Isaiah - యెషయా 38 | View All

1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

2. అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;

6. ఇంక పదిహేను సంవత్సర ముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

7. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

8. ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

9. యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10. నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.
మత్తయి 16:18

11. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12. నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14. మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

15. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును.

16. ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.

18. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.

19. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

20. మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

21. మరియయెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.

22. మరియహిజ్కియానేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
38:1-3 ఆ దినములలో అనే పదాలను 37వ అధ్యాయం తర్వాత 38వ అధ్యాయం వరుసగా కాలక్రమంలో జరుగుతున్నవాటిని తెలియజేసేవిగా చూడకూడదు. దేవుడు యెరూషలేమును విడిపించక పూర్వమే హిజ్కియా జబ్బుపడ్డాడు. వ.6 ఈ విషయాన్ని స్పష్టంచేస్తుంది.

38:4-5 దేవుడు హిజ్కియా ప్రార్థన... నంగీకరించి అతనికి పదిహేను సంవత్సరముల ఆయుష్యము పొడిగించాడు. ఈ వచనాల్లో దేవుణ్ణి నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా అని వర్ణించడం ఆసక్తికరమైన విషయం.
హిజ్కియా దావీదు వంశస్థుడు, దేవుడు దావీదుతో అతని సంతానం యెరూషలేములో సదాకాలం సింహాసనం మీద ఉంటాడని వాగ్దానం చేశాడు. హిజ్కియాకు అప్పటికి కుమారుడు కలిగి ఉండకపోవచ్చు. (హిజ్కియా మరణించినప్పుడు అతని కుమారుడైన మనషే వయస్సు పన్నెండేళ్లు : - 2రాజులు 21:1). హిజ్కియా ఆయుషు పదిహేను సంవత్సరాలు పొడిగింప బడక పూర్వం అతనికి మరణం సంభవించి ఉన్నట్లయితే దావీదు వంశం అతనితో అంతమై ఉండేది. 

38:6 పట్టణాన్ని అష్నూరు రాజు నుండి విడిపించడం, ఈ సంఘటన 36-37 అధ్యాయాల్లో వర్ణించబడిన అషూరు ముట్టడి కాలంలో జరిగి ఉండవచ్చని సూచిస్తుంది. 

38:7 హిజ్కియాకు సూచన, అధ్యా.7లో అతని తండ్రియైన ఆహాజుకు తెలియజేసిన సూచనను గుర్తు చేస్తుంది. సూచన నందుకోడానికి ఆహాజు ఇష్టం చూపలేదు. బహుశా అతని మనసులో వేరే ఉద్దేశాలుండవచ్చు. అయితే హిజ్కియా సూచనను తిరస్కరించలేదు. తండ్రీ తనయుల భిన్నమైన ప్రతిస్పందనలు వారి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాయి, ఆహాజు అన్యదేశాల నాశ్రయించాడు. హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. 

38:8 సూర్యకాంతి మెట్ల మీద మరల ఎక్కడం పగటివేళ పొడిగించబడడాన్ని తెలియజేస్తుంది. ఇది దేవుడు హిజ్కియా ఆయుషును పొడిగించడాన్ని సూచిస్తుంది. 2రాజులు 20:9-11 వచనాల్లోని ఇదే వృత్తాంతం హిజ్కియాకు ఎంపిక చేసుకొనే అనుమతి ఉన్నట్టు తెలియజేస్తుంది. అతడు సూర్యకాంతి సహజక్రమం ప్రకారం దిగిపోవాలనియైనా కోరుకొనవచ్చు. లేదా సూర్యకాంతి వెనుకకు పది మెట్లు మరల ఎక్కాలనియైనా కోరుకోవచ్చు. హిజ్కియా అతి కష్టమైనదాన్ని కోరుకున్నాడు, అతడు సూర్యకాంతి వెనుతిరిగి మెట్లు ఎక్కాలని కోరుకున్నాడు. 

38:9 హిజ్కియా పద్యంలోని ఉపోద్ఘాతం అది అతడు రోగియై ఆరోగ్యము పొందిన తరువాత రచించినదని తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఇది కీర్తనలు గ్రంథంలోని కృతజ్ఞతార్పణ కీర్తనల్లాగా ఉంది. పద్యం మొదటి భాగంలో హిజ్కియా తాను మరణానికి ఆసన్నుడైనట్టు చెబుతున్నాడు. అయితే, రెండవ భాగాన్ని అతడు బాగై ఆరోగ్యవంతుడైన తర్వాత వ్రాసినట్టుగా తెలుస్తుంది. 

38:10 పాతాళద్వారము మృత్యువును లేదా సమాధిని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో “పాతాళం" అధఃలోకాన్ని సూచిస్తుంది. 

38:11 సజీవుల దేశమున అనే పదజాలం ఈ లోకాన్ని సూచిస్తుంది, హిజ్కియాకు మరణానంతర జీవితంలో ఉన్న నమ్మకం గురించి ప్రశ్నను లేవనెత్తుతుంది. 

38:12 హిజ్కియా పలు సాదృశ్యాలనుపయోగిస్తూ మానవజీవితం అశాశ్వత మైందనీ, క్లుప్తమైందనీ వర్ణించాడు. .. 88:13 దేవుణ్ణి సింహముగా వర్ణించడం గురించి విలాప 3:10; హోషేయ 5:14; ఆమోసు 3:8 చూడండి.

38:14 హిజ్కియా విలాపంలోని మూల్గులు పక్షి కిచకిచలాడుతున్నట్టుగా ఉన్నాయి.

38:15-16 దేవుడు మాట ఇచ్చెను కాబట్టి, హిజ్కియా అకాలమరణం నుండి తప్పించుకున్నాడు. 

38:17 మిక్కుటమైన ఆయాసము అనే పదజాలం (వ.15 కూడా చూడండి) హిజ్కియాకు తాను మరణించ బోతున్నానని తెలిసినప్పుడు వ్యాకులపాటుతో నిండిన అతని ప్రతిచర్యను సూచిస్తుంది. ఈ వ్యాకులమే అతడు ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించేలా, దేవుడతణ్ణి మరణం నుండి తప్పించేలా చేసింది. రాజు నాశనమను గోతి అనే పదజాలంతో సమాధిని (అధఃలోకాన్ని) సూచిస్తున్నాడు. సమాధిలో శరీరం కృశించి మన్నయి పోతుంది. 

38:18 పాతాళము (వ.10 నోట్సు చూడండి), మృతి వ్యక్తిత్వారోపణలో కనబడుతున్నాయి. సమాధిలోనికి దిగువారు అనే పదజాలం మృతుల్ని సూచిస్తుంది, మృతులు దేవుణ్ణి స్తుతించలేరు.

38:19 సజీవుల ద్వారా దేవుడు స్తుతుల నందుకుంటాడు. సజీవులు దేవుణ్ణి స్తుతిస్తూ, రాబోయే తరాలు కూడా దేవుణ్ణి స్తుతించేలా చేయగలరు.

38:20 విమోచనాగానాల్ని ఆలపించడం దేవుని ప్రజల్లో మాత్రమే ఉండే విలక్షణమైన ప్రతిస్పందన. 

38:21-22 ఈ వచనాలు హిజ్కియా వృత్తాంతంలోని కొన్ని యథార్ధ సంఘటనల్ని తెలియజేసే అనుబంధ భాగం. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |