Hosea - హోషేయ 9 | View All

1. ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.

2. కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.

3. ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.

4. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.

5. నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు?

6. లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.

7. శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.
లూకా 21:22

8. ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.

9. గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.

10. అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.

11. ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

12. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

13. లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

14. యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.

15. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.

16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

17. వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
9:1-3 వ.1-9లో హోషేయ మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ పడుపుకూలిని ఆశించినట్లు, ఇశ్రాయేలు అన్యజనులలాగా సంతానోత్పత్తికి చెందిన అన్యదేవతలను - ఆరాధించి అభివృద్ధిని వెదకుతూ ఉంది. “యెహోవా పండుగ"లో (వ.5) వారు సంభ్రమపడి సంతోషించలేరు. దేవుడు వారి పంటను ఆపివేసి లేమిని కలుగజేశాడు, అది ఇశ్రాయేలీయుల చెరకాలంలో మరింత ఎక్కువైతుంది (వ.3). 

9:4-6 పంట లేకపోవడం వల్ల - ఇశ్రాయేలీయులకు తినడానికి కూడా సరిపోదు కాబట్టి ఇక అర్పణలకు, బలులకు ఏమీ మిగలదు. ప్రలాపము చేయువారి ఆహారము అంటే మరణంతో సంబంధం ఉన్న ఆహారం. అది అపవిత్రం. దానిని దేవునికి అర్పించకూడదు. ఇశ్రాయేలు ఈ లయము నుండి ఐగుప్తులో ఆశ్రయం కోసం వెదకుతుంది, కానీ వారు తమ దేశం బయటే మరణిస్తారు. 

9:7-9 ప్రజలను హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలను పంపాడు, కానీ వారి దోషము, పగ దేవుడు పంపిన వార్తాహరులను వెఢవారిగా భావించేలా చేశాయి. అయినప్పటికీ దేవుడు వారితో ఉన్నాడు. కనిపెట్టువాడు అనేది సాధారణంగా ప్రవక్తలను సూచించడానికి వాడే పదం (యిర్మీయా 6:17; యెహె 3:17; 33:2). వేటకాని వల అంటే బుద్ధిహీనులైన , ఇశ్రాయేలు చర్యయంతటిలో అడ్డుగా ఉన్న ప్రవక్తలే (యెషయా 8:14; 2కొరింథీ 2:16). గిబియా గురించి 10:9 నోట్సు చూడండి.

9:10 వ.10-17లో దేవుడు మాట్లాడుతున్నాడు. అరణ్యములో దొరికిన ద్రాక్ష పండ్లలాగా, అంజూరపు చెట్టు మీద తొలి ఫలములాగా ఇశ్రాయేలీయులు దేవునికి సంతోషాన్ని కలిగించారు. అయితే అది ప్రజలు బయలును ఆరాధించి సంతానోత్పత్తి కలిగించుకోవాలని ప్రయత్నించినపుడు, బయల్పెయోరు దగ్గర జరిగిన అన్యమత సంబంధమైన లైంగిక సంఘటనతో మారిపోయింది. (సంఖ్యా 25:1-9; కీర్తన 106:28-30), దానినే ఇక్కడ లజ్జాకరమైన దేవత అని అంటున్నాడు. విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు మళ్ళీ తన బుద్ధిహీనమైన ప్రవర్తనను కనపరుస్తూ ఉంది. 

9:11-12 యెహోవాయే ఎఫ్రాయిము కీర్తి. ఆయన వెళ్ళిపోతే వారి ఫలింపు అంతమై వారికి శ్రమ కలుగుతుంది.

9:13 దేవుడు ఎఫ్రాయిము, తూరులను వారు అభివృద్ధి పొందే పరిస్థితుల మధ్య ఉంచాడు (లోయలో అనేది ఒక సాదృశ్యం; యెహె 17:5-8), కానీ వారిద్దరూ బయలు ఆరాధన వైపుకు తిరిగి పిల్లల బలులను ఆచరించారు. తూరు, షోమ్రోనులను అష్నూరు రాజైన ఐదవ షల్మనేసరు ముట్టడి వేశాడు. క్రీ.పూ. 722లో అప్లూరీయుడైన రెండవ సర్గోన్ చేతిలో ఈ రెండు పట్టణాలు పతనమయ్యాయి. 

9:14 ఇశ్రాయేలు ప్రజలకు వారు దేనికి యోగ్యులో దానిని ఇవ్వమని ప్రవక్త ప్రభువును అడుగుతున్నాడు: ఆది 49:25లోని “స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు” అనే యాకోబు ఆశీర్వాదానికి వ్యతిరేకమైనవే వారికి తగిన దీవెనలు. 

9:15-17 వ.10-14 బయల్పెయోరు (4:15; 12:11తో పోల్చండి) గురించిన పరోక్ష సూచనతో ఆరంభమైనట్లే, ఈ వచనాలు పాపంతో నిండి ఆరంభమౌతున్నాయి (వ.15లోని విరోధినైతిని అంటే వ.17లో విసర్జించెను). 


Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |