Acts - అపొ. కార్యములు 15 | View All

1. కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.
లేవీయకాండము 12:3

2. పౌలున కును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.

3. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.

4. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.

5. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.

6. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను

7. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.

8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను.

9. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు

10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

12. అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్న బాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.

13. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహో దరులారా, నా మాట ఆలకించుడి.

14. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.

15. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా

16. ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
యిర్మియా 12:15, ఆమోసు 9:9-12

17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ

18. పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.
యెషయా 45:21

19. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
ఆదికాండము 9:4, లేవీయకాండము 3:17, లేవీయకాండము 10:14

21. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

22. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును

23. వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.

24. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు

25. గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను

26. మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను.

27. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.

28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

29. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
ఆదికాండము 9:4, లేవీయకాండము 3:17, లేవీయకాండము 10:14

30. అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.

31. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.

32. మరియయూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి.

33. వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన

34. వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.

35. అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.

36. కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.

37. అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.

38. అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.

39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;

40. పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి,

41. సంఘములను స్థిరపరచుచు సిరికిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.బైబిల్ అధ్యయనం - Study Bible
15:1 అంతియొకయకు తిరిగి వచ్చిన తర్వాత, ఆసియలో తమ మొదటి మిషనరీ యాత్రలో దేవుడు చేసిన కార్యాలను, ముఖ్యంగా అన్యజనులకు సువార్త ప్రకటించడాన్ని (14:27) పౌలు బర్నబాలు నివేదించారు. యూదేత రుల పట్ల పౌలు విధానాన్ని యూదయ నుండి వచ్చిన కొందరు సరిచేయ బోయారు. అన్యజనులు సున్నతి పొందాలని పట్టుబడుతూ, రక్షణ పొందడానికి యూదుల ఆచారాలను అనుసరించడం తప్పనిసరి అని చెప్పారు. 

15:2 ఏకాభిప్రాయానికి రాలేక, పౌలు బర్నబాలను యెరూషలేములో పెద్దలయొద్దకు పంపారు. యెరూషలేము సంఘం, దానిలోని అపొస్తలులు, పెద్దలతో, ఇంకా క్రైస్తవ ఉద్యమానికి కేంద్రంగా కొనసాగుతుందని ఇది సూచిస్తుంది. ఒకవేళ పౌలు ప్రభుని అపొస్తలులను ఒప్పించడంలో విఫలమైతే సంఘం అతనిని సమర్థించదు. 

15:3 యెరూషలేముకు వెళ్ళే దారిలో అన్యజనులు దేవునివైపు తిరిగిన విషయాన్ని పౌలు బర్నబాలు తెలివిగా ఫేనికే, సమరయలలో ఉన్న విశ్వాసులతో పంచుకున్నారు. ఈ వార్త సహోదరులందరికిని మహా సంతోషము కలుగజేసింది.

15:4-5 పరిసయ్యులు (పౌలుతో సహా) యేసును తీవ్రంగా వ్యతిరేకించి నప్పటికీ, వారిలో కొందరు విశ్వాసులయ్యారు (6:7). ఈ సందర్భంలో వారిలో కొందరు విశ్వాసుల కోసం క్రీస్తు సంపాదించిన స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. 

15:6 యెరూషలేము సభలోని ముఖ్యాంశం ఏమిటంటే, అన్యజనులలో నుండి క్రైస్తవులైనవారు సున్నతి పొంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అనేది. క్రైస్తవ్యం యూదుమతం నుండి వచ్చింది కాబట్టి, ఈ మార్పు జరుగుతున్న సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవలసి రావడాన్ని అర్థం చేసుకోవచ్చు. 

15:7-9 పేతురు తన శ్రోతలకు నాలుగు విషయాలను జ్ఞాపకం చేశాడు: (1) అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు తనను ఏర్పరచుకొన్నాడు (10:1-43). (2) అన్యజనులు పేతురు సందేశాన్ని నమ్మారు. (3) అన్యజనులు విశ్వసించినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందారు (10:44-46). (4) అన్యజనుల మారుమనస్సు విధానం కూడా యూదు విశ్వాసుల మార్పువంటిదే. తన సంఘాన్ని కట్టడంలో దేవుడు ఎలాంటి జాతి వివక్ష చూపడంలేదు. 

15:10 పైన చెప్పిన అంశాలను బట్టి (వ.7-9 నోట్సు చూడండి), “పరిసయ్యుల తెగ” నుండి వచ్చిన విశ్వాసులు (వ.5) దేవుని శోధించే విధంగా, యూదా పితరులు గాని లేక ఆనాటి యూదులు గాని మోయలేని భారమును మారుమనస్సు పొందిన అన్యజనులపై మోపుతున్నారు. 

15:11 ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా - నెరవేర్చడం యూదులకు గాని అన్యజనులకు గాని సాధ్యం కాదని పేర్కొంటూ, రక్షణ ప్రభువైన యేసు కృపచేత మాత్రమే దొరకుతుందని పేతురు పట్టుబట్టాడు. అంటే రక్షణ అనేది ఉచితవరం అని అర్థం. సున్నతివంటి ఆచారాలు ఎవరినీ రక్షించలేవు. ఆ 
15:12 అన్యజనులలో జరిగిన సూచకక్రియలను అద్భుతములను బట్టి వారు కూడా దేవుని రక్షణలో చేర్చబడ్డారని అవి చూపుతున్నాయి. 

15:13-14 యెరూషలేము సంఘ నాయకుడుగా, యేసు సహోదరుడైన యాకోబు వాదన, ప్రతివాదనలను గమనించాడు. అతడు మాట్లాడటం మొదలు పెట్టి, అన్యజనులలో నుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటను గురించిన దేవుని ప్రణాళికను సీమోను (పేతురు) ఎలా నివేదించాడో జ్ఞాపకం చేశాడు. అది కూడా అప్పుడు వివాదాస్పదమైంది (11:2).

15:15-18 ప్రవక్తలైన ఆమోసు (ఆమోసు 9:11-12), యెషయా (యెషయా 45:21)లను ఉదహరిస్తూ, అన్యజనులు తన నామము కోసం పిలువబడతారని దేవుడు చాలాకాలం క్రితమే చెప్పాడని యాకోబు పేర్కొన్నాడు. 

15:19 ఆ చర్చకు ముగింపు పలుకుతూ అతడు సంక్షిప్తంగా మాట్లాడడం చూస్తే యెరూషలేము సంఘంలోని తన సమకాలికులలో యాకోబు మొదటిస్థానంలో ఉన్నాడని గ్రహించవచ్చు. అతని అభిప్రాయము ప్రకారం యూదుల నుండి వచ్చిన విశ్వాసులు అన్యజనులలో నుండి దేవునివైపు తిరుగుచున్నవారిని కష్టపెట్టకూడదు.


15:20 యూదులకు, అన్యజనులకు రక్షణ విషయంలో ఆధారం ఒక్కటే అయినప్పటికీ, చాలా పరిమితులు అవసరం (వ. 29; 21:25). ఒకే సంఘంలో ఉన్న యూదులు, అన్యజనుల అనుసంధానానికి ఒక ఆధారంగా ఉండడం కోసం వీటిని పరిచయం చేసివుంటారని కొందరు పండితులు తలుస్తారు. అయితే ఇవి అన్యజనుల నైతికస్థాయి పెంచడానికి రూపొందించబడ్డాయని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. అన్యజనులను విగ్రహారాధన, గుడులలోని జంతుబలి, జారత్వము, విగ్రహారాధన వంటి అనేక ఆచారాలలో పాల్గొనకుండా నిషేధించడానికి వీటిని రూపొందించారు. 

15:21 మోషే పేరును ప్రస్తావించడానికి, ధర్మశాస్త్ర విస్తృత ప్రకటనకు యాకోబు చూపిన కారణమేమిటో పూర్తిగా స్పష్టం కాదు. చెదరిపోయిన యూదులు బహిరంగంగా తమ లేఖనాలను చదవడం ద్వారా మోషే ధర్మశాస్త్రాన్ని అన్యజనుల మధ్య తెలియపరచి వుంటారని బహుశా అతని భావం కావచ్చు. అంతేకాక, వ.20లో అతడు అన్యజనుల నుండి కోరిన ప్రామాణికాలు, మోషే ధర్మశాస్త్రంలో నెలకొన్న సార్వత్రిక నైతిక నియమాలను ప్రతిబింబిస్తున్నాయని అతడు చెబుతున్నట్లు కావచ్చు. 

15:22-23 యెరూషలేములోని సహోదరులలో ముఖ్యులైన యూదా, సీలలు, యెరూషలేము సభ ఫలితాలను (వ్యక్తిగతంగాను, తాము తెచ్చిన పత్రిక ద్వారాను) ధృవీకరించడానికి, అంతియొకయకు తిరిగి వస్తున్న పౌలు, బర్నబాలతోపాటు వచ్చారు.

15:23-27 ఆ ఉత్తరం సభలో జరిగిన సంగతులను తెలియజేయడం మాత్రమే కాక, బర్నబా, పౌలుల పరిచర్యను మెచ్చుకుంది. ప్రాచీన కాలంలో ఉత్తరం అంటే, అది వ్రాసిన వ్యక్తి వ్యక్తిగతంగా వచ్చి చెప్పినట్టుగా భావించేవారు. దాన్ని తరచు, అందులోని విషయాలను ధృవీకరించి, వివరించే నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా పంపేవారు. అదే పనిని యెరూషలేము సంఘ నాయకుల దూతలుగా యూదా, సీల చేయబోతున్నారు. 

15:28 సభలో తీసుకున్న నిర్ణయాలు పరిశుద్దాత్మ. మానవుల చొరవ (మాకును) వల్లనైనవని యాకోబు రాశాడు. కొ.ని. అంతటిలోను దైవిక నడిపింపు, తద్వారా దేవుని ఉద్దేశాలను నెరవేర్చే మానవుని కార్యాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి (ఉదా. ఫిలిప్పీ 2:12-13). 

5:29 వ.20లో చెప్పిన నివారించాల్సిన నాలుగు విషయాలను వేరే క్రమంలో పునరుదాటించాడు. 

15:30-31 పౌలు బర్నబాలు అన్యజనులకు సువార్తను ప్రకటించే వ్యూహాన్ని ఆమోదిస్తూ, నూతన విశ్వాసులపై అనవసర భారాలు మోపకపోవడం వలన ఆ పత్రిక అంతియొకయలో ఉన్న సంఘానికి ఆదరణకరంగా ఉంది. 

15:32-35 యెరూషలేము సంఘంలో ముఖ్య నాయకులే గాక ప్రవక్తలు కూడా అయినందున, యూదా, సీలలు, అంతియొకయలో ఉన్న విశ్వాసులను పెక్కుమాటలతో (ఈ మాటలు లేఖనాలలో ఎక్కడా రాయలేదు) ఆదరించి స్థిరపరచిరి. బైబిల్ రచయితలు అనేక ముఖ్యమైన సంఘటనలు, గొప్ప ప్రసంగాలు గ్రంథస్తం చేయలేదు అని మరొకసారి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. (యోహాను 20:30; యోహాను 21:25 నోట్సు చూడండి). పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా, ప్రతి రచయిత ఏ సంఘటనలు, ఏ మాటలు రాయాలో, వేటిని వదిలేయాలో ఎంచుకోవాలి. అనేక సందర్భాలలో ఇవి పాఠకులను మరింతగా తెలుసుకోవాలనే భావనతోనో లేక సమాధానం దొరకని ప్రశ్నలతోనో నిండిపోయేటట్లు చేశాయి. అయితే పాఠకులు “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు" (యోహాను 20:31) తగినంత సమాచారం ఇవ్వబడింది.

15:36 ఈ వచనం పౌలు రెండవ మిషనరీ యాత్ర ఆరంభాన్ని చూపుతుంది. బాధ్యతాయుతంగా, వారు సువార్త ప్రకటించిన ప్రతి పట్టణములో ఉన్న విశ్వాసుల యొద్దకు తిరిగి వెళ్ళి, వారు విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకోవాలని పౌలు కోరాడు. 

15:37-40 మార్కు అనబడిన యోహాను గురించి పౌలు బర్నబాలు విడిచి వేరైపోవడం అనేది, అపొస్తలుల సహవాసంలో కూడా పరిపూర్ణమైన ఐక్యత ఎల్లప్పుడూ సాధ్యం కాదు అని చూపుతుంది. కొన్నిసార్లు వేర్వేరు మార్గాలలో వెళ్ళడానికి దేవుని పనివారు అంగీకరించవలసి ఉంటుంది, కానీ మరలా కలుసుకుంటారనే నిరీక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. (కొలస్సీ 4:10; 2తిమోతి 4:11; ఫిలే 23-24). యెరూషలేము నుండి పత్రికను అంతియొకయకు తెచ్చినవారిలో ఒకడైన సీలను (వ.23-34) పౌలు తనతో తీసుకువెళ్ళాడు. ఈ సంఘటన తర్వాత బర్నబా పేరు అపొ.కా. గ్రంథంలో మరలా కనబడదు. 

15:41 కుప్రలో ఉన్న విశ్వాసులను బలపరచడం కోసం వెళ్ళడానికి బదులు, పౌలు, సీలలు చిన్నాసియా (ఆసియ మైనర్) ప్రాంతాలైన సిరియ, కిలికియకు వెళ్ళారు.


Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |