Chronicles I - 1 దినవృత్తాంతములు 26 | View All

1. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.

2. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,

3. ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు.

4. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,

5. అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.

6. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.

7. షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.

8. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.

9. మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.

10. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,

11. రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.

12. ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.

13. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.

14. తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,

15. ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.

16. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.

17. తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును,దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,

18. బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.

19. కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.

20. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.

21. లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.

22. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.

23. అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.

24. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.

25. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.

26. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును

27. యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.

28. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.

29. ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.

30. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమ శాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

31. హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి.

32. పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.బైబిల్ అధ్యయనం - Study Bible
26:1-3 ఈ క్రింది ద్వారపాలకుల జాబితా లేవీయులలో కహాతు, మెరారిల రెండు కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యింది. సంగీతకారుడైన ఆసాపు గెరోము వంశానికి చెందినవాడు. (6:39-43), కాబట్టి ఇక్కడ పేర్కొన్న ఆసాపు వేరొక వ్యక్తి. బహుశ ఇక్కడ “ఆసాపు” అనే పేరును సెప్టువజింట్లో పేర్కొన్న విధంగా “ఎబ్యాసాపు” అని చదవాలి. 9:19లో “ఎబ్యాసాపు” కూడా పోల్చండి. 

26:4-8 మందసము యెరూషలేముకు తీసుకువచ్చే సమయంలో ఓబేదెదోము వాద్యకారులతో జతకలిశాడు (15:21), కానీ అతడు వృత్తిరీత్యా ద్వారపాలకుడు. ఆ చొరవ ఇప్పుడు శాశ్వతంగా విధులు నిర్వహించడానికి ఉపయోగపడింది, అరువది యిద్దరు కుటుంబ సభ్యులతో ఒక ప్రత్యేకమైన వంశంగా సిద్ధపడి వచ్చిన ఓబేదేదోము ద్వారపాలకులలో ప్రముఖునిగా ఉన్నాడు. అతని కుమారుడైన షెమయా, లేవీయులలో శాస్త్రిగా ఉన్న నెతనేలు కుమారుడైన షేమయా (24:6), వేర్వేరు వ్యక్తులు. 

26:9 ఓబేదెదోము కుమారులు మెషెలెమ్యా గురించిన చర్చలో అంతర్లీనంగా ఉన్నారు. 

26:10-11 కొందరు మెరారీయులు కూడా ద్వారపాలకులుగా పనిచేశారు. 

26:12 ఆరాధన విధులు నిర్వహించిన వారి బాధ్యతలు ఎంత విశిష్టమైనవో, ఈ ద్వారపాలకులు చేసిన సేవ కూడా అంతే విశిష్టమైనదని వృత్తాంతకారుడు వక్కాణించి తెలియజేశాడు. సమర్పణ కలిగిన ద్వారపాలకులు లేకుండా మందిరంలో పరిచర్య ముందుకు కొనసాగదు. 

26:13 ద్వారపాలకులను భిన్నసమయాల్లో పని చేసే ఇరవై నాలుగు బృందాలుగా విభజించకుండా, కాపలా కాయవలసిన గుమ్మములను బట్టి వారికి పనిని కేటాయించాడు. 

26:14-15 ప్రతి ద్వారమునకు కాపలాకాసే నాయకుడిని కుటుంబసభ్యుల నేపథ్యాన్ని బట్టి ఎంపిక చేశారు. అయితే ఎంపికకు వారి సామర్థ్యమే ప్రామాణికమయ్యింది. తండ్రులు, కుమారులు సమాన సామర్థ్యం కలిగి వున్న సందర్భంలో, ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి వారిలో ఎవరినీ ఆపలేదు. తండ్రి కుమారులు ఇద్దరినీ తమతమ ద్వారముల వద్ద పాలకులుగా నియమించారు. షెలెమ్యా, అతని కుమారుడు జెకర్యా విషయంలో, ఇంకా ఓబేదెదోము, అతని కుమారుల విషయంలో ఇలానే జరిగింది. 

26:16 జంతువుల బల్యర్పణలు అర్పించగా మిగిలిన వ్యర్థపదార్థాలను పడవేయడానికి షల్లెకెతు గుమ్మమును కేటాయించారు. 

26:17-19 కాపలా బాధ్యతలు మందిరపు గుమ్మాలకే పరిమితం కాలేదు. మందిరపు బొక్కసములకు (సామానుల గది) కూడా భద్రత అవసరం కాబట్టి మందిరపు వెలుపల భాగంలో కూడా కావలి వారిని నియమించారు. ప్రత్యేకంగా మందిరానికి వెళ్ళే దారిలో కాపలా ఏర్పాటు చేశారు. మందిరానికి వెలుపల నున్న కాపలాదారులు, మందిర ప్రాంగణ వెలుపల సమస్యలు, ముఖ్యంగా బల్యర్పణలకు అనంగీకారమైన జంతువులను తీసుకురాకుండా చూచేవారు. 

26:20-22 ద్వారపాలకులు ముఖ్యంగా మెరారి, కహాతు వంశాలనుంచే వచ్చారు. గెరోనీయులను మందిరపు బొక్కసములను కాపలా కాయుటకు నియమించారు.
ఎవరూ దొంగిలించకుండా, ధ్వంసం చేయకుండా మందిరపు వనరులను (వస్తువులను) కాపలా కాయడం, వాటిని భద్రపరచి లెక్క అప్పగించడం వంటివి వీరి విధులు. ఈ పని అహీయా పర్యవేక్షించాడు. బొక్కసములలో (ఖజానాలో) దీర్ఘకాలిక నిల్వలు, మందిరంలో అనుదిన కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఉండేవి. 

26:23-27 ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి గానీ, అక్కడ ఇంకా మందిరం లేదు. అందుకోసం దావీదు ధనం ఇచ్చాడు, అతని ఉన్నతాధిపతులు, సైన్యాధిపతులు మందిరపు నిధికి ధనం ఇచ్చారు. ఈ చెల్లింపులలో అధిక భాగం సైనిక విజయాలలో కొల్లసొమ్ము నుంచి వచ్చింది. 

26:28 మందిరం గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన ప్రారంభం కాకముందే, ఇశ్రాయేలు నాయకులు ప్రత్యక్ష గుడారంలో వస్తువులు, సొమ్ము ప్రతిష్ఠించారు. 
ఇలా సేకరించిన వస్తువులు సమూయేలు, రాజైన సౌలు, అతని సైన్యాధిపతియైన అబ్నేరు, దావీదు సైన్యాధిపతియైన యోవాబు, దావీదు ప్రతిష్ఠించినట్లు గమనించగలం.

26:29 మరొక లేవీయుల సమూహం ఏర్పాటు చేయబడవలసి ఉంది. లేఖికులుగాను, న్యాయాధిపతులుగాను ఉన్న వీరు ఇశ్రాయేలులో దైవిక చట్టమును అమలు చేసే బాధ్యతను కలిగి ఉన్నారు. 

26:30-32 యొర్దానునదికి తూర్పున నివాసమున్న రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రమునకు చెందినవారు మిగతా ఇశ్రాయేలీయుల నుండి అప్పటికే దూరమైపోతున్నారు. దావీదు తన పరిపాలన చివరి భాగంలో మాత్రమే దూరంగా నున్న ఈ గోత్రాల వారికి అనువైన బోధకులను నియమించాడు.


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |