Nahum - నహూము 3 | View All

1. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడ తెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.

2. సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడు చున్నవి.

3. రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు.

4. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివే సినదానా,

5. నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.

6. పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమాన పరచెదను.

7. అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.

8. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?

9. కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.

10. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.

11. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.

12. అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;

13. నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.

14. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.

15. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుత లంత విస్తారముగాను ఉండుము.

16. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.

17. నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.

18. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధా నులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.

19. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త విను వారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
3:1-3 నరహత్య చేసిన పట్టణం, దానిలో చచ్చినవారు కుప్పలుకుప్పలుగా పడియున్నారు అంటూ మరలా రచయిత ఆరంభంలో అస్పష్టంగా మాట్లాడుతున్నాడు (2:3-10 నోట్సుతో పోల్చండి), కాని జాగ్రత్తగా చదివేవారికి అది ఒకప్పటి బలమైన నీనెవె పట్టణమనీ, దాన్ని దేవుడు ఇప్పుడు నాశనం చేస్తున్నాడని తెలుస్తుంది (వ.10 నోట్సు).. 

3:4-6 ఒక వేశ్య శిక్షను గురించి- దాన్ని యిర్మీయా 13:26తో పోల్చండి. 

3:7 పారిపోయి అనేమాట ఆ స్పందనకు కారణం భయం కాదుగానీ భీతితో కూడిన విభ్రాంతి అని తెలియజేస్తోంది. ఒక్కప్పుడు భయం గొల్పి ఇప్పుడు చచ్చిపడి ఉన్న క్రూర జంతువు కళేబరాన్ని చూసినట్లు నీనెవె పాడైపోయెనని చెప్తున్నారు. 

3:8-9 మధ్యధరా సముద్రానికి దక్షిణంగా సుమారు 400 మైళ్ళ దూరంలో ఉన్న నోఅమోను, నైలునదికి ఇరుపక్కలా వ్యాపించి ఉన్న నేటి కార్నాక్, లగర్ ప్రాంతాలు. సుమారు క్రీ.పూ. 2200లో ఆరవ రాజవంశం కాలంలో అది ప్రసిద్ది చెందిన పట్టణమైంది. 12వ రాజవంశం నాటికి (సుమారు క్రీ.పూ. 1990-1776) దానిలోని అమున్-రా గుడి, ఐగుప్తు దేవాలయాల్లో అతి ముఖ్యమైనదిగా మారి, ఆ దేవతను “దేవతలకు రాజు, రెండు దేశాల (అంటే ఐగుప్తు) మీద రాజు” అని పిలిచారు. నూతన రాజ్యయుగంలో (క్రీ.పూ. 1550-1076), నోఅమోను ఇంకా ప్రభావవంతమై రాజుల లోయగా, రాజులను పాతిపెట్టిన పట్టణంగా పేరు పొందింది. ఐగుప్తు దేవతలకు అక్కడ చాలా గుడులు కట్టారు. క్రీ.పూ.663లో అషూర్భనిపాల్, అషూరీయులు దాన్ని నాశనం చేసేవరకు అది ఒక మహా నగరంగా కొనసాగింది. 

3:10 హోషేయ 13:16లో చెప్పింది నెరవేర్పుగా అషూరు ఇశ్రాయేలు పట్ల జరిగించినట్టుగానే (కీర్తన 137:9 తో పోల్చండి; హోషేయ 10:1415), అషూరీయులు ఐగుప్తీయుల చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి ముక్కముక్కలుగా చేశారు. గర్భిణుల కడుపులు చీల్చివేయడం వారి దురాగతాల్లో ఒకటి. అలాంటి క్రూరత్వం అష్బూరీయులకు మాత్రమే ప్రత్యేకం కాదు. (వ.18-19 నోట్సు చూడండి), దురాక్రమణను సాగించే ఇతర అనేక సైన్యాలు కూడా అలాగే చేసేవి (2రాజులు 8:12; యెషయా 13:16 చూడండి). 

3:11-12 "నీవును మత్తురాలై" అనడం చిత్రంగా ఉంది. ఎందుకంటే నోఅమోను ప్రజలు మతులై ఉండడం గురించి ఎక్కడా కనిపించదు. అయితే మత్తులో మునిగిపోవడం అనేది తరచుగా దేవుని విరోధులపై వచ్చే తీర్పును సూచిస్తుంది. వ.12 సందేశం ఏమిటంటే, నీనెవె తాను ఎంత సురక్షితమనీ,
దుర్భేద్యమని భావించినా, యెహోవా సైన్యాల ముందు అది అంజూరపు చెట్టునున్న పండిపోయిన అంజూరపు పండులాగా అయిపోయింది.

3:13 తమ తిరుగులేని సామర్థ్యం, నైపుణ్యాలకు పేరుపొందిన అష్యూరు సైన్యాన్ని స్త్రీలు అని పిలుస్తున్నాడు. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇది ఒక సాధారణ దూషణపదం. యెషయా 19:16 చూడండి. 

3:14 రానున్న ముట్టడికి సిద్ధపడమని పదే పదే వ్యంగ్యంగా చెప్పడం ఈ వచనంలో చూస్తాం. 

3:15-17 వాల్టర్ మైయర్ అనే వ్యాఖ్యాత రాసినట్టు, “అష్నూరు రాజ్యం 800 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అషూర్భనిపాల్ పాలనలోనే పశ్చిమాసియా ప్రాంతమంతటినీ తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంది. ఒక్క కేంద్ర ప్రభుత్వ పాలనలో విస్తారమైన రాజ్యంలో అంతకు ముందెన్నడూ లేనంతగా వర్తక వాణిజ్యాలు వృద్ధిచెందాయి.” మిడుతలు అప్పుడప్పుడూ గుంపులుగా వచ్చి పడుతూ, వచ్చినంత వేగంగానూ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుండేది. నహూము ఈ స్వభావాన్నే వ.17లో వర్ణించాడు. అషూరువారికి కూడా యెహోవా దేవుడు ఇలాగే జరిగిస్తాడు.

3:18-19 నీనెవే రాజుకు సమీపమైన మరణం గురించి ఈ చివరి వచనాలు వివరిస్తున్నాయి. అది గొప్ప వేడుకకు కారణమౌతుంది. బాబిలోనియన్ దినవృత్తాంతం ధృవీకరించిన ప్రకారం క్రీ.పూ. 615, 612 మధ్య కాలంలో అష్నూరు రాజ్యంలోని ప్రముఖ నగరాలైన కాలహు, అషూరు, దురరుకిన్, నీనెవెలు సర్వనాశనమైపోయాయి. అష్యూర్ ఉబాలిత్ (క్రీ.పూ. 612-609) హారానులో తన సైన్యాన్ని తిరిగి సమకూర్చుకొని రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే క్రీ.పూ. 605లో కర్కెమిషు యుద్ధంలో నెబుకద్నెజరు నాయకత్వంలో బబులోనీయులు వారిని పూర్తిగా అణగదొక్కారు.


Shortcut Links
నహూము - Nahum : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |