Isaiah - యెషయా 39 | View All

1. ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగు పడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా

2. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తవస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.

3. పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి-ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియాబబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.

4. నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా-నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.

5. అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెనుయెహోవా సెలవిచ్చు మాట వినుము

6. రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

8. అందుకు హిజ్కియా-నీవు తెలియజేసిన యెహోవాఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.బైబిల్ అధ్యయనం - Study Bible
39:1 మెరోదక్బలదాను బబులోను రాజు, అప్పటికి బబులోను అషూరు సామ్రాజ్యంలోని ఒక ప్రదేశం (ఇది రెండు వేర్వేరు కాలాల్ని సూచిస్తుంది - క్రీ.పూ. 721-710, క్రీ.పూ. 705-703). క్రీ.పూ.703లో సనెరీబు ఎలాగైనా సరే మెరోదక్బలదాను నెదిరించి అతన్ని పదవి నుండి తొలగించే అవకాశం కోసం చూశాడు. ఇందుకు బలమైన కారణం మెరోదక్బలదాను సనెరీబుకు చికాకు కలిగిస్తూ అతనికి తలనొప్పిగా మారడం. మెరోదకృలదాను బబులోను నుండి బహిష్కృతుడైన తర్వాత సైతం అషూరును చికాకు పెడుతూనే ఉన్నాడు, అతడు ఏలాముకు పారిపోయి తాను మరణించేవరకూ అష్యూరు మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. మెరోదక్బలదాను హిజ్కియాకు పత్రికలను కానుకను పంపించడం అష్నూరుకు వ్యతిరేకంగా తనతో కలవాలని అతన్ని ఒప్పించే వ్యూహం. 

39:1-8 వచనాల్లోని వృత్తాంతం 2రాజులు 20:12-19 వచనాల్లోని వృత్తాంతంలాగానే ఉంది.

39:2 హిజ్కియా మెరోదక్కలదాను ప్రతిపాదనకు అనుకూలంగా ప్రతిస్పం దించాడు, హిజ్కియా మెరోదకృలదానుకు తన రాజ్యంలోని ఐశ్వర్యాన్ని, తన ఆయుధబలాన్ని చూపించాడు.

39:3-4 హిజ్కియా తాను తప్పు చేశానేమోననే భావన కలిగి ఉండవచ్చు నేమోనని మనం అనుకుంటుండ వచ్చు.

39:5-7 దేవుడు హిజ్కియా చేసిన పనికి తనలోని తీవ్రమైన అసంతృప్తిని యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. రాజు చర్యలు తన సంరక్షణ కోసం దేవుణ్ణి ఆశ్రయించడం కాక, అతడు అన్యదేశాల సహాయాన్ని కోరుకుంటున్నట్టుగా తెలియజేస్తున్నాయి. యెహోవా నుండి వచ్చే శిక్ష హిజ్కియా మెరోదక లదానుకు చూపించిన ఐశ్వర్యాన్నంతా తీసివేస్తుంది. శిక్షలో మరొక భాగం రాజు గర్భమందు పుట్టిన పుత్రసంతు బబులోను చెరలోకి తీసుకొనిపోబడతారు, వారక్కడ నపుంసకులగా చేయబడతారు. బబులోను రాజు దగ్గర ఉండే సలహాదార్లలో (మంత్రులు) అనేకులు నపుంసకులని బబులోను రాజ్యపు దస్తావేజులు తెలియజేస్తున్నాయి. అప్పెనజు అనే పేరుకు అర్ధం అక్షరాలా “నపుంసకుల యధిపతి” కాబట్టి, దానియేలు, అతని ముగ్గురు స్నేహితుల్ని (ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై అనే వర్ణన నుండి - దాని 1:3-4) సైతం నపుంసకులుగా చేసి ఉండవచ్చనేది కొందరి ఊహాత్మకమైన అభిప్రాయం. 

39:8 హిజ్కియా తన కాలంలో ఏదీ జరగకూడదని స్వార్థపూరితంగా కోరుకొనడం అతని గురించి మంచిగా తెలియజేయకపోయినప్పటికీ, ప్రకటించబడిన శిక్ష రానున్న తరాల్లో జరుగుతుందనే సూచన కనబడుతుంది. బహుశా ఇది యూదాలో దావీదు వంశపాలన అల్లకల్లోలంగా ముగియడాన్నీ, మరీ ముఖ్యంగా యూదావారు చెరలోకి వెళ్లడాన్నీ, యూదా చివరి రాజైన సిద్కియా పదవీభ్రష్టుడు కావడాన్ని సూచిస్తుండవచ్చు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |