Mark - మార్కు సువార్త 2 | View All

1. కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను

2. ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

3. కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

4. చాలమంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.

5. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.

6. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.

7. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
కీర్తనల గ్రంథము 103:3, యెషయా 43:25

8. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?
1 సమూయేలు 16:7

9. ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా?

10. అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి

11. పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

12. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
యెషయా 52:14

13. ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.

14. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.

15. అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించు వారైరి

16. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయు చున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా

17. యేసు ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

18. యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చియోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా

19. యేసుపెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని

20. పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినముల లోనే వారుపవాసము చేతురు.
1 సమూయేలు 21:6

21. ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.

22. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.

23. మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
ద్వితీయోపదేశకాండము 23:25

24. అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.

25. అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?

26. అబ్యాతారుప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.
లేవీయకాండము 24:5-9, 2 సమూయేలు 15:35

27. మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.
నిర్గమకాండము 20:8-10, ద్వితీయోపదేశకాండము 5:12-14

28. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-3:6 యేసుని అధికారానికి సంబంధించిన 5 పోరాట సంఘటనలు ఈ భాగంలో ఉన్నాయి. ప్రతీ సంఘటనలోనూ యేసు దేవదూషణ చేశాడనీ, పాపులతో సహవాసం చేస్తున్నాడనీ, మతాచారాలను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ, విశ్రాంతి దినాచారాలను ఉల్లంఘిస్తున్నాడనీ యూదులు ఆయనను నిందించారు. 2:1 ఆయన ఇంట ఉన్నాడని - బహుశా ఈ ఇల్లు పేతురు. ఇల్లు అయ్యుంటుంది (1:29-31 నోట్సు చూడండి). 

2:2 వాక్యము (గ్రీకు. లోగోస్, 4:33; 8:32 కూడా చూడండి). అనే పదం తర్వాత రోజుల్లో క్రైస్తవ సువార్త ప్రకటనను తెలియచేయడానికి ఉపయోగించబడింది. (అపొ.కా.6:4; 8:4; 17:11; గలతీ 6:6; కొలస్సీ 4:2-4). ఇక్కడ ఇది సువార్త గురించి ప్రస్తావిస్తుంది (మార్కు 1:14-15). 2:3 పక్షవాయువు గలవాని గురించి మార్కు కేవలం ఇక్కడ మాత్రమే ప్రస్తావించాడు (మత్తయి 8:6తో పోల్చండి). 

2:4 ఇంటి కప్పు విప్పి- పాలస్తీనాలో ఎక్కువశాతం ఇళ్లు ఒక్క అంతస్థు భవనాలే, సమతలమైన పైకప్పు గలవి, బయట నుంచి మెట్లు ఉంటాయి. మేడపై భాగం పని చేయడం కోసం, బట్టలు ఆరబెట్టుకోడానికి, నిద్రించడానికీ, ప్రార్థించడానికి ఉపయోగపడేది. అడ్డంగానూ నిలువుగానూ దూలాలను పేర్చి, వాటిపైన పూరి గడ్డినీ మట్టినీ పోసేవారు. పరుపు (వ.4,9,11-12) అనేది పేదలు ఉపయోగించే చిన్న మంచం లేదా మందమైన దుప్పటి అయ్యుండవచ్చు (6:55; యోహాను 5:8-11; అపొ.కా.5:15). 25 వారి విశ్వాసము అనే మాట పక్షవాయువు గలవాని విశ్వాసాన్ని అతణ్ణి మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని సూచిస్తుంది. స్వస్థతా వచనం పలకడానికి బదులు, అతణ్ణి కుమారుడా అని సంబోధించిన తర్వాత యేసు అతణ్ణి క్షమించానని చెప్పాడు. నీ పాపములు అనేది బహువచనంలో ఉండి, కొన్ని నిర్దిష్టమైన పాపాలను సూచిస్తుండవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే యేసు పాపాన్నీ రోగాన్ని ముడి పెట్టాడు. బహుశా ఈ వ్యక్తి చేసిన పాపాలకూ ఇతనికి ఉన్న పక్షవాతానికి సంబంధం ఉండి ఉంటుంది. 

2:6-7 ఆ రోగి పాపాలు క్షమించబడ్డాయని యేసు చెప్పిన మాటల్ని విన్నప్పుడు , ఆయన , దేవదూషణ చేస్తున్నాడని శాస్త్రులు భావించారు. దేవదూషణకు శిక్ష రాళ్లతో కొట్టి చంపడం (లేవీ 24:16; యోహాను 10:33). ఈ ఆరోపణలను ఎదుర్కొనే యేసు చివరికి మరణశిక్షను అనుభవించాడు (మార్కు14:64). 

2:8-11 "ఏది సులభం?" అని యేసు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం నిజానికి సులభం కాదు. పాపాలు. క్షమించబడ్డాయో లేదో దృశ్యనీయమైన రుజువులతో నిర్ధారించడం సాధ్యం కాదు. అందువల్ల పాపాలు క్షమించానని ఎవ్వరైనా చెప్పుకోవచ్చు. అయితే అలా క్షమించడానికి తనకు అధికారం ఉందని చెప్పుకోవడం భిన్నమైన విషయం. పాపాలు క్షమించడానికి తనకు అధికారముందని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తిని స్వస్థపరచడమనే నిర్ధారించ గలిగిన కార్యాన్ని యేసు చేపట్టాడు. మనుష్యకుమారుడు. అనేది యేసుకు నచ్చిన స్వీయబిరుదు. మనుష్యకుమారునికి అధికారము. ఇవ్వబడిందని చెప్పే దానియేలు 7:13-14 వచనాల నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది (1:21-22 నోట్సు చూడండి).


2:12 యేసు పాపాలను క్షమించగలిగాడని - ఈ - చర్య నిరూపించింది. వారందరు విభ్రాంతినొంది అనేమాట 1:27ని గుర్తుచేస్తుంది. దేవునికున్న ఆధిక్యతల్ని యేసు తనకు ఆపాదించుకుంటున్నాడని శాస్త్రులు ఆయనను నిందించారు 12:7). అయితే యేసును బట్టి జనసమూహము దేవుని మహిమపరచిరి. 

2:13-14 సముద్రతీరము అనేది గలిలయ సముద్రాన్ని సూచిస్తుంది. కేవలం మార్కు మాత్రమే సుంకరిని అల్పయి కుమారుడైన లేవిగా గుర్తించాడు (మత్తయి 9:9తో, లూకా 5:27తో పోల్చండి. వీటిని బట్టి మత్తయికి ఉన్న మరొక పేరు “లేవి” అని గ్రహిస్తున్నాం . మత్తయి 10:3), సుంకపుమెట్టు అనేది స్థానికంగా పన్ను వసూలు చేసే కార్యాలయం అయి ఉండవచ్చు. సుంకరులకు దొంగలకంటే, అన్యులకంటే మించిన గౌరవం దక్కేది కాదు. నన్ను వెంబడించుమని చెప్పిన మాట 1:17-18 వచనాలను గుర్తుచేస్తుంది. సువార్త గ్రంథాల్లో శిష్యత్వానికి ఇదొక ప్రామాణిక పదం. అతడు లేచి, ఆయనను వెంబడించెను అనే మాట యేసుని పిలుపు పట్ల లేవి తక్షణ స్పందనను తెలియచేస్తుంది.

2:15-17 యూదులు భోజనం చేసేటప్పుడు నేలకు ఆనుకొని పొట్టిగా ఉన్న బల్లపై మోచేతిని ఆనించి, కాళ్లను వెనక్కి మడిచి మోకాళ్లపై కూర్చుంటారు. లేవి యేసునూ ఆయన శిష్యులనూ విందుకు ఆహ్వానించాడు. అలా ఆహ్వానం పొందినవారిలో చాలా చెడ్డ పేరు పొందిన సుంకరులును పాపులును కూడా ఉన్నారు (లూకా 5:29తో పోల్చండి). "పాపులు" అనే మాట “ఉద్దేశపూర్వకంగా దేవుని చట్టాలను ఉల్లంఘించేవారి గురించి ప్రస్తావిస్తుంది”. యేసు అలాంటి వాళ్ల పాపాలను ఏమాత్రమూ సమర్థించలేదు. పాపులను రక్షించడానికే తాను వచ్చాడు కాబట్టి ఆయన వాళ్లతోనే జీవించాడు. శాస్త్రుల గురించి 1:21-22 నోట్సు చూడండి. ఎక్కువశాతం శాస్త్రులు పరిసయ్యులే. పరిసయ్యులు (ప్రత్యేకింపబడినవాళ్లు) ఎంతో నిష్టగా లిఖితపూర్వకమైన, నోటిమాటగా వాడుకలో ఉన్న చట్టాన్ని పాటిస్తూ దేవదూతల్నీ, పునరుత్థానాన్ని నమ్మేవాళ్లు. వారు గ్రీకు - ప్రాబల్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజలచేత గౌరవింపబడుతూ ఉండేవాళ్లు. తరచూ యేసుతో వాళ్లకు వివాదం తలెత్తేది. నేను నీతిమంతులను పిలువరాలేదని, యేసు పలికిన మాటలో నీతిమంతులు అనేది ఆయన స్వనీతిపరులైన పరిసయ్యులకు వ్యంగ్యంగా పెట్టిన పేరు. 

2:18 ఉపవాసము గురించి ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు, పరిసయ్యుల ప్రవర్తనకు యేసుని శిష్యుల ప్రవర్తన భిన్నంగా ఉంది. మహాప్రాయశ్చిత్త దినాన మాత్రమే ఉపవాసం చేయాలి (లేవీ 16:29-30. అయితే, చెర తర్వాత కాలంలో ఉపవాసం మొదలైందని ఎస్తేరు 9:30; జెకర్యా 8:19లో మనం చూడవచ్చు). కొ.ని. కాలంలో సోమ, గురువారాల్లో పరిసయ్యులు ఉపవాసం చేసేవారు. (లూకా 18:12). అది భక్తికి సూచనగా పరిగణించబడేది (మత్తయి 6:16-18). 

2:19-20 వివాహ వేడుక అనేది సాధారణంగా 7 రోజులపాటు జరిగేది. పెండ్లి యింటివారు ("వివాహవేదిక కుమారులు" అని అక్షరార్థం) అనే మాట వివాహ అతిథులనూ లేదా పెండ్లి కుమారుని సహాయకులను సూచిస్తుంది. పెండ్లికుమారుడు అనేమాట బాప్తిస్మమిచ్చే యోహాను యేసును పిలిచిన పిలుపును గుర్తుచేస్తుంది. (యోహాను 3:29). కొనిపోబడు అనేమాట “బలవంతంగా తొలగించబడడం" గురించీ, యేసుకు సంభవించబోయే మరణం గురించీ సూచిస్తుంది. బాప్తిస్మమిచ్చే యోహాను ఏవిధంగా తీసుకొనిపోబడ్డాడో (1:14) అలాగే తాను కూడా హింసాత్మక ధోరణిలో తీసుకొనిపోబడిన తర్వాత బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు ఇప్పుడు ఉపవాసం చేస్తున్నట్లు తన శిష్యులు కూడా ఉపవాసం చేస్తారని యేసు చెప్పాడు. 

2:21-22. మార్కు సువార్తలో యేసు - చెప్పిన తొలి ఉపమానాలు ఇవే! ద్రాక్షతిత్తులు మెత్తని, సాగే గుణమున్న మేక చర్మాలతో తయారుచేయబడ తాయి. ద్రాక్షరసాన్ని పులియబెట్టడానికి పాత ద్రాక్షతిత్తులు ఇంతకుముందే ఉపయోగించబడ్డాయి. కాబట్టి అవి సాగే గుణాన్ని కోల్పోయి, పెళుసుగా మారి, మరొకసారి ఉపయోగించినప్పుడు పిగిలిపోతాయి. తద్వారా నిలువ ఉంచడానికి పనికిరావు, కొత్త ద్రాక్షారసం పాడైపోతుంది. యేసుని ఉపదేశాలనూ (క్రొత్తదానిని) సనాతన యూదుమతంలోని ఆచారవ్యవహారాలనూ (పాతదానిని) ఐక్యపరచడం అసాధ్యమని ఈ రెండు ఉపమానాలు తెలియచేస్తున్నాయి. 

2:23-24 చేయకూడనిది అన్నప్పుడు ఏ నియమాలు ఉల్లంఘించబడ్డాయో స్పష్టం చేయబడలేదు. ఈ చర్యను వాళ్లు విశ్రాంతి దినమున చేయడం వల్లనే వివాదం తలెత్తింది. విశ్రాంతి దినాన ఎలాంటి పనీ చేయడానికి అనుమతి లేదు. (నిర్గమ 20:8-11; ద్వితీ 5:12-15). మరి ముఖ్యంగా విశ్రాంతి దినాన పంట కోయడం, ధాన్యం దుళ్లగొట్టడం నిషేధించబడ్డాయి. (నిర్గమ 34:21). గింజ పట్టిన వెన్నులను బట్టి ఈ సంఘటన వసంత కాలానికి చివర్లో లేదా వేసవి కాలానికి తొలిదశలో జరిగి ఉంటుందని చెప్పవచ్చు. పరిసయ్యుల గురించి వ. 15-17 నోట్సు చూడండి. 

2:25-26 రాజైన సౌలు నుంచి దావీదు పారిపోయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ యేసు తన శిష్యుల చర్యను సమర్థించాడు (1సమూ 21:1-6), అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా అనే మాటలు మార్కు సువార్తలోనే ఉన్నాయి. (మత్తయి 12:3; లూకా 6:3తో పోల్చండి). ఈ మాటలు వివాదానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే నిజానికి అబ్యాతారుకు తండ్రియైన అహీమెలెకు ప్రధానయాజకునిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే సౌలు యాజకుల్ని వధించినప్పుడు తప్పించుకున్న ఒకే ఒక్క ప్రధాన యాజకుడు అబ్యాతారు మాత్రమే (1సమూ 22:19-20). దావీదు జీవించిన కాలమంతటిలో ఇతడు ముఖుడు. ఆ విధంగా, మార్కు చెప్పిన సంగతి చరిత్రలో చక్కగా ఇమిడిపోయింది. దేవాలయంలోని పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన 12 పులియని రొట్టెలనే సన్నిధి రొట్టెలు సూచిస్తున్నాయి. ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలులోని 12 గోత్రాలకు సూచనగా ఉన్నాయి. ప్రతీ విశ్రాంతి దినాన వీటిని మారుస్తూ ఉంటారు, కేవలం. యాజకులు మాత్రమే వీటిని తినాలి (లేవీ 24:5-9). తినకూడని అనే మాటలు వ.24 లో పరిసయ్యులు చెప్పిన మాటల్ని పునరావృతం చేస్తున్నాయి. దావీదు తలపెట్టిన చర్యలు పా.ని. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినప్పటికీ వాటికి శిక్ష విధించబడలేదు అని ప్రకటించడానికి యేసుకు ఈ మాటలు అవకాశమిచ్చాయి.

2:27-28 విశ్రాంతి దినం విషయంలో, మనుషుల విషయంలో దేవుని ప్రాధాన్యతల గురించి యేసు చేసిన ప్రకటనను కేవలం మార్కు మాత్రమే గ్రంథస్థం చేశాడు. మనుష్యకుమారుడు గురించి తెలుసుకోవడానికి వ.8-11 నోట్సు చూడండి. విశ్రాంతి దినమునకు ప్రభువు అనే మాట పరిస్థితిని యేసు అధికారం వైపుకు మళ్లించి, ఆయనకున్న హోదాను ధృవీకరించింది.


Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |