18:1-5. ఈ వచనాలు చిన్నపిల్లలవంటి అమాయకత్వాన్ని ప్రోత్సహించడా నికని చెబుతారు కానీ యేసు వ్యాఖ్యలు నిజానికి శిష్యులను చిన్నపిల్లలవంటి దీనత్వాన్ని పొందమని చెప్పినవిగా కనిపిస్తాయి. పరలోకరాజ్యములో గొప్పవాడు కావాలనే కోరిక యథార్థమైన శిష్యత్వానికి సరిపడని ఒక గర్వాన్ని కనపరుస్తుంది. దీనత్వమే నిజమైన గొప్పతనానికి మార్గం. బిడ్డలను తన నామములో చేర్చుకొనువానికి, మెస్సీయ అయిన తనను చేర్చుకుంటే వచ్చే ప్రతిఫలం వస్తుందని చెబుతూ, చిన్నపిల్లలను దయగా, కృపతో చూడాలని
యేసు కోరాడు.
18:6-7 యేసు నిజమైన చిన్నపిల్లల నుండి తన శిష్యులవైపు, అంటే ఆధ్యాత్మికంగా తనయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో అంటూ అంశాన్ని మార్చాడు. పెద్ద తిరుగటిరాయి అంటే మనుషుల చేతితో తిప్పే తిరుగటి రాయి కాకుండా గాడిదతో తిప్పబడే పెద్ద వృత్తాకార రాయి. ఇశ్రాయేలు సముద్ర ప్రయాణాలు చేసే దేశం కాదు కాబట్టి, మునిగిపోవడం అనేది మొదటి శతాబ్దపు యూదుల ఆలోచనలలో అతి భయంకరమైన మరణం.
18:8-9. యేసు శిష్యులు పాపం చేయడానికి కారణమయ్యేవారు తీవ్రమైన శిక్షను పొందుతారు. అయినప్పటికీ, శిష్యులు తమ సొంత క్రియలకు బాధ్యులు. వారు తమను తాము పవిత్రులుగా కాపాడుకోవాలి (5:29-30 నోట్సు చూడండి).
18:10 దేశాలను కాపాడడానికి, ... వాటికి ప్రాతినిధ్యం వహించడానికి దేవదూతలు నియమింపబడ్డారని దాని 10:10-14 బోధిస్తుంది. అదేవిధంగా దేవునియెదుట విశ్వాసులకు ప్రతినిధులుగా దూతలు నియమించబడ్డారని
యేసు బోధిస్తున్నట్లుగా ఉంది. ఈ దూతలు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు... చూచుచుందురు, అంటే వారికి పరలోకంలోని సింహాసనం వద్దకు వెళ్ళడానికి ఎల్లప్పుడూ అనుమతి ఉండి, విశ్వాసుల అవసరాలను దేవునితో ఎల్లప్పుడూ నివేదిస్తారని అర్థం.
18:12-14 పాపం చేసిన విశ్వాసులను వారి పశ్చాత్తాపాన్ని బట్టి వారిని సంఘ సహవాసానికి తిరిగి చేర్చుకొనేటప్పుడు, సణుగుతూనో లేక సంకోచంతోనో స్వీకరించ కూడదు కానీ. తప్పిపోయిన గొట్టె దొరికినపుడు కాపరి ఎంత సంతోషిస్తాడో, అంత సంతోషంతో స్వీకరించాలి. పరలోకపు కాపరి ఒక్క విశ్వాసిని కూడా నష్టపోవడానికి సిద్ధంగా లేడు. . ఈ ఉపమానంలోని కాపరిలాగా ఆయన తప్పిపోయిన తన గొట్టెను రక్షిస్తాడు.
18:16-17 దారితప్పిన గొట్టెలపట్ల గొప్ప కాపరివంటి శ్రద్ధను శిష్యులు ఎలా చూపాలి అనే ప్రక్రియను ఈ వచనాలు వివరిస్తాయి. వ. 15లోని నీయెడల అనే మాటలు ప్రాచీన, నమ్మకమైన. మూలప్రతులలో కనిపించవు. కాబట్టి ఈ ప్రక్రియ కేవలం వ్యక్తిగత మనోవేదనలతో మాత్రమే వ్యవహరించడం మాత్రమే కాక, ఒక క్రైస్తవ సహోదరుని (లేక సోదరి) ఎలాంటి పాపప్రవర్తన గురించియైనా, అది అతణ్ణి/ఆమెను క్రీస్తునుండి దూరం చేస్తున్నట్టు కనిపిస్తుంటే, దానితో వ్యవహరించడం గురించి కూడా ఉద్దేశించబడింది. ఈ ప్రక్రియ ఉద్దేశం శిక్షించడం కాదుగాని పాపంలో పడిన శిష్యుని తిరిగి సమకూర్చడం (నీ సహోదరుని సంపాదించుకొంటివి). ఒకవేళ, ప్రక్రియలోని చివరి మెట్టుపై, పశ్చాత్తాపం పొందడానికైన సంఘపు పిలుపును ఆ శిష్యుడు తిరస్కరిస్తే, అలాంటి వ్యక్తి నిజమైన విశ్వాసి కాడని సంఘము భావించి, వారిని సహవాసం నుండి వెలివేయాలి (1కొరింథీ 5:1-13 చూడండి).
18:18 బంధించడం, విప్పడం గురించి, 16:19 నోట్సు చూడండి. ఎలాంటి ప్రవర్తనకు అనుమతి ఉందో లేక అనంగీకృతమో అనేదాన్ని గురించిన సంఘ నిర్ణయం, దేవుడు పరలోకంలో చేసిన నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయి.
18:19-20 ఒక సామాన్యమైన, తప్పు వ్యాఖ్యానం ప్రకారం, ఈ వచనాలు ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది ఏమి అడిగినా దేవుడు చేస్తాడు అనే వాగ్దానం ఇస్తున్నాయని అంటారు. కానీ అది ఇక్కడి నేపథ్యానికి విరుద్ధం. పాపం చేసిన శిష్యుని పునరుద్ధరించడం అనే ముందటి చర్చకు దీనికి స్పష్టమైన సంబంధం ఉంది. వ.18-19 వచనాలు, భూమిమీద యేసు శిష్యులు తీసుకునే పునరుద్ధరించే శిక్షించే నిర్ణయాలకు, పరలోకంలో
తండ్రి నిర్ణయాలకు ఉన్న సంబంధాన్ని తెలుపుతాయి. మరియు అనే వ. 19 ఆరంభపు మాట, ఈ వచనం వ.18లోని సూత్రాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లు ఉ సూచిస్తుంది. కాబట్టి, వ.20లో సూచించిన ఇద్దరు లేక ముగ్గురు, వ.16లో మొదట పేర్కొన్న ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు. శిష్యుల మధ్య ఇబ్బంది పెట్టే ప్రవర్తనను బట్టి దేవుని నడిపింపును కనుగొనడానికి శిష్యులు కూడుకున్నపుడు, క్రీస్తు వారి మధ్యలో ఉంటాడు. పాపం చేసిన విశ్వాసి పునరుద్ధరణ కోసం వారు చేసే ప్రార్ధనకు ఆయన జవాబిస్తాడు.
18:21-22 ఏడుమారులు మాత్రమే ఎవరినైనా క్షమించడం పిసినారితనంగా అనిపించినా, కొందరు రబ్బిలు తమ విద్యార్థులకు మూడుసార్లు మాత్రమే అనుమతించేవారనే సత్యపు వెలుగులో అది చాలా దాతృత్వంతో కూడినదే. ఒకడు తన సహోదరుని లేక సహోదరిని.. 77 సార్లు క్షమించమని - యేసు కోరాడా లేక 70x7=490 సార్లు క్షమించమన్నాడా అనే దాని గురించి వ్యాఖ్యాతలు వాదోపవాదాలు చేస్తారు, కానీ ఇక్కడ యేసు చెప్పింది, నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు క్షమాపణ అపరిమితంగా ఉండాలని తెలుసుకోవాలి.
18:23-27 యూదుల ఉపమానాలలో రాజు దేవునికి సాదృశ్యం, లెక్క చూచుకొనడం అంటే దైవిక తీర్పుకు సాదృశ్యం. పదివేల తలాంతులు లక్ష కోట్ల రోజుల రైతుకూలీకి సమానం. అది పాలస్తీనా అంతటిలో జరుగుతున్న లావాదేవీలకంటె ఎక్కువ మొత్తం. తలాంతు అనేది అత్యంత పెద్ద నాణెం లేక నోటు (సుమారు 6000 రోజుల జీతంతో సమానం). పదివేలు అనేది గ్రీకుభాషలో వ్యక్తీకరించగలిగే అత్యున్నత సంఖ్య. కాబట్టి ఈ ఉపమానంలో చెప్పిన ఈ మొత్తం, దేవునిపట్ల పాపి ఎన్నడూ తీర్చలేని అప్పును సూచిస్తుంది. ఋణస్తుని, అతని కుటుంబాన్ని, అతని ఆస్తుల్ని అమ్మినప్పటికీ ఈ అప్పు తీర్చడం మొదలు పెట్టడం కూడా కష్టమే. అలాంటి అప్పును క్షమించడం ఉ అద్భుతమైన కృపాకార్యం.
18:28-31 నూరు దేనారములు (సుమారు 100 రోజుల కూలి), మొదటి సేవకుడు రాజుకు అప్పున్నదానితో పోల్చితే చాలా తక్కువ. దేవునికి విరోధంగా మనం చేసిన పాపాలతో పోల్చితే, ఇతరులు మనకు విరోధంగా
చేసిన పాపాలు చాలా తక్కువ. తనయెడల ఓర్చుకొనుము అని ఈ దాసుడు రాజును బతిమాలినట్లుగానే, తోడిదాసుడు బతిమాలాడు. కానీ అతని అప్పు తీర్చగలిగిందే కాబట్టి ఈ తోడిదాసుని బతిమాలడం, వాగ్దానం చేయడం మరింత యథారమైనది.
18:32-35 ఉపమానపు ఉద్దేశం ఇప్పుడు బయల్పరచబడింది. వారి పాపా లను క్షమించడం ద్వారా విశ్వాసులపట్ల దేవుడు గొప్ప కరుణ చూపించాడు కాబట్టి దానికి బదులుగా వారు ఇతరుల పాపాలను హృదయపూర్వకంగా క్షమించాలి. అతని అప్పు పూర్తిగా చెల్లించేవరకు అప్పు తీసుకున్నవానిని బాధించడం కొనసాగుతుంది. కానీ అప్పు తీర్చడం సాధ్యం కాదు కాబట్టి బాధింపబడడం నిత్యశిక్షను సూచిస్తుంది.