Jeremiah - యిర్మియా 29 | View All

1. రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును,

2. యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,

3. హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెర పట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవె

4. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

5. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,

6. పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.

7. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.

8. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

9. వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.

10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.

11. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.

12. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

13. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,

14. నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.

15. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,

16. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;

18. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేతవారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.

19. గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

20. నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి.

21. నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రక టించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

22. ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;

23. చెర పట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.

24. నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియ జేయుము

25. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

26. వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.

27. అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?

28. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,

29. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త యైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను

30. అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

31. చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

32. నెహెలా మీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.



బైబిల్ అధ్యయనం - Study Bible
29:1-3 రాజైన యెహోయాకీనుకున్న మరొక పేరు యెకొన్యా (22:24-30 నోట్సు చూడండి). తల్లి యగు రాణి (రాజమాత) అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం (గిబిరా) “బలవంతుడైన శూరుడు” లేదా “కథానాయకుడు” అనే అర్థాన్నిచ్చే గిబర్ అనే పుంలింగ పదానికి సమాన స్త్రీలింగ పదం. రాజపరివారము (హెబ్రీ.హస్సరిసిం) అనే పదం సాధారణంగా “నపుంసకులు" అనే అర్థాన్ని స్తుంది, అయితే ఇక్కడ ఈ పదం రాజభవనంలోని ఉద్యోగులకు బిరుదు అనే అర్థంలో కూడా కనబడుతుంది. (52:25; ఆది 37:36; 40:2; 1సమూ 8:15). సిద్కియా రాజు బబులోను రాజు దగ్గరకు పంపించిన రాయబారుల ద్వారా బబులోను చెరలో ఉన్నవారికి యిర్మీయా తన లేఖను పంపాడు, వీరు షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గేమర్యా. షాఫాను రాజైన యోషీయా ప్రభుత్వంలో కార్యదర్శి లేదా లేఖికుడు వంటి హోదాలో ఉన్న వ్యక్తి (2రాజులు 22:8-14), గెమర్యా యోషీయా కాలంలో ప్రధాన యాజకుడు (2దిన 34-35 అధ్యా.). ప్రభుత్వం, యాజకత్వం ఎంత కుటిలమైనవిగా ఉన్నప్పటికీ, దారుణమైన పరిస్థితుల్లోను యెహోవా పట్ల విశ్వాసంతో ఆయనకు నమ్మకస్తులుగా ఉన్న మనుషులు కూడా ఉన్నారనడానికి వీరే రుజువు. చెరపట్టబడి పోయినవారి పెద్దలలో శేషించినవారికిని అనే పదజాలం బబులోను చెరలో సజీవులుగా మిగిలి ఉన్న వయోవృద్ధుల్ని సూచిస్తుంది.

29:4-7 చెరతీసికొని పోబడిన కొద్దికాలం లోపుననే యిర్మీయా రాసిన లేఖ బబులోనుకు చేరింది. ఇది కొద్దికాలం మాత్రమే ఉండే చెర కాదని ఈ లేఖ హెచ్చరిస్తుంది. 

29:7 చెరలో ఉన్నవారికి యిర్మీయా సలహాలు గమనారమైనవి. వారు

బబులోను కోసం, దాని అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలని యిర్మీయా వారిని కోరుతున్నాడు. ఇలా చేయడం వలన చెరలో ఉన్నవారు సైతం క్షేమము కలిగి ఉంటారు (1తిమోతి 2:1-2).

29:8-9 యిర్మీయా 27:15 చూడండి. 

29:10 బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు అనే వర్ణన 25:11 లోను కనబడుతుంది. ఇది బబులోను రాజ్యం నిలిచి ఉండే కాలానికి, చెరకాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది (25:11 నోట్సు చూడండి). క్రీ.పూ. 605లో నెబుకద్నెజరు సింహాసనం అధిష్టించినప్పటి నుండి క్రీ.పూ. 539లో బబులోను పతనం వరకు అరవై ఆరు సంవత్సరాలు. 

29:11 ఈ నిరీక్షణాస్పద పలుకుల వలన నమ్మకస్తులైన విశ్వాసులు అనేకులు ఓదార్పు పొందారు. 

29:12-14 ఈ వచనాలు ద్వితీ 30:3-5 వచనాల్లోని దేవుని వాగ్దానాన్ని నూతనపరుస్తున్నాయి. 

29:15-19 సిద్కియా రాయబారులు తీసుకొని వెళ్లిన లేఖలో యిర్మీయా సిద్కియాను విమర్శించి రాయడాన్ని బట్టి అనేకమంది వ్యాఖ్యానకారులు ఈ వచనాలు ఇక్కడ ఉండవలసినవి కావేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే 4-23 వచనాలు మొత్తం ఒకే లేఖ అయ్యుండకపోవచ్చు. వ.15 నుండి వ. 19 వరకు రెండవ లేఖ అయ్యుండవచ్చు. దీనిని రాజు అధికారులు బబులోనుకు తీసుకొని వెళ్లి ఉండకపోవచ్చు. 

29:17 తొలి విడతగా చెరలోకి వెళ్లక యెరూషలేములో మిగిలిపోయినవారు కుళ్లి పోయిన అంజూరపు పండ్లను పోలినవారు. ఇదే సాదృశ్యం 24వ అధ్యాయంలోను కనబడుతున్నది. 

29:20-23 కోలాయా కుమారుడైన అహాబు... మయశేయా కుమారుడైన సిద్కియా అనే వీరిద్దరూ అబద్దపు మాటలు పలికే ప్రవక్తలుగా మాత్రమే కాక, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించువారుగా కూడా ఉన్నారు. ఇక్కడ శబ్ద చమత్కారం ఉంది. కోలాయా అనే పేరు, హెబ్రీలో "శాపం” అనే అర్థాన్నిచ్చే కెలాలా అనే పదానికి, “కాల్చు" అనే అర్థాన్నిచ్చే కెలా అనే పదానికి సంబంధం గలది. ఈ విధంగా వారు శాపగ్రస్తులై అగ్నిలో కాల్చి వేయబడతారని ఇది సూచిస్తుంది. వారి అబద్ద ప్రవచనాలెంత నీచమైనవిగా ఉన్నాయంటే బబులోను రాజు వీరిని రాజద్రోహ నేరం క్రింద అగ్నిలో కాల్చివేసి శిక్షించబోతున్నాడు (దాని 3:6,20,23).

29:24-25 నెహెలామీయుడైన షెమయా మరొక అబద్ద ప్రవక్త. యిర్మీయా మాట్లాడకుండా మౌనం వహించేలా చూడాలని ఇతను యాజకుడగు జెఫన్యాను ఆదేశించాడు. జెఫన్యా దేవాలయంలో శాంతి భద్రతల్ని పర్యవేక్షించే పై విచారణకర్త (21:1; 37:3; 52:24). 
29:26 యిర్మీయా ఒక వెట్టివాడని షేమయా ఆరోపించాడు. 

29:27-28 వ.5 చూడండి.

29:29-32 యాజకుడైన జెఫన్యా షెమయా వ్రాసిన పత్రికను యిర్మీయాకు చదివి వినిపించాడు. అప్పుడు యిర్మీయా ప్రత్యుత్తరంగా చెరలో ఉన్నవారికి యెహోవా లేఖను పంపాడు. షేమయా వేషధారణను యిర్మీయా బహిర్గతం చేసి అతని మీదకు రాబోయే శిక్షను తెలియజేశాడు, దేవుడు ముందుగానే తెలియజేసిన యూదాప్రజల పునరుద్దరణను చూడడానికి అతడు, అతని సంతానము బ్రతికి ఉండదు. ఏదేమైనా, దేవుని వాగ్దానం నెరవేరే విషయంలో యిర్మీయాకు ఏ అపాయమూ ఎదురు కాలేదు (1:8,19; 15:20). 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |