Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
1. aayana maargamuna pōvuchuṇḍagaa puṭṭu gruḍḍiyaina yoka manushyuḍu kanabaḍenu.
2. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగానిర్గమకాండము 20:5, యెహెఙ్కేలు 18:20
2. aayana shishyulu bōdhakuḍaa, veeḍu gruḍḍivaaḍai puṭṭuṭaku evaḍu paapamu chesenu? Veeḍaa, veeni kannavaaraa? Ani aayananu aḍugagaa
3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
3. yēsu veeḍainanu veeni kannavaarainanu paapamu cheyalēdu gaani, dhevuni kriyalu veeniyandu pratyakshaparachabaḍuṭakē veeḍu gruḍḍivaaḍugaa puṭṭenu.
4. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.
4. pagalunnanthavaraku nannu pampinavaani kriyalu manamu cheyuchuṇḍavalenu; raatri vachuchunnadhi, appuḍevaḍunu panicheyalēḍu.
5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.యెషయా 49:6
5. nēnu ee lōkamulō unnappuḍu lōkamunaku velugunani cheppenu.
6. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి
6. aayana iṭlu cheppi nēlameeda ummivēsi, ummithoo buradachesi, vaani kannulameeda aa burada poosi
7. నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.2 రాజులు 5:10
7. neevu silōyamu kōnēṭiki veḷli andulō kaḍugu konumani cheppenu. Silōyamanu maaṭaku pampabaḍina vaaḍani arthamu. Vaaḍu veḷli kaḍugukoni choopu galavaaḍai vacchenu.
8. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.
8. kaabaṭṭi poruguvaarunu, vaaḍu bhikshakuḍani anthakumundu chuchinavaarunuveeḍu koorchuṇḍi bhiksha metthukonuvaaḍu kaaḍaa aniri.
9. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.
9. veeḍē ani kondarunu, veeḍukaaḍu, veeni pōliyunna yokaḍani marikondarunu aniri; vaaḍaithēnēnē yanenu.
10. వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
10. vaaru nee kannulēlaagu teravabaḍenani vaani naḍugagaa
11. వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
11. vaaḍu yēsu anu noka manushyuḍu burada chesi naa kannulameeda poosi neevu silōyamanu kōnēṭiki veḷli kaḍugukonumani naathoo cheppenu; nēnu veḷli kaḍugukoni choopu pondithinanenu.
12. వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
12. vaaru, aayana ekkaḍanani aḍugagaa vaaḍu, nēnerugananenu.
13. అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
13. anthakumundu gruḍḍiyai yuṇḍinavaanini vaaru parisayyulayoddhaku theesikonipōyiri.
14. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
14. yēsu buradachesi vaani kannulu terachina dinamu vishraanthidinamu
15. వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
15. vaaḍēlaagu choopupondenō daaninigoorchi parisayyulu kooḍa vaanini marala aḍugagaa vaaḍu naa kannulameeda aayana burada un̄chagaa nēnu kaḍugu koni choopu pondithinani vaarithoo cheppenu.
16. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
16. kaagaa parisayyulalō kondaru ee manushyuḍu vishraanthidinamu aacharin̄chuṭalēdu ganuka dhevuni yoddhanuṇḍi vachinavaaḍu kaaḍaniri. Marikondaru paapiyaina manushyuḍu eelaaṭi soochakakriya lēlaagu cheyagalaḍaniri; iṭlu vaarilō bhēdamu puṭṭenu.
17. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
17. kaabaṭṭi vaaru marala aa gruḍḍivaanithoo athaḍu nee kannulu terachinanduku neevathanigoorchi yēmanu konuchunnaavani yaḍugagaa vaaḍu aayana oka pravaktha anenu.
18. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,
18. vaaḍu gruḍḍi vaaḍaiyuṇḍi choopu pondenani yoodulu nammaka, choopu pondinavaani thalidaṇḍrulanu pilipin̄chi,
19. గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.
19. gruḍḍivaaḍai puṭṭenani meeru cheppu mee kumaaruḍu veeḍēnaa? aalaagaithē ippuḍu veeḍēlaagu choochu chunnaaḍani vaarini aḍigiri.
20. అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.
20. anduku vaani thalidaṇḍrulu veeḍu maa kumaaruḍaniyu veeḍu gruḍḍivaaḍugaa puṭṭenaniyu mēmerugudumu.
21. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
21. ippuḍu veeḍēlaagu choochuchunnaaḍō yerugamu; evaḍu veeni kannulu terachenō adhiyu mēmerugamu; veeḍu vayassu vachinavaaḍu, veeninē aḍuguḍi; thana saṅgathi thaanē cheppukonagalaḍani vaarithoo aniri.
22. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.
22. vaani thalidaṇḍrulu yoodulaku bhayapaḍi aalaagu cheppiri; endukanina aayana kreesthu ani yevarainanu oppukoninayeḍala vaanini samaajamandiramulōnuṇḍi veli vēthumani yoodulu anthakumunupu nirṇayin̄chukoni yuṇḍiri.
23. కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
23. kaavuna vaani thalidaṇḍruluvaaḍu vayassu vachinavaaḍu; vaanini aḍuguḍaniri.
24. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగాయెహోషువ 7:19
24. kaabaṭṭi vaaru gruḍḍivaaḍaiyuṇḍina manushyuni reṇḍava maaru pilipin̄chi dhevuni mahimaparachumu; ee manushyuḍu paapiyani mēmerugudumani vaanithoo cheppagaa
25. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.
25. vaaḍu aayana paapiyō kaaḍō nēneruganu; okaṭi maatramu nēnerugu dunu; nēnu gruḍḍivaaḍanaiyuṇḍi ippuḍu choochuchunnaa nanenu.
26. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా
26. anduku vaaru aayana neekēmi chesenu? nee kannulu ēlaagu terachenani marala vaanini aḍugagaa
27. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.
27. vaaḍu indaaka meethoo cheppithini gaani meeru vinakapōthiri; meerenduku marala vinagōruchunnaaru? meerunu aayana shishyulaguṭaku kōruchunnaaraa yēmi ani vaarithoo anenu.
28. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
28. anduku vaaru neevē vaani shishyuḍavu, mēmu mōshē shishyulamu;
29. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
29. dhevuḍu mōshēthoo maaṭalaaḍenani yerugudumu gaani veeḍekkaḍanuṇḍi vacchenō yerugamani cheppi vaanini dooshin̄chiri.
30. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
30. anduku aa manushyuḍu aayana ekkaḍanuṇḍi vacchenō meererugakapōvuṭa aashcharyamē; ayinanu aayana naa kannulu terachenu.
31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.కీర్తనల గ్రంథము 34:15, కీర్తనల గ్రంథము 66:18, సామెతలు 15:29, యెషయా 1:15
31. dhevuḍu paapula manavi aalakimpaḍani yerugudumu; evaḍainanu dhevabhakthuḍai yuṇḍi aayana chitthamuchoppuna jarigin̄chinayeḍala aayana vaani manavi aalakin̄chunu.
32. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.
32. puṭṭu gruḍḍivaani kannulevaraina terachinaṭṭu lōkamu puṭṭinappaṭinuṇḍi vinabaḍalēdu.
33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.
33. eeyana dhevuni yoddha nuṇḍi vachinavaaḍu kaaniyeḍala ēmiyu cheyanēraḍani vaarithoo cheppenu.
34. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.కీర్తనల గ్రంథము 51:5
34. anduku vaaru neevu kēvalamu paapivai puṭṭinavaaḍavu, neevu maaku bōdhimpa vachithivaa ani vaanithoo cheppi vaani velivēsiri.
35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.
35. parisayyulu vaanini velivēsirani yēsu vini vaanini kanugoni neevu dhevuni kumaaruniyandu vishvaasamun̄chu chunnaavaa ani aḍigenu.
36. అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా
36. anduku vaaḍu prabhuvaa, nēnu aayanayandu vishvaasamun̄chuṭaku aayana evaḍani aḍugagaa
37. యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.
37. yēsu neevaayananu choochuchunnaavu; neethoo maaṭalaaḍuchunnavaaḍu aayanē anenu.
38. అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.
38. anthaṭa vaaḍu prabhuvaa, nēnu vishvasin̄chuchunnaanani cheppi aayanaku mrokkenu.
39. అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.
39. appuḍu yēsu chooḍanivaaru chooḍavalenu, choochuvaaru gruḍḍivaaru kaavalenu, anu theerpu nimitthamu nēneelōkamunaku vachithinani cheppenu.
40. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.
40. aayana yoddhanunna parisayyulalō kondaru ee maaṭa vinimēmunu gruḍḍivaaramaa ani aḍigiri.
41. అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
41. anduku yēsu meeru gruḍḍivaaraithē meeku paapamu lēka pōvunu gaani choochuchunnaamani meerippuḍu cheppu konuchunnaaru ganuka mee paapamu nilichiyunnadani cheppenu.