Jeremiah - యిర్మియా 26 | View All

1. యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

3. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో.

4. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా

5. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.

6. మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

7. యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.

8. జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.

9. యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.

10. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా

11. యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజల తోను ఈలాగనిరి మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.
అపో. కార్యములు 6:13

12. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.

13. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.

14. ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.

15. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.

16. కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.

17. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.

18. యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

19. అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.

20. మరియకిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.

21. రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.

22. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;

23. వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.

24. ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.



బైబిల్ అధ్యయనం - Study Bible
26:1-24 ఈ అధ్యాయం, ప్రవక్త మందిర ద్వారం దగ్గర ప్రకటించిన సందేశం ఉన్న అధ్యా. 7 తో జోడింపుగా ఉంది. 

26:1 ఈ సంఘటనాకాలం యెహోయాకీము ఏలుబడి ఆరంభము నాటిది (క్రీ.పూ. 609). కాలక్రమానుసారంగా, ఇది 25:1 వచనంలోని సంఘటనకు (యెహోయాకీము నాలుగవ సంవత్సరమున) పూర్వమే చోటుచేసుకున్న సంఘటన. అదే సంవత్సరం రాజైన యోషీయా మరణించాడు, యెహోయాహాజు కేవలం మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు. 

26:2 దేవునినుండి వచ్చిన మాటల్ని యథాతథంగా ప్రకటించాలి, వాటిలో ఒక మాటైనను విడిచిపెట్టకూడదు. 

26:3 జాతులకు విమోచన కలిగించే పశ్చాత్తాపం ముందుగా వ్యక్తుల్లో ప్రారంభం కావాలి. మనుషులు దుర్మార్గము విడుచుదురేమో అని ప్రతి ఒక్కరినీ పిలుస్తున్నాడు. 

26:4-6 ఈ వచనాలు అధ్యా. 7లోని పూర్తిసందేశపు సారాంశాన్ని మూడు అంశాల్లో నొక్కి వక్కాణిస్తున్నాయి: (1) దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనమని పిలుపు, (2) నా సేవకులగు ప్రవక్తల మాటల్ని అంగీకరించా లని దేవుడు చెబుతున్న మాటల్లో యిర్మీయా సందేశం కూడా ఉండడం, (3) యెరూషలేము మీదకు దేవాలయం మీదకు రాబోతున్న పెనుముప్పు తీవ్రమైందని తెలియజేయడం. 

26:6,9 షిలోహు గురించి 7:12, 14 నోట్సు చూడండి. 

26:7-8 యిర్మీయా తన సందేశాన్ని పూర్తిచేసే వరకు యాజకులును ప్రవక్తలును జనులందరును విన్నారు. అయితే యిర్మీయా మీద వారిలో అప్పటివరకు దాగి ఉన్న కోపాగ్ని ఒక్కసారిగా పెల్లుబికింది, వారు అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు అని బిగ్గరగా కేకలు వేశారు. యిర్మీయా దైవదూషణ చేస్తున్నాడని వారనుకుంటున్నారు. (లేవీ 24:16; ద్వితీ 18:20). దేవుడు పట్టణాన్ని, దేవాలయాన్ని ఎలా నాశనం చేస్తాడు? దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఇది అసాధ్యమని వారి నమ్మకం. 

26:9 శత్రువును చుట్టుముట్టినట్టుగా యిర్మీయా దగ్గరకు ప్రజలు గుంపు కూడి వచ్చారు. 

26:10-11 కొత్త గవిని ద్వారము బహుశా దేవాలయం లోపలి ఆవరణం లోనికి వెళ్లడానికున్న ద్వారం కావచ్చు (36:10). న్యాయ విచారణలు జరిగే స్థలం ఇదే. రాజైన యోతాము దీన్ని నిర్మించాడు (2రాజులు 15:35). 

26:12-15 యిర్మీయా గొప్ప ధైర్యంతో, అసాధారణమైన క్లుప్తతతో, వారి మధ్య తన ఇరవై సంవత్సరాల పరిచర్య అనుభవంలోని ముక్కుసూటితనంతో తనను తాను సమర్థించుకున్నాడు (25:3తో పోల్చండి, మూడు సంవత్సరాల ముందు). యిర్మీయా సందేశం దేవునినుండి వచ్చిన సందేశం, అతడు విశ్వసనీయతతో ఆ సందేశాన్ని ప్రకటించాడు.

26:16 యిర్మీయా వాదన విన్న అధిపతులును జనులందరును మెత్తపడ్డారు, అతని వాదన వారిని ఒప్పించింది.

26:17-18 మోరప్రియుడైన మీకా అనే పదజాలం మీకా 1:1 ని సూచిస్తుంది. ఇక్కడ ఉదహరించిన మాటలు మీకా 3:12 వచనంలోని మాటల్లాగానే ఉన్నాయి. మోరెషెత్తతు యెరూషలేముకు నైరుతిదిశలో సుమారు ఇరవై-మూడు మైళ్ల దూరంలో ఉన్న గ్రామం. మీకా హెచ్చరికల్ని ప్రజలు విని పశ్చాత్తాపంతో స్పందించారు కాబట్టి వారికి విడుదల కలిగింది. గతంలోని అనుభవం గురించి వాదన ఫలితాన్నిచ్చింది, యిర్మీయా విడుదల పొందాడు. 

26:19 మీకా, హిజ్కియాల ఉదాహరణ ప్రజల్ని ఒప్పించింది కాబట్టి వారు యిర్మీయాకు హానిచేయ సాహసించలేదు. 

26:20-23 మీకా చేసినట్టుగా షెమయా కుమారుడగు ఊరియా చేయలేదని ఈ వచనాలు తెలియ జేస్తున్నాయి. నమ్మకస్తులైన సేవకులలో కొందరికి విడుదల రావడం, మరికొందరికి రాకపోవడం దేవుని చేతుల్లో ఉంది. 

26:20 ఫిలిపీయులు పంపించిన మందసాన్నుంచిన కిర్యత్యారీము యెరూషలేముకు వాయవ్యంలో సుమారు ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది (1సమూ 7:1-2). 

26:22 అక్బోరు కుమారుడగు ఎల్నాతాను బహుశా మీకాయా కుమారుడైన అక్బోరు కుమారుల్లో ఒకడును, రాజైన యోషీయా అధిపతులలో ఒకడును కావచ్చు. (2రాజులు 22:12,14). యిర్మీయా గ్రంథపుచుట్టను యెహోయాకీము తగలపెట్టకుండా అడ్డుకోడానికి ఎల్నాతాను ప్రయత్నించాడు (36:25). 

26:23 యూదా రాజైన యెహోయాకీము ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొని వచ్చాడు. ఐగుప్తు క్రింద సామంత రాజుగా ఉన్న యెహోయాకీముకు దేశాల మధ్య ఉండే ఒప్పందాల ప్రకారం ఎవరినైనా ఒక చోటునుండి మరొక చోటుకు రప్పించుకొనే హక్కు ఉంది. 

26:24 షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడై ఉన్నాడు. షాఫాను రాజైన యోషీయా మతసంస్కరణల కాలంలోని లేఖికుడు (2రాజులు 22:3-14). యిర్మీయా గ్రంథపుచుట్టను రాజైన యెహోయాకీము కాల్చరాదని షాఫాను మరొక కుమారుడైన గెమర్యా వాదించాడు (36:10,25). షాఫాను మూడవ కుమారుడు గెదల్యా యెరూషలేము పతనం తర్వాత యూదాకు అధికారిగా నియమించబడ్డాడు. (39:14; 40:5-16). 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |