Luke - లూకా సువార్త 16 | View All

1. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా

2. అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.

3. ఆ గృహనిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహనిర్వాహ కత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.

4. నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,

5. తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.

6. వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసి కొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను.

7. తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితోనీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.

8. అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా పరులై యున్నారు

9. అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.

10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

12. మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

13. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.

14. ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా

15. ఆయన మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.

16. యోహాను కాలమువరకు ధర్మశాస్త్ర మును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింప బడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు

17. ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.

18. తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచ రించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసి కొనువాడు వ్యభిచరించుచున్నాడు.

19. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

20. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి

21. అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.

22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి

24. తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను-నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.

25. అందుకు అబ్రాహాము-కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.

26. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.

27. అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.

28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

29. అందుకు అబ్రాహాము -వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా

30. అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.

31. అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.బైబిల్ అధ్యయనం - Study Bible
16:1-2 ధనవంతుడొకడు తన ఆస్తికి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలను నిర్వహించడానికి ఒక వ్యక్తిని (గ్రీకు. ఓయికోనొమొస్, గృహనిర్వాహకుడు, విచారణకర్త) నియమించుకున్నాడు. ఈ గృహనిర్వాహకుడు ఆ ధనవంతుని ఆస్తిని వృధా చేస్తున్నాడనే అపవాదు నిజమే. అతడు నిర్లక్ష్య
ధోరణితోనో లేదా అక్రమంగానో దాన్ని దుర్వినియోగం చేశాడు. అందువల్లనే తన యజమానుడు ప్రశ్నించినప్పుడు ఈ గృహనిర్వాహకుడు తనను తాను సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. యజమాని తన ఆస్తికి సంబంధించిన లెక్కల్ని జాగ్రత్తగా అప్పగించమని అతణ్ణి ఆదేశించాడు. దాని వలన తర్వాత రాబోయే గృహనిర్వాహకుడు ప్రారంభం నుంచే ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.

18:3-4 తనను యజమాని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నాడని ఎరిగిన ఆ గృహనిర్వాహకుడు తనను తాను పోషించుకునే మార్గాన్ని అన్వేషించ వలసి వచ్చింది. కాయకష్టం చేసి బ్రతికే స్థితిలో లేడు, భిక్షమెత్తడానికి అహం అడ్డువస్తుంది, అందువల్ల తన దగ్గరకు ఇంతకు ముందు వచ్చిన ఖాతాదారులు తనకు ఆతిథ్యమివ్వడానికి ఇష్టపడేలా చేయడంపై దృష్టిసారించాడు. 

16:5-7 తన యజమాని ఖాతాదారుల అప్పులను ఈ గృహనిర్వాహకుడు తగ్గించి రాశాడు. దీనికి నాలుగు వివరణలు ఉన్నాయి: (1) ఆ రుణస్తులను సంతోషపెట్టి వారి అనుగ్రహం పొందేటంతగా అతడు రుణాన్ని తగ్గించాడు, (2) వాళ్లు తీసుకున్న రుణానికి చెల్లించవలసిన వడ్డీని రద్దు చేశాడు. (3) ఆ లావాదేవీల్లో తనకు రావలసిన వాటాను రద్దు చేశాడు. (4) తన దుబారా ఖర్చును సర్దుబాటు చేసుకోవడానికి ఇంతకు ముందు వేలంలో ఎక్కువ వడ్డీ చెల్లించమని అడిగినవాడు. ఇప్పుడు తొలిసారి తీసుకున్న దాన్నే చెల్లించమని అడిగి ఉంటాడు. ఈ నాలుగు ఎత్తుగడలు సాధ్యమే. యజమానికి పూర్తిగా ఈ గృహనిర్వాహకుడు లెక్కలు అప్పగించాల్సి వచ్చిందని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇతని ఎత్తుగడలు న్యాయమైనవే అయి ఉండవచ్చు. 

18:8-9 యజమానుడు (వ.8) అనే మాటకు గ్రీకు మూలం “కురియోస్" (ప్రభువు). అందువల్ల అన్యాయస్టుడైన ఈ గృహనిర్వాహకుని అభినందించింది దేవుడేనని కొందరు అనుకున్నారు. అయితే, వ.8 మధ్యభాగానికే ఉపమానం పూర్తె ఉండదు. ఆ విధంగా, గృహనిర్వాహకుణ్ణి అభినందించింది. దేవుడు కాదు, యజమానుడే... గృహనిర్వాహకుడు తాను చేసిన తప్పిదాలకు స్పందనగా యుక్తిగా నడుచుకొనెనని మాత్రమే యజమాని మెచ్చుకున్నాడు. వ.8 చివరి భాగంలోనూ, వ.9 లోనూ ఈ ఉపమాన భావాన్ని యేసు తెలియజేస్తున్నాడు. ఈ లోక సంబంధులు (అవిశ్వాసులు) సాధారణంగా ఒకరితో మరొకరు యుక్తిగా వ్యవహరిస్తూ స్నేహితులను గెలుచుకుంటారు. అయితే, వెలుగు సంబంధులు (విశ్వాసులు) కొందరిని విశ్వాసంలోకి నడిపించడానికి తమ ఆర్థిక వనరులను ఉపయోగించడంలో విఫలమవుతున్నారు. విశ్వాసులు ఎవరినైతే గెలుచుకుంటారో వాళ్లే శాశ్వత మిత్రులుగా మారి విశ్వాసుల్ని తమ నిత్యమైన నివాసములలో.... చేర్చుకొంటారు. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి తమ ధనాన్ని యుక్తిగా (అదే సమయంలో నిష్కల్మషంగా) ఉపయోగించమని యేసు ఆ విధంగా తన అనుచరులను ప్రోత్సహించాడు. 

16:10-12 ప్రభువు యెదుట నమ్మకముగా ఉండాల్సిన అవసరముందనేదే ఈ ఉపమానం బోధిస్తున్న రెండవ పాఠం. ఆధ్యాత్మికంగా ప్రతీ విశ్వాసి దేవుడు అనుగ్రహించిన వరాలకు గృహనిర్వాహకుడే. మీరు తక్కువ మొత్తంలో మీ దగ్గర ఉన్న ధనం విషయంలో నమ్మకంగా ఉంటే, ప్రభువు మీకు మరింత ఎక్కువగా ధనాన్ని ఇస్తాడు. అందులో నిత్య విలువ కలిగిన బహుమానాలు కూడా ఉం టాయి. మిక్కిలి కొంచెము విషయంలో నీవు నమ్మదగిన వ్యక్తివి కాకపోతే, నీకు ఎక్కువగా అప్పగించినా కూడా నువ్వు చెడ్డ గృహనిర్వాహకునిగానే ఉంటావు. 

16:13 ఇద్దరు యజమానులను సేవింపడం గురించి, మత్తయి 6:24 చూడండి.. 

16:14-15 పరిసయ్యులు ధనాపేక్ష గలవారు కాబట్టి యేసును వాళ్లు అపహసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవునితోబాటు ధనాన్నీ సేవించడం సాధ్యమేనని వాళ్ళు నమ్మారు. (వ.13). దాని స్పందనగా మనుష్యులలో ఘనముగా ఎంచబడడం అనే వారి కోరిక దేవుని దృష్టికి అసహ్యము అనీ, ఎందుకంటే ఆయన లోకవిలువలను ఆమోదించడు అనీ యేసు పరిసయ్యులకు చెప్పాడు. 

16:16-17 ధర్మశాస్త్రమును ప్రవక్తలును అనే మాట మొత్తం పా.ని.ను సూచించే మాట (వ.29; 24:27,44). బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య పాత నిబంధన యుగానికి ముగింపును సూచిస్తుంది. యేసు పరిచర్య సువార్త ప్రకటనతో మొదలయ్యి, కొత్త నిబంధన యుగాన్ని ఆరంభించింది, దేవునిరాజ్య సామీప్యతను మూర్తీభవించింది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు అనే మాట ఈ సందర్భంలో బహుశా బాప్తిస్మమిచ్చే యోహాను, యేసు, అపొస్తలులు చేస్తున్న సువార్త ప్రకటనలోని తీవ్రతను సూచిస్తూ ఉండవచ్చు. ఒక పొల్లయిన అనే మాట గురించి మత్తయి 5:17-20 చూడండి. 

16:18 మొదటి వివాహాన్ని చట్టవిరుద్ధమైన కారణాలతోనో వేరే ఉద్దేశాలతోనో తెంచేసుకుని పునర్వివాహం చేసుకోవడం వ్యభిచరించినట్లు అవుతుంది.. ఈ వచన భావం ఇదే. సమాంతర వాక్యభాగాలైన మత్తయి 5:31-32; 19:9 లు ఈ వాక్యభాగానికి మరింత వివరణ నిస్తున్నాయి. వ్యభిచార కారణం వలన మాత్రమే విడాకులు తీసుకుని మొదటి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మాత్రమే పునర్వివాహం చట్టబద్దమవుతుందని ఈ వాక్యభాగాలు తెలియ చేస్తున్నాయి.

16:19-21 ధనవంతుడు (లాటిన్. డైవ్స్) నిత్యరాజ్యంలో స్నేహితులను పొందుకోడానికి తన ధనాన్ని ఉపయోగించ లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది (వ.8-9 నోట్సు, చూడండి). కురుపులు అనే మాట కొ.ని.లో ఇక్కడ మాత్రమే ఉపయోగించిన వైద్య పరిభాషిక పదం. ఈ పదం వైద్యునిగా లూకా నేపథ్యాన్ని సూచిస్తుంది (కొలస్సీ 4:14). బాధననుభవిస్తున్న దరిద్రుని పేరు లాజరు కావడం కాకతాళీయమే, ఎందుకంటే అదే పేరుతో ఉన్న వ్యక్తి కొంతకాలం తర్వాత మృతుల్లో నుంచి లేపబడ్డాడు (యోహాను 11:1-44). ఊదారంగు వస్త్రము గురించి, అపొ.కా.16:14 చూడండి. 

16:22-24 ఈ ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. పరదైసు (23:43; 2 కొరింథీ 12:4), అబ్రాహాము రొమ్ము అనే మాటలను మరణం తర్వాత ధన్యకరమైన స్థలాలుగా యూదుల తాల్మూదు గ్రంథం ప్రస్తావిస్తుంది. హేడేస్ అనే గ్రీకు పదం షియోల్ అనే హెబ్రీ పదానికి సమాంతరమైనది. పాతాళము అని దీన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఇది మృతుల లోకాన్ని తెలియజేసే మాట. అయితే, ఈ సందర్భంలో యాతన పడడం గురించిన ప్రస్తావన ఉంది. కాబట్టి పాతాళాన్ని దుర్నీతిపరులైన మృతులుండే నరకం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అగ్నిజ్వాలలో అనే మాట నిత్యాగ్ని గుండమును సూచిస్తుంది (మత్తయి 25:41). 

16:25 లూకా 13:30లో కనబడే నియమానికి నిజరూపమే ఈ వచనం. ధనవంతుడు ఈ జీవితంలో ఎంతో సుఖము అనుభవిస్తూ “మొదటి "వానిగా ఉండేవాడు. ఇప్పుడు అతడు “కడపటి"వాడు అయ్యాడు, ఇది మరణం తర్వాత అతని యాతనను సూచిస్తుంది. దీనికి భిన్నంగా లాజరు తన భూసంబంధమైన జీవితంలో కడపటివానిగా ఉన్నాడు (వ.20-21), ఇప్పుడు మొదటివానిగా ఉంటూ నిత్య ఆదరణ (నెమ్మది) పొందుతున్నాడు. 

16:26 మరణం తర్వాత విశ్వాసులకూ, అవిశ్వాసులకూ మధ్యన ఎవ్వరూ దాటిపోలేనంత అగాథం ఉంటుంది. పరలోకం నుంచి నరకానికి గానీ, నరకం నుంచి పరలోకానికి గానీ దాటిపోజాలడం సాధ్యం కాదు. 

16:27-29 తనకు కలిగిన దుస్థితి నుంచి బయటపడలేనని గుర్తించిన ధనవంతుడు చివరికి తనకున్న అయిదుగురు సహోదరుల నిత్యత్వం గురించి శ్రద్ధ కనపరిచాడు. మోషేయు ప్రవక్తలు అనేవి మొత్తం పా.ని.ను సూచించడానికి ఉపయోగించబడిన మాటలు (వ.16 చూడండి). 

16:30-31 చిత్రమేమిటంటే, యేసు పునరుత్థానం తర్వాత లూకా ఈ మాటలు రాశాడు. మృతులలో నుండి తిరిగి లేపబడిన వ్యక్తులను (లాజరును లేదా యేసును) చూసిన తర్వాత కూడా అత్యంత తక్కువమంది ప్రజలే మారుమనస్సు పొందేలా పురికొల్పబడ్డారని లూకాకు తెలుసు. ఇక్కడ. ఇదే విచారకరమైన సంగతి. లేఖనాల్లోని రక్షణ సందేశాన్ని వాళ్లు హృదయపూర్వకంగా “చెవిగలవాడు వినినట్టు" విశ్వాసంతో వినాలి. మోషేయు ప్రవక్తలు గురించి వ.16-17, 27-29 నోట్సు చూడండి.


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |