2:1-2 తన సందేశం ఏనాడూ లోకజ్ఞానంపై ఆధారపడలేదనీ, సిలువవేయబడిన... క్రీస్తు అనే అభ్యంతరపరచే సందేశం పైనే అది ఆధారపడి వుందనీ పౌలు కొరింథీ విశ్వాసులకు జ్ఞాపకం చేశాడు.
2:3-5 పౌలు ప్రసంగం జ్ఞానయుక్తమైన తియ్యనిమాటలతో లేదు, కానీ పరిశుద్దాత్ముని రక్షణశక్తితో కనుపరచబడింది. మీ విశ్వాసము అంటే సువార్తను విశ్వాసంతో హత్తుకున్న వారందరినీ సూచిస్తుంది. వారి మారుమనస్సు, విశ్వాసుల సంఘంలో వారి గుర్తింపు రెండూ దేవుని శక్తి ఫలితమే.
2:6-9 దేవుని అసాధారణ జ్ఞానం ఆత్మ వెలిగింపుతో చూడగలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది.
2:6-7 జ్ఞానము మర్మమైనట్టుగా అంటే దేవుడు బహిరంగంగా బయలుపరచిన రహస్యాన్ని సూచిస్తుంది. సిలువ వేయబడిన క్రీస్తు మహిమా లో స్వరూపియగు ప్రభువై యున్నాడు అనే సువార్త సందేశమే ఆ రహస్యం. 2:8 ఈ లోకాధికారులు యేసును మహిమాస్వరూపియగు ప్రభువుగా గుర్తించలేదు. వారు గుర్తించకపోవడమే ఆయనను సిలువ వేయడానికి దారితీసింది, ఇదే సువార్తకు ఆధారమైంది. కాబట్టి వింతైన విధంగా, క్రీస్తు తృణీకరించబడడం ద్వారా మనం స్వీకరించబడడం సాధ్యమైంది.
2:9 ఈ “మరుగైన జ్ఞానం" ప్రత్యక్షం కావడాన్ని రెండు పా.ని. లేఖనభాగాలు పేర్కొనడం ద్వారా పౌలు నిర్ధారించాడు (యెషయా 52:15; 64:4).
2:10 దేవుని మర్మములు. అంటే దేవుని ఆత్మ విశ్వాసులకు బయల్పరచే లోతైన జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ముందటి నేపథ్యం నుండి, ఈ పత్రిక అంతటి నుండి అర్ధం చేసుకునే ఈ అత్యున్నత జ్ఞానం, మహిమాస్వరూపియగు ప్రభువైన యేసు క్రీస్తు, అంటే “సిలువవేయబడిన క్రీస్తు” (వ. 2).
2:11 పౌలు తక్కువనుండి ఎక్కువకు అన్న సాదృశ్యాన్ని వాడాడు. ఒక మనుష్యుడు ఏమి ఆలోచిస్తున్నాడో అతనిలో ఉన్న మనుష్య ఆత్మకు (గ్రీకు. న్యూమా) తెలిసినట్లే దేవుని ఆత్మకు (గ్రీకు. న్యూమా) దేవుని ఆలోచనలు తెలుసు.
2:12 దేవుని యొద్దనుండి... ఆత్మను పొంది, ఒకడు “సిలువ వేయబడిన క్రీస్తును” (వ.2) అర్థం చేసుకోవడమే అసలైన అత్యున్నత జ్ఞానం అని పౌలు ప్రకటించాడు.
2:13 ఆత్మసంబంధమైన విషయాలు పొందడం ఆత్మ సంబంధులైన మనుష్యులకే (గ్రీకు. న్యూమాటికోయ్; ఆధ్యాత్మికపరులకు) ఆత్మ వాటిని బయల్పరచడం ద్వారా సాధ్యం. “ఆత్మానుసారులు" అంటే బహుశా వ.6"లోని అర్థం చేసుకోగల సామర్థ్యం” (అంటే “పరిపక్వత") ఉన్నవారిని సూచిస్తుండవచ్చు.
2:14. ప్రకృతి సంబంధియైన (ఆత్మలేని) మనుష్యుడు దేవుని ఆత్మ విషయము లను అంగీకరించడు. సువార్త వెడ్డితనము అని భావించేవాడు అది "దేవుని ఆత్మ నుండి వస్తుందని" ఎరగలేడు. ఒప్పించేవాడు, బయలుపరచేవాడు ఆత్మయే. 1-2 అధ్యాయాలలో, “వెళితనము" ఎల్లప్పుడూ "సిలువ వేయబడిన క్రీస్తు"గా కనిపించడాన్ని లేక దేవుని జ్ఞానమైన సువార్తను సూచిస్తుంది.
2:15-16 ఈ జ్ఞానానికి సంబంధించి ఆత్మ సంబంధియైనవాడు అన్నిటిని వివేచిస్తాడు. ఆత్మ సంబంధియైనవాని వివేచన దేవుని గూఢమైన సంగతులను గ్రహించడంలో విశ్వాసికి ఉచితంగా ఇవ్వబడిన అవగాహన, ఆత్మ సంబంధి" ఎంత నమ్మకంగా సువార్త ప్రకారం జీవించి, ప్రకటిస్తున్నాడు అని పరీక్షించేది ప్రభువే (4:4-5). ఆ ఆత్మసంబంధి. ఎవనిచేతనైనను వివేచింపబడడు అంటే సువార్త విషయంలో ప్రతికూలమైన మానవ అవగాహనలకు విలువకట్టడం గురించి పట్టించుకోడు, ఎందుకంటే అలాంటి వానికి క్రీస్తు మనస్సు అనే సరియైన దృక్పథం ఉంటుంది. తన వ్యాఖ్యను వ.15లో ప్రామాణీకరిస్తూ యెషయా 40:13ను పేర్కొంటున్నాడు. క్రీస్తు మనస్సు ఉన్నవారు కలిగి ఉండే ఆధ్యాత్మిక విషయాలను గురించి బోధించే సామర్థ్యం పరిశుద్దాత్మ లేనివానికి ఉండదు. ఉండండంతంగా