Nehemiah - నెహెమ్యా 6 | View All

1. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని

2. సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించిఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.

3. అందుకు నేనునేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొ ద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.

4. వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని.

5. అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.

6. అందులోవారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,

7. యూదు లకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించి తివనియు మొదలగు మాటలునురాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు,ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నా డనియు వ్రాయబడెను.

8. ఈ పని చేయలేకుండ మే మశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరి గాని

9. నేనుఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్త మానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.

10. అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడురాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా

11. నేనునావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.

12. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని

13. ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపు నట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.

14. నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము.

15. ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకార మును కట్టుట సమాప్తమాయెను.

16. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజను లందరు జరిగినపని చూచినప్పుడును,వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.

17. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.

18. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియు గాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారు డైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.

19. వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు ఆతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబీయా పత్రికలు పంపెను.బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-19 అధ్యా. 6 లో గోడకట్టడం వైపు మరలా దృష్టి పెట్టడం, నెహెమ్యాను, పనివారిని “భయపెట్టడం (వ.8,14,19; హెబ్రీలో “భయం కలిగేటట్లు చేయడం") ద్వారా దాన్ని అడ్డుకోవడానికి జరిగిన మూడు ప్రయత్నాలు ఉన్నాయి. 

6:1-4 గోడ సంపూర్ణమైందనే (కానీ గుమ్మాలు ఇంకా కాలేదు) వార్త సన్నల్లటును, టోబియాయును, అరబీయుడైన గేషెములు కట్టడం ఆపడానికి ఈ సారి నేరుగా నెహెమ్యాపైనే దృష్టిపెట్టే కొత్త ప్రయత్నానికి కారణమైంది. ఈ అనువాదం హెబ్రీ లేఖనాల ప్రాచీన ప్రతులను అనుసరించింది కాబట్టి "కెఫారిమ్" (గ్రామములలో) అని వుంది, అదే మాసోరిటిక్ లో అయితే "కెఫిరిమ్" అని వుంటుంది. ఈ ప్రతినిబట్టి ఏ గ్రామములో కలుసుకోవడానికి రమ్మన్నారో అనే సందిగ్ధం మనకు కలుగుతుంది - నాలుగు మారులు బహుశా వేర్వేరు గ్రామాలలో కావచ్చు. మాసోరిటిక్ ప్రతిలో మనకు తెలియని ఒక ప్రదేశం చెప్పాడు. యూదాకు వాయవ్యమూలగా ఉన్న ఓనో లోయ, యూదా సమరయల మధ్య ఉన్న తటస్థ ప్రదేశం అయివుండవచ్చు. కలవడానికి వారు ఇచ్చిన అవకాశాన్ని తనపై విసిరిన ఒక వలగా నెహెమ్యా గ్రహించాడు. 

6:5-7 నాలుగుసార్లు వారి ఆహ్వానాన్ని తిరస్కరించిన తరువాత, నెహెమ్యాను బెదిరించడానికి సన్బల్లటు వత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. తన పనివాని చేతితో పంపిన విప్పియున్న యొక పత్రిక, నెహెమ్యామీద సన్నల్లటు చేసిన ఆరోపణలు అందరూ తేలికగా చదివేందుకే అని స్పష్టం చేస్తున్నది. ఆ పత్రిక అర్తహషస్త రాజుకు విరోధంగా నెహెమ్యా కుట్రపన్నుతున్నాడని ఆరోపించింది. ఈ ఆరోపణే ఇంతకు ముందు యెరూషలేములో కట్టడపు పనిని ఆపడానికి ఉపయోగపడిందని సన్నల్లటుకు తెలుసు (ఎజ్రా 4:7-16). 

6:8-9 నెహెమ్యా వారి నిందకు కుంగిపోలేదు. వ.9 చివరి భాగంలోని నెహెమ్యా మాటలను ఒక క్లుప్త ప్రార్థనగా చూడవచ్చు. అయితే నిజానికి నెహెమ్యా ఇతర క్లుప్త ప్రార్థనలలో ఉన్న నా దేవా (హెబ్రీ. ఎలో హే) అనేమాట (వ.14; 5:19, 13:14,22) ఇక్కడ కనిపించదు. అంతేకాక ఆదిలోని ప్రాచీన ప్రతులు (గ్రీకు, లాటిన్, సిరియాక్) ఏవీ ఈ ముగింపు మాటను. ప్రార్థనగా అర్థం చేసుకోలేదు. ఇది మనసులో ఉంచుకుంటే, దాని అనువాదం, “కాబట్టి ఇప్పుడు నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను" అని కావచ్చు. 

6:10 షెమయా (“యెహోవా విన్నాడు") అనే పేరు పా.ని.లో 20 మందికంటే ఎక్కువమందికి ఉన్న సాధారణమైన పేరు. షెమయా ఎందుకు నిర్బంధింపబడ్డాడో స్పష్టంగా లేదు. ఈ వచనంలో అతన్ని ప్రవక్తగా చెప్పలేదు కాని, వ.12లో అతడు నెహెమ్యాకు పంపిన సందేశాన్ని ప్రవచనం అని పిలిచాడు. నెహెమ్యాను మతపరంగా ఇరికించడానికి షెమయా ప్రయత్నించి, హతం కాకుండా తప్పించుకోవడానికి దేవాలయంలోనికి పారిపోదామని అతనిని తొందరచేశాడు.

6:11-13 తనను బెదిరించి, తనపై నిందమోపునట్లుగా, ఈ మతసంబంధ
మైన కుయుక్తిని పన్నారని నెహెమ్యా అర్థం చేసుకున్నాడు. అంతేకాక, ఒకవేళ అతడు గర్భాలయములో ప్రవేశించి వుంటే, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు మాత్రమే గర్భాలయంలో ప్రవేశించాలి (సంఖ్యా 18:7). కాబట్టి అతనికి మరణశిక్ష పడివుండేది. 

6:14 షేమయా "ప్రవచనం” వెనుక టోబియాను సన్బల్లటును ఉన్నారని నెహెమ్యాకు తెలుసు. వారిద్దరూ తామనుకున్నదానిని - ఇతరుల ద్వారా చేయించడానికి ప్రయత్నిస్తారనేది స్పష్టం. నోవద్యా పేరు పా.ని.లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. 

6:15-16 అనేక సమస్యలు వచ్చినప్పటికీ, ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. ఏలూలు మాసము ఇరువదియయిదవ దినము బహుశా క్రీ.పూ. 445, అక్టోబరు. 2 కావచ్చు. ఆరునెలలకంటే తక్కువ సమయంలోనే నెహెమ్యా పర్షియా (ఆధునిక ఇరాన్) లోని షూషను నుండి ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చి, పట్టణము చుట్టు ఉన్న ప్రాకారమును పునర్నిర్మించే తన పనిని పూర్తిచేశాడు. నెహెమ్యా శత్రువులు అతని బెదిరించారు (వ.9,14,19), కానీ చివరికి వారే అధైర్యపడిరి. దేవుని సహాయంతోనే ఇలాంటి బలీయమైన పని పూర్తిచేయడం సాధ్యమౌతుందని వారు అయిష్టంగానే అర్థం చేసుకున్నారు. 

6:17-19 ఆ దినములలో అంటే నెహెమ్యాను. బెదిరించడానికి చేసిన ఈ మూడవ ప్రయత్నం, బహుశా ఇంతకు ముందు బెదిరింపు చర్యలకు సమాంతరంగా ఉండివుండవచ్చు. యెరూషలేములో ఉన్న పరిస్థితులను గురించి నెహెమ్యా శత్రువులకు సమాచారం ఎలా అందివుంటుందో కూడా వ.17 వివరిస్తుంది. ఎలా అంటే యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. పా.ని.లో "పత్రికలు" అనే పదం (హెబ్రీ. "ఈక్ ఇగైరొత్" నుండి వచ్చిన "ఇగైరొతె హెమ్") కేవలం డజను సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఇవన్నీ చెరతర్వాత రాసిన లేఖనాల్లోనే కనిపిస్తాయి. ఈ “ప్రధానులు" వివాహం ద్వారా టోబియాతో ప్రమాణము (హెబ్రీ. "బాఆలే-షేవూవా", “ఒట్టుకు యజమానులు" అని అక్షరార్థం) చేసివున్నారు. టోబియాతో కుమ్మక్కయినవారు, టోబియా గుణాతిశయములను చెప్పి నెహెమ్యాను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అతని పత్రికలు నెహెమ్యాను భయపెట్టుటకే చేసిన ప్రయత్నమే. 


Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |