John - యోహాను సువార్త 9 | View All

1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.

2. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా
నిర్గమకాండము 20:5, యెహెఙ్కేలు 18:20

3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.

4. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.

5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.
యెషయా 49:6

6. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి

7. నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.
2 రాజులు 5:10

8. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.

9. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.

10. వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా

11. వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.

12. వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.

13. అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.

14. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము

15. వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.

16. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.

17. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.

18. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,

19. గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.

20. అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.

21. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.

22. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.

23. కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.

24. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
యెహోషువ 7:19

25. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.

26. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా

27. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.

28. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;

29. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.

30. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.

31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
కీర్తనల గ్రంథము 34:15, కీర్తనల గ్రంథము 66:18, సామెతలు 15:29, యెషయా 1:15

32. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.

33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.

34. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
కీర్తనల గ్రంథము 51:5

35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.

36. అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా

37. యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.

38. అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.

39. అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

40. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.

41. అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
9:1-41 "లోకమునకు వెలుగు"గా యేసు గుర్తింపు, యోహాను సువార్తలో నమోదు చేయబడిన ఆయన ఆరవ, చివరి “సూచకక్రియ" - పుట్టుగుడ్డివాని స్వస్థపరచడాన్ని వర్ణించింది (2:11 నోట్సు చూడండి). అధ్యా. 5లో ఉన్నట్టు యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు కాబట్టి యూదుల నాయకులచే హింసించబడ్డాడు. అయితే అధ్యా. 5 లో విశ్వాసము చూపించక, యేసును గురించి అధికారులకు సమాచారమందించిన కుంటివానిలాగా కాక, ఇంతకుముందు గుడ్డివాడుగా ఉన్న ఈ వ్యక్తి తన విశ్వాసంలో ఎదుగుదలను చూపి, చివరికి యేసును ఆరాధించాడు (9:38). వారి ఆత్మీయ గుడ్డితనాన్ని బట్టి యేసు పరిసయ్యులను ఖండించాడు (వ.40-41). 

9:2 ప్రాచీన యూదామతంలో సాంప్రదాయంగా ఉన్న ఊహను శిష్యుల ప్రశ్న ప్రతిబింబించింది: శ్రమకు కారణం నిర్దిష్టమైన పాపాలు (యోబు 4:7తో పోల్చండి). ఈ ఊహకు అంతర్లీనంగా ఉన్న ఆలోచన, అమాయకులైన ప్రజల జీవితాల్లోని కీడుకు, దేవునికి సంబంధం లేదని చెప్పడమే (నిర్గమ 20:5; సంఖ్యా 14:18; ద్వితీ 5:9). అయినప్పటికీ, శ్రమకు కారణం ఎల్లప్పుడూ ఒక వ్యక్తి పాపఫలితం కాదు అని కొ.ని. స్పష్టం చేస్తుంది (లూకా 13:2-3; 2కొరింథీ 12:7; గలతీ 4:13). ఒక వ్యక్తి శ్రమపడుతున్నపుడు మనం దానికి కారణాన్ని ఊహించడం మానాలి. కానీ కీడు కూడా దేవునికి మరింత మహిమతేవడానికి కారణం కాగలదని మాత్రం గుర్తించాలి (ముఖ్యంగా సిలువ మరణం; యోహాను 12:28,37-41; 17:1,5తో పోల్చండి).

9:3 ఆ వ్యక్తి గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడో యేసు వివరించలేదు; కేవలం రాబోయే ఫలితాన్ని మాత్రమే ఆయన ప్రకటించాడు: దేవునికి మహిమ. 

9:4 మనము చేయుచుండవలెను అంటూ యేసు తన పరిచర్యలో తన శిష్యులను కలుపుకోవడం గొప్ప విషయం. భూమిపై తన సమయం పరిమితం అని యేసుకు తెలుసు.

9:5 యేసు లోకమునకు వెలుగు అనే మాటలను గురించి, 6:35,48; 8:12 నోట్సు చూడండి. 

9:6-7 ఆ వ్యక్తిని సిలోయము కోనేటికి... కడుగుకొనుమని యేసు పంపించడం, ఎలీషా నయమానును యొర్దాను నదిలో స్నానం చేయమని పంపించడాన్ని జాపకం చేస్తుంది. (2రాజులు 5:10-13). పంపబడిన వాడని అర్థము అనే మాటలు, ఆది 49:10ను (యెషయా 8:6తో పోల్చండి) ప్రతిధ్వనిస్తుండవచ్చు (యోహాను 1:38; 3:16-18 నోట్సు చూడండి). 9:7 తర్వాత, వ.35 వరకు యేసును గూర్చి ఏమీ వినము.

9:8-13 తనకు తెలిసినంత మట్టుకు అతడు స్పష్టంగా సాక్ష్యమిచ్చాడు.

9:14 ఇక్కడ విశ్రాంతి దినమును పేర్కొనడం (5:9తో పోల్చండి), అధ్యా. 5 లోని విశ్రాంతి దినాన్ని గురించిన వివాదాన్ని తిరిగి ఆరంభిస్తుంది. యేసు తన ఉమ్మితో మట్టిని తడిపి, బురద చేయడానికి చేతితో కలిపాడు. పిండి కలపడం (ఇక్కడ మట్టిని కలపడం) అనేది యూదా రబ్బీల సాంప్రదాయం ప్రకారం విశ్రాంతి దినమున చేయకూడదని నిషేధించిన 39 రకాల పనులలో ఒకటి. 

9:15 ఈ సారి పరిసయ్యులకు అతడు తన సాక్ష్యాన్ని చెప్పాడు. 

9:16 పరిసయ్యుల మధ్య పుట్టిన భేదము నకు కారణం, షమ్మాయి, హిల్లెల్ వర్గాలు అనుసరించే వేర్వేరు వాదనలు. షమ్మాయివారి వాదన పునాది సూత్రాలపై ఆధారపడింది. (విశ్రాంతిదిన నియమాన్ని మీరినవాడు పాపి"),

హిల్లెల్ వారి వాదన ఒక విషయాన్ని గురించి నిరూపించబడిన సత్యం (“యేసు ఒక మంచికార్యం చేశాడు").

9:18-23 యేసును క్రీస్తు అని ఒప్పుకొనిన వారందరినీ సమాజ మందిరములో నుండి వెలివేయడానికి నిశ్చయించుకున్న యూదు అధికారులకు భయపడి, వాని తలిదండ్రులు తమకేమీ తెలియదని చెప్పి తప్పించుకోజూచారు. యూదులు, వారి శక్తిని గురించి, 7:13 నోట్సు చూడండి. 

9:24 దేవుని మహిమపరచుము అని పరిసయ్యులు స్వస్థత పొందినవానికి ప్రబోధించడం, నిజం చెప్పమని అతనికి ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక (యెహో 7:19; 2దిన 30:8; యిర్మీయా 18:16). 

9:25-27 ఆ వ్యక్తి ధైర్యంగా మాట్లాడాడు. 

9:28 మోషే ఎవరిని గురించి రాశాడో ఆయన మాటలు వినడంలో విఫలం కావడంతో తాము మోషే శిష్యులమని చెప్పుకునే పరిసయ్యుల వాదన వీగిపోయినట్లయింది (5:45-47 నోట్సు చూడండి). 

9:29 దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము అనే పరిసయ్యుల వాదన, సీనాయి కొండ దగ్గర దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వడాన్ని " సూచిస్తుంది. (నిర్గమ 33:11; సంఖ్యా 12:2-8ను యోహాను 1:17తో పోల్చండి). 

9:30-33 స్వస్థత పొందిన వాని ముఖ్య ప్రతిపాదన: దేవుడు పాపుల మనవి. ఆలకింపడు అనేది పా.ని.నుండి వచ్చింది (కీర్తన 34:15; 66:20; 109:7; 145:19). ఇంతకు ముందు పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు ఎక్కడా వినలేదు అనే అతని రెండవ ప్రతిపాదన కూడా పా.ని., లేక బైబిలేతర సాహిత్యంలో అలాంటి సంఘటనలు లేవని నిర్ధారిస్తుంది. అతని సమీక్ష ఈయన దేవునియొద్దనుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడు (3:2) అన్న ఈ వ్యక్తి సమీక్ష ప్రార్థనకు జవాబుగానే అద్భుతాలు జరుగుతాయి అనే యూదుల సాధారణ నమ్మకానికి తగినట్టుగా ఉంది.

9:34 స్వస్థత పొందినవానికి విరోధంగా పరిసయ్యులు తీర్మానించడం కీర్తన 51:5ను ప్రస్తావిస్తుంది. వెలివేసిరి అంటే సమాజమందిరం నుండి వెలివేయడాన్ని సూచిస్తుంది. (వ.22 చూడండి). వెలివేసిన విధానం ఒక పద్ధతి ప్రకారంగా కాక, తొందరపాటు చర్యగా కనిపిస్తుంది. 

9:35-38 మంచికాపరియైన యేసు తాను స్వస్థపరచిన వ్యక్తిని వెదకి, అతనిని విశ్వాసం లోనికి నడిపించాడు. గుడ్డివాడు యేసును “ఒక ప్రవక్త"గా (వ. 17) గుర్తించడం నుండి, ఆయనను ప్రభువు (వ.38) అని ఒప్పుకునేటంత వరకు ఎదిగాడు. 

9:39-41 నీతిమంతుడైన గుడ్డివానికి దృష్టినివ్వడం (కీర్తన 146:8; యెషయా 29:18; 35:5; 42:7,18), చూడగలిగే అనీతిమంతులైన వారిని గుడ్డివానిగా చేయడం (యెషయా 6:10; 42:19; యిర్మీయా 5:21ను మత్తయి 13:13-15; యోహాను 12:40తో పోల్చండి) అనేవి పా.ని.లోని సాధారణమైన అంశాలు. వేరొకచోట యేసు పరిసయ్యులను “అంధులైన మార్గదర్శకులు" అని పిలిచాడు. (మత్తయి 23:16ను 15:14; 23:26తో పోలుండి) 


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |