Daniel - దానియేలు 10 | View All

1. పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగు నన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.

2. ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.

3. మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.

4. మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.

5. నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.
ప్రకటన గ్రంథం 1:13

6. అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
ప్రకటన గ్రంథం 1:14, ప్రకటన గ్రంథం 2:18, ప్రకటన గ్రంథం 14:2, ప్రకటన గ్రంథం 19:6-12

7. దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.

8. నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.

9. నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

10. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి

11. దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.

12. అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని

13. పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,
యూదా 1:9, ప్రకటన గ్రంథం 12:7

14. ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.

15. అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.

16. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,
ప్రకటన గ్రంథం 14:14

17. నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవాని యెదుట ఏలాగున మాట లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా

18. అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయ పడకుము,

19. నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొనినీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని.
ప్రకటన గ్రంథం 1:17

20. అతడు నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును.
ప్రకటన గ్రంథం 12:7

21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.
యూదా 1:9, ప్రకటన గ్రంథం 12:7



బైబిల్ అధ్యయనం - Study Bible
10:1 దానియేలుకు ఈ దర్శనం క్రీ.పూ. 536లో వచ్చింది. బబులోను చెరలోకి వెళ్ళేటప్పటికి దానియేలు వయసు సుమారుగా పదిహేను సంవత్సరాలైతే ఇప్పుడతని వయసు సుమారుగా ఎనభై నాలుగు సంవత్సరాలు. ఈ దర్శనం రాబోయే కాలంలో జరగబోయే గొప్పయుద్ధము గురించి తెలియజేస్తుంది, దీనిగురించి 11:2-12:3 లలో ఉంది. దానియేలు గ్రంథంలోని చివరి మూడు అధ్యాయాలు ఈ దర్శనం గురించే తెలియజేస్తున్నాయి. 

10:2 దానియేలు దుఃఖప్రాప్తుడవడానికి కారణం చెరనుండి స్వదేశానికి తిరిగి వెళ్లినవారు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులు. సమరయులు దేవాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నందువలన పని ఆగిపోయింది (ఎజ్రా 4:5,24). దానియేలు దుఃఖించిన కాలాన్ని తెలిపే "మూడు వారములు" అనే పదానికి హెబ్రీ లేఖన ప్రతిలోని పదాలు 9 వ అధ్యాయంలో సంవత్సరాలను సూచించే “వారములు" అనే పదానికి భిన్నమైనవి (9:24-27). 

10:3 దానియేలు సరిగ్గా భోజనం చేయలేకపోయాడు, ఇది ఒక రకమైన పాక్షిక ఉపవాసం. ఇందుకు కారణం ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడమే గానీ ఆ భోజనం ముందుగా దేవతల కర్పించిందని కాదు. 

10:4 హిద్దెకెలు (ట్రైగ్రిస్) నది బబులోనుకు సుమారు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు యూదులతో బాటు కఠిన ప్రయాణం చేసి స్వదేశానికి తిరిగి వెళ్లలేదు గానీ, బబులోనులోనే రాజోద్యోగిగా ఉండిపోయాడు. 

10:5-6 ప్రక 1:12-16 వచనాల్లో క్రీస్తు రూపాన్ని పోలినట్టుగా ఉన్నప్పటికీ నారబట్టలు ధరించుకొన్న యొకడు (దేవదూత) శరీరధారిగా రాకపూర్వం నాటి మెస్సీయ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన క్రీస్తు అయినట్లయితే ఆయనకు మిఖాయేలు సహాయం అవసరం లేదు. 

10:7 దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా అనే మాటలు హెబ్రీ భాషలో నొక్కి పలుకుతున్నట్టుగా కనబడుతున్నాయి: “నేను చూశాను, దానియేలను నేనే, నేనొక్కడినే”. దానియేలుతో బాటు ఉన్నవారు అక్కడేదో శక్తిమంతమైన, భీకరమైన దృశ్యం ఉన్నట్టు అనుభూతి చెందారు. అయితే వారికేమీ కనబడలేదు గానీ, వారు దాగుకొనవలెనని పారిపోయారు (అపొ.కా. 9:7 తో పోల్చండి). 

10:8-11 వ.11 లో బహు ప్రియుడవు అనే పదజాలం ఉపయోగించబడింది. ఇదే పదజాలం 9:23 వచనంలో కూడా ఉంది. 

10:12-13 ఈ దేవదూతను అడ్డుకోడానికి పారసీకుల రాజ్యా ధిపతి మానవాతీతశక్తి గలవాడై ఉండాలి, దేవుని ఉద్దేశాలను వ్యతిరేకించే దుష్టుడై ఉండాలి. కాబట్టి, పారసీక రాజ్యంలోని రాజకీయ వ్యవహారాలను ప్రభావితం చేయాలని, దేవుని ఉద్దేశాలను వ్యతిరేకించాలని కోరుకుంటున్న ఈ వ్యక్తి దురాత్మ అయ్యుండాలి. అదృశ్యమైన దురాత్మ శక్తులు అధికారులను, లోకనాథులను వశపర్చుకున్నట్టు లేఖనం తెలియజేస్తుంది (యెహె 28:11-19; 2 కొరింథీ 10:3-4; ఎఫెసీ 6:12). పేరు చెప్పబడని ఈ దేవదూత, మిఖాయేలను ఒకడు (దేవదూత) సహాయము చేయగా దురాత్మ సంబంధియైన పారసీక రాజ్యా ధిపతిని గెలిచాడు. మిఖాయేలు (ఈ పేరుకు “దేవునివంటి వాడెవడు” అని అర్థం) ఇశ్రాయేలుకు సంరక్షక దూత (వ.21; 12:1; ప్రక 12:7తో పోల్చండి), కొత్త నిబంధనలో మిఖాయేలును ప్రధానదూతగా పేర్కొనడం జరిగింది (యూదా వ.9). 

10:14 ఈ దర్శన ప్రధాన ఉద్దేశం దినముల అంతమందు ఇశ్రాయేలుకు జరగబోయేదాన్ని వెల్లడిచేయడమని దేవదూత తెలియజేశాడు.

10:15-19 భవిష్యకాలంలో జరగబోయే వాటిని తెలియజేయడం కోసం మాత్రమే కాక, దానియేలును ముట్టి అతడిని బలపర్చడానికి, ధైర్యం చెప్పడం కోసం కూడా దేవదూత ప్రత్యక్షం అయ్యాడు (వ.18-19). 

10:20-21 (కేయుల దేశము యొక్క అధిపతి అనే మాటలు పారసీక రాజ్యం తర్వాత మరొక ప్రధానమైన రాజ్యంగా గ్రీకు రాజ్యం ఏర్పడనున్నదని సూచిస్తున్నాయి. (8:4-8,20-22). దేవదూత అంతిమ ఉద్దేశం సత్యగ్రంథ మందు వ్రాసినది వెల్లడిచేయడం. ఇది భూసంబంధమైన ఫలాని గ్రంథాన్ని కాక, రాబోయే కాలంలో ప్రపంచంలోని జాతులన్నిటి భవితవ్యం గురించిన దేవుని దివ్యాదేశాలను సూచిస్తుంది.


Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |