Chronicles I - 1 దినవృత్తాంతములు 1 | View All

7. యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

10. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

11. లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

12. పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

13. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

15. హివ్వీయులు అర్కీయులు సీనీయులు

18. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

19. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

20. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

21. హదోరమును ఊజాలును దిక్లానును

22. ఏబాలును అబీమా యేలును షేబను

23. ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

26. అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

27. అబ్రాహాము కుమారులు,

29. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

31. యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

32. అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

33. మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.

35. ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

36. ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

37. రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

39. లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

41. అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

42. ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

43. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

44. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

45. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

46. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

47. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

48. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

49. షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

50. బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.

51. హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

52. అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

53. కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

54. మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.



బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 దినవృత్తాంతములు గ్రంథకర్త ఈ గ్రంథాన్ని సమకాలీనులైన యూదుల కోసమే ప్రత్యేకంగా రాస్తున్నప్పటికీ, ప్రజలందరూ మొదటి మానవుడైన ఆదాము నుంచి ఉద్భవించినవారే అని సంక్షిప్తంగా జ్ఞాపకం చేస్తూ తన రచన ప్రారంభించాడు. మొదటి మానవుని వైఫల్యం తరువాత చిగురించి కొనసాగుతున్న నిరీక్షణకు షేతు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు (ఆది 4:25). 

1:2-4 ఆది పితరుల వంశావళి వివరాలు ఆదాము నుండి నోవహు దగ్గరకు త్వరగా కదిలాయి. ఈ వంశాల వరసలో ఉన్న పురుషులకు యవ్వనప్రాయంలోనే కుమారులు జన్మించారు. తరవాత ఆ పురుషులు చాలా శతాబ్దాలు జీవించారు. హనోకు వాస్తవానికి మరణించలేదు కానీ పరమునకు కొనిపోబడ్డాడు. (ఆది 5:24). మెతూషెల 969 సంవత్సరాల వయస్సు కలిగి దీర్ఘకాలం జీవించాడు. ఆదాము "సృష్టించబడిన” సుమారు 1,650 సంవత్సరాల తరువాత మెతూషెల మరణించాడు. నోవహు కాలంలో జలప్రళయం కూడా ఈ సంవత్సరంలోనే సంభవించి ఉండవచ్చు. వృత్తాంతకారుడు తరచూ వంశంలో ప్రధాన సంతతి గురించి తెలియజేయడానికి ముందు, ఒక చిన్న లేదా వేరొక సంతానపు వంశావళిని ప్రస్తావించాడు. ఆ విధంగా షేము వంశావళిని వివరించక ముందు, యాఫెతు, హాము వంశీకుల గురించి వివరించాడు. 

1:5-7 యాఫైతు సంతతివారు అతని సహోదరుల సంతతి వారికన్నా దూరంగా ఉత్తర ప్రాంతానికి వెళ్ళారు. 

1:8-16 హాము కుమారులలో అనేకులు వివిధ దేశాలకు తమ పేర్లు పెట్టారు, వాటిలో అనేక దేశాలు వాగ్దానభూమిలో ఇశ్రాయేలీయులకు ప్రధాన ప్రత్యర్థులు అయ్యాయి. 

1:17 షేము వంశావళిలో అబ్రాహాము ఉన్నాడు కాబట్టి వృత్తాంతకారునికి ఈ వంశం చాలా ముఖ్యమైనది.

1:18 ఏబెరు పేరునుంచే "హెబ్రీయులు” అనే పేరు వచ్చిందని కొందరు వేదాంత పండితులు ప్రతిపాదించారు, కానీ ఈ ఆపాదన ఖచ్చితమని చెప్పలేము.

1:19 సహోదరులైన పెలెగు, యొక్తానుల నడుమ షేము వంశావళి విభజింపబడింది. "పెలెగు” అంటే “విభజన", అతని కాలంలోనే బాబేలు గోపురపు ఉదంతం జరిగింది, మాట్లాడే భాషలను బట్టి మానవాళి అంతా విభజించబడింది. 

1:20-23 మరలా వృత్తాంతకారుడు ఒక చిన్న వంశావళి గురించి తెలియజేయడం వలన మనం యొక్తాను వారసుల గురించి చదువుతున్నాం. 

1:24-27 ఇక్కడ పెలెగు వారసుల ఆధారంగా షేము, అబ్రాహాము మధ్య సంబంధాల త్వరిత పరిశీలన కనబడుతుంది. 

1:28 ఈ వచనంలో ఇస్సాకు గురించి ప్రస్తావించినా, యూదా వరకు ఉన్న వంశావళి దగ్గరకు మనం చేరుకోడానికి చాలా దూరం ఉంది. ఇక్కడ ఇష్మాయేలు, అతని కుమారుల గురించి మొదట పేర్కొన్నారు. (వ.29-31). 

1:32-33 శారా వలన తనకు ఒక్క కుమారుడైనా కలగాలని అబ్రాహాము దాదాపు ఒక పూర్తి శతాబ్దం వేచిచూశాడు. అప్పుడు, శారా మరణం తరువాత, కెతూరా అతనికి అనేకమంది కుమారులను బహుమానంగా ఇచ్చింది.

1:34 మరలా యాకోబు లేదా ఇశ్రాయేలుతో కలిపి ఇస్సాకును ప్రస్తావించారు. అయితే ఇక్కడ వృత్తాంతకారుడు ఏశావు మీద దృష్టి కేంద్రీకరించాడు. ఇది కూడా వేరొక వంశావళి.. 

1:35-37 ఏశావు కుమారులు, మనవల పేర్లు జాబితా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ ఈ వంశం తరవాత కాలంలో ఎదోము వంటి అనేక పెద్ద జాతుల ఆవిర్భావానికి కారణమయ్యిందని మనకు తెలుసు. 

1:38-42 శేయీరు అనేది ఎదోమీయుల పూర్వీకుడిని సూచించే సరైన పేరు. ఎదోమీయుల భూభాగంలో ఉన్న ఒక పర్వతానికి కూడా ఇదే పేరుంది. ఎదోమీయులు మృత సముద్ర ప్రాంతంలో యొర్దాను నదికి తూర్పుభాగంలో నివసించారు. “శేయీరువారు", "మాయోనీయులు" అనే పేర్లు పర్యాయపదాలుగా కొన్నిసార్లు ఉపయోగించారు. 

1:43-51 ఎదోము దేశమందు ఏలిన రాజులు గురించి తెలిసింది చాలా తక్కువ. స్పష్టంగా వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల కాలంలో జీవించారు. 

1:51-54 ఈ అధ్యాయం ఎదోము నాయకులు జాబితాతో ముగుస్తుంది. ఇప్పుడు 1దినవృత్తాంతములు గ్రంథంలో ప్రధాన వంశానికి చెందని అనేక ఇతర వంశాలను పేర్కొన్నారు. ఎక్కడ ప్రారంభించినా యూదారాజుల వంశావళికే దారితీసే ఇతర ప్రస్తావనలకు ఇది భిన్నంగా ఉంది. ఆ విధంగా మనం షేము (హాము, యాఫెతు), అబ్రాహాము (ఇష్మాయేలు, కెతూరా కుమారులు), ఇస్సాకు (ఏశావు, ఎదోమీయులు) వంశావళులలో వారి సంబంధికుల/సహోదరుల వంశావళులు గమనించాం. ఇప్పుడు ప్రధాన వంశావళి, అంటే యాకోబు సంతతి గురించి తెలుసుకోడానికి సిద్ధంగా ఉన్నాం . 


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |