Colossians - కొలస్సయులకు 3 | View All

1. మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
యెషయా 45:3

2. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

3. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.

4. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

5. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.

6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.

7. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి.

8. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

9. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ

10. మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
కీర్తనల గ్రంథము 110:1

11. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.

12. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.

13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను బంధమైన ప్రేమను ధరించుకొనుడి.

15. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

17. మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

18. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
ఆదికాండము 1:27

19. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.

20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.

21. తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.

22. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.

23. ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక,

24. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.

25. అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.
ఆదికాండము 3:16బైబిల్ అధ్యయనం - Study Bible
3:1-17 2:23లో అబద్ధ బోధకుల దేహశిక్ష బోధను పౌలు విమర్శించాడు. శరీర పాపేచ్ఛలను అదుపుచేయడంలో అలాంటి ఆచారాలు ఏమాత్రం సహాయపడవని అతడు చెప్పాడు. శరీర పాపేచ్చలకు ప్రభావవంతమైన విరుగుడు నిజమైన ఆధ్యాత్మిక జీవితమేనని పౌలు ఈ వచనాల్లో ఒక సానుకూలమైన సలహా ఇచ్చాడు. 

3:1-2 "2:20లో ఆరంభమైన క్రీస్తుతో విశ్వాసుల గుర్తింపు గూర్చిన ప్రస్తావన ఇక్కడ మళ్ళీ కొనసాగింది. పత్రికలో సిద్ధాంతపరమైన సూచనల నుండి (అధ్యా. 1-2) ఆచరణాత్మక అన్వయానికి (3:1-4:6) మారడాన్ని ఈ వచనం సూచిస్తుంది. విశ్వాసులు తమ ప్రయత్నాలు, ఆలోచనలకు క్రీస్తును పైనున్న వాటిని మాత్రమే కేంద్రంగా చూడాలి గాని భూసంబంధమైన వాటిని కేంద్రంగా చేసుకోకూడదు (వ.3). ఈ ఆజ్ఞలు నిజమైన ఆధ్యాత్మికతకూ, భూసంబంధమైన “తత్వాన్ని ప్రోత్సహించే తప్పుడు ఆధ్యాత్మికతకూ వ్యత్యాసాన్ని చూపుతున్నాయి. 

3:3 ఈ ఆజ్ఞలకు మూలం (వ.1-2) క్రీస్తుతో విశ్వాసి ఐక్యతలో ఉంది. దాచబడడం శాశ్వతమైన ఫలితాలతో గతంలోనే దేవుడు కార్యాన్ని పూర్తిచేశాడని సూచిస్తుంది. 

3:4 ప్రస్తుతం క్రీస్తు భూమిపై జీవించేవారి దృష్టికి కనబడకుండా పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. భవిష్యత్తులో ఒక సమయంలో తన సంపూర్ణ మహిమతో ఆయన ప్రత్యక్షమౌతాడు. ఇది జరిగినప్పుడు, విశ్వాసులు కూడా క్రీస్తుతో పాటు మహిమలో ప్రత్యక్షమౌతారు. 

3:5 చంపివేయుడి అనే ఆజ్ఞ (2:20; మత్తయి 5:29-30; రోమా 8:13) పరలోక సంబంధమైన వాటిని ఆచరణాత్మకంగా వెదుకుతూ, వాటి గురించి ఆలోచించడాన్ని సూచిస్తుంది. భూమిమీదనున్న మీ స్వభావము అంటే ఏమిటో వివరించడానికి పౌలు ఐదు అవలక్షణాల జాబితా ఇచ్చాడు. ఈ జాబితా నిర్దిష్టమైన బాహ్య ప్రవర్తన నుండి అంతరంగంలోని సాధారణ ప్రవృత్తులు, ఆలోచనల వైపుకు పయనించింది. 3:6 ఈ పాపాల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను దేవుని ఉగ్రత సూచిస్తుంది. 

3:7 అనుసరించి నడుచుకొంటిరి అనే మాటలు విశ్వాసుల పాత, కొత్త జీవన విధానాల మధ్య వైవిధ్యాన్ని నొక్కిచెబుతున్నాయి.

3:8 విసర్జించుడి అంటే అక్షరార్ధంగా దేనినైనా "తీసివేయడం" లేక “తొలగించడం” అనే అర్థమిస్తూ పౌలు అలవాటుగా చెప్పే దుస్తులు మార్చుకోవడం లాంటి సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. (రోమా 13:12; ఎఫెసీ 4:22). జాబితాలో ఉన్న అవలక్షణాలన్నీ వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను పాడుచేసే ప్రవర్తనకు సంబంధించినవే. 

3:9-10 దుస్తులు మార్చుకోవడం అనే సాదృశ్యం ఒకని ప్రవర్తనలో మనం సాధారణంగా దృష్టించదగిన మార్పుకు సాదృశ్యంగా ఉంది. పాత వ్యక్తిత్వానికి మారుగా కొత్త వ్యక్తిత్వం వస్తుంది కానీ అది దేవుని రూపాన్ని ప్రతిబింబించేటంత వరకూ నూతనపరచబడుచూ ఉంటుంది. నవీన స్వభావము వ్యక్తులకు మాత్రమే కాక క్రీస్తు శరీరం (1:15-20) అనే సమూహానికి కూడా వర్తిస్తుంది. 

3:11 పూర్వపు క్రమం జాతి, సమాజభేధాన్ని బట్టి గుర్తించబడింది కానీ కొత్త క్రమం క్రీస్తు శరీరంలోని ఆ వైరుధ్యాన్ని తుడిచివేస్తుంది. (గలతీ 3:27-28 చూడండి). క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు అనే మాటలు ఆయన సార్వభౌమత్వాన్నీ (1:17), విశ్వాసుల్లో ఆయన నివాసాన్ని (1:27) సూచిస్తున్నాయి. 

3:12 ప్రాపంచిక ప్రవర్తనలను “విసర్జించమని విశ్వాసులకు ఆజ్ఞాపించిన తర్వాత, పౌలు దేవుని ప్రజలకు తగిన ప్రవర్తనను ధరించుకొనమనే (రోమా 13:14) సానుకూలమైన ఆజ్ఞల పరంపరను ఇస్తున్నాడు. ఏర్పరచబడినవారు (యెషయా 43:20; - 65:9; రోమా 8:33; 2తిమోతి 2:10; తీతు 1:2-4; 1పేతురు. 1:1; 2:4,6,9), పరిశుద్దులు (మార్కు 1:24; లూకా 4:34; యోహాను 6:69; 1 పేతురు 2:9), ప్రియులు (మత్తయి 3:17; ఎఫెసీ 1:6; 1థెస్స 1:4; 2థెస్స 2:13) అనే విశేషణాలన్నీ ఇశ్రాయేలుకు, యేసుకు, సంఘానికి వర్తించేవి. ఐదు సద్గుణాలు వ. 5, 8లలో ఇచ్చిన దుష్టత్వాలకు పూర్తిగా విరుద్ధమైనవి. 

3:13 సహించుచు (రోమా 15:7; ఎఫెసీ 4:2తో పోల్చండి), క్షమించుడి (ఎఫెసీ 4:32తో పోల్చండి) అనే మాటలు ఇంతకు ముందు చెప్పిన సద్గుణాలు విశ్వాసులకు ఒక అలవాటుగా చూపించడాన్ని వ్యక్తపరుస్తాయి. ఈ రెండు క్రియాపదాలు క్రీస్తు శరీరంలో ఒకరితో ఒకరికి ఉండాల్సిన అనుబంధాలను గురించినవి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున అనే మాటలు విశ్వాసులు క్షమించబడ్డారు కాబట్టి వారు కూడా క్షమించాలి అనే యేసు ఆజ్ఞను ప్రతిధ్వనిస్తుంది. (మత్తయి 6:12,14-15; 18:23-35; లూకా 7:42). 

3:14 దేవుని ప్రజల అంతిమ, అతి ప్రాముఖ్యమైన నూతన వస్త్రం పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అని ఈ వర్ణన సూచిస్తుంది. ఇది విశ్వాసులను సంపూర్ణ ఐక్యత కోసం కలిపి ఉంచుతుంది (ఎఫెసీ 4:3). 

3:15 క్రీస్తు ఇచ్చే సమాధానము విశ్వాసుల హృదయాలను నియంత్రించాలి (రోమా 8:6; 15:13; 2 కొరింథీ 13:11; గలతీ 5:22; ఎఫెసీ 2:14; ఫిలిప్పీ 4:7; 2థెస్స 3:16). కృతజ్ఞులై యుండుడి అనే మాటలు 1:3,12; 2:7ను జ్ఞాపకం చేస్తున్నాయి (3:17; 4:2తో పోల్చండి). 

3:16 విశ్వాసుల మధ్య సువార్త నివసించవలసిన మార్గాలను బోధించుచు, బుద్ధిచెప్పుచు అనే మాటలు వివరిస్తున్నాయి. బోధించుట, బుద్ది చెప్పుట అనేవి ఎలా జరగాలో గానము చేయుచు, కృపాసహితముగా అనే మాటలు సూచిస్తున్నాయి. 

3:17 ఈ వచనం 1కొరింథీ 10:31 లాగా ఉంది: “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”. మీరేమి చేసినను ప్రభువైన యేసు... పేరట చేయడం అంటే, ఆయనకు విధేయులై చేయడం అని అర్థం. 3:18-4:1 ప్రభువు నామంలో సమస్తం చేయడం అనేది కుటుంబంలోని ప్రతివ్యక్తికి ఎలా అన్వయిస్తుందో పౌలు ఈ భాగంలో చెప్పాడు. ఆది క్రైస్తవులు ఈ విధానాన్ని పాటించి, మెరుగుపరచి, ఒక క్రైస్తవ కుటుంబంలోని సభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలో వివరించేవారు.
(ఎఫెసీ 5:21-6:9; తీతు 2:2-10; 1 పేతురు 2:18-3:7). 

3:18 భార్యలు తమ భర్తలకు విధేయులుగా ఉండాలని పౌలు హెచ్చరించాడు. (ఎఫెసీ 5:21-24). పౌలు ఎల్లప్పుడూ అధికారానికి సంబంధించిన విషయాల్లో ఈ క్రియాపదాన్ని ఉపయోగించాడు (రోమా 8:7; 10:3; 13:15; 1కొరింథీ 14:34; 15:27-28; 16:16; ఫిలిప్పీ 3:21; తీతు 2:5,9; 3:1). ఈ విధేయత దాస్యత్వము కాదు. అది స్వచ్ఛందంగా అధికారానికి లోబడడం. ఈ క్రమము భార్యకు క్రీస్తుతో ఉన్న సంబంధం మీదా, కుటుంబంలో ఆమె పాత్ర మీదా ఆధారపడి వుంటుంది. (ఇది ప్రభువును బట్టి యుక్తమై యున్నది) గాని ఆమె తక్కువస్థాయి వ్యక్తి అనే చెడు అభిప్రాయం మీద కాదు (1కొరింథీ 11:3,7-9; ఎఫెసీ 5:22-24 నోట్సు చూడండి) 

3:19 భార్యలకు హెచ్చరికలతో పాటు పౌలు భర్తలతో మీ భార్యలను ప్రేమించుడి అంటూ వారిని నిష్ఠురపెట్టకుడి అనే హెచ్చరికను కూడా కలుపుతున్నాడు. "ప్రేమ" అంటే ఆ వ్యక్తి క్షేమం కోసం చూపవలసిన నిస్వార్థమైన, త్యాగపూరిత శ్రద్ధ (ఎఫెసీ 5:25-33). “నిష్ఠుర” పెట్టడం అంటే కఠినంగా ప్రవర్తించడం అని భావం. “వారిలో నిష్ఠూర భావనలు కలిగించేలా ప్రవర్తించవద్దని" దీన్ని అనువదించవచ్చు. భర్తలు భార్యలను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి, ఎన్నడూ వారితో కటువుగా ప్రవర్తించకూడదు (1 పేతురు 3:7). 

3:20 మాట వినుడి అనే మాటలో లోబడి ఉండండి అని చెప్పే ఆజ్ఞలోని స్వచ్చంద భావన లేదు. పిల్లలు తమ తల్లిదండ్రులకు తప్పక విధేయులవ్వాలి (నిర్గమ 20:12; ద్వితీ 5:16; ఎఫెసీ 6:1-3). అలా చేస్తేనే వారు ప్రభువును సంతోష పెట్టగలరు. ఈ విధేయత తల్లిదండ్రులు అడిగే అనైతికమైన, విగ్రహారాధన సంబంధిత విషయాల్లో చూపించకూడదు. ఎందుకంటే అలాంటి ప్రవర్తన ప్రభువును సంతోషపెట్టదు కాబట్టి. 

3:21 తండ్రులారా అనే మాటలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నప్పటికీ (హెబ్రీ 11:23), తమ పిల్లలకు కోపము పుట్టింపకుండా ఉండాల్సింది నిర్దిష్టంగా తండ్రులే (ఎఫెసీ 6:4). "కోపము పుట్టించడం" అంటే ఒకడు తన మనసులో కక్ష తీర్చుకోవాలని అనుకునేలా చేయడం. ఈ ఆజ్ఞ ఇవ్వడానికి కారణం పిల్లల మనస్సు కృంగకుండుటకు లేక నిరుత్సాహ పడకుండా ఉండాలని. తండ్రులు వారితో కటువుగా ప్రవర్తించకూడదు. 

3:22-25 ప్రాచీన కాలంలోని బానిసలు కష్టపడి పనిచేసేవారు కాదని కొందరు వ్యాఖ్యాతలు నమ్ముతారు. ఎందుకంటే వారు చేసే పనికి వ్యక్తిగతంగా వారికేమీ లాభం ఉండేది కాదు. క్రైస్తవ దాసులు భూమిమీద తమ యజమానులకు అన్ని విషయములలో విధేయులై ఉండాలి అనడానికి పౌలు కారణాలు పేర్కొన్నాడు: (1) ఎవరూ పర్యవేక్షించక పోయినా దాసులు పనిచేయాలి, ఎందుకంటే వారు సేవచేసేది ప్రభువుకే గాని మానవుడైన యజమానికి కాదు. (2) ప్రభువుకు వారు చేసే పరిచర్యకు నిత్యత్వంలో మహిమాన్వితమైన బహుమానం దొరుకుతుంది. (3) చెడు ప్రవర్తనను శిక్షించడంలో దేవుడు పక్షపాతం చూపడు. ఈ సూచనలు ఎఫెసీ 6:5-8కి సమాంతరంగా ఉన్నాయి. 


Shortcut Links
కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |