Jeremiah - యిర్మియా 4 | View All

1. ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి తొలగించి

2. సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.

3. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.

4. అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
రోమీయులకు 2:25

5. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.

6. సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొను టకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,

7. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.

8. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి; రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మనమీదికి రాకుండ మానిపోలేదు;

9. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయ మొందుదురు.

10. అప్పుడు నేనిట్లంటిని కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవుమీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.

11. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.

12. అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.

13. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.

14. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?

15. దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,

16. ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.

17. ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.

18. నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?

19. నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?

20. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.

21. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?

22. నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారుమూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.

23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.

24. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.

25. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.

26. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.

27. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.

28. దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి యున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.

29. రౌతులును విలు కాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,
ప్రకటన గ్రంథం 6:15

30. దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు.

31. ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1 ప్రజలు పశ్చాత్తాపంతో మొఱపెట్టినప్పుడు (3:21-25), యథార్థ హృద యంతో యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఆయన వారి భవిష్యత్తులో నిశ్చయంగా ఏం జరగనున్నదో తెలియజేస్తూ వారి మొబైలకు జవాబిస్తాడు. ఇప్పటివరకు వారు నిజంగా పశ్చాత్తాపపడలేదు. 

4:2 ఇశ్రాయేలు, యూదా ప్రజలు - నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, యెహోవా అన్యజనులను ఆశీర్వదిస్తాడు (జనములు ఆయనయందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు). ఇశ్రాయేలీయుల కివ్వబడిన వాగ్దానాలు ఎప్పుడూ కేవలం వారిని ఆశీర్వదించడానికి మాత్రమే కాక, వారి ద్వారా లోకంలోని ప్రజలందరి ఆశీర్వాదానికి కూడా ఉద్దేశించబడ్డాయి (ఆది 12:3; 18:18; 22:18; 26:4; 28:14). 

4:3 బీడు పొలము అంటే చాలా కాలంగా సేద్యం చేయకుండా వదలివేయగా ముళ్ళపొదలు మొలిచిన నేల. హోషేయ కూడా ఇదే సవాలు విసిరాడు ( హో షేయ 10:12). 
చాలా కాలంగా బీడుగా వదిలి పెట్టిన భూమిని దున్ని మళ్ళీ సేద్యం హోషేయలిద్దరూ ఇదే సాదృశ్యాన్ని ఉపయోగించారు.

4:4 ప్రజలు అవిధేయులై ఉండడం మానుకోవాలి. అంటే వారి హృదయా లకు ఛేదనసంస్కారం జరగాలి (ద్వితీ 10:16; రోమా 2:28-29). ఛేదనసంస్కారం (సున్నతి) నిబంధనకు గుర్తు (ఆది 17:10-14), అయితే హృదయంలో దేవునితో సరైన సంబంధం లేకుండా కేవలం మతపరమైన ఆచారం నిరుపయోగం. 

4:5-31 యిర్మీయా ఈ విభాగంలో దేవుని తీర్పు తథ్యమని రూఢిగా ఉన్నాడు, అది ఇప్పటికే జరుగుతున్నట్టుగా వర్ణించాడు. 

4:7 ఉత్తరం వైపు నుండి రాబోతున్న భీకరమైన యుద్ధం గురించి యిర్మీయా సింహముతో సహా పలు జంతు సాదృశ్యాలను ఉపయోగించాడు. దీనికి తోడుగా గద్దలు (వ. 13), అడవి తోడేలు, చిరుతపులి (5:6), తీక్షణమైన వడ గాలి (వ.11), అగ్ని (వ.4) వంటి సాదృశ్యాలు రానున్న ఆపద ఎంత భీకరంగా ఉండబోతున్నదో తెలియజేస్తున్నాయి.

4:10 ఇది యిర్మీయా గ్రంథంలో వివాదాస్పదంగా ఉన్న వచనాల్లో ఒకటి. దేవుడు యూదా ప్రజలకు క్షేమం కలుగుతుందని చెప్పి వారిని మోసం చేశాడని యిర్మీయా ఆయన మీద ఆరోపణ చేస్తున్నాడా? దేవుడలా చేయడని యాకోబు 1:13 వచనం తెలియజేస్తుంది. ఈ ప్రశ్నకు పరిష్కారం దేవుడే మానవచరిత్రను అంటే విశ్వాన్ని పరిపాలిస్తున్నాడని గుర్తుచేసుకొనడం (కీర్తన 22:28). అంతగా ప్రాధాన్యత లేని ఇతర కారణాల గురించి లేఖనమేమీ చెప్పడం లేదు, దేవుడే లోకమంతటినీ పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన అనుమతించే వాటన్నిటినీ ఆయనకే ఆపాదించడం జరుగుతున్నది. ఈ సందర్భంలో కూడా, దేశం క్షేమంగా ఉంటుందని చెప్పి ప్రజలను పెడత్రోవ పట్టించే అబద్ధ ప్రవక్తలను ఆయన అనుమతించాడు. దేవుడెవరినీ మోసగించేవాడు కానప్పటికీ ఆయన సకలవిశ్వాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఈ ప్రశ్న నడగడం సమంజసమేనని యిర్మీయా అనుకొని ఉండవచ్చు. దేవుడు ఈ మోసపూరిత చర్యను అనుమతించాడు. అదే సమయంలో దాన్ని వ్యతిరేకించాడు. 

4:11 నా జనుల కుమార్తె ("నా పియ ప్రజలు" అని అక్షరార్థం) అనే పదజాలం ఇక్కడ తొలిసారి కనబడుతోంది. ఇక్కడ మొదలు 9:7 వచనం వరకు ఈ పదజాలం మొత్తం ఎనిమిదిసార్లు కనబడుతుంది. 9:7 లో ముగిసిన ఈ పదజాలం విలాపవాక్యములు గ్రంథంలో మళ్ళీ అయిదుసార్లు కనబడుతుంది. కొన్నిసార్లు ఈ పదాన్ని యెహోవా ఉపయోగించగా, మరి కొన్నిసార్లు ప్రవక్త ఉపయోగించాడు. 

4:15-17 ఉత్తరంవైపు నుండి దూసుకొని వస్తున్న శత్రువు. ప్రకంపనలు ఇశ్రాయేలు ఉత్తర సరిహద్దు దాను ప్రదేశంలోను, మొర్దాను నది ప్రారంభమైన స్థలంలోను, దిగువన ఉన్న ఎఫ్రాయిము కొండలలోను, షెకెము నుండి బేతేలు వరకు విస్తరించిన ఉన్నత ప్రదేశాల్లోను వినబడుతున్నాయి.....

4:19-22 ఈ వచనాల్లో యిర్మీయా మొదటి “ఒప్పుకోలు" ఉంది. (ఇతర ఒప్పుకోలు ప్రకటనల గురించి 11:18-23; 12:1-6; 15:10-11,15-21; 17:14-18; 18:18-23; 20:7-13,14-18; 5:3-5; 8:18-9:1 వాక్యభాగాలను చూడండి). యిర్మీయా తన ప్రజల మీదకు రాబోతున్న పెనుముప్పును అనుభవిస్తున్నట్టుగా ముందుగానే అనుభూతి చెందాడని ఈ ఒప్పుకోలు ప్రకటనలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రవక్తను దేశద్రోహి అని నిందించడం జరిగింది, అయితే ఈ వచనాలు అతని దేశభక్తిని యూదాపట్ల అతనిలోని యథార్థమైన ప్రేమను తెలియజేస్తున్నాయి. అయితే ఇటువంటి నాశనకరమైన మాటలు మాట్లాడడం అతనికి ఏ సంతోషాన్ని ఏ సంతృప్తిని ఇవ్వదు గానీ దేవుడతనిని తన ఉద్దేశాలు తెలియజేయడం కోసం వాడుకుంటున్నాడు కాబట్టి చెప్పక తప్పదు. 

4:23-28 ప్రవక్తల గ్రంథాల్లో గగుర్పాటు కలిగించే సందేశాల్లో ఒకటైన ఇది దేవుడు పాపంమీద కుమ్మరించ బోతున్న ఉగ్రతను తీక్షణమైన వాస్తవికమైన చిత్రణతో వివరిస్తుంది. ఈ శిక్ష యూదామీదకు బబులోను దాడి చేయడాన్ని, అంతకు మించి మానవచరిత్ర అంతంలో “రాబోతున్న యెహోవా ఉగ్రత దినం" గురించి తెలియ జేస్తుంది. 

4:23 భూమిని... అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే వర్ణనను యిర్మీయా ఆది 1:2 నుండి తీసుకున్నాడు. ఈ వర్ణన దేవుని సృష్టి కార్యాలు తారుమారు కావడాన్ని సూచిస్తుంది. యెహోవా దినం సమీపించి నప్పుడు జరగబోయే వినాశనం అంత తీవ్రంగా ఉంటుంది. 

4:27 భూమి నిరుపయోగమైనప్పటికీ అంతం వెంటనే రాదు. యెహోవాకు నమ్మకంగా నిలిచినవారి శేషం గురించిన వాగ్దానమెప్పుడూ ఉంటుంది. 

4:30 యెరూషలేము అనుభవించే మరణవేదనను యిర్మీయా వర్ణించాడు, యెరూషలేము ఇంత వేదనలో సైతం దేవుణ్ణి తన భర్తగా తృణీకరిస్తూనే ఉంది. పశ్చాత్తాపపడి దుఃఖించడానికి బదులు యెరూషలేము రక్తవర్ణవస్త్ర ములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కళ్ళను కాటుకచేత అలంకరించుకొని ఉంది. ఈ వర్ణన బైబిల్ కాలంలోని స్త్రీలు నల్లని కాటుక దిద్దుకొనడం కోసం ముందుగా కనురెప్పల మీద వెండివంటి తెల్లని మెరుపు రంగును అద్దుకోవడాన్ని వర్ణిస్తున్నది. అయితే, యెరూషలేము తనను తాను అలంకరించుకోవడం వ్యర్థమే, ఎందుకంటే యెరూషలేము కోరుకొంటున్న విటకాండ్రు (రాజకీయ మిత్రులు) ప్రాణం తీసేవారే గానీ నిజమైన ప్రేమికులు కారు. 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |