Kings II - 2 రాజులు 14 | View All

1. ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.

2. అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపుర స్థురాలైన యెహోయద్దాను.

3. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.

4. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.

5. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.

6. అయితేకుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింప కూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణ శిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్ర మందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.

7. మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.

8. అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపిమనము ఒకరి నొకరము దర్శించు నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా

9. ఇశ్రా యేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెనులెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటినీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.

10. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయ ములో దిగుదువని చెప్పినను

11. అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా

12. యూదావారు ఇశ్రా యేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.

13. మరియు ఇశ్రా యేలు రాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూష లేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

14. మరియయెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.

15. యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమ మును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

16. అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

17. యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహో యాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.

18. అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

19. అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.

20. వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.

21. అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.

22. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

23. యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రో నులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.

24. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

25. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలువారి సరి హద్దును మరల స్వాధీనము చేసికొనెను.

26. ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.

27. యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొ బాము ద్వారా వారిని రక్షించెను.

28. యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంత టిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రా యేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

29. యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
14:1-2 అమజ్యా... ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలాడని అతని సుదీర్ఘ పాలనా కాలం గురించి తెలియజేసిన వివరాలు మినహా మిగిలిన ప్రారంభ పలుకులు సాధారణంగా ఉన్నాయి. ఈ కాలమంతటిలో మొదటి నాలుగు సంవత్సరాలు తప్ప మిగిలిన కాలమంతా అతడు తన కుమారుడైన అజర్యాతో సహపాలకునిగా ఉన్నాడనే వాస్తవం ఇక్కడ మరుగున పడిపోయింది. 

14:3-4 అమజ్యా మూల్యాంకనంలో ఉన్నత స్థలముల గురించి పేర్కొన్నారు. ఇవి అన్యదేవతల ఆరాధనా స్థలాలు కాకపోయినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యెహోవాను ఆరాధించే స్థలాలు కావచ్చు. వాటిని అమజ్యా తొలగించలేదు. 

14:5-6 తన తండ్రిని హత్యచేసిన సేవకులను శిక్షించే విషయంలో తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధించకుండా అమజ్యా ధర్మశాస్త్రానికి విధేయత చూపాడు. (ద్వితీ 24:16; 2రాజులు 10:11-14 పోల్చండి)..

14:7 ఇశ్రాయేలీయుల అధికారపు పునరుజ్జీవ ప్రక్రియ వాస్తవంగా యోవాషు, అమజ్యాలతో ప్రారంభమయ్యింది. యూదావారి విషయంలో ఈ పునరుజ్జీవ ప్రక్రియ వారు ఎదోముపై క్రూరంగా దాడి చేసి మరలా గెలిచిన యుద్ధంతో ప్రారంభమయ్యింది. ఉప్పులోయ ఎక్కడుందో ఖచ్చితంగా గుర్తించలేక పోయినా, ఇది బహుశ మృతసముద్రానికి దక్షిణంగా అరాబాలో ఉండివుంటుంది. సెల పట్టణం 1000 అడుగుల ఎత్తైన పర్వతపు కోట. ఇది పెట్రాకు సమీపంగా ఎదోములో ఉంది.

14:8 అమజ్యా తనను తాను గొప్పగా ఊహించుకోడానికి కారణాలు అర్థం చేసుకోడానికి చాలా క్లిష్టంగా ఉన్నా, ఎదోముపై విజయంతో కలిగిన గర్వం, అహంకారాల కారణంగానే అలా ప్రవర్తించాడని 2రాజులు గ్రంథం సూచిస్తుంది. అమజ్యా దేవుని చిత్తాన్ని తోసిపుచ్చి విగ్రహారాధన వైపు తిరగడమే అతని అహంభావానికి కారణమని దినవృత్తాంతములు గ్రంథం ఆరోపిస్తుంది (2దిన 25:14,20). 

14:9 అమజ్యా, యెహోయాషు కుటుంబాల మధ్య ఒక వివాహ సంబంధం కోసం జరిగిన అభ్యర్థనను యెహోయాషు తిరస్కరించడంతో అమజ్యా కలత చెందాడని, యెహోయాషు చెప్పిన కల్పితకథను బట్టి కొందరు భావిస్తారు.

14:10-14 అమజ్యాతో యుద్ధం చేయాలని యెహోయాషు కోరుకోలేదు. కానీ అమజ్యా పట్టుపట్టడంతో కలిగిన యుద్ధ ఫలితాలు యూదా వారికి వినాశకరంగా పరిణమించాయి. యెహోయాషు యెరూషలేము ఉత్తర గుమ్మపు పడమటి భాగం వరకు పడగొట్టి పట్టణాన్ని దోచుకున్నాడని ఇక్కడ పేర్కొన్న రెండు గుమ్మాలు సూచిస్తాయి.

14:15-16 యెహోయాషు చేసిన యితర కార్యముల గురించి రెండవసారి తెలియజేసిన అధికారిక ముగింపు బహుశ నకలు తయారుచేసిన వారి పొరపాటు కావచ్చు (13:12-13). మరోవైపు, ఈ సమాచారం రెండవసారి తెలియజేయడం ఉద్దేశపూర్వకమని, ఎక్కడైతే యెహోయాషు ఇశ్రాయేలీయుల అదృష్టాన్ని తిరిగి సమకూరుస్తున్నాడో ఆ ఉత్తరాది ఇశ్రాయేలు దేశంపై అది పాఠకుని దృష్టిని కేంద్రీకరింప చేస్తుందని కొందరు అనువాదకులు సూచిస్తారు. ఇలా రెండవసారి తెలియజేయడం యెహోయాషుకు లభించిన నెమ్మదికరమైన ముగింపుతో అమజ్యాకు కలిగిన హింసాత్మక ముగింపును వ్యత్యాసపరుస్తుందని ఇయాన్ ప్రోవెన్ సూచించాడు. 

14:17-18 యెహోయాషు మరణమైన తరవాత వ.17లో అమజ్యా పదిహేను సంవత్సరాలు “పరిపాలించాడు” అనకుండా బ్రదికెను అని పేర్కొనడం గమనించండి.

14:19-21 ఇక్కడ సంఖ్యలు వివరించాలంటే తండ్రి కుమారులు ఇద్దరు దీర్ఘకాలం సహపాలకులుగా ఉండటం తప్పనిసరి (15:2). అందుచేత యూదా జనులందరును... (అజర్యాను)...పట్టాభిషేకము చేసిరి అనే ప్రకటన బహుశ అమజ్యా రాజకీయ, సైనిక అసమర్థతను బట్టి (2దిన 25:14 ప్రకారం విగ్రహారాధన కూడా) అజర్యాను సహపాలకునిగా చేయాలని ప్రజలు వత్తిడి చేసిన గతకాలపు. సంఘటనల ప్రస్తావన కావచ్చు. అమజ్యా మరి కొన్ని సంవత్సరాల తరవాత మరణించినా, బహుశ ఈ అసంతృప్తి ఫలితంగానే అతడు మరణించాడని అనుకోవచ్చు. 

14:22 ఉజ్జియా అని కూడా పిలువబడిన అజర్యా అతని తండ్రియైన అమజ్యా స్థానంలో యూదాకు రాజయ్యాడు. కొత్త రాజు సాధించిన విజయాలను, అతని ముందు పరిపాలించిన రాజు గురించి ముగింపు వాక్యాలు పలికే సందర్భంలో తెలియజేయడం అసాధారణం. అయితే, సహపాలనలో అజర్యా అప్పటికే చాలా రాజ్యాధికారం కలిగి వున్నాడు. అమజ్యా మరణం వరకు అతని అధికార నియామకం పూర్తిగా జరగకపోయినా, సాధించిన ఈ కార్యం సహపాలనా కాలంలో అజర్యా చేసిన ప్రయత్నాలను సూచిస్తుంది. 

14:23-29 ఘనత వహించిన ముగ్గురు లేదా నలుగురు హెబ్రీయుల రాజు లలో ఒకడైన ఈ రాజు గురించి బైబిలు తక్కువగా తెలియజేయడం ఏ లౌకిక చరిత్రకారునికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండవ యరొబాము కాలంలో రెండు హెబ్రీ రాజ్యాల సమిష్టి శక్తి సంపదల మొత్తం, సొలొమోను అధికార సంపదల స్థాయికి చేరిందని కొందరు వివరణ ఇస్తారు. అయితే లోక సంబంధమైన గొప్పతనాన్ని రాజరిక నిబంధనా వచనాలలో గుర్తించడం లేఖనాల ఉద్దేశం కాదు. అందుచేత, దేవునికి మహిమ కలిగించని ఎలాంటి లౌకిక విజయాలైనా, అసంబద్ధమైనవి. అందుకే వాటికి గణనీయమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. 

14:23-24 ఇతడు (రెండవ యరొబాము) ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు (నెబాతు కుమారుడైన) మొదటి యరొబాము పాపమునుండి తొలగలేదు అంటూ మూసధోరణిలో కొనసాగే ఖండింపుతో సహా సాధారణ సమాచారమే ఇక్కడ ప్రారంభ వాక్యాలలో కనబడుతుంది. 

14:25 రెండవ - యరొబాము సామ్రాజ్య సరిహద్దు విస్తరణ కాంక్షను బైబిలు గ్రంథకర్త స్పష్టంగా తెలియజేశాడు. అతని కాలంలో ఇశ్రాయేలు సరిహద్దు, యూఫ్రటీసు నదికి పైన తిప్పావద్ద సొలొమోను రాజ్యానికి గల ఉత్తర సరిహద్దుకంటే కొంచెం తక్కువగా ఉంది. రెండవ యరొబాము కాలంలో కేవలం లెబోహమాతు వరకే సరిహద్దుపై ఆధిపత్యం లభించింది. దక్షిణాన అతని భూభాగం మైదానపు సముద్రము వరకు విస్తరించింది. ఇది మృతసముద్రం అనేది స్పష్టం. ఎందుకంటే ఈ జలప్రవాహం పిగౌకొండల వాలుకు దిగువన ఉంది. (ద్వితీ 3:17). హెబ్రీయులకు తిరిగి అధికారం సమకూరుతుందని ప్రవచనం చెప్పి ఎలీషా ప్రవచనాలతో గొంతు కలిపిన చిన్న ప్రవక్త యోనా గురించి మనం ఇక్కడే గమనించగలం. 

14:26-27 యెహోయాషు విషయంలో జరిగినట్లే (13:23), మరలా ఈ రక్షణ కార్యాలు కూడా రాజు నీతినిబట్టి కాక దేవుని కృపాకరుణల వలనే సాధ్యమయ్యాయి. దారితప్పిన తన ప్రజలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి తప్పించడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చియుండెను అనే కారణం సాధారణంగా కనిపించినా మనసును హత్తుకుంటుంది. 

14:28-29 యరొబాము (రెండవ యరొబాము) విదేశీ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించాడని తెలియజేసే మరొక ప్రకటన తప్ప అతని గురించి మిగిలిన ముగింపు వ్యాఖ్యానాలు సాధారణ నమూనాలోనే ఉన్నాయి. 


Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |