Ezekiel - యెహెఙ్కేలు 10 | View All

1. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.

2. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.

3. అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.

4. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.

5. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.

6. కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.

7. కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;

8. అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను;

9. నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.

10. ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.

11. అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.

12. ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
ప్రకటన గ్రంథం 4:8

13. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.

14. కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
ప్రకటన గ్రంథం 4:7

15. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.

16. కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.

17. జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను

18. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా

19. కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.

20. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.

21. ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.

22. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
10:1 ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలాన్ని మూసి ఉంచే అడ్డ తెరను కెరూబులతో అలంకరించడం జరిగింది. (నిర్గమ 26: 1,31; 36:8,35). ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందసం మీద రెక్కలు చాచిన రెండు బంగారు కెరూబులుండేవి (నిర్గమ 25:18-22; 37:7-9). యెరూషలేము దేవాలయం లోని గోడల మీద కూడా బంగారంతో తాపడం చేయబడిన కెరూబులుండేవి (1రాజులు 6:29; - 2దిన 3:7; యెహె 41:18-20). ప్రత్యక్ష గుడారంలోను, దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోను కెరూబులు దేవుని అదృశ్య సన్నిధిని ఆయన మహిమను సూచించే సింహాసనం (1సమూ 4:4; 2సమూ 6:2; 2రాజులు 19:15; కీర్తన 18:10; 80:1; 99:1) యెహెజ్కేలు 1వ అధ్యాయంలో ఉన్న దర్శనంలోని జీవుల పేర్లు తెలియవు. అయితే యెహెజ్కేలు ఈ జీవుల్ని కెరూబులుగా గుర్తించాడు.

10:2 దహించబడిన పట్టణము గురించిన సాదృశ్యం క్రీ.పూ. 586లో యెరూషలేము విషయంలో నిజమైంది (2రాజులు 25:9).

10:3 అన్ని వేళలా యెహోవా మహిమ మందిరంలో నిలిచి ఉంది. ఆవరణమును కమ్మి ఉన్న మేఘము ఆ మహిమను వెల్లడి చేసింది (నిర్గమ 19:9; లేవీ 16:2 చూడండి). 

10:4-5 వ.4 9:3 వచనాన్ని పునరావృతం చేస్తుంది.

10:6-8 బైబిల్లో అగ్ని పలుచోట్ల దుష్టత్వం , పాపం మీదకు దేవుడు రప్పించే తీర్పుకు సంబంధించిందిగా ఉంది. (ఆది 19:24; ద్వితీ 32:22; ఆమోసు 1-2 అధ్యాయాలు). యెహెజ్కేలు ప్రకారం, దేవుని నుండి వచ్చిన ఏ అగ్ని యెషయా పెదవుల్ని పవిత్రపర్చిందో (యెషయా 6:6), ఏ కోపాగ్ని అగ్నిగంధకముల వర్షంతో సొదొమ గొమొర్ర పట్టణాల్ని నాశనం చేసిందో (ఆది 19:24), అదే అగ్ని ఇప్పుడు తీర్పుగా యెరూషలేమును దహించి శుద్ధి చేయబోతుంది. 

10:9-13 ఇది మొదటి అధ్యాయం పునశ్చరణ. 1:18లో చక్రాలు “చుట్టు కండ్లతో నిండియుండెను" అని ఉంది. ఇక్కడ జీవుల శరీరం మొత్తమూ కన్నులతో నిండియుండెను అని ఉంది. కన్నులతో నిండి ఉన్న నాలుగు జీవులు దేవుని సింహాసనం చుట్టూ ఉండడాన్ని దర్శనంలో యోహాను చూశాడు (ప్రక 4:8).

10:14-17 "ఎద్దు" ముఖం స్థానంలో కెరూబు ముఖం ఉండడం మినహా 14వ వచనంలోని ముఖాలు వ.10 లోనివే. కెరూబులు, దేవుని మహిమ నెమ్మదిగా దేవాలయం నుండి కదలి వెళ్లడం ప్రారంభమైంది. 

10:18 యెహెజ్కేలు ఈ వచనంలో మోషే చేసిన హెచ్చరిక నెరవేరడాన్ని తెలియజేస్తున్నాడు (ద్వితీ 31:17), తరువాతి కాలంలో హోషేయ ఇదే విధంగా హెచ్చరించాడు ( హోషేయ 9:12).
దేవుడు తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. దేవాలయము దేవునికి విశ్రాంతిస్థలం గాను, నివాసస్థలంగాను ఉండాలి (కీర్తన 132:14; యెషయా 66:1). 

10:19 దేవుని మహిమ తూర్పు ద్వారము దగ్గరకు రావడం దేవాలయ ఆవరణ నుండి యెరూషలేము నుండి ఆయన మహిమ . అంతిమంగా నిష్క్రమించడాన్ని తెలియజేస్తుంది (11:22-23). తూర్పు ద్వారం యూదులకు అంతిమ తీర్పు స్థలంగా కూడా ఉండబోతుంది (జెకర్యా 14:1-9). యేసు పట్టణం తూర్పువైపు వెలుపల ఉన్న ఒలీవల కొండకు వెళ్ళి, అక్కడ నుండి తండ్రి దగ్గరకు ఆరోహణమయ్యాడు (అపొ.కా. 1:9-12). దేవుని ప్రజల మధ్య ఆయన సన్నిధి వారిమీద ఆయన కృప నిలిచి ఉందనడానికి సూచన (ద్వితీ 4:29,31), మరొకవైపు, ఆయన సన్నిధి లేకపోవడం, ఆయన వారిని విడిచిపెట్టాడనేందుకు సూచన (ద్వితీ 31:17-18). "దేవుని సన్నిధిలోకి ప్రవేశించడం విశ్వాసానికున్న విశేషమైన ఆధిక్యత.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |