Chronicles II - 2 దినవృత్తాంతములు 22 | View All

1. అరబీయులతో కూడ దండు విడియుచోటికివచ్చిన వారు పెద్దవారినందరిని చంపిరి గనుక యెరూషలేము కాపురస్థులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుచేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము బొందెను.

2. అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమీ కుమార్తె, ఆమె పేరు అతల్యా

3. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.

4. అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారుకులైరి.

5. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులో సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతోకూడ పోయెను; సిరియనులచేత యెహోరామునకు గాయములు తగిలెను.

6. సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసి కొనుటకై అతడు యెజ్రెయేలునకు మరల వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియైయున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.

7. యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీకుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా

8. యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.

9. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటి వారు ఇక నెవరును లేకపోయిరి.

10. అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు చనిపోయె నని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.

11. అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.

12. ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
22:2-4 యూదాదేశపు రాజైన అహజ్యా తన తండ్రికి సమాన స్థాయిలో దుష్టత్వం జరిగించాడు. అతడిని తప్పుదోవ పట్టించడంలో అధిక నింద అతని తల్లి అతల్యాకు దక్కుతుంది. అహాబు కుటుంబంతో గల సంబంధాల కారణంగా, ఉత్తర ఇశ్రాయేలు దేశంలో అతని బంధువులు అహజ్యాకు ఆలోచనకర్తలై ఉన్నారు. విగ్రహారాధన, హింసాత్మక విధానాలతో పాటు ఉత్తర ఇశ్రాయేలు దేశపు ఆచారాలు అహజ్యా అనుసరించాడు.

22:5-6 ఇశ్రాయేలు దేశపు రాజైన అహాబుతో కలసి యెహోషాపాతు రామోతిలాదులో సిరియనుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినట్లే, యూదా రాజైన అహజ్యా కూడా ఇశ్రాయేలు రాజైన యోరాముతో కలసి అదే
ప్రదేశానికి, అదే ఉద్దేశంతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఫలితం దాదాపు ఒకేలా ఉంది. యోరాము తీవ్రంగా గాయపడ్డాడు.
యోరాము (యెహోరాము అని కూడా పిలిచారు); అహాబు కుమారుడైన ఇతడు. ఇశ్రాయేలుకు ఎనిమిదవ రాజు, అహజ్యాకు సహోదరుడు. ఇతడు యూదారాజైన అహజ్యాతో కలసి సిరియావాడైన హజాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళి వచ్చిన తరవాత యెహూ ఇతడిని చంపాడు. ఇతడు అహాబు కుటుంబంలో ఇశ్రాయేలు దేశానికి చివరి రాజు.

22:7-9 అహాబు సంతతిని నిర్మూలం చేయడానికి, ఇశ్రాయేలు రాజుగా ఉండటానికి దేవుడు. యెహూను అభిషేకించాడు (2రాజులు 9:1-10). అయితే, యూదా రాజైన అహజ్యాను కూడా నిర్మూలించి యెహూ చాలా దుడుకుగా వ్యవహరించాడు. ఆ విధంగా అతల్యా దావీదు సింహాసనం ఆక్రమించుకునే సమయానికి దాదాపు దావీదు రాజవంశమంతటినీ హతం చేసే పరిస్థితి తలెత్తింది (2దిన 22:10-12). 

22:10 అతల్యా: ఈమె అహాబు, యెజెబెలుల కుమార్తె. యెహోరాము భార్య. యూదా సింహాసనాన్ని ఆక్రమించుకుంది. తిరిగి యోవాషను రాజుగా చేయడానికి యెహోయాదా వేసిన ప్రణాళికలో హతమయ్యింది. ఖాళీగా ఉన్న యూదా సింహాసనంపై ఎవరు ఆసీనులవుతారు? వారసులలో కొంతమంది మగపిల్లలు ఉన్నారు, కానీ వారు పసిపిల్లలు, దేశాన్ని పాలించే వయసు, సామర్థ్యం వారికి లేదు. . అహజ్యా తల్లి అతల్యా ఈ అవకాశం ఉపయోగించుకుని యూదా దేశానికి తనను తాను రాణిగా ప్రకటించుకుంది. ఆమె దావీదు సంతతికి చెందింది కాదు కాబట్టి సింహాసనం చేపట్టే అధికారం ఆమెకు లేదు. అయితే, ముందుకాలంలో తన భర్త చేసిన విధంగా, తన సొంత మనవలతో సహా సింహాసనానికి వారసులందరినీ హతం చేసింది. 

22:11-12 అయితే, అతల్యా ఒక వారసుడిని మాత్రం హతం చేయలేక పోయింది. అహజ్యా సింహాసనం అధిష్టించే సమయానికి పుట్టిన యోవాషు అనే రాజకుమారుడు ఒకడున్నాడు. అహజ్యా సహోదరి యెహోషబతు, ప్రధాన యాజకుడును, ఆమె భర్తయునైన యెహోయాదా కలసి యోవాషును మందిరములో రహస్యంగా ఆరు సంవత్సరములు పెంచి పెద్దచేశారు.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |