Kings II - 2 రాజులు 11 | View All

1. అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.

2. రాజైన యెహోరాము కుమార్తెయును అహ జ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారు డైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడ కుండెను.

3. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడి యుండెను.

4. ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరము లోనికి వారిని తీసికొని పోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను

5. మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;

6. ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.

7. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.

8. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవే శించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచ రించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.

9. శతాధి పతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞ లన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.

10. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా

11. కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడి కొన మొదలుకొని యెడమ కొనవరకు రాజుచుట్టు నిలిచిరి.

12. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.

13. అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి

14. రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొనిద్రోహము ద్రోహము అని కేక వేయగా

15. యాజకుడైన యెహో యాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక

16. రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.

17. అప్పుడు యెహోయాదాజనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయించెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.

18. అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.

19. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గ మున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.

20. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.

21. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.బైబిల్ అధ్యయనం - Study Bible
11:1-15:38 ఈ భాగం యోవాసు, అమజ్యా, అజర్యా, యోతాము అనే నలుగురు మంచి రాజుల పరిపాలనా విశేషాలను తెలియజేస్తుంది. ఈ నలుగురు రాజులకు కొంత అనుకూలమైన విశ్లేషణ లభించింది. మొదటి ముగ్గురు ఘనంగా ప్రారంభించారు. కానీ వారి ముగింపు హీనంగా లేదా చెడ్డగా ఉంది. అయినప్పటికీ, వారు ముగ్గురూ చూపిన భక్తి దేశానికి అభివృద్ధి, ఆశీర్వాదం, బలాన్ని కలిగించిన మూడవ కాలాన్ని ప్రారంభించింది. అంతకు ముందు (1) దావీదు, సొలొమోను, (2) అహాబు, యెహోషాపాతు పరిపాలించిన గొప్పకాలాలకు ఇప్పుడు రెండవ యరొబాము, అజర్యా (అంటే యూదారాజైన ఉజ్జియా, 28న. 26) పరిపాలనా కాలం కూడా జతకలుస్తుంది. పశ్చాత్తాపపడిన , యూదా ప్రజలకు ఆశీర్వాదం అనుగ్రహించడానికి దేవుడు మరొకసారి ఇశ్రాయేలు దేశపు సైనిక, ఆర్థిక శక్తిని ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలీయులు సంపద అనుభవిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు, అధికారం - పొందిన చివరి కాలమిది. ఈ తరవాత జరిగిన రెండు పునరుజ్జీవ కార్యకలాపాలు పాక్షిక మత పునరుద్ధరణకు దారితీశాయి గానీ, ప్రపంచస్థాయి రాజకీయ శక్తిని తిరిగి సాధించడానికి వారికి ఉపయోగపడలేదు. ఈ పునరుజ్జీవం యోవాసు ఇరవై మూడు సంవత్సరాల వయసులో (సుమారుగా క్రీ.పూ. 812) ప్రారంభమైనా, ఆ తరవాత మరో ఇరవై సంవత్సరాల తరవాత, అంటే యెహూ మనవడు యెహోయాషు సిరియనులపై సాధించిన విజయాలతోనే ఇశ్రాయేలీయుల శక్తి సంపదల పునరుద్ధరణ మరింత స్పష్టంగా ప్రారంభమయ్యింది. 

11:1-21 ఒమీ మనవరాలు, అహజ్యా తల్లియైన అతల్యా గురించి మొదటి పరిచయం 8:26లో కనబడుతుంది. రాజమాతగా ప్రజలకు ఆమెపై ఉన్న గౌరవం, దావీదు వంశావళిలో అంతకు ముందు పాలించిన ఇద్దరు రాజుల ఆధ్యాత్మిక, నైతిక క్షీణస్థితి, యూదాలో బయలు దేవతారాధకులు తిష్టవేయడం వంటి మూడు కారణాలు సింహాసనం ఆక్రమించుకోడానికి అతల్యాకు కలిసివచ్చాయి. అయితే ఆమె నాశనానికి కారణమైన మూడు బలహీనతలు కూడా ఉన్నాయి. అతల్యాకు వ్యక్తిగతంగా నమ్మకత్వం చూపినవారు యెరూషలేము వెలుపల ఎవరూ లేరు. ఉన్నప్పటికీ బహు తక్కువ సంఖ్యలో ఉన్నారు. లేవీయులలో అనేకులు యెహోవా పట్ల విధేయత కలిగివున్నారు. యెహూ జరిగించిన మారణకాండ, ఉత్తర ఇశ్రాయేలు దేశంనుంచి అతల్యాకు మద్దతు లభించకుండా అడ్డుపడింది. ధర్మశాస్త్రానుసారంగా దావీదు వంశావళి నుంచి వచ్చే పోటీని తొలగించడానికి రాజకుటుంబానికి చెందిన మగవారినందరినీ అతల్యా హతమార్చింది. రాజకుటుంబంపై మరొక విపత్తు విరుచుకు పడిన తరవాత (9:27; 10:13-14), అందులో బాధితులు అనేకులు ఆమె సంతానానికి చెందినవారే ఉన్నారు. విశ్వ ప్రమాణాల ప్రకారం గమనిస్తే, మంచి చెడుల మధ్య జరిగే పోరాటంలో ఇదొక మెట్టు. ఎందుకంటే దావీదు వంశం ద్వారా పాపక్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు చేసిన ప్రణాళికపై ఇది ఒక దాడిగా కనబడుతుంది.

11:2-3 అహజ్యా సోదరి, యాజకుడైన యెహోయాదా (2దిన 22:11) భార్యయైన యెహో షెబ, అహజ్యా కుమారుల్లో ఒకడిని, అతని దాదిని అతల్యా చేతిలో చావకుండా తప్పించి వారిని యెహోవా మందిరమందు దాచింది. దేశంలో, రాజధాని పట్టణంలో యెహోవా ఆరాధనను నిలిపివేయ గలిగేటంత సుస్థిరత అతల్యాకు లేదు. 11:4 ఆరు సంవత్సరాల తరవాత యాజకుడైన యెహోయాదా దావీదుకు నమ్మకంగా ఉన్న బలగాలను సమకూర్చడానికి ఒక ప్రణాళిక వేసి దానిని అమలుపరచాడు. ఇక్కడ తిరుగుబాటు దారుల్లో క్రేతీయులు ఉన్నారు. ఇది అన్యదేశానికి చెందిన పేరు. సాధారణ హెబ్రీ ఇంటి పేర్లలా లేదు కాబట్టి వీరు విదేశీ కిరాయి సైనికులై ఉండొచ్చు. తిరుగుబాటు ఇంత సులభంగా జరిగిన విధానం, దావీదు వంశానికి నమ్మకమైన వారు అధిక సంఖ్యలోనే ఉన్నారని సూచిస్తుంది. సింహాసనానికి వారసుడైన ఈ చిన్నవానికి నమ్మకంగా ఉంటామని తిరుగుబాటు చేసిన ఈ కుట్రదారులతో యెహోయాదా ప్రమాణం చేయించాడు. బహుశ యెహోవా నామం పేరట ప్రమాణము చేయించి ఉంటాడు. 

11:5-9 యెహోయాడా సేనలను సమకూర్చి, రాజభవనంలో కుట్ర అమలుచేశాడు. సూరు గుమ్మము, వెనుకటి గుమ్మములను (2దిన 23:5) సూచించడానికి ఉపయోగించిన హెబ్రీ భాషా పదాలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే, వాటిలో ఒక పదం అచ్చు తప్పని భావించేంత దగ్గరగా ఉన్నాయి. ఈ సిద్ధపాటులో భాగం పంచుకున్న దళాలను దావీదు వారసుడైన బాలుడిని రక్షించడానికి వేర్వేరు ప్రదేశాలలో నియమించారు.

11:10-11 యెహోవా మందిరములో దాచి ఉంచిన కొన్ని ఆయుధాలు తీసుకుని రాజభవనంలో కుట్రను అమలు చేయడం వ్యంగ్యంగా అనిపిస్తుంది కానీ అది దేవుని సమకూర్పు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా తనకు వ్యతిరేకంగా మందిరంలో ఉన్న కేంద్రాన్ని అతల్యా ఎప్పుడూ నాశనం చేయలేకపోయింది. ఈ ఆయుధాలు రాజైన దావీదు కాలానికి చెందినవి. ఇక్కడ లేవీయులు, దేవునికి నమ్మకంగా ఉన్నవారు మరొకసారి విశ్వాసాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషించారు.

11:12 కుట్రదారులు బాలుడైన యోవాషు తలమీద కిరీటం పెట్టారు. దావీదు సంతతి వెనక ఉన్న దైవచిత్తానికి రాజరిక వేదాంతానికి ఉత్తమ చిహ్నం ధర్మశాస్త్ర గ్రంథం. అది రాజుకు . వ్యక్తిగత నకలుగా లేవీయులు సిద్ధపరచిన నిబంధన (ద్వితీ 17:18). అయినప్పటికీ, రాజుకు ముంజేతి కంకణంలా, రాజరిక స్థాయికి ఇదొక భౌతిక చిహ్నమని కొందరు భావిస్తారు (2సమూ 1:10), వేదాంతపరంగా కిరీటం ధరింపజేసి సరైన పట్టాభిషేకం చేయాలంటే ప్రధాన యాజకుడు ఉండి తీరాలి (అదోనియాతో అబ్యాతారు ఉన్న విషయం గమనించండి; 1రాజులు 1:7) 

11:13-16 స్తంభము అనే మాట రాజును బహిరంగంగా గుర్తించే ఒక సాంప్రదాయ స్థలాన్ని లేదా నిబంధన తిరిగి నూతనపరచే స్థలాన్ని (23:3) సూచిస్తుంది. ఈ మంటపం ఒకవేళ దేవుని మందిరంలో ఒక స్తంభాల గది అయితే (1రాజులు 7:6; ఈ వచనంలో “మంటపము”, “గది" అని పేర్కొనడానికి ఉపయోగించిన హెబ్రీపదాలు ఒకేలా ఉన్నాయి) ఈ స్తంభం ఆ ప్రదేశంలో ఉన్న ఒక స్తంభమై ఉంటుంది. లేనిపక్షంలో పెద్ద ఇత్తడి స్తంభాలలో ఒకటై ఉంటుంది. అతల్యా మద్దతు కూడగట్టుకోడానికి వెనుకకు వెళ్ళకుండా పట్టాభిషేకాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఆమెను పవిత్ర పంక్తుల బయటకు వెళ్ళగొట్టి అక్కడ చంపారు. ఆమెకు మద్దతు లేదని తెలియజేయడానికి ఇది రుజువుగా ఉంది. 

11:17 బాలుడైన రాజుకు ప్రజలందరి ముందు బహిరంగంగా చేసిన పట్టాభిషేకం, నిబంధన నూతన పరచడంతో ప్రారంభమయ్యింది. ప్రజలు కేవలం ఒక రాజును ఎంపిక చేసుకోవడమే కాదు, దేవునితో తమ నిబంధన సంబంధాన్ని నూతన పరచుకున్నారు. ఎవరు కొత్తగా రాజైనా, విధానపరంగా నిబంధన నూతన పరచుకోవడంతోనే పట్టాభిషేకం ముడిపడి ఉండేది. ఎందుకంటే కొత్తగా ఒక రాజు సింహాసనంపై అధికారం చేపట్టిన ప్రతిసారి తమ నిబంధనా నమ్మకత్వాన్ని ప్రజలు నూతన పరచుకునేవారు. 

11:18 నిబంధనకు విధేయత చూపడంలో సహజంగా వేసే మొదటి అడుగు బయలు గుడి నాశనం చేయడం. బయలునకు యాజకుడైనవానిని దాని బలిపీఠము ముందు చంపడం ఆ బలిపీఠాన్ని అవమానకరమైన రీతిలో హీనపరచడమే. 

11:19-20 బాలుడైన రాజును రాజనగరుకు తీసుకు రావడంతో ఈ బహిరంగ పట్టాభిషేకం ముగిసింది. అక్కడ అతడిని సింహాసనముపై ఆసీనుని చేశారు.


Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |