Song of Solomon - పరమగీతము 7 | View All

1. రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.

2. నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి

3. నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.

4. నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.

5. నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.

6. నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు.

7. నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి.

8. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.

9. నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.

10. నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.

11. నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.

12. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను

13. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.బైబిల్ అధ్యయనం - Study Bible
7:1-5 ఈ విభాగంలో సొలొమోను షూలమ్మితి శిరస్సు నుండి పాదాల వరకు ఉన్న పది విశిష్టగుణాలను ప్రశంసించడం, 5:10-16 వచనాల్లో ఆమె సొలొమోను పాదాల నుండి శిరస్సు వరకు ఉన్న పది విశిష్టగుణాలను ప్రశంసించడం ఒక ప్రత్యేక అలంకారంలో కనబడుతుంది (గ్రంథ పరిచయం లోని గ్రంథ విభజన చూడండి). ఈ ప్రశంసకూ, వివాహపు రాత్రి ప్రశంసకూ (4:1-7) ఆసక్తికరమైన పోలికలు కనబడుతున్నాయి. ఈ వర్ణన మరింత అన్యోన్యంగా మరింత శోభాయమానంగా కనబడుతుంది. షూలమ్మితిని ఇక్కడ రాజకుమార పుత్రికా (యువరాణి) అని సంబోధించారు. ఆమె కురులు కొండలమీది నుండి దిగి వచ్చే నల్లని మేకలను పోలి ఉన్నాయని కాక, ఆమె తలవెండ్రుకలు ధూమ్రవర్ణము గలవి అయ్యుండి రాజు వాటి యుంగరముల చేత బద్దుడయ్యేంతగా ఉన్నాయనే పోలిక కనబడుతుంది. ఇదివరకు ఆమె కుచములు గురించి మాత్రమే వర్ణన కనబడుతుంది, ఇప్పుడు మరింత ఉద్వేగభావనతో ఆమె ఊరువులు మరియు నాభీదేశము గురించి తొలిసారి వర్ణించడం కనబడుతుంది. ఈ వారి విరహవేదన, వారి సయోధ్యలు సాధించిన అన్యోన్యతలోని గాఢతను కవితాత్మకంగా వర్ణిస్తుంది. 

7:1 రాజకుమార పుత్రికా (హెబ్రీ. బాత్ నడివ్) అనేది ఒక శబ్దచమత్కారం కానట్లయితే, 6:12 లోని "ఘనులగువారి" (హెబ్రీ. అమ్మి నడివ్) అనే పదంతో సామ్యం కలిగి ఉంది. గ్రంథంలో ఇక్కడ రెండు చోట్ల మాత్రమే రాచరికపు (హెబ్రీ. నదివ్) వర్ణన కనబడుతుంది, ఈ పదాలు ఈ రెండు
చోట్ల రావడం వారిద్దరి పునరేకీకరణ విభాగానికి, ప్రణయ ప్రశంసకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆమె ఊరువులు శిల్పి కౌశలంతో చెక్కిన వంపులను (ఆడుచున్నవి) కలిగి ఉన్నాయని సొలొమోను ప్రశంసిస్తున్నాడు. శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము అనే వర్ణన షూలమ్మితి సొలొమోనుకు దేవుడనుగ్రహించిన వరం అని తెలియజేసే మరొక సృజనాత్మక వర్ణన.

7:2 అరబిక్ లోని కొన్ని సాహిత్యపరమైన ఆధారాలను బట్టి నాభీదేశము ప్రత్యుత్పత్తి అవయవాలను సూచించినా పాత నిబంధనలో ఈ పదం కనబడే రెండు సందర్భాల్లోను అది శరీరాన్ని (సామె 3:8 - దేహమునకు), బొడ్డుత్రాడును (యెహె 16:4 - నాభిసూత్రము) సూచిస్తుంది. అంతేకాక, ఇక్కడ వాడబడిన మండలాకార కలశము (గుండ్రని ద్రాక్షారసపు పాత్ర) అనే పదాన్ని బట్టి “నాభీదేశము" అనే మాట నాభినే సూచిస్తుంది. ద్రాక్షారసము మరియు గోధుమరాశి అనే సాదృశ్యపదాలు 8:2 లోని దాడిమఫలరసము అనే సాదృశ్యంతో కలిసి 8:1-2 లోని "ముద్దులిడుదును", "నీకిత్తును" అనే పదాలతో శబ్దచమత్కారంలో ఉన్నాయి. అంతేకాక, ఈ పదాలు 7:12-13 వచనాల్లోని "పుత్రదాతవృక్షము”, “ద్వారబంధముల", "వికసించెను” అనే పదాలతో శబ్దచమత్కార రీతిలో కనబడుతూ (7:12-13 నోట్సు చూడండి) నాభి అనే వర్ణన మరింత వ్యక్తిగతమైన షూలమ్మితి శరీర సౌందర్యాన్ని అలంకారికంగా సూచిస్తుంది. పద్మాలంకృత గురించి 2:1 నోట్సు చూడండి. ద్రాక్షరసము, గోధుమరాశిని పోలిన షూలమ్మితి నాభి, ఉదరములను పద్మములు - ఆవరించి ఉన్నట్టుగా సొలొమోను ఊహాత్మకంగా దృష్టిస్తూ సంతోషిస్తున్నాడు.

7:3 కుచములు జింకపిల్లలయి అనే పదజాలంలో వివాహపు రాత్రి (4:5) ప్రశంస పునరావృతమవుతుంది. తామరలో మేయు అనే వర్ణన పద్మాలంకృత గోధుమరాశి అనే వర్ణనను ఇనుమడింపజేస్తుంది. వ.7-8 లలో షూలమ్మితి వక్షస్థలం యెడల తనకు గల ఆనందాన్ని వర్ణించడానికి గెలలు గల తాళవృక్షపు సాదృశ్యాన్ని సొలొమోను వినియోగించాడు. 

7:4 తాకడానికి నునుపుగా ఉన్న దంత గోపురము మన్ననకు, గౌరవానికి తగినదిగా కనబడుతుంది. (4:4 నోట్సు చూడండి). నేత్రములు... హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో - 5:12 లో సొలొమోను కళ్ళు “నదీతీరములందుండు” గువ్వలవలె ఉన్నాయనే వర్ణన కొనసాగుతుంది (5:12 నోట్సు చూడండి). హెష్బోను సరస్సులో నీళ్ళు నిశ్చలంగా, శాంతికరంగా ఉంటాయి (హెబ్రోను అనే పదానికి వివేకం లేదా వివరణ అని " అర్థం). ప్రశాంతతను సూచించే ఈ సాదృశ్యం, జనపూర్ణమైన నగరంలోని కోలాహలానికి భిన్నంగా కనబడుతుంది. నాసిక (ముక్కు) దమస్కు దిక్కునకు
చూచు లెబానోను శిఖరముతో సమానము అనే మాటలు సందర్భానుసారమై కోపాన్ని సూచించే మాటలు. కోపంతో ఉన్నప్పుడు ముక్కుపుటాలు అదరడం సహజం. ఈ వర్ణన షూలమ్మితి కోపం సరైనదేననే భావనను తెలియజేస్తుంది. శిఖరము అనే పదం సైన్యానికి సంబంధించిన సాదృశ్యం, ఇశ్రాయేలు సరిహద్దుల మీదకు దాడిచేసే శత్రువులు దమస్కు వైపు నుండి వచ్చే అవకాశాలెక్కువ. షూలమ్మితి నెవరైనా సమీపించినట్లయితే, సైనిక శిబిరమైన శిఖరము లాగా ఆమె ముక్కు కోపంతో అదురుతుందని ఇది వర్ణనాత్మకంగా సూచిస్తున్నది. 

7:5 షూలమ్మితి రాచఠీవి గల కర్మలు పర్వతము లాగా ఉంది. రాచఠీవి వర్ణన కొనసాగుతుంది, షూలమ్మితి తలవెండ్రుకలు ఊదారంగులో ఉన్న పట్టు కుచ్చుల్లాగా (ధూమ్రవర్ణము గలవి) ఉండి, రాజును వశపర్చుకుంటున్నాయి (బద్దుడగుచున్నాడు), పాదరక్షలతో ఉన్న యువరాణి పాదాలను ప్రశంసించ డానికి ఉద్యుక్తుడైన రాజు (వ.1) పట్టుకుచ్చుల్లాంటి ఆమె తలవెండ్రుకలకు బందీ అయ్యాడు (వ.5).

7:6-9 ఈ విభాగంలో తీవ్రతను కనబర్చే ప్రశంస, 5:2-8 వచనాల్లో నిర్లక్ష్యాన్ని వ్యక్తపరిచే అలంకారిక వర్ణనతో సరితూగుతుంది (గ్రంథ పరిచయం లోని గ్రంథ విభజన చూడండి). ఇక్కడి ప్రశంస వెంబడి వచ్చే శృంగారం 4:1-7 వచనాల్లో ప్రశంస వెంబడి వచ్చే ప్రేమాతిశయంతో పోల్చవచ్చు. వివాహపు రాత్రి ముఖ్యోద్దేశం దాంపత్యసిద్ధి యైనట్లయితే (4:12-5:1), ఈ తరువాతి రాత్రి ముఖ్యోద్దేశం వారి ప్రేమ ఫలించినందువలన చేకూరిన ప్రశాంతత. ద్రాక్షారసమంత మధురమైన చుంబనాలను ఆస్వాదిస్తూ వారు నిద్రలోకి జారుకున్నారు. (7:9 నోట్సు చూడండి). శృంగారం వివాహాన్ని పరిపూర్ణం చేస్తుంది, సంరక్షిస్తుంది కూడా.

7:6 నా ప్రియురాలా... అతి మనోహరమైనదానవు హెబ్రీలో ఈ వర్ణనను అనువదించడం కష్టం. భాషాధ్యయనానికి సంబంధించి, ప్రియురాలా అనే పదం (హెబ్రీ. ఆహావా) సంబోధనాపదంగా కాక, ప్రేమను సూచించే సంక్షిప్త పదంగా కనబడుతుంది. పరమగీతములు గ్రంథంలో తొమ్మిదిచోట్ల ఈ పదం ఇదే భావంలో కనబడుతుంది. (వ.6; 2:4-5,7; 3:5; 5:8; 8:4,6-7), వీటిలో ఒకటి (5:8) ఈ వచనంతో, అలంకారికంగా సరితూగుతుంది. కాబట్టి నా ప్రియురాలా అనే పదం కేవలం సంబోధనను మాత్రమే కాక కథా విషయాన్ని సైతం తెలియజేస్తున్నందు వలన ఈ వచనంలో ఈ పదం తర్వాత అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు అనే వర్ణన ఉన్నట్టే, 1:16 లో కూడా "నా ప్రియుడా, నీవు సుందరుడవు అతి మనోహరుడవు" అనే వర్ణన కనబడుతుంది. సరళమైన మాటల్లో “మృదువైన నీ అనురాగంలో ప్రేమాతిశయం కనబడుతుంది” అని సొలొమోను చెబుతున్నాడు. ఈ వచనం హృదయపూర్వకమైన షూలమ్మితి ప్రేమ గురించిన అందమైన కవిత. 

7:7-8 తాళవృక్షపు శాఖలను వర్ణించడంతోబాటు ద్రాక్షగెలల వరకు ఈ వర్ణన.. కొనసాగుతుంది. ముందుగా దూరం నుండి చూడడం, తదుపరి పండ్లు చేతికందేంతగా సమీపించడం. దూరం నుండి చూచినప్పుడు ఆమె కుచములు తాళవృక్షపు గెలల్లాగా కనిపించినా, దగ్గరకు సమీపించినప్పుడు మృదు మధుర రసభరిత ద్రాక్షగెల ల్లాగా ఉన్నాయి (కైగ్.గ్లిక్మన్). 

7:9 శ్రేష్ఠ ద్రాక్షారసము అనే మాట అలంకారిక వర్ణనలో షూలమ్మితి నోటిని సూచిస్తుంది. ఈ విభాగం (5:2-7:9) ప్రారంభంలో షూలమ్మితి ఒంటరిగా నిద్రపోతుంది (5:2 - హెబ్రీ. ఎషెనా), ముగింపులో దంపతులిద్దరూ కలిసి నిద్రపోతున్నారు (గ్రంథ పరిచయం లోని గ్రంథ విభజన చూడండి). అంతే కాక, 3:1-4 వచనాల్లోని వర్ణనతో ఈ విభాగంలోని వర్ణన అలంకారికంగా సరితూగుతుంది. ఆమె నోటి ముద్దులు . జల్దరు ఫల సువాసన వలె (వ.8) వారిరువురి నోటి ముద్దులు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె తన్మయింపజేసి వారిరువురినీ ప్రశాంతంగా నిద్రలోకి జారుకొనేలా చేశాయి. 

7:10 2:16 లో తమ ప్రత్యేక బంధాన్ని దృఢపరుస్తూ షూలమ్మితి పలికిన అవే మాటలు ఈ వచనంలో పునరావృతమయ్యాయి. (2:16 నోట్సు చూడండి). అతడు నాయందు ఆశాబద్దుడు అనే పంక్తిలోని ఆశ అనే పదం కోరదగిన లేదా వాంఛనీయమైన అనే అర్థాన్నిస్తుంది. ఈ పదం ఇదే అర్థంలో పాత నిబంధనలో ఇతర చోట్ల రెండు సందర్భాల్లో మాత్రమే కనబడుతుంది: దేవుడు ఆదాము హవ్వల అవిధేయతా ఫలితాన్ని హవ్వకు వివరించేటప్పుడు "నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును” (ఆది 3:16), దేవుడు కయీనుతో, పాపం. ద్వారం దగ్గర పొంచి ఉందని చెప్పినప్పుడు, “నీయెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు" (ఆది 4:7). కాబట్టి ఆశాబద్దుడు అనే పదంలోని ఆశ పరోక్షంగా. ఏలడం అనే అర్ధాన్నిస్తుంది. ఈ వచనాన్ని కనీసం మూడు విధాలుగా వ్యాఖ్యానించవచ్చు: (1) ఇప్పుడు ప్రేమించడంలో లేదా ఏలడంలో సొలొమోను ఆశ, షూలమ్మితి
ఆశతో సమానంగా ఉంది, (2) ఇప్పుడు. ప్రేమించాలనే ఆశ కలిగి ఉన్నాడు గానీ ఆధిపత్యం చూపించాలని కాదు, (3) ఇప్పుడు షూలమ్మితి కాదు గానీ సొలొమోను ఏలాలనే వాంఛ కనపరుస్తున్నాడు. బహుశా అది కాంతినిస్తూ సూర్యుడు పగటినీ చంద్రుడు రాత్రినీ ఏలినట్టుగా (ఆది. 1:18), లేక దేవుడు తన ప్రజలపట్ల కృపాప్రేమలను చూపిస్తూ వారిని ఏలుతున్నట్టుగా (కీర్తన 22:28; 59:13; 66:7; 89:9 చూడండి) సుహృద్భావంతోనే గానీ అధికార దర్పంతో కాదు. ఏదేమైనా గానీ, అద్భుతమైన పునరేకీకరణ తర్వాత, అన్యోన్య సమయాన్ని గడిపిన తర్వాత, సొలొమోనుయొక్క ప్రేమలో తాను సంపూర్ణ భద్రత పొందగలిగానని షూలమ్మితి ధృవీకరించింది. 

7:11-8:4 ఈ విభాగం 2:16-17 వచనాలతో అలంకారికంగా సరితూగు తుంది (2:16-17 నోట్సు చూడండి). 

7:11-13 ఈ విభాగంలో వసంతకాలాన్ని ఆస్వాదించాలని షూలమ్మితి సొలొమోను నాహ్వానిస్తుంది. ఈ ఆహ్వానం సొలొమోను ఇదివరకు షూలమ్మీ తికి ఇచ్చిన ఆహ్వానంతో సరితూగుతుంది. (2:8-14). అతని ఆహ్వానంలో ఆమె స్వరాన్ని వినాలన్న అతని వాంఛ తెలుస్తుంది (2:14). ఇక్కడ ఆమె ఆహ్వా నంలో ఇద్దరూ ప్రేమను పంచుకోవాలనే కోరిక కనిపిస్తుంది (7:12-13). ఈ అంశాలనే క్లుప్తంగా తెలియజేస్తూ పరమగీతము ముగుస్తుంది: సొలొమోను ఆమె స్వరాన్ని వినాలని కోరుకోవడం (8:13), ప్రేమను పంచుకోడానికి షూలమ్మితి అతడి నాహ్వానించడం (8:14). ఈ వర్ణన వారి ప్రేమలో ఎప్పటికీ ముగియని వసంతకాలాలను కళాత్మకంగా తెలియజేస్తున్నది.

7:11 గ్రామసీమలో నివసింతము అనే పదజాలం 1:13-14 లోని పరిభాష లాగా కనబడుతుంది. అక్కడ షూలమ్మితి సొలొమోనును తన రొమ్ముల మధ్యనుండు గోపరస సువాసనతో పోల్చిన తర్వాత, ఏనెదీ లోని కర్పూరపు పూగుత్తులతో (గోరింట పుష్పాలు) పోల్చుతుంది. వివాహానికి పూర్వం ఆమె రాత్రంతా తనతో ఉండే కర్పూరపు పూగుత్తుల వంటి తన ప్రియుని గూర్చి ఆలోచిస్తూ. ఇప్పుడు షూలమ్మితి సొలొమోనును కర్పూరపు పూగుత్తులు విరివిగా ఉండే గ్రామసీమలో రాత్రిని గడిపేందుకు ఆహ్వానిస్తుంది.

7:12-13 ఈ వచనాలు వారి ప్రేమానుభవంలో నవవసంతాన్ని తెలియజేస్తు న్నాయి. ప్రేమసూచనలు (హెబ్రీ. దొదే) అనే పదం, ప్రేమకు సంతానోత్పత్తికి సంకేతాలుగా ఉన్న పుత్రదాత వృక్షము (హెబ్రీ. దుదాయిం) తో ధ్వనిసామ్యం కలిగి ఉంది. వివాహపు రాత్రి మధురమైన అనుభూతులను సూచించే శ్రేష్ఠఫలములు అనే పదం ఇతర చోట్ల కూడ కనబడుతుంది. (4:13,16). పచ్చివియు పండువియు అంటే అప్పటికప్పుడు చెట్ల నుండి కోసుకొని వచ్చిన తాజా పండ్లు, ఎండబెట్టి నిల్వచేసిన పండ్లు. అలంకారిక వర్ణనలో ఇది వివాహం జరగక పూర్వం, వివాహం జరిగిన తర్వాత మధురమైన అనుభూతులను తెలియజేస్తుంది. పండువియు అనే పదం (హెబ్రీ. ఎషానిం), వ.9 లోని నిద్రితుల (హెబ్రీ. ఎషేనిం) అనే పదంతో ధ్వనిసామ్యం కలిగి ఉంది. ఇది దాంపత్య కలయిక తర్వాత ప్రశాంతమైన నిద్ర కాబట్టి (వ.9 నోట్సు చూడండి), ప్రేమలో సురక్షితభావం, సౌఖ్యం ఉందని గీతరచయిత తెలియజేస్తున్నాడు. వ.13 లోని ద్వారబంధముల (హెబ్రీ. పెతాచెను) అనే పదం, వ.12 లోని వికసించెనో (హెబ్రీ. పిత్తాకు) అనే పదంతో ధ్వనిసామ్యం కలిగి ఉంది. ఈ రెండు పదాలకూ మూలధాతువు ఒక్కటే. గీతరచయిత ద్వారబంధముల అనే పదానికి హెబ్రీలోని ఖోమా అనే పదాన్ని (“కవాటము", 8:9) ఉపయోగించకుండా, వివాహపు రాత్రిని వర్ణించడానికి ఉద్దేశపూర్వకంగానే పెతాచెను అనే పదాన్ని ఉపయోగించాడని తెలుస్తుంది. ఆ విధంగా “మా ద్వారబంధములు" అనే మాట "వికసించెను" అనే మాటతో ప్రణయాత్మకమైన ధ్వనిస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రణయకలాపం కోసం ఆమె సిద్ధంగా ఉండడం పువ్వు వికసిస్తూ తెరచుకోవడాన్ని పోలి ఉంది. 


Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |