Philippians - ఫిలిప్పీయులకు 2 | View All

1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల

2. మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

3. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

4. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
జెకర్యా 3:8

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
యెషయా 45:23

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
యెషయా 45:23

12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.
కీర్తనల గ్రంథము 2:11

13. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,

15. సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
ద్వితీయోపదేశకాండము 32:5

16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును
యెషయా 49:4, యెషయా 65:23

17. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును.

18. ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.

19. నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.

20. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు.

21. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

22. అతని యోగ్యత మీరెరుగు దురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.

23. కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను.

24. నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.

25. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.

26. అతడురోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.

27. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.

28. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.

29. నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను

30. గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-2 యైనను అనే అక్షరాలతో ముగిసే ఐదు పదాలు పౌలు విన్నపానికి ఆధారంగా నిలిచాయి. ఈ మాటలు వాదన కోసం కొన్ని షరతులను వ్యక్తపరుస్తున్నాయి. ఈ షరతుల్లోన్ని సత్యాన్ని పౌలు, అతని పాఠకులు అంగీకరిస్తారు. నా సంతోషమును సంపూర్ణము చేయుడి, అన్నాడు గానీ “పౌలును సంతోషపెట్టండి" అనలేదు. అంటే వారు స్థిరంగా నిలిచి ఉండడం అతని జీవితానికి దేవుని పిలుపును సంపూర్ణం చేస్తుందని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీయులు చేయాల్సిన నాలుగు పనులు వారిపట్ల పౌలు ఉద్దేశాన్ని వివరిస్తాయి. ఏకమనస్కులు... ఏకప్రేమ... కలిగి అనే రెండు క్రియాపదాలు గ్రీకు. ఫోనియో అనే మూలపదం నుండి వచ్చాయి. కేవలం ఆలోచించడం అనే క్రియను దాటి ఇవి విలువలను సూచిస్తున్నాయి. ఫిలిప్పీయులు యేక మనస్కులుగా ఒక్కదానియందే మనస్సుంచుచు విలువనివ్వాలి. ఈ రెండిటికి మధ్య, పౌలు ఏక ప్రేమ, ఏకభావములను చొప్పించాడు. 

2:3-4 పౌలు వేటినైతే ఖండించాడో ఆ సమస్యలను కక్ష లేక వృధాతిశయము అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి (1:15,17). చెడు వైఖరికి విరుగుడైన వినయమైన మనస్సు ఇతరులను తనకంటె యోగ్యుడని ఎంచేలా చేస్తుంది. దానికి మించి వినయమనస్సు ఇతరుల కార్యములను పట్టించుకుంటుంది. సరైన సంబంధాలలో "అవి మాత్రమే అని కాక, ఇవి కూడా” అనే విరుద్ధ భావాలు ఇమిడి ఉంటాయి. వ్యక్తిగత బాధ్యతలు నెరవేర్చడం అవసరమే గానీ కానీ ఇతరుల విషయాలను పట్టించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం.

2:5-11 ఈ వాక్యభాగం వివిధరకాల (గ్రీకు. "కెనోసిస్", అక్షరార్థంగా “రిక్తునిగా చేసుకోవడం”) సిద్ధాంతాల ద్వారా భూమి మీదకు రావడానికి యేసు ఏమేమి విడిచి పెట్టాడో వివరించింది. ఈ వాక్యాలు క్రైస్తవ దీనత్వానికి ఒక వర్ణన. దీనిలో కనిపించే ప్రాసనియమాన్ని బట్టి దీనిని ఆదిసంఘంలో వ.6-8 (క్రైస్తవ దీనత్వం), వ.9-11 (యేసు ఆరోహణం) అనే రెండు చరణాలతో కూడిన ఒక కీర్తనగా భావిస్తారు. 

2:5 యీ మనస్సు మీరును కలిగి యుండుడి అనే మాటలు క్రీస్తు వ్యక్తిత్వాన్ని / మనస్సును సంఘం ఒక మాదిరిగా తీసుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాయి. 

2:6 యేసు తన స్వంత ఇష్టాలను ప్రాముఖ్యమైనవిగా ఎంచుకొనలేదు అన్నది ఈ వచనంలోని కీలకమైన తలంపు (వ.3తో పోల్చండి). అంటే వాటిని ఆయన తాను చేపట్టిన పనిని నియంత్రించేందుకు అనుమతించలేదు. కలిగినవాడై యుండి: “అప్పటికే దేవుని స్వరూపం కలిగి ఉన్నప్పటికీ” అనేది ఇక్కడ ఉన్న ఆలోచన. ఎందుకంటే యేసు మానవుడుగా మారడానికి ఆయన అధిగమించాల్సిన ఆటంకాన్ని అది చూపిస్తుంది. స్వరూపము (గ్రీకు. "మోర్ఫే") ఆయన సంపూర్ణ దైవత్వాన్ని చూపుతోంది. దేవునితో సమానము అంటే ఆయన దేవునితో సహాత్ముడుగా, అదే సమయంలో వేరుగా ఉన్న వ్యక్తి (త్రిత్వంలో రెండవవ్యక్తి) అని అర్థం. విడిచిపెట్టకూడని అనేదానికి రెండు సహజమైన అర్థాలు ఉన్నాయి. “పట్టుకోవడం” (లాక్కోవడం) అని కావచ్చు, కానీ యేసు దైవత్వం దృష్టిలో చూస్తే అది బహుశా “గట్టిగా పట్టుకోవడం” (ఎట్టి పరిస్థితిలో విడవకుండా పట్టుకుని వేలాడడం) అని అర్థం కావచ్చు.

2:7-8 రిక్తునిగా చేసికొనెను అనే మాటలపై వాదోపవాదాలున్నాయి. యేసు తనను తాను ఏ విషయంలో రిక్తునిగా చేసుకున్నాడో అని వేదాంత పండితులు చర్చిస్తూ వచ్చారు. ఆయన తనను తాను దైవత్వం నుండీ, దాని గుణలక్షణాల నుండి వేరుచేసుకోలేదు అనేది నిశ్చయం. ఈ క్రియాపదంలో రెండు ప్రకటనలు కలిసి ఉన్నాయి. మొదటిది దాసుని స్వరూపమును ధరించుకొని అంటే కుమారుడైన దేవుడు నిజమైన దాసత్వం అంటే ఏమిటో ఆ కనపరచడానికి వచ్చాడు. 
మనుష్యుల పోలికగా పుట్టి అంటే ఖాళీ చేసుకోవడం, దాసత్వం, ఈ రెంటినీ సూచిస్తుంది. తగ్గించుకొనెను. (వ.3తో పోల్చండి)అనే ఈ రెండవ క్రియాపదాన్ని మరి రెండు వ్యాఖ్యలు వివరిస్తున్నాయి. మొదటిది, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి అనేది ఆయన తగ్గించుకొని ఉన్న కాలం. “మనుష్యుడుగా” అనే మాట "దేవుని స్వరూపము"(వ. 6) అనే మాటకు వ్యత్యాసమైనది. యేసు మానవరూపంతో భూమిమీదికి వచ్చినప్పటికీ, మానవుని కంటె ఎక్కువైనవాడు. రెండవది, యేసు తగ్గింపు, ఆయన విధేయత చూపిన దానిని బట్టి వచ్చింది. దాసులు విధేయులౌతారు. యేసు దేవునికి లోబడ్డాడు, సిలువ మరణము పొందేటంతగా! 

2:9-11 ఈ వచనాల్లో దేవుడు కార్యం జరిగిస్తున్నట్లుగా వర్ణించబడ్డాడు. మళ్ళీ రెండు క్రియాపదాలు ఇక్కడున్న ఆలోచనను వివరిస్తున్నాయి. మొదటిది, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి (“అధికంగా హెచ్చించడం" ఇక్కడ మాత్రమే ఉంది) అంటే కొందరు దానిని ఉన్నవాటిలో ఉన్నత స్థానం అని భావించినా, దేవుడు యేసుకు ఒక కొత్త స్థానాన్ని ఇచ్చాడు అని అర్థమిస్తుంది. రెండవది, దేవుడు ఒక నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ నామం ప్రతి నామమునకు పై నామము, అదే ప్రభువు (కురియోస్= యెహోవా). ప్రతివాని మోకాలును... వంగునట్లును, ప్రతివాని నాలుకయు... ఒప్పుకొనునట్లును అనే మాటలు దేవుడు ఎంత ఉన్నత స్థాయికి హెచ్చించాడో తెలుపుతున్నాయి. ఇక్కడ పేర్కొన్న భంగిమ, ఒప్పుకోలు, విధేయతాపూర్వక గౌరవాన్ని సూచిస్తున్నాయి. “ప్రతి” అనే మాటలో అన్ని ప్రాంతాలు, అంటే పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని అన్నీ ఉన్నాయి. మొత్తంగా సజీవులైనా, మృతులైనా (దీవించబడిన, శిక్షించబడిన) అందరూ దీనిలోకి వస్తారు. అందరూ దేవున్ని మహిమపరుస్తారు. యేసు దేవునికి, మానవులకు మధ్య మధ్యవర్తిగా ఉన్నాడని ఇది బోధిస్తుంది. ఆయన ఆరాధనకు కేంద్రస్థానం (ప్రభువు), భూమిపై దేవుని చిత్రాన్ని జరిగించేవాడు. 

2:12-18 ఈ భాగంలో మూడు అన్వయాలున్నాయి. ఆచరణాత్మక క్రైస్తవ్యం (వ.12-13), సానుకూల స్థిరత్వం (వ.14-16), వ్యక్తిగత ఆనందం (వ.17-18). 

2:12-13 విధేయత చూపాల్సింది దేవునికేగాని, తనకు రాబోయే మరణం క్రైస్తవ ఆసక్తిని నీరుకార్చదని ఆశిస్తున్న పౌలుకు కాదు. కొనసాగించుడి అంటే రక్షణను సంపాదించుకోమని కాదు, అన్వయించుకొని, ఆచరించమని అర్ధం. భయముతోను వణకుతోను అంటే దేవుని ఆశీర్వాదం విషయంలో సరైన గౌరవం కలిగి వుండడం. నిజమైన విధేయత గౌరవం నుండి వస్తుంది కానీ భయం నుండి కాదు. కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అనే మాటలు క్రైస్తవులను దేవుడే తనకు తానుగా ప్రోత్సాహాన్ని అందించి వారిని బలోపేతం చేస్తాడు అనే గొప్ప ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నాయి.

2:14-16 సణుగులును సంశయములును స్వార్థం నుండీ, వృథాతిశయం నుండీ పుట్టుకొస్తాయి (1:15,17 తో ద్వితీ 32:5 పోల్చండి). నిరపరాధులు (సంపూర్ణ క్రైస్తవ వ్యక్తిత్వం), నిష్కళంకులు (అభ్యంతరం కలిగించని జీవితం; 1:10తో పోల్చండి) అనే పదాలు రూపకాలంకారాలను పరిచయం చేస్తున్నాయి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైన లోకంలోని మూర్ఖమైన వక్రజనము మధ్య, మొదటిగా విశ్వాసులు నైతికంగా అనింద్యులై ఉండాలి. వంకర జీవితాలకు విశ్వాసులు తిన్నని నమూనాలుగా ఉండాలి. రెండవదిగా, అంధకారమయమైన లోకంలో దానికి భిన్నమైన తేజస్సుతో జ్యోతులవలె ప్రకాశించాలి.

2:17-18 పానార్పణ పా.ని.లోని బలుల వ్యవస్థను జ్ఞాపకం చేస్తుంది. ఈ విశ్వాసుల కోసం పోయబడుతున్న పానీయం పౌలే. విశ్వాసయాగము అర్పణను, ఆచారాన్ని జ్ఞప్తికి తెస్తుంది. ఇదంతా పౌలుకు, ఫిలిప్పీ విశ్వాసులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ 2:19-30 ఈ భాగంలో పౌలు ఏదో ఒక రోజు వారి వద్దకు రావాలనే ఆశను వ్యక్తం చేస్తున్నాడు కానీ తిమోతి, ఎపఫ్రాలను మాత్రం వెనువెంటనే ఫిలిప్పీయుల దగ్గరకు పంపించడానికి చూస్తున్నాడు. 

2:19-24 తిమోతిని గురించి 1:1 నోట్సు చూడండి. ధైర్యము (అక్షరార్థంగా “మంచి ఆత్మ") అంటే “ప్రోత్సాహం”. అతనివంటి వాడెవడును (అక్షరార్థంగా “సమానమైన ఆత్మగలవాడు") అంటే పరిచర్యలో “పాలివాడు లేక ఒకటే ఆత్మ గలవాడు” అని. తిమోతి గురించి పౌలు మూడు విధాలుగా వర్ణించాడు: వారి విషయమై అతడు యథార్థమైన శ్రద్ధ చూపాడు (వ.1-4తో పోల్చండి), యేసు క్రీస్తు విషయాలకు, ఇతరుల విషయాలకు అతడు విలువనిచ్చాడు, సువార్త పరిచర్యకు అవసరమైన షరతుల నెరవేర్పులో రాటుదేలిన యోగ్యత (అక్షరార్ధంగా “అగ్నితో పరీక్షింపబడినవాడు”) గలవాడు.

2:25-30 ఎపఫ్రాదితు ఫౌలుతో పరిచర్యను పంచుకొంటూ (సహోదరుడు, జతపనివాడు, తోడియోధుడు), సంఘానికి ప్రతినిధిగా ఉన్నాడు. దూతయు, ఉపచరించినవాడు అనే మాటలు ఎప దితు రోమాలో పౌలును గూర్చి శ్రద్ధ వహించడానికి సంఘం నియమించిందని సూచిస్తున్నాయి. రోమాకు వెళ్ళే ప్రయాణంలో ఎపఫ్రాదితు మరణకరమైన వ్యాధికి లోనయ్యాడు. సంఘాన్ని, పౌలును నిరాశపరుస్తానేమో అనుకున్నాడు. అతనిని చేర్చుకుని (“తగిన విధంగా”), అట్టివారిని ఘనపరచుడి అనే మాటలు, ఎపఫ్రాదితు ఈ విషయంలో విఫలం కాలేదని తెలియజేస్తున్నాయి. అతడు క్రీస్తు యొక్క పని నిమిత్తము శ్రేష్టమైన రీతిలో పనిచేశాడు. మీ ఉపచర్యలో ఉన్న కొదువ అనే మాటలు సంఘాలు పౌలు పట్ల చూపిన శ్రద్ధను సూచిస్తున్నాయి. ఆ కొదువను తీర్చడం ఎపఫ్రాదితు తన బాధ్యతగా తీసుకున్నాడు. 


Shortcut Links
ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |