Chronicles II - 2 దినవృత్తాంతములు 23 | View All

1. అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయాకుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా

2. వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణము లన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి.

3. జనులందరు సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసికొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను--యెహోవా దావీదు కుమారులను గూర్చి యిచ్చిన సెలవుచొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను.

4. కాబట్టి మీరు చేయవలసిన దేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను.

5. ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను.

6. యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు, వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను.

7. లేవీయులందరు తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లు నప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను.

8. కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహో యాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతి వాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.

9. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.

10. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.

11. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మ శాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించిరాజు చిరంజీవియగునుగాక యనిరి.

12. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనులయొద్దకు వచ్చి

13. ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొనిద్రోహము ద్రోహమని అరచెను.

14. అప్పుడు యాజకుడైన యెహోయాదాయెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

15. కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.

16. అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.

17. అంతట జనులందరును బయలు దేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.

18. మరియమోషే యిచ్చిన ధర్మశాస్త్ర మందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.

19. యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వార పాలకులను ఉంచెను.

20. మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజనగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనుని చేయగా

21. దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
23:1-3 అతల్యాను పడదోయటానికి ప్రణాళిక వేయకముందు యెహోయాదా ఆరు సంవత్సరాలు సహనంగా వేచిచూశాడు. యెహోయాదా దురుసుగా ప్రవర్తించలేదు, కానీ సైనిక నాయకులు, లేవీయులు, ఇంకా పితరుల గోత్రాల పెద్దలు తనవైపు ఉండేలా చూసుకున్నాడు. వారు యెరూషలేములో సమాజముగా కూడినప్పుడు, అతల్యాకు జనుల మద్దతు లేదని ఋజువయ్యింది. 

23:4-7 శక్తివంతమైన, క్రమశిక్షణతో కూడిన, బాగా సిద్ధపడిన తిరుగుబాటుదారులను యెహోయాదా సమకూర్చాడు. మందిరంలో పరిచర్య కోసం ఏర్పాటుచేసిన వారిలో మూడవవంతు సేవకులతో యాజకులును, లేవీయులును తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కనిపించేలా చేశాడు. అదే సమయంలో మిగిలిన లేవీయులు పరిసర ప్రాంతంలో మాటువేశారు, వారిలో సగంమంది రాజనగరు వద్ద ఉన్నారు, మరొక సగం పునాది గుమ్మము వద్ద ఉన్నారు. ఆయుధధారులు మందిర ప్రాంగణంలో ఉన్నారు. అయితే మందిర పవిత్రత అతిక్రమించి ప్రవర్తించ కూడదని యెహోయాదా వారికి సెలవిచ్చాడు. సైనికులు అక్కడ ఉండటంతో బాలుడైన యోవాషుకు ఏమీ కాదనే భరోసా లభించింది. 

23:8-10 మందిరమందు దావీదు కాలంనుంచి దాచిన ఆయుధాల గది ఒకటి ఉంది. అందుకే, సైనికులు ఆయుధాలు లేకుండా మందిరంలో ప్రవేశించినా, లోపలికి వెళ్ళిన తరవాత ఆయుధాలు ధరించడం సాధ్యమయ్యింది. 

23:11 అప్పుడు వారు యోవాషను బయటకు తోడుకొని వచ్చి, ఆ బాలుణ్ణి రాజుగా ప్రకటించారు. ధర్మశాస్త్ర గ్రంథము అని పేర్కొన్న నిబంధన గ్రంథం బహుశ ద్వితీయోపదేశకాండం అయివుండవచ్చు. అయితే అది యోవాషు అసలు హక్కుగల రాజు అని గుర్తిస్తున్నట్లు యెహోయాణా ప్రజల నాయకులతో చేసిన ఒప్పందపు నకలు కూడా కావచ్చు. 

23:12-13 ప్రవేశస్థలము దగ్గరనున్న స్తంభము సాధారణంగా పట్టాభిషేకాలు జరిగే స్థలం కావచ్చు (న్యాయాధి 9:6; 2రాజులు 11:14; 23:3). బహుశ అతల్యా చిన్నవాడైన యోవాషును గుర్తించి ఉండకపోవచ్చు. అందుకే ఎవరో ద్రోహము చేస్తున్నారని ఆమె అనుకుంది. 

23:14-15 ఆమెను అక్కడే చంపించి మందిరాన్ని అపవిత్రపరచాలని యెహోయాదా అనుకోలేదు.

23:16-17 బాలుడైన రాజు నిర్ణయాలు తీసుకోడానికి ఇంకా చాలా చిన్నవాడు కాబట్టి అతనికి ప్రతిగా యెహోయాదా మాట్లాడాడు. రాజు పక్షంగా అతడు, ప్రజలు దేవుని వద్దకు తిరిగి రావడానికి .సమ్మతించారు. వారు యెహోరాము, అహజ్యా, అతల్యాల కాలంలో ఆరాధనకు కేంద్రంగా ఉన్న బయలు దేవత గుడికిపోయి దాని కట్టడమును, బలిపీఠములను, విగ్రహాలను విరుగగొట్టారు. బయలు యాజకుడైన మత్తానును చంపారు. 

23:18-19 అనేక సంవత్సరాల క్రిందట దావీదు నియమించిన ప్రకారంగా మందిరములో పనులు క్రమంగా జరిగేలా యెహోయాదా పునరుద్ధరించాడు. అర్పించవలసిన దహనబలులు అర్పించేలా, దావీదు నియమించిన సంగీత సేవ జరిగేలా, మందిరంలో అనుదిన కార్యక్రమాలలో ఆనంద స్తుతి మరల వినిపించేలా అతడు జాగ్రత్తలు తీసుకున్నాడు. 

23:20-21 యెహోయాదా, అతల్యాను గద్దె దించడంలో అతనికి సహకరించినవారు కలసి ఆ బాలుడైన - యోవాషను రాజనగరుకు తీసుకువచ్చారు, యోవాషును రాజ్యసింహాసనము మీద ఆసీనుని చేశారు. దేశంలో ఎలాంటి ముప్పులేకుండా, నెమ్మదికరమైన పరిస్థితి నెలకొని ఉందని తెలియజేయడానికి న్యాయాధిపతులు గ్రంథంలో ఉపయోగించిన పదమే ఇక్కడ కూడా పట్టణం నెమ్మదిగా ఉందని తెలియజేయడానికి ఉపయోగించారు (న్యాయాధి 3:11; యోబు 3:26 పోల్చండి; యెషయా 32:17; యిర్మీయా 30:10), అసలు కలహానికి అతల్యా కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |