Isaiah - యెషయా 2 | View All

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
యోహాను 4:22

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యోహాను 16:8-11, అపో. కార్యములు 17:31, ప్రకటన గ్రంథం 19:11

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
1,Joh,1,7

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.
ప్రకటన గ్రంథం 6:15, 2 థెస్సలొనీకయులకు 1:9

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
2 థెస్సలొనీకయులకు 1:9

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
2 థెస్సలొనీకయులకు 1:9

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
2 థెస్సలొనీకయులకు 1:9

22. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?బైబిల్ అధ్యయనం - Study Bible
2:1 ప్రారంభ వచనంలో 1:1 లోని ప్రకటన మళ్లీ కనబడుతుంది. అధ్యా.1 ఈ గ్రంథమంతటికీ ఒక ఉపోద్ఘాతం వంటిదని ఇది తెలియజేస్తున్నది. 

2:2-4 ఈ ప్రకటన రమారమి యెషయాకు సమకాలీనుడైన మీకా ప్రవక్త ప్రకటనను పోలి ఉంది (మీకా 4:1-3)...

2:2 అంత్యదినములలో అనే పదం భవిష్యకాలాన్ని సూచిస్తుంది, అంటే దేవుని ప్రజల పాపం మీదకు తీర్పు వచ్చే కాలానికి ఆవల సుదూరంలోని కాలాన్ని సూచిస్తుంది. యెహోవా మందిర పర్వతము అనే పదజాలం దేవాలయం, కట్టబడిన స్థలమైన సీయోనును సూచిస్తుండవచ్చు. దేవుడు తన ప్రజల మధ్య ప్రత్యేకమైన రీతిలో తన సన్నిధిని కనబర్చిన స్థలం సీయోను. వాస్తవానికి, సీయోను అంత ఎత్తైన పర్వతమేమీ కాదు - సీయోనుకంటె దాని సమీపంలో ఉన్న ఒలీవల కొండ ఎత్తైనది. అయితే ఆధ్యాత్మిక భావ ప్రాముఖ్యతను బట్టి ప్రపంచంలోని పర్వతాలన్నిటికంటె సీయోను ఎత్తైన పర్వతం. 

2:3 ఈ దర్శనంలో ఇశ్రాయేలు మాత్రమే కాక, లోకంలోని సర్వజాతులూ ప్రవాహం వచ్చినట్టుగా ఈ పర్వతమునకు వచ్చే రోజు గురించిన నిరీక్షణ కనబడుతుంది. దేవుడు అబ్రాహాముతో అతని సంతానం ద్వారా లోకంలోని అన్ని జాతుల వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. (ఆది. 12:1-3). క్రీస్తులో విశ్వాసం ద్వారా ఏకమైన" సర్వ జాతుల ప్రజలూ నేడు క్రైస్తవ సంఘంలో ఉన్నారు, ఇది ఈ దర్శన నెరవేర్పు ప్రక్రియ ప్రారంభం.

2:4 ఏ జనము యెహోవాను అన్వేషిస్తుందో వారిలో గొప్ప పరివర్తన ఉంటుంది, ఇక వారు తమ శక్తి సామర్థ్యాల్ని వినాశనం. సృష్టించే మారణాయుధాల్ని (ఖడ్గములను... యీటెలను) తయారు చేయడానికి ఉపయోగించక, ఉత్పత్తి కోసం ఉపయోగించే సాధనాల్ని (నాగటి నక్కులుగాను... మచ్చుకత్తులుగాను) చేయడానికి మాత్రమే వాడతారు.

2:5 దేవునికి విధేయత చూపాలనే ఈ పిలుపు ఇదివరకటి ప్రకటనకు ముగింపు పలుకుతున్నదని కొందరి అభిప్రాయం. అదే అయినట్లయితే, భవిష్యకాలంలో లోకంలోని జనాలందరూ తన వైపు చూస్తారనే నిరీక్షణతో ఇప్పుడు తన ననుసరించాలని దేవుడు ఇశ్రాయేలును పిలుస్తుండడం అయ్యుం డవచ్చు. అయితే, వ.6 లోని “గనుక" అనే పదం, తరవాతి వచనాలు ఇశ్రాయేలు పశ్చాత్తాపపడడానికి ప్రేరణను గురించి చెప్తున్నాయని సూచిస్తుంది.

2:6 దేవుని ప్రజలు తూర్పున (ఉదాహరణకు, ఎదోము, మెసపొతమియా), పశ్చిమాన (ఫిలిష్తియ) ఉన్న పొరుగు జనాల్లోని ఆచార సంప్రదాయాల్ని (ఉదాహరణ: సోదె, శకునాలు) అనుసరిస్తున్నారు కాబట్టి దేవుడు వారిమధ్య నుండి తన సన్నిధిని - తీసివేశాడు. (వారిని విసర్జించి). భవిష్యకాలంలో జరగబోయేవాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సోదె చూడడం, చెడును తొలగించాలనే ఉద్దేశంతో మంత్రప్రయోగం చేయడం మొదలైన చర్యలన్నిటినీ ధర్మశాస్త్రం నిషేధించింది (లేవీ 19:26; ద్వితీ 18:9-14). 

2:7 గుఱ్ఱములతో... రథములకు అనే పదజాలం రాజులు వెండి బంగారాలవంటి ప్రశస్తమైన లోహాల్ని, గుబ్దాలు మొదలైన సైనికసంపత్తిని విస్తారంగా సమకూర్చుకొనకూడదని ద్వితీ 17:14-20 వచనాలు తెలియజేయడాన్ని గుర్తుచేస్తుంది. 

2:8 ఈ వచనం విగ్రహారాధన అనే దుష్టసంప్రదాయపు మూలాల్ని తెలియజేస్తుంది, అవి మనుషుల చేతిపని. పౌలు కూడా ఇదే అవగాహనను ప్రతిబింబిస్తూ “వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి" అని రాశాడు (రోమా 1:23). 

2:9-10 వారిని క్షమింపకుము అనే పదజాలం ఆసక్తికరమైన విజ్ఞాపన. ఇది ఇశ్రాయేలు పాపాల్ని క్షమించి వారిని విడిచిపెట్టమని కాక, వారిని శిక్షించాలని తెలియజేస్తుండవచ్చు.. 

2:11 మనుష్యుల గర్వము అణగదొక్కబడును అనే మాటల ద్వారా యెషయా తన గ్రంథంలోని ప్రధానమైన అంశాల్లో ఒకదాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చడం ద్వారా వారిలోని పాపపు నడతల్ని తొలగించి వేస్తున్నాడు. 

2:12-18 ప్రవక్తలు “యెహోవా దినము" గురించి (దినమొకటి... యెహోవా నియమించియున్నాడు) మాట్లాడడం పరిపాటి (యోవేలు 1:15;

2:1,11,31; ఆమోసు 5:18,20; జెఫన్యా 1:7,14; జెకర్యా 14:1). ఇది పాపులు తీర్పు పొందే రోజు, అంటే దేవుని ప్రజలు విమోచన పొందే రోజు. అయితే, దేవుని ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కాబట్టి కోపానికి గురయ్యారని ఈ వచనం తెలియజేస్తుంది. “యెహోవా దినము” అంతిమంగా చివరి తీర్పును సూచిస్తున్నప్పటికీ, దేవుడు తన ప్రజలకు ఇక్కడ విధించే తాత్కాలిక శిక్షలు రానున్న అంతిమ తీర్పును సూచనప్రాయంగా తెలియజేస్తున్నట్లు అర్థంచేసుకోవాలి. లెబానోను... బాషానులు సారవంతమైన నేలలకు, మరీ ముఖ్యంగా ఎత్తైన చెట్లకు ప్రసిద్ధి. ఈ ప్రకారంగా అవి సమృద్ధివలన కలిగే గర్వానికి ప్రతీకలుగా ఉన్నాయి. దేవుని తీర్పు నరుల ప్రతి అహంకారమునకు వ్యతిరేకమైంది. 

2:19-21 రానున్న దేవుని తీర్పును చూచి ప్రజలు గజగజ వణికి పారిపోతారు, వెండి బంగారాలతో చేసుకున్న విగ్రహములను భయంతో పారవేస్తారు. కొండల గుహల గురించి, బండ బీటల గురించి ప్రక 6:15 చూడండి. 

2:22 ఈ ప్రకటనలోని చివరి వచనం యెషయా గ్రంథంలోని ముఖ్యమైన, ప్రభావాత్మకమైన అంశాన్ని వెల్లడిజేస్తూ, దేవుని ప్రజలు దీనత్వం కలిగి ఉండాలనే యెషయా ప్రవక్తకున్న శ్రద్ధాసక్తుల్ని తెలియజేస్తుంది. వారు నరుని నమ్ముకొనక (లక్ష్యపెట్టక), దేవునిలో మాత్రమే నమ్మిక కలిగి ఉండాలి. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |