Revelation - ప్రకటన గ్రంథము 9 | View All

1. అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.

2. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.
ఆదికాండము 19:28, నిర్గమకాండము 19:18, యోవేలు 2:10

3. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.
నిర్గమకాండము 10:12, నిర్గమకాండము 10:15

4. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.
యెహెఙ్కేలు 9:4

5. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.

6. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
యోబు 3:21, యిర్మియా 8:3, హోషేయ 10:8

7. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,
యోవేలు 2:4

8. స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.
యోవేలు 1:6

9. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
యోవేలు 2:5

10. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
యోబు 26:6, యోబు 28:22

12. మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.

13. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు
నిర్గమకాండము 30:1-3

14. అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.
ఆదికాండము 15:18, ద్వితీయోపదేశకాండము 1:7

15. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.

16. గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.

17. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
నిర్గమకాండము 9:16

18. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,

19. ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.

20. ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.
ద్వితీయోపదేశకాండము 32:17, కీర్తనల గ్రంథము 115:7, కీర్తనల గ్రంథము 135:15-17, యెషయా 17:8, దానియేలు 5:3-4, దానియేలు 5:23

21. మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
2 రాజులు 9:22బైబిల్ అధ్యయనం - Study Bible
9:1 ఐదవ.. బూర తీర్పు, ఐగుప్తుపై ఎనిమిదవ తెగులును (నిర్గమ 10:12-15), ప్రభువు దినమునకు ముందస్తు గురుతైన (యోవేలు 1:15) యోవేలు 1:2-4; 2:25 లోని మిడతల తెగులు, రెండింటినీ గుర్తుచేస్తుంది. ఇక్కడ నక్షత్రము బహుశా వీటిని సూచించవచ్చు. (1) వ.11 లో పేర్కొన్న పాతాళపు దూత, (2) సాతాను (12:4,7-10 నోట్సు చూడండి) లేక (3) 20:1లో అగాధము (అడుగులేని గొయ్యి) యొక్క తాళపు చెవులు గల దూత కావచ్చు. బహుశా చివరిది అయివుండడానికి ఎక్కువ అవకాశం ఉంది. 

9:2-10 మిడతలు దండు పొగంత దట్టంగా అగాధములో నుండి బయటికి వచ్చాయి (వ. 1నోట్సు చూడండి). అవి అగాధం నుండి రావడం, దానితోపాటు మామూలు మిడతల్లాగా కాక, వీటికి భూమిమీద ఉన్న మొక్కలకైనను... ఏ వృక్షమునకైనను హాని చేయడానికి అనుమతి లేదు అనే విషయం ఈ జీవులు దయ్యపుశక్తులు అని స్పష్టం చేస్తుంది. అవి నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులనే లక్ష్యంగా చేసుకోవడం, అంటే ప్రభువుచేత 7:2-4 లో ముద్రించబడిన 144,000 ఇశ్రాయేలీయులు తప్ప జీవించివున్న మిగిలిన వారందరూ అని అర్థం (ఈ సమయానికి అనేకమంది ఇంకా మారుమనస్సు పొందినవారు ఉండే అవకాశం ఉంది. వారు కూడా ఈ దయ్యపు మిడతలనుండి కాపాడబడతారు). మిడతల జీవితకాలం అయిదు నెలల వరకే కాబట్టి, ఆ బాధ అంతకాలం ఉంటుందని కొందరు అంటారు. మిడతల తెగుళ్ళు వచ్చేది వసంతకాలం మధ్యనుండి వేసవి మధ్యవరకు కాబట్టి సంవత్సరంలోని ఆ సమయాన్ని బట్టి అది అయిదు నెలలు అని మరి కొందరు భావిస్తారు. అనేకులు మరణించకుండా వారి మరణవాంఛను ప్రభువు ఎలా అడ్డుకుంటాడో మనకు తెలియదు. 

9:11 ఈ దయ్యపుజీవుల రాజుకు హెబ్రీ భాషలో అబద్దానని, గ్రీకు భాషలో అపొల్లుయోను అని పేరు. ఈ రెండింటి అర్థం “నాశనము”. ఐదవ బూర తీర్పులో అవిశ్వాసులు తాము ఆరాధించే దయ్యములచేతనే (వ.20) బాధనొందడం హాస్యాస్పదం కాక మరేమిటి? 

9:12 8:13 లో ముందుగా చెప్పిన మొదటి శ్రమ అయిదవ బూరతో గతించెను (వ.1-11). ఇంకా మిగిలివున్న రెండు శ్రమలు ఆరవ బూర (వ.13-21; 11:14), ఏడవ బూర (11:15-19). అవి రెండూ క్రీస్తు రెండవ రాకడపై దృష్టి సారిస్తున్నాయి (19:11-16). 

9:13 ఆరవ...బూర ఊదినపుడు, దేవునియెదుట... బలిపీఠము... స్వరపు అధికారం, అది బలిపీఠం కిందవున్న హతసాక్షుల నుండి (6:9-10) కాక గొట్టెపిల్ల (క్రీస్తు) స్వరమని బలంగా సూచిస్తుంది. లేకపోతే బూరల తీర్పుల కార్యాన్ని చేస్తున్న దేవదూతస్వరమైనా అయ్యుండాలి (8:3-5). 

9:14-16 నలుగురు దూతలు అపొల్లుయోనువలె (వ.11) దయ్యముల సైన్యం మీద అధికార స్థానంలో ఉన్న దయ్యములు అనేది స్పష్టం. యూఫ్రటీసు... నది అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన దేశపు తూర్పు సరిహద్దు (ఆది 15:18). ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి అష్బూరీయులు, బబులోనీయులు దాన్ని దాటివచ్చారు. ఈ దయ్యములు అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి వుండడం అనేది ఈ సంఘటనలన్నీ దేవుని సర్వాధికారం ప్రకారం తగిన సమయానికి జరుగుతున్నాయని సూచిస్తుంది. (దాని 9:24-27). యిరువది కోట్లు అనే సంఖ్య, మనుష్యులలో మూడవ భాగమును చంపే భయంకరమైన వధకు తగినంత సైన్యమే (ఇంతకు ముందు బూరల తీర్పులో ప్రక 8:7,9-12 లో కూడా ఇంతే శాతం నష్టం జరిగింది). ఈ సైన్యం మానవులేనని కొందరు నమ్ముతారు. కానీ ఐదవ బూర మిడతల తీర్పులాగా అది దయ్యముల సైన్యమయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి (వ.2-11). ఎవరూ మరణించడానికి అనుమతించబడని (వ.5-6) -దేవునియెదుట వారికి మారుమనస్సు పొందడానికి, రక్షణ పొందడానికి అవకాశమిచ్చిన (వ. 20,21) - ఐదవ బూర తీర్పు తరువాత వెంటనే, ముందటి తీర్పులలో చావకుండా మిగిలిన ప్రపంచంలోని మూడవ వంతు జనాభా (6:2,4,8,12-17; 8:9,11) ఇప్పుడు ఈ దయ్యపు సైన్యం చేత వధింపబడ్డారు.

9:17-19 దెబ్బల (తెగుళ్ళు)నే మాట వాడడం, దేవుడు నిర్గమ 7-11లో ఐగుప్తుపై తెచ్చిన తెగుళ్ళను ప్రతిధ్వనిస్తుంది. ఇది ప్రకటనలో అంత్యకాలములలోని దేవుని తీర్పులను గూర్చి చెప్పే తెగుళ్ళు అనే మాట అనేక విధాలుగా వాడడంలోని మొదటిసారి (11:6; 15:1,6,8; 16:9,21; 18:4,8). గుఱ్ఱముల బలము వాటి తోకలయందు ఉన్నది అనీ, అవి సింహముల తలలుగలవి అనీ అనడం, దయ్యముల మిడతల దండును గురించి చెప్పినదాన్ని పోలివుంది. (వ.10). కానీ ఇది ఆ మిడతలనే సూచిస్తున్నాయి అనడం సరికాదు. ఎందుకంటే ఎవరినైనా చంపడానికి ఆ మిడతలకు అనుమతి లేదు (వ.5-6). 

9:20-21 బూరల తీర్పు “దెబ్బల"చేత చంపబడకుండా రక్షించబడడానికి ఒకే మార్గం, వారి పాపములనుండి మారుమనస్సు పొంది (లూకా 24:47; అపొ.కా.26:20), ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచడమే (అపొ.కా. 16:31). కానీ ఐదవ, ఆరవ బూరల తీర్పులు ఏ “భూ నివాసుల”
మీద పడబోతున్నాయో వారి పేర్లు (ప్రక 8:13), గొట్టె పిల్ల జీవగ్రంథమందు రాయబడనందున (13:8; 17:8) వారు మారుమనస్సు పొందరు. తెగుళ్ళు వచ్చినపుడు ఐగుప్తు దేశపు ఫరో హృదయం కఠినమైనట్లుగానే వారు కూడా ఉంటారు. (నిర్గమ 7:22; 9:7; అలాగే రోమా 9:17-18 నోట్సు చూడండి). దయ్యములను... విగ్రహములను పూజించడం, అలాగే మాయా మంత్రములును, జారచోరత్వములును అనే మాటలు, పెర్గము, తుయతైర సంఘములలోని సమస్యలను జ్ఞాపకం చేసి (2:13-14, 20-21), విపరీతమైన మహా బబులోను పాపాలను సూచిస్తున్నాయి (18:2,3,5,9). 


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |