Song of Solomon - పరమగీతము 6 | View All

1. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?

2. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.

3. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.

4. నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు

5. నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.

6. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.

7. నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.

8. అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.

9. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.

10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

11. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.

12. తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.

13. షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?బైబిల్ అధ్యయనం - Study Bible
6:1 ఈ విభాగాన్ని ముందుకు నడిపించే రెండు ప్రశ్నల్లో ఇది రెండవది (5:9; 5:2-7:9 నోట్సు చూడండి). 

6:2-13 ఈ విభాగం ముందుగా ప్రశ్నకు ప్రతిస్పందనను తెలియజేస్తుంది: సొలొమోను ఎక్కడున్నాడో షూలమ్మితికి తెలిసింది. తర్వాత సొలొమోను షూలమ్మితిని ఇదివరకు ప్రశంసించినట్లే ఇప్పుడు కూడా ప్రశంసిస్తూ తాము తిరిగి కలుసుకోవడాన్ని వర్ణిస్తున్నాడు. 

6:2-3 పద్మములను గురించి 2:1 నోట్సు చూడండి. నేను... నా ప్రియుని దానను అనే పల్లవి మళ్ళీ ఇక్కడ కనబడుతుంది (2:16 నోట్సు చూడండి). ఇద్దరూ మళ్ళీ కలుసుకున్న సందర్భంలో పద్మములలో మేపుచున్న అనే ఈ వర్ణన సొలొమోను జీవదాయక శక్తిని తెలియజేస్తుంది. (2:16 నోట్సు చూడండి). 

6:4-10 ఇద్దరూ మళ్లీ కలుసుకున్న సందర్భంలో సొలొమోను షూలమ్మితిని ప్రశంసించడం గురించి ఈ విభాగం తెలియజేస్తుంది. వివాహపు రాత్రిలో షూలమ్మితి ఒక చూపుతో సొలొమోనును వశపర్చుకుందనే వర్ణన ఉన్నప్పటికీ (4:9), ఇక్కడ షూలమ్మితి తన కనుదృష్టి అతనిమీద ఉంచకూడదని అతడు అడగడం కనబడుతుంది. వారు మానసికంగా మళ్లీ కలుసుకొనేవరకు అతడు తన ప్రేమను భౌతికంగా వ్యక్తం చేయాలనుకోలేదని, ఇప్పుడు ఈ ప్రశంస వారిని మానసికంగా దగ్గర చేసిందని తెలుస్తుంది. అతడు శృంగారభరితమైన పొగడ్తలను పలకలేదు గానీ, షూలమ్మితి తనకు దేవుని నుండి లభించిన వరమనీ, వివాహపు, రాత్రి నుండి ఇప్పటివరకు ఆమె పట్ల తన ప్రేమలో ఎటువంటి మార్పు లేదనీ నొక్కి చెప్పాడు. ఆమె నతడు ఇశ్రాయేలు సౌందర్యంతో పోల్చడం (వ. 4, 10), దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలు దేశాన్ని వరంగా ఇచ్చినట్లే ఆమె తనకొక అద్భుతమైన వరంగా ఇచ్చాడని సూచిస్తుంది (4:11 నోట్సు చూడండి).

సొలొమోను షూలమ్మితిని తిర్సా పట్టణంతో పోల్చడం, ఆమె యెరూషలే మంత సౌందర్యంగా ఉందని చెప్పడం అలంకారిక వర్ణనలో ఆమె చంద్రబింబమంత అందముగలదై మరియు సూర్యుని అంత స్వచ్చమును కళలును గలదై అని చెప్పడంతో సరితూగుతుంది, ఎందుకంటే ఈ రెండు కవితాత్మక వర్ణనలూ ఒకే భావంతో ముగుస్తున్నాయి: టెక్కెములనెత్తిన సైన్యమువలె భయము పుట్టించుదానవు... వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె. టెక్కెముల నెత్తిన సైన్యము అనే పదజాలాన్ని ధ్వజాలనెత్తిన సైన్య సమూహం (అంటే, "ఆకాశ సైన్య సమూహం - ఈ సందర్భంలో “నక్షత్రాలు" లేదా "సైన్యం” అనే భావనలో) అని కూడా అనువదించవచ్చు. అందుచేత, సొలొమోను షూలమ్మితిని సూర్యచంద్ర నక్షత్రాల్లాగా ఉన్న కథలుసు " వర్ణనము మన సైన్య పు కూర కవిమువలె ఆ అముల్య లో చనలో ఆర్యచంద్ర ఇశ్రాయేలు పట్టణాలతో, వ్యూహపరచబడిన భీకర సైన్యంతో పోల్చడం జరిగింది. బహుశా ఇది యోసేపు కల లోని ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్న సూర్యచంద్ర, నక్షత్రాలను జప్తికి తెచ్చుకోవడం కావచ్చు (ఆది 37:9). 

6:11-13 ఈ వచనాల్లో షూలమ్మితి తానెలా సొలొమోనును మళ్ళీ కలుసుకొనగలిగిందో జ్ఞాపకం చేసుకుంటుంది. ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో అనే వసంతకాల ఆగమనాన్ని సూచించే
ఈ అలంకారిక వర్ణన వారిద్దరూ కలిసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకోవడాన్ని తెలియజేస్తుంది (2:17; 7:12). ఘనులగువారి రథములను అనే పదజాలానికి వివరణ అంత సుళువు కాదు గానీ ఆమెకు మళ్లీ రాచవైభవం కలిగిందని సూచిస్తుంది. ఆమెను షూలమ్మితీ అని పేరుతో సంబోధించడం గ్రంథంలో తొలిసారిగా ఇక్కడ కనబడుతుంది (ఈ పేరు సొలొమోను అనే పేరుకు స్త్రీలింగ రూపం). ఇద్దరూ కష్టాలనధిగమించి మళ్ళీ కలుసుకొని గాఢమైన బంధంలోకి ప్రవేశించిన ఆత్మీయులుగా వీరిద్దరినీ వర్ణిస్తున్నాయి (8:10). ప్రత్యామ్నాయ అర్థంలో, షూలమ్మితి అనే పదం వ్యక్తిగత నామంగా లేదా ముద్దు పేరుగా కాకపోయినా షూలేము లేక షూనేము అనే పట్టణానికి చెందిన స్త్రీ అనే భావం కావచ్చు (యెహో 19:17-23; 1సమూ 28:4; 2రాజులు 4:8). హెబ్రీలో మహనయీము అనే పేరుకు రెండు శిబిరాలు లేక రెండు సమూహాలు అని అర్థం. యాకోబు ఏశావులు మళ్ళీ కలుసుకున్న స్థలం మహనయీము (ఆది 32-33 అధ్యా. ). భార్యాభర్తల మధ్య కలతలు పరిష్కారమయ్యాయని తెలిపే యుక్తమైన సామ్యం. ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ ఎలా ప్రదర్శితమైందో, షూలమ్మితి పట్ల తన ప్రేమ కూడా అలాగే ప్రదర్శితమైందని సొలొమోను వర్ణనలోని భావం. దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని కోరుకొనే సమాధాన స్థితికి సాదృశ్యంగా ఉన్న వీరిద్దరి కలయికను ప్రజలు (ఒక దర్శనంలో చూసినట్టుగా) తదేకంగా చూస్తున్నారు. 


Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |