Ezekiel - యెహెఙ్కేలు 5 | View All

1. మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.

2. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.

3. అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;

4. పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.

5. మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.

6. అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి

7. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.

8. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

9. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.

10. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.

11. నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

12. కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
ప్రకటన గ్రంథం 6:8

13. నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

14. ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

15. కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా

16. నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.

17. ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
ప్రకటన గ్రంథం 6:8



బైబిల్ అధ్యయనం - Study Bible
5:1 తలను క్షౌరం చేసికొనడం తరచుగా మృతుల కోసం సంతాపాన్ని తెలియజేసే ఆచారాలకు సంబంధించినది (7:18; 27:31; యోబు 1:20; యెషయా 7:20; 15:2-3; యిర్మీయా 7:29; 48:37). ఈ విధంగా మృతులకోసం సంతాపాన్ని తెలియజేయడం ఇశ్రాయేలీయులకు నిషిద్ధం (ద్వితీ 14:1). త్రాసు తీసుకొని ... తూచి భాగములు చేయడం రాబోతున్న తీర్పును లెక్కించే సూచన (సామె 21:2; దాని 5:27). 

5:2 మూడింట రెండువంతుల ప్రజలు దాడిలో మరణించబోతున్నారు, మూడింట ఒకటో వంతు ప్రజలు చెర లోనికి వెళ్లబోతున్నారు. 

5:3 చెరలోకి చెదరిపోవడానికి సూచనగా ఉన్న మూడవ భాగం వెండ్రుకల్లో (వాటిలో) యెహెజ్కేలు కొన్నిటిని తీసుకొని తన వస్తపు చెంగున కట్టుకోవాలి, ఇది చెరలోకి వెళ్ళినవారిలో బ్రతికి ఉండే శేషానికి సూచన. ప్రాచీన కాలంలోని దృక్పథం ప్రకారం చెరలోకి వెళ్ళినవారు తిరిగిరారు. గాలికి చెదరిపోయిన వెండ్రుకల్ని తిరిగి ప్రోగు చేయడం అసాధ్యం. కొన్ని వెండ్రుకల్ని వస్తపు చెంగులో కట్టుకొనడం బబులోను చెరలో ఉన్న దేవుని ప్రజల భవితవ్యానికి సూచన (లేవీ 26:36-39; హగ్గయి 2:12). ఇశ్రాయేలీయులు పూర్తిగా అంతమై పోయేటంతగా దేవుడు వారికి తీర్పు తీర్చడు.

5:4 చెరలో ఉన్నవారిలో కూడా కొందరు నశించిపోవడం జరుగుతుంది.

5:5 కీర్తన 132:13-14 ప్రకారం, దావీదు వంశస్థుల పట్ల యెహోవా నిబంధన ఆయన సీయోనును లేదా యెరూషలేమును తనకు ప్రతిష్ఠితమైన నివాసస్థలంగా ఎన్నుకోడానికి సంబంధించినది. (ద్వితీ 12:5; 1రాజులు 8:41-43; కీర్తన 48:1-14). 

5:6 ద్వితీ 4:7-8 ప్రకారం, యెహోవా పట్ల ఇశ్రాయేలు పాటించే నిబంధనాపూర్వకమైన విధులు లోకంలోని అన్యజనుల ప్రశంసను పొందుతాయి. ఇశ్రాయేలు ఈ న్యాయవిధులకు కట్టడలకు విధేయత చూపించినట్లయితే, లోకానికి వెలుగుగా ఉండగలదు. 

5:7-9 ఇశ్రాయేలు అన్యజనుల కంటె ఎక్కువ దుర్మార్గంగా ఉందని యెహెజ్కేలు ఆరోపిస్తున్నాడు (16:27; 2రాజులు 21:11; యిర్మీయా 2:11 తో పోల్చండి). 

5:10 మోషే ధర్మశాస్త్రంలో నరమాంస భక్షణ నిషిద్ధం (లేవీ 26:29; ద్వితీ 28:53-57), నరమాంస భక్షణను ప్రవక్తలు బహిరంగంగా ఖండించారు (యెషయా 9:19-21; యిర్మీయా 19:9; జెకర్యా 11:9), విషాదమేమి టంటే, ఇశ్రాయేలీయులు ముట్టడి కాలంలోను, బబులోను సైన్యానికి వశమైన కాలంలోను (క్రీ.పూ. 588-586) నరమాంస భక్షణకు దిగజారిపోయారు (విలాప 1:7-14; 2:20-22; 4:4-10). 

5:11 జాలియైనను లేక అనే పదజాలం నేరాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో మెతకదనం చూపకపోవడాన్ని సూచిస్తుంది (ద్వితీ 7:16; 13:8; 19:13,21; 25:12). 8:1-18 వచనాల్లో పరిశుద్ధస్థలమును అపవిత్ర పర్చడమే ముఖ్యమైన అంశంగా కనబడుతుంది. 

5:12 పట్టణాలు ముట్టడించబడినప్పుడు కరవు మరియు తెగులు తరచుగా సంభవించేవే. పైగా, ఇవి నిబంధనలోని శాపాల్లోను ఉన్నాయి (లేవీ 26:25-26). 

5:13 "దేవునికి దుర్నీతిపరులపట్ల అనాసక్తత లేదని (తటస్థవైఖరి) ప్రజలు తెలుసుకొనేలా ఆయన అభినివేశం (రోషం, పట్టుదల) పాపాన్ని శిక్షించేలా చేస్తుంది, అవిశ్వాసులైన అన్యజనులు ఆయన విశ్వాస్యతను ప్రశ్నించ కుండా అదే అభినివేశం ఆయన శేషప్రజల్ని విడిపించి వారిని పునరుద్దరించేలా చేస్తుంది” (లమార్ కూపర్).

5:14-16 ఘనతకోసం ఎన్నుకొనబడిన ప్రజ (ద్వితీ 26:19) ఇప్పుడు అన్యజనులకు వినోదాన్నిచ్చే దృశ్యమైంది. (నీవు నిందకును ఎగతాళికిని... ఆస్పదముగా ఉందువు). ఇశ్రాయేలు అన్యజనులకు ఆశీర్వాదంగా ఉండాలనే పూర్వదీవెన ఇక్కడ వ్యతిరేకంగా కనబడుతుంది, ఇశ్రాయేలు తన ఈ కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమైంది (లూకా 12:48).

5:17 నేను నీమీదికి క్షామమును... ప్రాణహానియు... రప్పించెదను. అనే పదజాలం వరసగా వచ్చే తీర్పులను తెలియజేస్తుంది. ఇవి దేవుని ధర్మశాస్త్రం పట్ల ఆయన ప్రజలు అవిధేయత చూపినప్పుడు వారి మీదకు వచ్చే నిబంధనా పూర్వకమైన శాపాల్లాగానే ఉన్నాయి (క్షామం, లేవీ 26:26,29; దుష్టమృగాలు, లేవీ 26:22; ద్వితీ 32:24, తెగులు, ద్వితీ 28:21; ఖడ్గం, ద్వితీ 32:42). 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |