Hosea - హోషేయ 7 | View All

1. నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.

2. తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.

3. వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.

4. రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు.

5. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.

6. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది.

7. పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.

8. ఎఫ్రా యిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.

9. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.

10. ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.

11. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.

12. వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.

13. వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్దములు చెప్పుదురు

14. హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.

15. నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు.

16. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
7:3-7 రాజు దేవుని గురించి ఏమీ పట్టించుకోలేదు. కానీ చెడును, మోసపు ఆలోచనలను వినడానికి ఇష్టపడ్డాడు. దాని కారణంగా అతడు కోరికలతో రగిలిపోయారు. రాజు రహస్య ఆలోచనకర్తలు, అతణ్ణి తాగుడుకు, శరీరవాంఛలకు, మరణం వైపుకు నడిపించారు. వారి కోపం పొగరాజుతున్నది అని కూడా “రొట్టెలు కాల్చువాడు... నిద్రపోయినను" అనే మాటలను తర్జుమా చేయవచ్చు. రొట్టెలు కాల్చువాడు అనేమాట తన వ్యభిచారం ద్వారా చెడు వర్దిల్లేటట్లు అనుమతించిన రాజుకు సూచన కావచ్చు. 

7:8-10 తమ ప్రజలను ఇతర దేశాల ప్రజలలాగా మారడానికి అనుమతించిన ఎఫ్రాయిము నాయకులు నిర్లక్ష్యపరులు. వారు అప్పము రెండవ ప్రక్కన కూడా కాలేలా తిరగవేయకుండా నిర్లక్ష్యం వహించిన వంటవాళ్ళు. అయినప్పటికీ ఏమి జరిగిందో వారికి తెలియకపోయెను. తిరిగి, వెదకి అనే మాటలు ఉపయోగించడాన్ని 3:5; 5:15; 2దిన 7:14; యెషయా 9:13; దాని 9:3; జెఫన్యా 1:6 లో చూడండి. 

7:11-12 ఇశ్రాయేలు తన ఇంటికి దారి మరచిపోయిన పక్షిలాగా ఉంది. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము అనే మాటలు, విదేశ ప్రభుత్వాల నుండి సంరక్షణ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అనే వార్తను సూచిస్తుండవచ్చు. 

7:13 యెహోవా యొద్దకు తిరిగివచ్చి, స్వస్థత పొందండి అని పిలుపుతో 6:1లో ఆరంభమైన భాగం, ఇశ్రాయేలు దానికి విరుద్ధమైన పనిచేసింది అనే విలాపంతో ఇక్కడ ముగుస్తుంది. వారికి శ్రమ అనేది రానున్న తీర్పును ప్రకటిస్తుంది (9:12; యెషయా 3:9; యిర్మీయా 50:27; యూదా 11). తప్పిపోయి యున్నారు. ("ఎగిరిపోయారు") అనేమాట పక్షులను గురించి తరచూ వాడేది (యెషయా 16:2; యిర్మీయా 4:25). దీనినే విశ్రాంతి లేకుండా తిరగడంగా కూడా పేర్కొనవచ్చు (సామె 27:8). ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి దేవుని నుండి పారిపోవచ్చు, కానీ వారు నాశనమును తప్పించుకోలేరు. "నేను వారిని విమోచింపకోరియున్నను” అనే మాటలు (నిర్గమాన్ని పేర్కొంటూ) “నేను విమోచించాను” అని కూడా అనువదించవచ్చు (ద్వితీ 7:8; 9:26; మీకా 6:4). దేవుని విమోచన, ప్రజలు ఆయన గురించిన సత్యాన్ని ప్రకటించేలా చేయాలి. 

7:14 ఇశ్రాయేలీయులు కేకలు పెట్టడం (అలాగే కత్తులతో కోసుకోవడం) అనాగరిక జాతుల ఆచారాలను అనుసరించి కావచ్చు (1రాజులు 18:28; యెహె 8:14). 

7:15 ఈ భాగంలో “నేను”, “వారు” అనే మాటలకు వైరుధ్యం రెండవసారి ఉంది (వ.13తో పోల్చండి). బలమైన దేశంగా ఉండేలా దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి నేర్పాడు, కానీ వారు తమ బలాన్ని ఆయన మీదకే విరోధంగా తిప్పారు. 

7:16 జాకిచ్చిన విల్లు బాణాలను లక్ష్యానికి సూటిగా పంపలేనట్లుగా ఇశ్రాయేలు అధిపతులు పనికిరాకుండా పోయారు (కీర్తన 78:57). ఇశ్రాయేలు “గర్వపు మాటలు", దేవునికి లేక ప్రవక్తలకు విరోధంగా వారు మాట్లాడిన చెడ్డమాటలను సూచిస్తుండవచ్చు (2దిన 36:16). పర్యవసానంగా వచ్చే హేళన, వారు ఐగుప్తును సహాయం కోరినపుడు (హోషేయ 7:11) లేక వారు నాశనమైనపుడు (వ. 13) వారి అనుభవంలోకి వస్తుంది. 


Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |