Proverbs - సామెతలు 18 | View All

1. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక

2. తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.

3. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును.

4. మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
యోహాను 7:38

5. తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.

6. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

7. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.

8. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.

9. పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.

10. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

11. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.

12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.

13. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

14. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?

15. జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.

16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును

17. వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.

18. చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.

19. బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచు కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.

20. ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.

21. జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

22. భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.

23. దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.

24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.బైబిల్ అధ్యయనం - Study Bible
18:1 స్వేచ్ఛానుసారముగా అంటే ఇష్టానుసారమైన కోరికలు లేదా ఆశలు (21:25-26; సంఖ్యా 11:4; కీర్తన 10:3 తో పోల్చండి). లెస్పైన జ్ఞానము అంటే సఫలతకు నడిపించే (2:7 నోట్సు చూడండి) యోగ్యత లేదా సామర్థ్యం (3:21; 8:14) 

18:2. బుద్ధిహీనుడు తన వివేచన యందు సంతోషించినప్పుడు అతను మౌనంగా ఉండగలడు. అయితే తనకు తెలుసని అనుకుంటున్నదాన్ని బయటపెట్టకుండా ఆగలేడు (15:2)

18:3 భక్తిహీనుడు ఇతరుల పట్ల తిరస్కారంతోను అవమానముతోను నిందాపూర్వకంగాను ప్రవర్తిస్తాడని ఈ వచనం చెప్పడంలేదు గానీ, భక్తిహీనుడికి సమాజం నుండి తిరస్కారం ఎదురవుతుందని తెలియజేస్తుంది. 

18:4 మంచి ప్రసంగం లోతు గలది అర్థవంతమైనదై ఉంటుంది అని దీని భావం కావచ్చు. మంచి మాటలు జ్ఞానపు ఊట లాంటివి. లేదా సగటు మనిషి మాటలు తరచుగా నిరుపయోగమైనవైనా (20:5), జ్ఞానపు ఊట మటుకు ప్రయోజనకరమైన నదీ ప్రవాహమువంటిది. 

18:5 పక్షపాతము చూపుటయు అంటే "ముఖం పైకెత్తడం” అని అక్షరార్ధం. ఇది ఉన్నతమైన స్థాయిలో ఉన్న న్యాయాధిపతి తన ముఖాన్ని పైకెత్తి, కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని చిరునవ్వుతో చూస్తూ అతని కనుకూలమైన తీర్పు నివ్వడాన్ని సూచిస్తుండవచ్చు. (సంఖ్యా 6:26; కీర్తన 4:6 తో పోల్చండి), లేదా దిగువన ఉన్న వ్యక్తి నేలచూపులు చూస్తూ తలదించుకొని ఉన్నప్పుడు న్యాయాధిపతి అతని కనుకూలంగా తీర్పు చెప్పడం ద్వారా అతని తలను పైకెత్తడాన్ని సూచిస్తుండవచ్చు. (ఆది. 40:13; యోబు 11:15). ఈ పదజాలానికున్న మరొక అర్థం దిగువస్థాయిలో ఉన్న వ్యక్తి తన పై స్థాయి వ్యక్తిని బహుమానాలతో "ప్రాయశ్చిత్తమేమైనా”... చేసినప్పుడు (సంతృప్తి పర్చడం) (6:35), పై స్థాయి వ్యక్తి ఆ బహుమానాన్ని “అంగీకరించి" (యోబు 42:9), దిగువస్థాయి వ్యక్తి “మనవి అంగీకరించడం” (ఆది. 19:21, 1సమూ 25:35) అయ్యుండవచ్చు. న్యాయము తప్పించడమంటే “న్యాయ తీర్పు నుండి ప్రక్కకు తొలగడం” అని అక్షరార్థం (యెషయా 29:21; ఆమోసు 5:12; మలాకీ 3:5). 

18:6-7 బుద్దిహీనుడు (హెబ్రీ. కేసిల్) మాట్లాడే మాటలను పెదవులు... నోరు అనే పదాలు సూచిస్తుండవచ్చు. ఇవి కలహము పుట్టించడంతో బాటు భయము కలగడానికి, దెబ్బలు తగలడానికి చివరికి నాశనమునకు తుది పర్యవసానంగా మరణానికి దారితీస్తాయి. 

18:8 కొండెగాని మాటలు గురించి 16:28 నోట్సు చూడండి. రుచిగల భోజ్యములు అంటే ఆశతో ఆత్రంగా తినాలనిపించే రుచిగల పదార్థాలు. ఆ మాటలు వాటిని వినువాని లోకడుపు అంటే జీర్ణాశయం లోపలి భాగంలోనికి దిగిపోవును. అవి (చాడీలు) అతని మనసులో చేరి అతని ఆలోచనలను కలుషితం చేసి అతని అంతరంగాన్ని విషపూరితం చేస్తాయి. 

18:9 జాగు చేయడం అంటే బద్దకంలోకి కూరుకొనిపోవడం, అవసరమైన దానికంటే ఎక్కువగా విశ్రమించడం, నత్తనడకతో నిదానంగా పనిచేయడం, ఈసురోమంటూ నిరుత్సాహంగా ఉండడం, కార్యదక్షత లేకపోవడం, సోదరుడు అనే భావన సంఘీభావాన్ని తెలియజేస్తుంది, అంటే ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండడం (యోబు 30:29), ఒకే కారణాలను బలపర్చడం (28:24 లోని “జతకాడు” తో పోల్చండి). నష్టము చేయువాడు (హెబ్రీ. బాల్) అంటే అక్షరార్థంగా “నాశనానికి అధిపతి” (యెహె 21:31 తో పోల్చండి. “నాశనము చేయుటయందు నేర్పరులైన")

18:10-11 ఈ రెండు సామెతలు వరుసగా నిజమైన, కృత్రిమమైన ఆశ్రయా లను వివరిస్తున్నాయి. ఒక బలమైన దుర్గము ఆపద ఎదురైనప్పుడు ఏదైనా పట్టణం లేక ప్రదేశం లోని ప్రజలు అందులోకి పరుగెత్తి సురక్షితంగా ఉండడం కోసం దాని మధ్యభాగంలో లేదా ప్రధానమైన చోట ఉండే ఆశ్రయస్థానం (న్యాయాధి 9:51). యెహోవా నామము ఆయన గుణలక్షణాల్ని, అంటే ఆయన అనంతుడనీ, శక్తిమంతుడనీ, నమ్మదగినవాడనీ, నిబంధనను మీరని దేవుడనీ తెలియజేస్తుంది (నిర్గమ 3:15; 6:6-7; ద్వితీ 7:9). నీతిమంతులు, అంటే దేవుని గుణలక్షణాల్లో విశ్వాసం గలవారు ఆయనను ఆశ్రయించి, ప్రార్థించినప్పుడు ఆయన వారిని సురక్షితముగా కాపాడుతాడు (అక్షరార్థంగా “శత్రువుకు అందకుండా ఎత్తైన చోట ఉంచడం"). ధనవంతునికి ఆపద ఎదురైనప్పుడు తన ఆస్తి తనకు ఆశ్రయపట్టణము అనుకుంటాడు. అతని ఆస్తి అతనికి యెత్తయిన ప్రాకారము లాగా కనబడుతుంది (10:15 తో పోల్చండి), అయితే అది వాని దృష్టికి అలా కనబడుతుంది గానీ, వాస్తవానికి ఐశ్వర్యం అతడిని రక్షించలేదు (11:28; యోబు 31:24-28; 36:18-19; కీర్తన 49; 52:5-7; మత్తయి 16:26; మార్కు 10:24-25 లతో పోల్చండి). 

18:12 ఈ సామెత ఘనతకు ముందు వినయము ఉంటుంది అని వివరించడంలో 16:5, 18 లను అధిగమించింది. (3:16 నోట్సు చూడండి: 15:33; 22:4; 29:23; 11:2 “జ్ఞానము” నోట్సు చూడండి). "వినయం" అనేదానికి ఇక్కడ వాడిన హెబ్రీ పదం శ్రమ లేదా బాధ కలిగినప్పుడు క్రుంగి ఉండడం, మన స్వావలంబన చాలదని శ్రమ లేదా బాధ మనకు స్ఫురింపజేసినప్పుడు దేవుని మీద నిజమైన విశ్వాసంతో ఆయనను ఆశ్రయించడం అనే భావనను తెలియజేస్తుంది. 

18:13 బుద్ది లేనివాడు వినకముందు మాట్లాడడానికి ముందుకు వస్తాడు, ఎవరూ అడగకుండానే తన అభిప్రాయాల్ని బయటికి చెప్తాడు (వ.2), లేదా ఆలోచించకుండా ప్రత్యుత్తర మిచ్చును (అక్షరార్థంగా “మాటకు మాట చెప్తాడు"). ఇది వాడి మూఢతను (హెబ్రీ. ఏవిల్ నుండి ఉత్పన్నమైన ఇవెలెత్) బయటపెట్టి, వాడిని సిగ్గుపడేలా చేస్తుంది (పాపం లేదా ఓటమి కారణంగా గౌరవాన్ని, లేదా హోదాను కోల్పోవడం). 

18:14 దేహానికి వచ్చే వ్యాధికంటె మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా నలిగిన స్థితి రుగ్మత దారుణమైనది (15:18). 

18:15 జ్ఞానాన్ని ద్వేషిస్తూ (1:22) విననొల్లని (వ.13) జానాభ్యాసం కోసం తన ధనాన్ని వెచ్చించని (17:16) బుద్ధిహీనుడి లాగా కాక, జ్ఞానం గలవారి చెవులు తెలివిని వింటాయి (1:4 నోట్సు చూడండి), వివేకము గల (1:5 నోట్సు చూడండి) మనసు తెలివిని సంపాదించును (4:5-8 నోట్సు చూడండి) 

18:16 ఇక్కడ చెప్పిన కానుక లంచం (15:27 నోట్సు చూడండి). లంచం గురించి సూక్ష్మ పరిశీలన: లంచం ఇచ్చే వ్యక్తికి అది అనుకూలమైన (“వీలు కలుగజేయును”) అవకాశం కలిగేలా చేసినా (హెబ్రీ. లో “వీలు” అనే పదం గొట్టెలకాపరి గొట్టెలకు అనుకూలమైన ఏర్పాట్లు చేయడాన్ని సూచిస్తుంది), లంచం ఇచ్చే వ్యక్తిని అది రాజులు, న్యాయాధిపతులు వంటి గొప్పవారి యెదుటకు వానిని రప్పించినా, లంచం వలన అనుకున్న పని నెరవేరుతున్నట్టు కనబడినా (17:8; 19:6; 21:14), అంతిమంగా లంచాన్ని ద్వేషించేవారు మాత్రమే వర్దిల్లుతారు (15:27). 

18:17 "ఎదుటివాడు వచ్చినమీదట” అంటే “పరిశోధించిన మీదట” అని అక్షరార్థం. వ్యాజ్యంలో అవతలి వ్యక్తి వాదాన్ని లోతుగా పరిశీలించి అందులో దాగి ఉన్నవాటిని బయట పెట్టడాన్ని ఇది సూచిస్తుంది (25:2; 28:11)..

18:18 చీట్లు గురించి 16:33 నోట్సు చూడండి. నాణాన్ని ఎగరవేయడం ద్వారా కఠినమైన వాగ్వాదానికి సైతం ముగింపు పలకవచ్చు. 

18:19 ఏదైనా నష్టానికి లేదా నేరానికి గురై బాధపడినవాడే ఈ అన్యాయము నొందిన సహోదరుడు. ప్రాచీన కాలంలో నగరు తలుపులకు బలమైన ఇనుప అడ్డగడియలుండేవి. అడ్డగడియలు వేసిన ద్వారాలను దాటి లోపలికి వెళ్ళడం ఎంత కష్టసాధ్యమో, సహోదరుల మధ్య వివాదాల పరిష్కారం కూడా అంతే అసాధ్యం అని దీని భావం. 

18:20 విత్తనం విత్తిన తర్వాత కొంత కాలానికి ఫలముగా పంట చేతికి వస్తుంది. హెబ్రీలో ఒకే పదం నిండును, తృప్తి పొందును అనే ఈ రెండు అర్థాలను ఇస్తుంది. “కడుపు నిండును” అనే పదం నిషేధార్థంలో “కక్కు వచ్చేంత ఎక్కువగా తినడాన్ని సూచిస్తుంది (25:16-17). ఈ పదాలు మనిషి నోటి నుండి వచ్చే మాటలు, అవి మంచైనా చెడైనా, తిరిగి అతనికే చేరుతాయని సూచిస్తున్నాయి. మాటలు చెడ్డవైతే అవి అతనికి కావలసినంత చేటును తెస్తాయి (1:31), మంచివైతే కావలసిన మేలులు వాటంతట అవే వస్తాయి (12:14; 14:14; 28:19 తో పోల్చండి). 

18:21 నాలుక ఒక శక్తి గల అవయవం (యాకోబు 3:1-12). కత్తి చేతపట్టిన వారు కత్తితోనే బ్రతికినట్టుగా (ఆది 27:40; మత్తయి 26:52), ధర్మశాస్త్రంలోని నీతి ననుసరించేవారు. దాని ప్రకారమే జీవించినట్టుగా (నెహెమ్యా 9:29; యెహె 20:11; రోమా 10:5; గలతీ 3:12), విశ్వాసాన్ని అనుసరించేవారు విశ్వాస మూలంగానే జీవించినట్టుగా (హబ 2:4; రోమా 1:17; గలతీ 3:11), నాలుకయందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అంటే తమ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు తగిన ప్రతిఫలం పొందుతారు. ఎందుకంటే జీవమైనా మరణమైనా నాలుక, వశములోనే ఉన్నాయి. వివేకవంతమైన మాటలు జీవమునిస్తాయి (వ.20; 12:14; 13:2; 21:23), చెడు మాటలు లేదా మితిమీరిన సంభాషణలు మరణమునకు దారితీస్తాయి (13:3; మత్తయి 15:18-19) 

18:22 మేలు. అంటే సంక్షిప్తంగా “మంచితనం." ఇతర సందర్భాల్లో అది “విజయం " అని కూడా అనువదించబడింది. (16:20; 17:20; 19:8). అనుగ్రహము గురించి 19:6 నోట్సు చూడండి. 

18:23 బతిమాలుకొనడమంటే కనికరం కోసం లేదా సహాయం కోసం మనవి చేసుకొనడం (కీర్తన 86:6; 116:1; 130:2; 140:6) లేక విజ్ఞాపన చేయడం (2దిన 6:21; దాని 9:3,17), ధనవంతుడు తనకు ధనం వలన వచ్చిన దర్పంచేత తాను దురుసుగా (అక్షరార్థంగా, “క్రూరంగా, పరుషంగా”) మాట్లాడినా చెల్లుబాటు కాగలననుకుంటాడు. అయితే మాటలు ఎవరి నోటినుండి వచ్చాయో వారికే తిరిగి తగులుతాయి, మాటలకు చంప గలిగే శక్తి ఉంది (13:3; 18:20-21), ధనం ప్రాణాన్ని రక్షించలేదు (11:28; 18:11). 

18:24 చెలికాండ్రు అంటే మొదటిగా ఇరుగు పొరుగువారు. లేదా మనతో సహవాసం చేసేవారు. వీరు డబ్బులున్నప్పుడు చెంత చేరేవారు(19:4). మరొక రకం స్నేహితుడు “నిజమైన ప్రేమను వెల్లడిచేస్తాడు”. యేసు తన శిష్యులకు అలాంటి స్నేహితుడుగా వారిని ప్రేమించాడు (యోహాను 15:13-14). 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |