Ezra - ఎజ్రా 5 | View All

1. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ మున ప్రకటింపగా

2. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.

3. అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిర మును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

4. ఈ కట్టడమును చేయిం చినవారి పేరులు మొదలౖౖెన సంగతులను మేము వారితో చెప్పితివిు.

5. యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.

6. నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరమునకలు

7. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.

8. రాజవైన తమకు తెలియవలసిన దేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

9. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు.

10. వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా

11. వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరిమేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవ కులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.

12. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

13. అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

14. మరియనెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి

15. తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించినీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

16. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

17. కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయముచేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోరుచున్నాము.బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-6:22 అధ్యా. 4 లో స్థానికంగా ఎదురైన వ్యతిరేకత గురించి తెలియ చేసిన తర్వాత, దర్యావేషు రోజుల్లో దేవాలయ నిర్మాణం పునఃప్రారంభమై, పూర్తయిన పరిస్థితిని గ్రంథకర్త తిరిగి వివరించడం మొదలుపెట్టాడు (5-6 అధ్యా:). పునర్నిర్మితమైన దేవాలయం, సంపూర్ణంగా పునరుద్ధరించబడిన బలి అర్పణలు చెరకు ముందు ఉన్న దేవుని ప్రజలతో తమకున్న సంబంధం కొనసాగింపుకు ప్రదర్శన మాత్రమే కాదు, తాము పోగొట్టుకున్న దానిని దేవుడు పునరుద్ధరించాడన్న సుస్పష్టమైన సూచనగా కూడా ఉంది. 

5:1 యూదులకు హగ్గయి, జెకర్యాలు , ప్రవచనాత్మక. దేవుని పలుకులను తీసుకొచ్చినప్పుడు దేవాలయ నిర్మాణం విషయం ప్రజల్లో ఒక నూతనోత్సాహం కలిగింది. హగ్గయి ద్వారా చెప్పిన మొదటిమాటలో, “ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీ వేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమ యమా?” (హగ్గయి 1:4) అని దేవుడు యూదుల సమాజాన్ని ప్రశ్నించాడు. యెరూషలేముకు భవిష్యత్తులో మహిమ కలుగబోతుందని దేవుడు చేసిన వాగ్దానానికి ప్రజలు స్పందించాలని - అదే సంవత్సరం జెకర్యా వారిని ప్రోత్సహించాడు. ఈ వచనంలో జెకర్యా ఇదో కుమారుడు అని ఉండగా జెకర్యా 1:1లో "ఇదోకు పుట్టిన బెరక్యా కుమారుడు" అని ఉంది. ఇది పరస్పర విరుద్ధమేమీ కాదు. కుమారుడు అనే పదానికీ (అరమేయిక్. బార్), దాని హెబ్రీ సమానార్థానికీ (బెన్) "మనుమడు" అనే అర్థం కూడా ఉంది. ఆ విధంగా జెకర్యా 1:1; ఎజ్రా 1:1 రెండు కూడా సరైనవే. 

5:2 పునఃప్రారంభమైన నిర్మాణంలో - ప్రజలను నడిపించిన వారిలో జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యేషువతోపాటు హగ్గయి, జెకర్యాలు కూడా ఉన్నారు (2:2; 3:2,8; 4:3). సహాయము చేయుచువచ్చిరి అంటే వాళ్లు కూడా పనికి పూనుకున్నారని కాదు గానీ, పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ వారికి నైతికబలాన్ని చేకూర్చారని భావం. 

5:3-5 క్రీ.పూ. 520వ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పునఃప్రారంభమైన సంవత్సరంలో దర్యావేషు నియమించిన నూతన అధికారి ఉయాను కింద ఉపఅధికారిగా తత్తేనై పనిచేసినా అతన్ని "నది. యివతల" (ట్రాన్స్ యూఫ్రటీసు) ప్రాంతానికి అధికారి అని పిలిచారు (అరమేయిక్. పెకహు). జెరుబ్బాబెలు కేవలం యెహూద్ (యూదా) ప్రాంతానికి మాత్రమే బాధ్యత వహిస్తూ తత్తైనైకి జవాబుదారిగా ఉన్నప్పటికీ అతడు కూడా "అధికారి" అని పిలవబడ్డాడు (హెబ్రీ. పెకహు, హగ్గయి 1:14). దేవాలయ నిర్మాణానికి మీకు ఎవరు సెలవిచ్చిరి అని తత్తైనై అడిగిన ప్రశ్న ఆ నిర్మాణానికి చట్టబద్ధమైన ఆమోదం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కనబరచిన యథార్థమైన ప్రశ్న. కట్టుటకు అనే పదానికి అరామిక్ మూలం ఉస్ హర్నా. ఈ పదం నిర్మాణాల్లో ఉపయోగించబడిన కలపను, మరి ముఖ్యంగా ప్రాకార నిర్మాణంలో గానీ పైకప్పు నిర్మాణంలో గానీ ఉపయోగించబడిన కలపను సూచిస్తోంది. నిర్మాణానికి ఉన్న చట్టబద్ధతను తత్తైనై ప్రశ్నించినప్పటికీ, రాతపూర్వకమైన ఆజ్ఞనొందు వరకూ అతడు ఆ పనిని నిషేధించలేదు. 

5:5 దేవుడు దృష్టియుంచినందున అనే మాటకు అర్థం “ఆ పెద్దల పైన వారి దేవుని కన్ను ఉంది!” అని. "యెహోవా కన్నులు" అనే జాతీయం పా.ని.లో మరికొన్ని చోట్ల కూడా ఉంది (కీర్తన 13:8, 34:15). ఎజ్రా వృత్తాంతంలో దైవికశ్రద్ధను సూచించడానికి “యెహోవా హస్తము మాకు తోడుగా నున్నది” అనే సామాన్య జాతీయాన్ని ఉపయోగించాడు. (ఎజ్రా 7:6,9; 8:18 చూడండి). పర్షియా పరిపాలనలో పర్షియాచేత నియమించబడిన అధికారుల చేతిలోనే నిజమైన అధికారం ఉండేది. అయితే ముఖ్య సంఘటనలకూ చట్టపరమైన నిర్ణయాలకూ సాక్ష్యమివ్వడానికి చాలా తరచుగా యూదుల... పెద్దలను పిలిచేవారు. చెర తరువాతి కాలంలో యూదుల పెద్దలను గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి. 

5:6 "అధికారులను సమస్యల పరిష్కారకర్తలుగా, - శిక్షలు అమలుచేసి పరిస్థితుల్ని అదుపుచేయడానికి సైనిక బలగాలను తోడుంచుకునే రాజరికపు వ్యక్తులు" అని డి.జె. థైన్స్ వర్ణించాడు. 

5:7 సకల క్షేమము అంటే "సమస్త సమాధానము" అని అర్థం. 

5:8 పర్షియాకు చెందిన అధికారి యూదుల దేవాలయాన్ని మహా దేవుని యొక్క మందిరము అని వర్ణించడం నమ్మశక్యంగా లేదని ఇంతకు ముందు కొందరు పండితులు దీన్ని కొట్టిపారేశారు. అయితే దర్యావేషు, అహష్వేరోషుకు చెందిన గొప్పనగరం పెర్స్-పోలిస్లో దొరికిన శిలాశాసనాల్లో కూడా ఇదే పదాన్ని కనుగొన్నారు.

5:9-10 వ.3,4 ల్లో తెలియ చేయబడిన సమాచారం ఖచ్చితమైందని ఈ వచనాలు సాక్ష్యమిస్తున్నాయి.

5:11 ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో ‘ఆకాశమందలి" దేవుడు అనే బిరుదు 12 సార్లు ఉపయోగించబడింది. అయితే బైబిల్లో భూమ్యాకాశముల దేవుడు అనే బిరుదు కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. ఏథెన్సులో దేవుణ్ణి "ఆకాశమునకును భూమికిని ప్రభువు" అని అపొస్తలుడైన పౌలు సంబోధించాడు (అపొ.కా.17:24). సొలొమోను యొక్క పేరు ఇక్కడ ఉపయోగించలేదు. కేవలం ఇశ్రాయేలీయులలో నొక గొప్ప రాజు అనే అతని గురించిన పరోక్ష ప్రస్తావన ఉంది.

5:12 తమ దేశం నాశనమవ్వడానికి చెరలోకి వెళ్లడానికి తమ పూర్వీకులు నిబంధనను పాటించడంలో విఫలమవడమే కారణమని మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున అనే మాటలు స్పష్టం చేస్తున్నాయి. (2దిన 36:15-21; - నెహెమ్యా 1:5-11; 9:5-37; యిర్మీయా 4-6). 

5.13 కోరెషు పర్షియాకు రాజు అయినప్పటికీ క్రీ.పూ. 539 లో బబులోనును జయించిన తర్వాత అతడు తనను తాను “బబులోను రాజు" అని కూడా పేర్కొన్నాడు. ఇక్కడ యూదు నాయకులు ఒక ముఖ్యమైన ఆధారాన్ని ముందుకు తెచ్చారు. రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను అనే ఈ శాసనం చేసినట్లు వారికి కనబడితే దేవాలయాన్ని పునర్నిర్మించడానికి వాళ్లకున్న హక్కు ధృవీకరించ బడుతుంది.

5:14-15 కూలిపోయిన దేవాలయాలను ఖచ్చితంగా వాటి వాటి స్థలాల్లోనే పునర్నిర్మించాలనీ, తద్వారా ప్రజలకు తమ పూర్వ దేవాలయాలే తిరిగి నిర్మించబడ్డాయనే నమ్మకం, ఖచ్చితత్వం బలపడాలనీ దర్యావేషుకు ముందు కొత్త బబులోను రాజులు ఎంతో శ్రద్ధ కనపరిచారు.

5:16 షేష్బజ్జరు... దేవుని మందిరపు పునాదిని వేయించెను, అని యూదుల పెద్దలు చేసిన వ్యాఖ్య చర్చకు దారితీసింది. (3:8-9 నోట్సు.. చూడండి). అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను అనే మాట కూడా కష్టమైనదే. ఎందుకంటే నిర్మాణం సుమారు - ఇరవై సంవత్సరాలుగా నిలిచిపోయిందని హగ్గయి, జెకర్యా, ఎజ్రా (4:5,23) చెబుతున్నారు. నిరాటంకంగా నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. అని యూదుల పెద్దలు చెప్పినది వంచనతో కూడిన మాటే. నిర్మాణపు పనులు సుదీర్ఘకాలం నిలిచిపోయాయని సూచనప్రాయంగా చెప్పినా అది తమ పునర్నిర్మాణ పనులకు ఆటంకంగా మారుతుందేమోనని భయపడి వారు ఆ మాటలు పలికారు. 

5:17 బందీలుగా ఉన్న యూదుల్ని తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కోరెషు ఆజ్ఞ యిచ్చాడో లేదో తెలుసుకోడానికి బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానా (ధనాగారం అని అక్షరార్థం) లో వెదికించమని తత్తైనై సూచించాడు. ఆ శాసనపు ప్రతి నిజానికి పర్షియాకు వేసవి రాజధానియైన ఎగ్భతానాలో దొరికింది (6:2). షేషట్టరు దగ్గర గానీ జెరుబ్బాబెలు దగ్గర గానీ దాని అధికారపూర్వకమైన ప్రతి లేనట్లు కనబడుతుంది. ఎందుకంటే ప్రారంభ దినాల్లో తమ విరోధులకు గానీ (4:1-5) తత్తైనైకి గానీ యూదుల పెద్దలు అలాంటిదేమీ చూపించలేదు


Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |