Psalms - కీర్తనల గ్రంథము 35 | View All

1. యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.

2. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.

3. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.

4. నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.

5. యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.

6. యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.

7. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

8. వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
రోమీయులకు 11:9-10

9. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

10. అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

11. కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.

12. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

13. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
రోమీయులకు 12:15

14. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.

15. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

16. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
అపో. కార్యములు 7:54

17. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము

18. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

19. నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
యోహాను 15:25

20. వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.

21. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.

22. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

23. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.

24. యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.

25. ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక

26. నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

27. నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.

28. నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-35. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై తన ఆక్షేపణలు తెలియజేస్తూ తన పక్షంగా వారిపై పోరాడమని దేవునికి చేసిన విన్నపం. 

35:1-28. ఈ కీర్తనను ఆక్షేపణ కీర్తన అని అంటారు. దుష్టులకు, దేవుని ప్రజలకు విరోధులైన వారికి తీర్పు తీర్చి, (నాతో పోరాడువారితో పోరాడుము) వారిని నాశనం చేయమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. (కీర్తన 35; 69, 109; 137; నెహెమ్యా 6:14; 13:29; యిర్మీయా 15:15; 17:18; గలతీ 5:12; 2తిమోతి 4:14; ప్రక 6:10). శత్రువులను క్షమించి (లూకా 23:34), వారి రక్షణ కోసం ప్రార్థించమని (మత్తయి 5:39,44) విశ్వాసులకు ఆజ్ఞ ఉన్నప్పటికీ, పాపాన్ని అరికట్టి నిర్దోషులకు న్యాయం జరిగించమని మనం ప్రార్థించే సమయం వస్తుంది. దుష్టత్వానికి, అణచివేతకు గురైనవారి పక్షంగా పోరాడడం విశ్వాసులుగా మన బాధ్యత.
ఆక్షేపణ కీర్తనలను గురించిన వివరణ. (1) అన్యాయం, అణచివేతలతో బాధలు పడుతున్న వారిని విడిపించమని చేసే ప్రార్థనలు. చెడ్డవారి నుండి కాపాడమని దేవున్ని వేడుకొనే హక్కు విశ్వాసులకుంది. (2) అలాగే అవి దుష్టులకు వారి నేరాలకు తీర్పుతీర్చి వారిని శిక్షించమని దేవున్ని వేడుకొనే
ప్రార్ధనలు (28:4 చూడండి). ఒకవేళ దేవుడు గాని, లేక మానవ ప్రభుత్వం - గాని న్యాయమైన దండన విధించక పోతే సమాజంలో హింస, అరాచకం రాజ్య మేలుతుంది. (ద్వితీ 25:1-3; రోమా 13:3-4; 1 పేతురు 2:13-14 చూడండి) (3) అయితే ఈ కీర్తనలను చదువుతున్నప్పుడు కీర్తనకారుడు ప్రతీకారాన్ని తన చేతుల్లోకి తీసుకొనక దానిని దేవునికి అప్పగించినట్లు గమనించాలి (ద్వితీ 32:35; సామె 20:22; రోమా 12:19తో పోల్చండి). (4) దుష్టుల అన్యాయం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన నీతినిబట్టి న్యాయం జరిగించి వారిని నాశనం చేస్తాడన్న సత్యాన్ని ఈ ఆక్షేపణ కీర్తనలు సూచిస్తున్నాయి (ఆది 15:16; లేవీ 18:24; ప్రక 6:15-17 చూడండి). (5) అంతే కాదు, ఈ ప్రార్ధనలు పరిశుద్దాత్మ ప్రేరితమైన మాటలనీ (2తిమోతి 3:16-17; 2 పేతురు 1:19-21తో పోల్చండి), కేవలం కీర్తనకారుని వ్యక్తిగత కోరికలు కావనీ గుర్తించాలి. (6) శపించే ఈ ప్రార్థన అంతిమ లక్ష్యం, అన్యాయం, అక్రమం అంతం, సాతాను ఓటమి, దేవుని నీతి రాజ్యస్థాపన. ఈ లక్ష్యానికి కొత్త నిబంధనతో సంబంధం ఉంది. నీతిమంతులకు న్యాయం జరిగేలా ప్రార్థించాలని క్రీస్తు చెప్పాడు. “నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము" అన్న విధవరాలి ప్రార్థనకు (లూకా 18:3), “దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?” అని జవాబు చెప్పాడు (లూకా 18:7; ప్రక 6:9-10 తో పోల్చండి). (7) విశ్వాసులు రెండు బైబిలు సిద్ధాంతాలను సమానంగా అనుసరించాలి: ఒకటి, మానవులందరినీ యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ జ్ఞానంలోనికి తీసుకొని రావాలన్న కోర్కె కలిగి ఉండాలి (2 పేతురు 3:9తో పోల్చండి), రెండు, దేవుడు దుర్మార్గాన్ని నశింపజేసి తన రాజ్యాన్ని స్థాపించడం చూడాలనే కోర్కె కలిగి ఉండాలి. తప్పిపోయిన వారి రక్షణ కోసం మనఃపూర్వకంగా ప్రార్ధన చేయాలి. సువార్తను తిరస్కరించిన వారి విషయంలో దుఃఖపడాలి. అయితే చెడు, లేక దుర్మార్గం జయింపబడి, సాతానును, వాని అనుచరులను శాశ్వతంగా నశింప జేసేటంత వరకు దేవుని ఉద్దేశం ప్రకారం నీతి, మంచితనం, ప్రేమ స్థాపించబడవని మనం తెలుసుకోవాలి (ప్రక 6:15-17; 19-21 చూడండి). ప్రపంచంలో చెడుకు దేవుని చివరి పరిష్కారంగా “ప్రభువైన యేసూ, రమ్ము" అని "విశ్వాసులు ప్రార్థించాలి (ప్రక 22:20).

35:2 కేడెమును... దాలును గురించి 5:11-12 నోట్సు చూడండి.

35:4 నా ప్రాణము తీయగోరు వారికి సిగును అవమానమును కలుగును గాక. మన శత్రువైన సాతానుతో పోరాడడానికి, పాపం పట్లా, చెడుగు పట్ల మనకున్న ద్వేషానికి సాక్ష్యంగా నిలబడమని దేవునికి మొర్రపెట్టడానికి కొత్త నిబంధన విశ్వాసి ఈ ప్రార్థనను ఉపయోగించు కొనవచ్చు. 

35:6-8 శత్రువులు తవ్విన గుంటల్లో వారే పడాలనీ, వారు పన్నిన వలలో వారే చిక్కుకోవాలనీ కీర్తనకారుడు కోరుకోవడం మనకు తరచూ కనిపించేదే (9:15; 57:6; 141:10; 7:14-16 నోట్సు చూడండి).

35:9-10 దీనులను (హెబ్రీ. ఎవ్యోన్) అనే పదం దరిద్రులను సైతం సూచిస్తుంది. ఇది పేదరికానికి, అణచివేతకు మధ్య ఉన్న సంబంధాన్ని, అంటే బలవంతులు పేదల్ని దోచుకుంటారని వెల్లడి చేస్తుంది (34:6 నోట్సు చూడండి). యెముకలన్నియు చెప్పుకొనును - సాధారణంగా కీర్తనల్లో యెముకల ప్రస్తావన బాధననుభవించడాన్ని సూచిస్తుంది. 

35:11-14 కూటసాక్షులు అంటే అబద్దసాక్షులు. వీరెవరి మీద అబద్దసాక్ష్యం చెబుతూ శిక్షపడాలని కోరుకుంటున్నారో ఆ శిక్ష వీరి మీదకే రావాలని కీర్తనకారుడు కోరుకున్నాడు (ద్వితీ 19:18-19). వీరి నిందలు నిరాధారమైనవి (35:19- నిర్దేతుకముగా). బహుశా వీరు కీర్తనకారునికి బాగా తెలిసిన వారే అయ్యుండవచ్చు, ఎందుకంటే వారు బాధననుభవిస్తున్నప్పుడు కీర్తనకారుడు వారి బాధను సైతం పంచుకొని వారిని చెలికాడైనట్టును సహోదరుడైనట్టును పరిగణించాడు. అయితే ఇప్పుడు కీర్తనకారుని పట్ల శత్రువులు, మిత్రులు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు (41:9; 55:12-24).

35:16 పరిహాసం కోసం హేళనచేయడాన్ని మించినది. దూషణలాడు అనే పదం. ఎందుకంటే వీరి దూషణల్లో దురుద్దేశాలున్నాయి. (వ.11,19). పండ్లు కొరికిరి అనడం కోపానికి సూచన (37:12; 112:10; యోబు 16:9, విలాప 2:16). 

35:17 నీవెన్నాళ్లు అనే పదం శ్రమననుభవిస్తున్న తన సేవకుని పక్షాన చర్యతీసుకోవడంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే భావనను తెలియజేస్తున్నది (4:2; 13:1-2 నోట్సు చూడండి). శత్రువుల్ని తరచుగా క్రూరమృగాలతో, మరి ముఖ్యంగా సింహములతో పోల్చి వర్ణించడం మామూలే (7:1-2 నోట్సు చూడండి).

35:19 నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని అనే మాటలను (35:19) యోహాను 15:25 లో యేసు తనకు అన్వయించుకుంటూ ఉదహరించాడు.

35:20 దేశమందు నెమ్మదిగా నున్నవారికి అనే పదజాలం పా.ని.లో ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనబడుతుంది. ఇది దేవుడు తన ప్రజలకు దేశంలో సమాధానాన్నిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇది ఆయన పట్ల విశ్వాస విధేయతలను చూపేవారిని వర్ణిస్తున్నది (లేవీ 26:6). మామూలుగా నెమ్మదిని (ప్రశాంతత) సూచించే “సమాధానము” (హెబ్రీ. షాలోమ్) అనే పదం ఈ వచనంలోని మొదటి పంక్తిలో కనబడుతుంది.

35:21 (ఆహా ఆహా అనే మాటలు అసలే ఆపదలో ఉన్నవారిని మరింత బాధించడాన్ని, అవమానించడాన్ని సూచిస్తున్నాయి (40:16; 70:4; యెహె 25:3; 26:2; 36:2).

35:22 నా శ్రమ నీకే కనబడుచున్నది అంటూ కీర్తనకారుడు తన పక్షాన చర్య తీసుకోవాలని యెహోవాను వేడుకుంటున్నాడు. 

35:26 యెహోవా ప్రభావాన్ని (93:1; 104:1), యాజకులు రక్షణనూ వస్త్రంగా ధరిస్తారని వర్ణనలు ఉన్నాయి (132:16). ఇవి ఘనతకు, ప్రతిష్ఠకు సూచనలు. అవమానము... లజ్జ శత్రువులు ధరించే వస్త్రాల గురించిన వర్ణనగా ఉన్నాయి. 

35:27-28 దేవుని నీతికీ కీర్తనకారుని నిర్దోషత్వముకూ, సంబంధం కనబడుతుంది. “నీతి” అనే అర్థాన్నిచ్చే (హెబ్రీ. సెడాకా) పదానికి “న్యాయం" అనే అర్థం కూడా ఉంది. అందుచేత తన నిర్దోషత్వం వెల్లడయ్యేలా దేవుడు తనకు న్యాయం తీర్చాలని కీర్తనకారుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |