Isaiah - యెషయా 31 | View All

1. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.

2. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.

3. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.

5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.

6. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.

7. మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.

8. నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు దురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు

9. వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.



బైబిల్ అధ్యయనం - Study Bible
31:1 శ్రమ గురించి 1:4 నోట్సు. చూడండి. 28-33 అధ్యాయాల్లో ఇది అయిదవ శ్రమ (28:1; 29:1,15; 30:1; 33:1). మళ్లీ ఇక్కడ విషయం , దేవుని ప్రజలు వారి శత్రువులకు వ్యతిరేకంగా సహాయం కోసం ఆయనను కాక అన్యదేశాల్ని (ఈ సందర్భంలో ఐగుప్తు) ఆశ్రయించడమే (30:1-17). పాత నిబంధనలోని “పవిత్ర యుద్ధం” అనే భావన ఇశ్రాయేలు క్షేమం వారి సైనికుల సంఖ్యాబలం మీద కాక, దేవుని మీద ఆధారపడి ఉందని స్పష్టంగా తెలియజేస్తుంది.. ఇందుకు ఉదాహరణలు: యెరికో దగ్గర యుద్ధం (యెహో 7), మిద్యానీయుల మీద గిద్యోను విజయం (న్యాయాధి 7-8), ఇంకా అనేక ఇతర విజయాలు (కీర్తన 20:7).

31:2-3 ఇశ్రాయేలు సహాయం కోసం ఐగుప్తు నాశ్రయించడం ఎదురుదెబ్బ తగలడమే అవుతుంది. ఎందుకంటే దేవుడు తోడ్పడువారి మీద (ఐగుప్తు), సహాయము పొందువారి (దేవుని ప్రజలు)మీద శిక్ష రప్పించి వారిని నాశనం చేయబోతున్నాడు.

31:4-5 దేవుడు మాత్రమే తన ప్రజల్ని కాపాడగలడు. యెషయా ఈ వచనాల్లో రెండు సాదృశ్యాల నుప యోగిస్తూ దేవుని కాపుదలను వర్ణించాడు. శత్రు సైన్యాలకు వ్యతిరేకంగా ఆయన ఇశ్రాయేలు పక్షాన నిలబడిన సింహము (శత్రు సైన్యాలిక్కడ గొట్టెల కాపరుల లాగా సింహం నుండి తప్పించుకోవాలను కుంటున్నారు). పక్షులు ఎగురుచు వాటి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా ఆయన తన ప్రజల్ని శత్రువుల బారినుండి కాపాడును అనేది రెండవ సాదృశ్యం. విషయమేమిటంటే, దేవుడు తన ప్రజల్ని కాపాడుతూ వారిని విడిపిస్తాడు.

31:6-7 దేవుని ప్రజల పునరుద్ధరణలో రెండు కోణాలున్నాయి. ఆయనవైపు మళ్లడం, అంటే పశ్చాత్తాప పడడం, కల్పితదైవాలైన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను తీసి పారవేయడం.

31:8 అష్యూరీయులు కూలుదురు అనే వాస్తవానికి అసలు కారణం దేవుడు. అందుకు ఆయన బబులోను నుపయోగించుకుంటాడు. అయితే, బబులోనుకు విజయాన్నిచ్చేది దేవుడే. 

31:9 ఇది అసాధారణంగా ఉన్నా, ఆశ్రయదుర్గము అనే పదం బహుశా అషూరు రాజును సూచిస్తుండవచ్చు. రాయి ఆశ్రయానికి, కాపుదలకు సూచన. అయితే, ఇక్కడ రాయి ఆశ్రయంగా ఉండబోదు. ధ్వజము సైన్యం యుద్ధానికి వెళ్తూ పైకెత్తి పట్టుకొనే జెండా, సీయోనులో అగ్ని ఉండడం, యెరూషలేములో కొలిమి ఉండడం బహుశా “దేవాగ్నిగుండము" అయ్యుండవచ్చు. (29:1 నోట్సు చూడండి). అయితే, తీర్పు రాబోతుందనే సందర్భంలో ఇవి దాడిచేసే శత్రు సైన్యాన్ని దహించివేయడానికి యెరూషలేములో రగిలే అగ్నిజ్వాలల్ని సూచిస్తుండవచ్చు.


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |