందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు1 ప్రధానుడు.

47. జెరుబ్బాబెలు దినములలో నేమి నెహెమ్యా దినములలో నేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకుల కును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.



బైబిల్ అధ్యయనం - Study Bible
12:1-26 అధ్యా.12 లోని ఈ భాగంలో, అధ్యా. 11 లోని పునరావాసం ఏర్పరచుకున్న జాబితాకు జోడించబడిన దేవాలయపు వ్యక్తుల అదనపు జాబితాలు ఉన్నాయి. ఈ జాబితాలు జెరుబ్బాబెలు, యేషూవల తరం తర్వాతి - పరిస్థితికి ప్రతినిధులుగా ఉన్నాయి. అవి కొద్ది వివరణ లేక నేపథ్యంతో కనిపిస్తు న్నందు వలన, ఒకదానితో మరొక దానికున్న సంబంధం, ఎజ్రా-నెహెమ్యాలో ఉన్న దేవాలయపు వ్యక్తుల మిగిలిన జాబితాలతో ఉన్న సంబంధాన్ని గురించి (ఎజ్రా 2, నెహెమ్యా 7, 9, 10, పండితులలో కావల్సినంత చర్చలకు కారణమయ్యాయి.

12:1-7 ఈ జాబితా వ్యక్తులను లెక్కించినట్లు కనిపిస్తుంది, కానీ రెండవది (వ. 12-21) యాజకుల నాయకులను లెక్కించినట్లుగా కనిపిస్తుంది. అయితే వ.1-7 వరకు ఇచ్చిన పేర్లు వ్యక్తుల పేర్లు కాక కుటుంబపు పేర్లు అయివుండాలి.

12:8-9 ఎజ్రా 2:40 ప్రకారం, జెరుబ్బాబెలు (యేషూవ, కద్మీయేలు) నేతృత్వంలో తిరిగివచ్చిన లేవీయ కుటుంబాలు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో 74 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ, ముఖ్యంగా నెహెమ్యా కాలంలో చురుకుగా ఉన్నట్లు చెప్పిన మత్తన్యా... బక్కుక్యా (వ. 25; 11:17) తోపాటు ఆరు కుటుంబాలు మాత్రమే పేర్కొనడానికి కారణం స్పష్టంగా లేదు. బక్బుక్యా బహుశా ఇతరులకు ఎదురు వరుసలో అయితే సహకారానికి గాని లేక వారి తర్వాత పాడడానికి గాని సిద్ధంగా ఉండివుంటాడు.

12:10-11 ఈ వచనాలలో ఆరుగురు ప్రధాన యాజకులు ఉన్నారు. మొదటి, మూడవ వారిని గుర్తించడం సులువు. దేశానికి తిరిగివచ్చినపుడు జెరుబ్బాబెలుతో పరిచర్య చేసిన యేషూవ (ఎజ్రా 2:2), నెహెమ్యా పదవీకాలంలో ప్రధాన యాజకుడుగా పరిచర్య చేసిన ఎల్యాషీబు (3:1,20) ఇద్దరినీ గుర్తించవచ్చు. అయితే మొదటి, మూడవ చెర తరవాతి ప్రధాన యాజకుల మధ్య ఉన్న సుమారు 80 సంవత్సరాల తేడాను బట్టి, ఈ - జాబితా సంపూర్ణమైనది కాక ప్రాతినిథ్యం వహించేదిగా మాత్రమే ఉండి వుండవచ్చు. లేక జె. బ్లెంకిన్నప్ సూచించినట్లు, "యాజకుని పదవి ఖాళీగా ఉన్నసమయాల్లో... రాజకీయ - సంక్షోభాలు నెలకొని ఉంటాయి" అనేది కారణం కావచ్చు. నాల్గవ యాజకుడు యోయాదా (యెహోయాదా అనే తన పూర్తి పేరుతో కూడా పేర్కొనబడ్డవాడు). 13:28లో, యెహోయాదా ఆ బిరుదుతో పిలువబడకపోయినా, యాజకుడైన ఎల్యాషీబు కుమారునిగా పేర్కొనబడ్డాడు. ఈ కాలంలో యోనాతాను గురించి ఎక్కడా పేర్కొనలేదు. కానీ వ. 22. నలుగురు యాజకులున్న కాలాన్ని గుర్తించింది. ఎల్యాషీబు, యోయాదా, యోనాతాను, యద్దూవ. చివర పేర్కొన్న ప్రధాన యాజకుడు యద్దూవ పేరును జోసీఫస్ కూడా ప్రస్తావించాడు. మహా అలెగ్జాండరు యద్దూవను (క్రీ.పూ. 333) కలిశాడని జోసీఫన్ రాశాడు. అయితే జోసీఫస్ రచనలలో కొన్ని ఇతిహాసానికి సంబంధించినవని భావించినందువలన, యద్దూవను ఆ కాలానికి చెందినవాడని చెప్పడం బహుశా జ్ఞానయుక్తంగా ఉండదు. అదే పేరుతో అతనికి ముందు, అతని తర్వాత కూడా ప్రధాన యాజకులు ఉండే అవకాశం ఉంది.

12:12-21 అనేక పేర్ల ఉచ్చారణలో గుర్తింపదగిన వ్యత్యాసం, అలాగే అనుకోని మినహాయింపులు (హట్టూషు, వ.2) ఉన్నప్పటికీ, ఈ రెండవ యాజకుల జాబితా ముందుదానితో (వ.1-7) సమాంతరంగా ఉంది. వీటిలో అనేకమైన పేర్లు అధ్యా. 10 లోని ప్రతిజ్ఞలో ముద్రలు వేసినవారివిగా కనిపిస్తాయి. చివరి  ఆరు పేర్లు ముందున్న జాబితాలో (వ.1-7), అధ్యా. 10లోని ముద్రవేసినవారి జాబితాలో కూడా లేవు. ఇదో యింటివారికి జెకర్యా అని పేర్కొనడం ఆసక్తిని గొలుపుతుంది. ఈ జెకర్యా బహుశా ప్రవక్తయైన జెకర్యాను సూచిస్తుండవచ్చు (ఎజ్రా 5:1; 6:14; జెకర్యా 1:1).

12:22 పారసీకుడగు దర్యావేషును గుర్తించడం అస్పష్టం, పర్షియా రాజులుగా ఉన్న ముగ్గురు దర్యావేషులను పండితులు సూచిస్తారు. యద్దూవ మహా అలెగ్జాండరును కలిశాడు అనే జోసీఫన్ వ్యాఖ్యను అంగీకరించేవారు, ఈ వచనంలోని దర్యావేషును మూడవ వాడైన దర్యావేషు కొడొమన్నస్ (క్రీ.పూ. 336-331)గా గుర్తిస్తారు. ఈ వాక్యభాగంలోని దర్యావేషు రెండవ దర్యావేపైన నోతుస్ (క్రీ.పూ. 423-404) అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. 

12:27-43 నెహెమ్యా పరిచర్యలోని చివరి అంకం, యెరూషలేము చుట్టూ పునర్నిర్మించిన ప్రాకారాన్ని ప్రతిష్ఠించే సంతోషంతో ముగిసింది. ప్రాకారం పూర్తవ్వగానే ఈ ప్రతిష్ఠ జరిగిందని కొందరు పండితులు సూచిస్తుండగా (6:15-16), ఇక్కడున్న వాక్యభాగం మరింత ఖచ్చితమైన కాలక్రమాన్ని ఇస్తుండవచ్చు. ఎజ్రా పనితోపాటు, నెహెమ్యా పని కూడా ప్రజలను పునరుద్ధరించడం. కాబట్టి ఈ ప్రతిష్ఠ పునర్నిర్మితమైన ప్రాకారాన్నే కాక, పునరుజ్జీవింపబడిన ప్రజలను కూడా ప్రతిష్టించింది. 

12:30 లేవీయులు గాయకులు (వ.28-29) ఉండగా, పవిత్రీకరించే ప్రక్రియ ఆరంభం కావడం తప్పనిసరి. యాజకులు, లేవీయులకు (ఈ సమయంలో గాయకులు కూడా లేవీయులతో కలిసివుంటారని ఊహిస్తూ), వారి వస్త్రములు ఉదుకుకోవడం, లైంగిక సంబంధం లేకుండా ఉండడం (నిర్గమ 19:14-15), ప్రత్యేక బలులు తీసుకురావడం (సంఖ్యా 8; 8-12), నీళ్ళతో ప్రోక్షించబడడం (సంఖ్యా 8:7) అనేవి కూడా ఉంటాయి. 

12:31-37 ప్రతిష్ఠించే ఉత్సవం నెహెమ్యా ప్రధానులను (హెబ్రీ. సారే) ప్రాకారము మీదికి తోడుకొని పోవడంతో ఆరంభమైంది. (ఇప్పటినుండి మరలా వృత్తాంతం నెహెమ్యా జ్ఞాపకాలతో స్వగతంగా తిరిగి మొదలౌతుంది). అక్కడ వారు రెండు గుంపులుగా విడిపోయి, ఒక గుంపు కుడిప్రక్కను... ప్రాకారము మీద నడిచారు. ఈ ఊరేగింపు పట్టణాన్ని బహుశా దాని పశ్చిమంవైపు ఉన్న లోయ గుమ్మంద్వారా, పశ్చిమం నుండి సమీపించి వుంటుంది. ఇక్కడ వారు "కుడి ప్రక్కకు” వెళ్ళారు లేక దక్షిణానికి అంటే పెంట గుమ్మము వైపుకు వెళ్ళారు. పురావస్తు శాఖ ఆధారాలను బట్టి ప్రాకారం సుమారు 9 అడుగులు వెడల్పు ఉండి, దాని పైన ఇద్దరు లేక ముగ్గురు ఒకరిప్రక్కన ఒకరు నడవగలిగేదిగా ఉంది... ఊరేగింపుకు నాయకుడు శాస్త్రియైన ఎజ్రా అనే వ్యాఖ్య చాలమందికి అసాధ్యంగా తోస్తుంది. ఎజ్రా నెహెమ్యాల పరిచర్యలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండవు అని ఎక్కువమంది పండితులు నమ్ముతారు. కాబట్టి, ఈ వ్యాఖ్య ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల పరిచర్యను కలపడానికి చేసిన లోపభరితమైన పవిత్ర ప్రయత్నం అంటారు. అయినప్పటికీ డి.జె.ఎ. థైన్స్ ఇలా రాశాడు: “ఎజ్రా పాల్గొనడం చరిత్రలో లేదు అనేది నిరూపించబడదు; ఎజ్రా తన పదవీ విరమణనుండి రావడం అసాధ్యమేమీ కాదు, లేక కేవలం ఈ కార్యక్రమాన్ని నడిపించడం కోసం బబులోనునుండి రప్పించబడడం కూడా అసాధ్యమేమీ కాదు." అను

12:38-39 రెండవ సమూహము లోయ - గుమ్మమును వదిలి వారికి ఎదురుగా నడిచెను (ఎడమవైపుకు లేక ఉత్తరానికి). అది సవ్యదిశలో నడిచి, (పట్టణానికి వాయవ్యంగా ఉన్న) మత్స్యపు గుమ్మమును దాటి, పట్టణానికి ఉత్తరపు చివరిలోని గొట్టెల గుమ్మము వద్ద ప్రాకారాన్ని విడిచింది. అక్కడనుండి వారు బందీగృహపు గుమ్మము (ఇది. 3:25 లో చెరసాల దగ్గర అని చెప్పబడిన ప్రదేశం కావచ్చు లేక 3:31 లోని మిప్కాదు ద్వారము దగ్గరున్న ప్రదేశం కావచ్చు) వరకు వెళ్ళారు. ఈ రెండింటిలో ఏదొక ప్రదేశం దేవాలయానికి దగ్గరగా ఉన్నదై ఉండవచ్చు.

12:40-43 రెండు సమూహములు... దేవుని మందిరము వద్ద కలిశాయి. దేవుడు తమకు మహానందము కలుగజేసెనని నెహెమ్యా గుర్తించాడు. 

12:44-47 ఇందులో పేర్కొన్న అంశాలు రానున్న అధ్యాయానికి సిద్ధపరచే విగా ఉన్నా, ఆ కాలమందు అనే మాట ద్వారా, ఈ భాగం ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిందని కలిపాడు. దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు ఆరాధన చేశారనేదాన్ని, దావీదు సొలొమోను కాలం నాటి ఆరాధనను చెరతర్వాతి చారిత్రాత్మకతగా చెప్పడానికి చేసిన ప్రయత్నం అని ఎక్కువమంది విమర్శకులు భావిస్తారు (1దిన 23-36). ఏదేమైనా, ఇలాంటి వాదన బైబిల్ భాగాన్ని వివరించడం కంటే బహుశా ఇశ్రాయేలీయుల చరిత్రను గురించి పండితుల సొంత ఊహను ప్రతిబింబిస్తుంది. 

Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |