Psalms - కీర్తనల గ్రంథము 62 | View All

1. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర

2. ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?

3. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ ద్రోయ చూచుదురు?

4. అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో దూషించుదురు. (సెలా.)

5. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.

6. ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.

7. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.

8. జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)

9. అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

10. బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
మత్తయి 19:22, 1 తిమోతికి 6:17

11. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

12. ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
మత్తయి 16:27, రోమీయులకు 2:6, 2 తిమోతికి 4:14, 1 పేతురు 1:17, ప్రకటన గ్రంథం 2:23, ప్రకటన గ్రంథం 20:12-13, ప్రకటన గ్రంథం 22:12



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-62. పగిలిపోయిన ప్రాకారాన్ని తేలిగ్గా పడగొట్టవచ్చని తన శత్రువులు భావించారు గానీ, దావీదు తన కోటను, ప్రాకారాన్ని దేవునిమీద కట్టుకున్నాడు కాబట్టి అతడు. నిశ్చింతగా, స్థిరంగా ఉంటాననే నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ రాసిన కీర్తన.
శీర్షిక: యెదూతూను - కీర్తన 39 శీర్షిక నోట్సు చూడండి. 

62:1 ప్రతి విశ్వాసీ ఏ ప్రాథమిక సత్యంపై ఆధారపడి జీవించాలో ఈ కీర్తన వివరిస్తుంది. కష్టాలు, బాధలు లేదా శత్రువుల వ్యతిరేకతల సమయంలో మన అంతిమ ఆశ్రయం , విమోచకుడునైన దేవుని వైపు తిరగాలి. ప్రతి విశ్వాసీ ఈ క్రింది వాటిని చెప్పగలిగేలా ఉండాలి: (1) ఏ కష్టాన్నైనా, సందేహాన్నైనా దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను (వ.2,6). ఆయనే నా విమోచన (వ.1), ఆయన వలన నాకు రక్షణ, ఆయనే నా బలం (వ. 6,7). (2) విచారం, భయం నిండిన సమయాల్లో నన్ను నేను ఆయనకు అప్పగించుకొని, నా హృదయంలో ఉన్న దాన్నంతటినీ ప్రార్థనలో ఆయన దగ్గర కుమ్మరిస్తాను (ఫిలిప్పీ 4:6). (3) నా పరిస్థితికి కనికరంతో, జాలితో స్పందిస్తాడని నమ్మి నా పక్షంగా ఆయన కార్యం కోసం నేను ఎదురు చూస్తూ వేచి ఉంటాను (వ.11-12).

62:2 ఆశ్రయదుర్గము గురించి, ఇక్కడా, వ.6-8 లలో ఉన్న ఇతర పదాలగురించి 18:1-2; 31:1-4 నోట్సు చూడండి. 

62:3 దీనుల్ని, దుర్బలుల్ని అణచివేయడం ఈ వచనంలో పేర్కొన్న శత్రువుల సాధారణ నైజం. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను త్రోయడమెంత సుళువో, శత్రువులు అంత సుళువుగా దీనుల మీద దుర్బలుల మీద దాడిచేస్తున్నారు.

62:4 శత్రువులు దాడి చేస్తున్న వ్యక్తి ప్రముఖుడనీ, బహుశా అధిపతి అనీ ఔన్నత్యము నుండి అనే పదం తెలియజేస్తున్నది. ఇది బహుశా రాజును సూచిస్తుండవచ్చు. 

62:5-7 ఈ వచనాలు వ. 1-2 లను ప్రతిధ్వనిస్తున్నాయి.

62:8 మీ హృదయములు కుమ్మరించుడి - దేవునియెదుట ఏదీ దాచుకొనకుండా అన్నిటినీ విప్పి చెప్పాలనే నుడికారం (42:4; 102:1; 142:2). ఇది ఎల్లప్పుడూ దేవునిలో మన నమ్మికతో బాటు . ఉంటుంది. మన అవసరాల్ని దేవుడే తీర్చాలని ప్రార్థిస్తూ ఆయననే నమ్ముకొనడాన్ని ఇది సూచిస్తుంది. 

62:9-10 మానవ జీవితం అప్రాముఖ్యమైందని, గతించిపోయేదేనని ఊపిరి (హెబ్రీ. హెవెల్) అనే మాట సూచిస్తుంది. (39:4-6 నోట్సు చూడండి). ఘనులైనవారు సైతం మాయ (భ్రాంతి) లాంటివారే. ఈ పోలిక మనుషుల గ్రాహ్యతకు వాస్తవానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూపెడుతుంది. ఊపిరి అంటే అక్షరాలా “క్షణమాత్రపు, శ్వాస", దాన్ని త్రాసులో తూచాలనుకోవడం అవివేకం. తమను తాము ఘనులుగా ఎంచుకొనే వారు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు. దేవునిలో తప్ప దేనిలోనైనా నమ్మిక ఉంచడం వ్యర్థం. - 

62:11 దేన్నైనా మళ్లీ మళ్లీ చెప్పడాన్ని ఉద్దేశిస్తూ ఒక మారు... రెండు మారులు అనే పదజాలం ఉపయోగిస్తారు. ఆ విధంగా నొక్కి చెప్పడం దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది (యోబు 33:14; 40:5). 

62:12. ప్రతిఫలమిచ్చుచున్నావు అనే మాట దేవుడు మంచివారికి మంచిని, చెడ్డవారికి చెడును ప్రతిఫలంగా ఇవ్వడాన్ని సూచిస్తుంది. (28:3-5 నోట్సు చూడండి),


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |