Isaiah - యెషయా 10 | View All

1. విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు

2. తలిదండ్రులులేనివారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.

3. దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు?మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
1 పేతురు 2:12

4. వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

6. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

7. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.

8. అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?

9. కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?

10. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?

11. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.

12. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.

13. అతడునేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని

14. పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను చున్నానని అనుకొనును.

15. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

16. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

17. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.

18. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును.

19. అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును.

20. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.

21. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును.

22. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి నను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును
రోమీయులకు 9:27-28

23. ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును.
రోమీయులకు 9:27-28

24. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును

25. వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

26. ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.

27. ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.

28. అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు

29. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.

30. గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు

31. మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు

32. ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూషలేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు

33. చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.

34. ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.బైబిల్ అధ్యయనం - Study Bible
10:1-2 శ్రమ గురించి 1:4 నోట్సు చూడండి. సమాజంలో దీనుల్ని, బలహీనుల్ని ధర్మశాస్త్రం సంరక్షిస్తుంది: విధవరాండ్రు (నిర్గమ 22:22), తలిదండ్రులు లేనివారు(ద్వితీ 10:18), దరిద్రులు (నిర్గమ 23:6,11; ద్వితీ 15:4-11 చూడండి). న్యాయాన్ని వక్రీకరించడానికి మనుషులు ఏర్పాటుచేసిన శాసనాల్ని యెషయా ఖండిస్తున్నాడు. 

10:3 దర్శనదినము వచ్చినప్పుడు వీరెక్కడికి వెళ్లగలరు? ఈ అలంకారిక ప్రశ్నలకు జవాబులు వ.4లో ఉన్నాయి. 

10:4 ఈ వచనం దేవుని కోపము గురించి నాల్గవసారి తెలియజేస్తుంది. (9:12,17,21 తో పోల్చండి), దీనితో ఈ విభాగం ముగుస్తుంది. ఈ వాక్యంలో పునరావృతమైన విషయం ఈ వాక్యభాగంలోని ప్రధానాంశాన్ని తెలియజేస్తుంది. (9:8-10:4). శిక్ష వచ్చినా - గానీ, దేవుని ప్రజలింకా పశ్చాత్తాపపడలేదు. తీర్పు ఇంకా ఎక్కువగా రాబోతుంది. 

10:5 ఈ ప్రకటన అష్యూరీయులకు శ్రమ అంటూ ప్రారంభమవుతుంది. శ్రమ గురించి 1:4 నోట్సు చూడండి (5:8-30 నోట్సు కూడా చూడండి). ఈ శ్రమ దేవుని ప్రజల గురించి కాక, శత్రువు గురించి చెప్పబడింది (వ. 1). ఇశ్రాయేలు మీదకు, యూదా మీదకు శిక్షను రప్పించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న సాధనం అష్పూరు. దండము అనే పదం “సామెతలు" గ్రంథంలో దండం గురించి ఉన్న విస్తృతమైన ఉపదేశాన్ని, అంటే పిల్లల్లోని మూర్ఖత్వం పోవడానికి దండాన్ని ఉపయోగించ వలసినదేననే బోధను (సామె 10:13; 22:15), కుమారుడు సరైన త్రోవలో నడిచేలా తండ్రి బెత్తాన్నుపయోగించడాన్ని (సామె 13:24; 23:13-14) గుర్తుచేస్తుంది. 

10:6 భక్తిహీనులైన జనముల అనే పదజాలం వ్యంగ్యార్థంలో అష్కూరును కాక, ఇశ్రాయేలును సూచిస్తుంది. వీరు దేవుని కోపానికి గురికానున్నారు. దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును అనే పదజాలం మహేరు షాలాల్ హాష్ బజ్ అనే పేరును గుర్తుచేస్తుంది, ఈ పేరుకు “త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును" అని అర్థం (8:1). 

10:7 దేవుని ఉద్దేశానికి, అష్నూరు ఉద్దేశానికి మధ్య వ్యత్యాసముంది. దేవుడు తన ఉద్దేశాల కోసం అషూరును ఉపయోగించుకొనడంలో ఈ వ్యత్యాసం ఆటంకం కానేరదు, పైగా ఇది దేవుని ఉగ్రత కుమ్మరించడానికి కూడా ఒక సాధనం కాగలదు. పాపాత్ములైన తన ప్రజల్ని శిక్షించడం ద్వారా తనకు మహిమ తెచ్చుకోవడం దేవుని ఉద్దేశమైతే, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అషూరు ఉద్దేశం. 

10:8-11 గర్విష్ఠుడైన అష్నూరు రాజు మాటల్ని యెషయా ఉటంకిస్తున్నాడు. 

10:9 ఈ జంట పట్టణాల పట్టిక దక్షిణపు కొన నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రకారంగా, కల్నో (దీనికి కల్నే అనే పేరు కూడా ఉంది) కర్కెమీషుకు దక్షిణంలో ఉంది. హమాతు అర్పాదుకు దక్షిణంలో ఉంది, షోమ్రోను దమస్కుకు దక్షిణంలో ఉంది. ఈ పట్టణాలు భౌగోళికపరంగా జంటగా కనబడుతున్నాయి తప్ప అవి ఓటమి పాలైన కాలాన్ని బట్టి కాదు. కర్కెమీషు క్రీ.పూ. 717లో అష్యూరు వశం కాగా, కల్నో క్రీ.పూ. 738 లో, హమాతు క్రీ.పూ.738, క్రీ.పూ.720 లో, అర్పాదు. క్రీ.పూ. 740 లో అపూరు వశమయ్యాయి. అషూరు రాజు మాటల్లో సామ్రాజ్యవాదం కనబడుతుంది, ఇది అతని ఉద్దేశం, దేవుని ఉద్దేశానికి వేరుగా ఉందని మళ్లీ తెలియజేస్తుంది.

10:10-11 దక్షిణంలోని పట్టణాలకు, ఉత్తరంలోని పట్టణాలకు మధ్య పోలిక ఉత్తరంలోని షోమ్రోను దక్షిణంలోని యెరూషలేము మధ్య పోలికకు పరాకాష్ఠ: సిరియాలోని పట్టణాల్లో లాగానే ఈ రెండు పట్టణాల్లో కూడా విగ్రహారాధన జరుగుతుంది (వ.9). 

10:12 దేవుడు అషూరు సామ్రాజ్యవాద కాంక్షను త్రోసిపుచ్చుతున్నాడు. వాస్తవానికి, దేవుడు విగ్రహపూజలు చేస్తున్న తన స్వంత ప్రజల్ని శిక్షించడానికి భక్తిహీనులైనవారిని ఉపయోగించుకుంటున్నాడు. ఏదేమైనా, అష్నూరు రాజు, అతని రాజ్యం దేవుని నుండి తప్పించుకోలేవు. 

10:13-14 అషూరు రాజు అతిశయపు మాటలు అప్పటి కాలంలో అష్నూరు రాజులు వేయించిన శిలా శాసనాల్లోని శబ్దాడంబరపు మాటల్ని ప్రతిబింబిస్తు న్నాయి. పక్షి గూటిలో చేయివేసి విడువబడిన గుడ్లను ఏరుకొనడమనే వర్ణన అషూరు రాజు తన క్రూరత్వంతో బలహీనంగా ఉన్న దేశాల మీద దాడిచేసి వాటిని తన కనుకూలంగా మలచుకోడాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి, అష్వూరు రాజు ప్రాబల్యాన్ని, అతని శక్తిని సవాలు చేసే రాజు లేకపోవడం గమనార్యం. 

10:15 అషూరు రాజు అతిశయపు మాటలు గాలిమేడలవంటివి. అతని వైపు నుండి చూచినప్పుడు అతడు శక్తిమంతుడైన యోధుడు, గొప్ప సైన్యం గల రాజు. అయితే, పరలోక దృక్పథం నుండి చూచినప్పుడు అతడు దేవుడు తన ఉద్దేశాల్ని అమలుచేయడానికి ఆయన ఉపయోగించుకుంటున్న ఒక సాధనం మాత్రమే. అషూరు రాజు నుద్దేశించి వేసిన అలంకారిక ప్రశ్నల్లోని అంతరార్థం అతని కపటోపాయాల్ని బట్టి అతన్ని నిందించి, అతన్ని ఇరుకున పెట్టడమే. ప్రతి ప్రశ్నకూ జవాబు “లేదు” అనే వస్తుంది. 

10:16-19 నిందారోపణల స్థాయి దాటిపోయి శిక్షకు దారితీసే పరిణామం ఈ వచనాల్లో కనబడుతుంది. క్షయరోగము మరియు కొరవికట్టె ద్వారా శిక్ష రానున్నదనే వర్ణన అక్షరార్థమైంది, అలంకారికమైంది కూడా. విషయం స్పష్టంగా ఉంది: వైభవాన్ని, వృద్ధిని అనుభవిస్తున్న అష్పూరు దేవుని నుండి వచ్చే శిక్షచేత బలహీన పడబోతున్నది.

10:17 దేవుడు వెలుగు అనే సాదృశ్యాన్ని సాధారణంగా అనుకూలాత్మకమైన ఉద్దేశాల్ని తెలియజేయడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. (కీర్తన 27:1). సూర్యప్రకాశం మాదిరిగా దేవుడు తన ప్రజల్ని స్పష్టంగా చూడగలిగేలా చేయగలడు, తీర్పులో మాడ్చి చంపివేయగలడనే అర్థాన్నిస్తుంది. 

10:20 శేషము ఇక అన్యరాజు శక్తిని కాక దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తారు. 

10:21-23 అబ్రాహాము సంతానం సముద్రపు ఇసుకవలె అసంఖ్యాకంగా ఉంటారని దేవుడతనితో వాగ్దానం చేశాడు (ఆది 22:17; 32:12; 41:49 చూడండి), అయితే శిక్ష కారణంగా శేషము మాత్రమే ఉన్నారు. వీరైనా సజీవులుగా ఉండడం కేవలం దేవుని కృపాకార్యమే. వ.22-23 లను పౌలు రోమా 9:27-28లలో ఉటంకించాడు.

10:24 ప్రస్తుతం అషూరు నుండి ఎదురవుతున్న బెడదను ఐగుప్తు దాస్యంతో పోల్చవచ్చు. ఈ పోలిక దేవుడు ఎఱ్ఱసముద్రం దగ్గర తన ప్రజల్ని విమోచించిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది (నిర్గమ 14-15). 

10:25 తన నిబంధనాజనుల పట్ల దేవుని ఉగ్రత తాత్కాలికమైనది, అయితే అష్కూరుపట్ల ఆయన ఉగ్రత వారిని సమూల నాశనము చేస్తుంది. 

10:26 ఓరేబు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల్ని అణచివేసిన మిద్యానీయుడు. గిద్యోను మనుషులు ఓరేబును ఓడించి, అతన్నొక బండ దగ్గర చంపివేశారు. అందుకు ఆ బండకు ఓరేబు బండ అనే పేరు వచ్చింది (న్యాయాధి 7:24-25). ఐగుప్తులో “ఆయన దండము" అనే ప్రస్తావన ఎఱ్ఱసముద్రం దాటడాన్ని గుర్తుచేస్తుంది. దేవుని సన్నిధికి సంకేతంగా ఉన్న దండమెత్తి మోషే ఇశ్రాయేలీయుల్ని ఎల్ల సముద్రం దాటించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు సైన్యం నుండి తప్పించుకొనేలా దేవుడు ఎఱ్ఱసముద్రాన్ని మధ్యకు విభజించాడు (నిర్గమ 14:21-31). 

10:27 ఇతరుల రాజకీయాధిపత్యాన్ని వర్ణించడానికి ప్రవక్తలు కాడి అనే పదాన్నుపయోగించడం పరిపాటి (14:25; 47:6; 58:6; యిర్మీయా 27:11; 30:8; యెహె 30:18). 

10:28-32 ఈ వచనాల్లోని ప్రకటన అషూరు సైన్యం ఉత్తరం నుండి యెరూషలేము గుమ్మం వరకు దండెత్తి రావడాన్ని వర్ణిస్తుంది. కొందరు దీన్ని యెరూషలేము మీద వాస్తవంగా జరిగిన దాడి అని వివరించినప్పటికీ, దీన్ని క్రీ.పూ. 701లో సనెరీబు నాయకత్వంలో జరిగిన అష్నూరు దాడి అని చెప్పలేము, ఎందుకంటే సనైరీబు సైన్యం మరొక దారి నెంచుకుంది. దీన్నిబట్టి కొందరు పండితులు అషూరు సైన్యం తరువాతి కాలంలో యూదా మీద రెండవసారి దాడి చేసిందనే అభిప్రాయానికి వచ్చారు. గానీ” ఇది సందేహాస్పదమే. ఈ వచనాల్లోని దారి వాస్తవంగా సైన్యం ప్రయాణించినది కాకపోవచ్చు. ఎందుకంటే ఈ భూభాగాల ద్వారా సైన్యం రావడం కష్టం. కాబట్టి, ఈ వచనాలు శత్రుదాడి గురించి వాస్తవికంగా కాక, ఊహాత్మకంగా తెలియజేస్తున్నాయని అర్థం చేసుకొనవచ్చు. ఇక్కడ వర్ణించబడిన దారి “కాకి ఎగిరినంత” తిన్నగా ఉన్న దారి. భౌగోళికంగా ఉన్న అడ్డులు సైతం సైన్యం ముందుకు రావడాన్ని మందగించలేవు. 

10:28 ఆయాతు బహుశా హాయి అయ్యుండవచ్చు. (యెహో 8), ఇది యెరూషలేముకు ఉత్తరంలో సుమారు ముప్పయి మైళ్ల దూరంలో ఉంది. అయితే, అయ్ అనే హెబ్రీ పదానికి “పాడుదిబ్బ" అనీ, దాని బహు వచనమైన అయిత్ అనే పదానికి “పాడుదిబ్బలు” అని అర్థం. ఈ పేరు అనేక స్థలాలను సైతం సూచించవచ్చు. మిగ్రేను స్వెనిట్ వాగును సూచిస్తుంది, ఇది మిక్మషుకు గెలకు మధ్య ఉన్న ఎండిపోయిన నదీ గర్భం. 

10:29 రామా... గిబ్యా యెరూషలేముకు ఉత్తరంలో ప్రధానమైన పర్వతమార్గం మీద ఉన్నాయి.

10:30 గల్లీము... లాయిషా... అనాతోతు (యిర్మీయా ప్రవక్త స్వస్థలం ; యిర్మీయా 1:1) యెరూషలేముకు ఉత్తరంలో కొద్ది దూరంలోనే ఉన్నాయి. 

10:31 మద్మేనా... గిబా ఎక్కడుండేవో ఇంకా గుర్తించలేదు., బహుశా ఇవి యెరూషలేముకు ఉత్తరంలో కొద్ది దూరంలో ఉన్న గ్రామాలు అయ్యుండవచ్చు. 

10:32 నోబు యెరూషలేముకు ఈశాన్యంలో కొద్ది దూరంలో ఉన్న ప్రస్తుత మౌంట్ స్కోపస్ అని అభిప్రాయపడుతున్నారు. నోబు మీద ఎవరైనా నిలబడితే, యెరూషలేము నగరదృశ్యం చాలా బాగా కనబడుతుంది. దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు అతనికి నోబులో ఆహారం, గొల్యాతు ఖడ్గం కూడా లభించింది. దావీదుకు మేలు చేసినందుకు సౌలు రాజు యాజకుల్ని నోబులోనే చంపించాడు (1సమూ 21:1-9; 22:11-23). నోబు అనాతోతు సమీపంలో ఉందనే ప్రస్తావన నెహెమ్యా 11:32 లో కూడా కనబడుతుంది. 

10:33-34 ఆకస్మిక తారుమారుతో ఈ ప్రకటన ముగుస్తుంది. అష్యూరు యెరూషలేము మీదకు దాడి చేసింది. అయితే అష్నూరు దండు నాశనమైంది. వీరు కొట్టివేయబడిన చెట్లు లాగా ఉన్నారు (చివరి పంక్తిలోని లెబానోను సూచనాత్మకంగా కనబడుతుంది), దేవుడే వీరిని కొట్టివేశాడు. దేవుడు తన ప్రజల్ని శిక్షించడం కోసం అష్యూరు దేవుని చేతిలో గొడ్డలి అయ్యింది (వ. 15). ఇప్పుడు దేవుడు తానుగా వారి మీద గొడ్డలి ప్రయోగిస్తున్నాడు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |