Chronicles I - 1 దినవృత్తాంతములు 17 | View All

1. దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించినేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా
అపో. కార్యములు 7:45-46

2. నాతానుదేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో అనెను.

3. ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

4. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాస మునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.

5. ఇశ్రా యేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.

6. నేను ఇశ్రా యేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయుమీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞా పించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా?

7. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడునీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱెలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డినుండి తీసికొని

8. నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగజేయుదును

9. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;

10. నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాకయెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.

11. నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.
మత్తయి 1:1+

12. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.

13. నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.
హెబ్రీయులకు 1:5

14. నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.

15. నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా

16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెనుదేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?

17. దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మను ష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చి యున్నావు.

18. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడ నైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.

19. యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.

20. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.

21. నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

22. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహో వావైన నీవు వారికి దేవుడవై యున్నావు

23. యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.

24. ఇశ్రా యేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.

25. దేవానీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.

26. యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు.

27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వ దించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును.ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి,



బైబిల్ అధ్యయనం - Study Bible
17:1-2 దావీదు, ప్రవక్తయైన నాతాను లిరువురూ మందిరం కట్టించాలనే ఆలోచనకు కట్టుబడి ఉన్నారు. నిబంధన మందసం ఒక గుడారంలో ఉంచడం ద్వారా తాను మందసానికి తగిన గౌరవం ఇవ్వడం లేదని (చిన్నచూపు చూస్తున్నానని) దావీదు భావించాడు. దావీదు ఉద్దేశాలు స్వచ్చమైనవని నాతానుకు తెలుసు కాబట్టి, మందిరం నిర్మించాలనే ప్రణాళికలతో దావీదు ముందుకు సాగకూడదని అనుకోవడానికి ఈ సమయంలో అతనివద్ద ఎలాంటి కారణం లేదు. 

17:3-15 దేవుడు మందిరం గురించి దావీదుకు నాతానుద్వారా ఇచ్చిన సందేశం దావీదు ఆలోచనలకు అనుకూలంగా ఉంది, ఎందుకంటే దావీదు దానిని అనుకూలంగానే తీసుకున్నాడు. చివరికి అక్కడ ఒక మందిరం తప్పకుండా నిర్మించబడుతుంది, ఎందుకంటే ఆరాధనకు ఒక కేంద్ర స్థలం ఏర్పాటు చేస్తానని దేవుడు మోషేకు వాగ్దానం చేసాడు. ఇది బల్యర్పణలకు ప్రత్యేకమైన స్థలంగా ఉంటుంది. (ద్వితీ 12:5-7). దేవుని నివాసమునకై ఈ ఆలయమును నిర్మించేందుకు దేవుడు దావీదును అనుమతించలేదు గానీ అంతకంటే ఉన్నతమైన వాగ్దానం రాజుకు అనుగ్రహించాడు. దావీదు సంతతిని స్థిరపరుస్తానని, వారి రాజవంశం, సింహాసనం అనేక తరముల వరకు ఉంటుందని (వ. 10-12) దేవుడు అతనికి తెలియజేశాడు. అతని కుమారులలో ఒకరు అతని తరవాత రాజు అవుతాడు, అతడే మందిరం నిర్మిస్తాడు. అంతేగాక అతడు దావీదు వంశాన్ని శాశ్వతకాలం కొనసాగిస్తాడు. 

17:16-27 దేవుని మాటలు దావీదు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించాడు. 

17:16-22 మందిరం కట్టడానికి తనకు అనుమతి లభించకపోయినా, తన కుమారుడే మందిరం నిర్మిస్తాడనే వాగ్దానం దేవుడు తనకు అనుగ్రహించిన అనుకూల ధృవీకరణగా దావీదు అర్థంచేసుకున్నాడు. ఇంతకు ముందు మోషే కూడా కొంచెం భిన్నమైన స్వరంతో నేను ఎంతటివాడను అని దేవుని అడిగాడు. (నిర్గమ 3:11; 1సమూ 18:18 పోల్చండి; 2సమూ 7:18; 1దిన 29:14; 2దిన 2:6). ఇక్కడ దావీదు స్పష్టమైన వినయం చూపించాడు. దేవుడు తనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి 1 దిన 17:16-22లో దావీదు ఆయనను స్తుతించాడు.


17:20 "మా దేవుడైన యెహోవా వంటి వాడెవడును లేడు” అని నిర్గమ 8:10లో మోషే స్పష్టంగా ప్రకటించాడు. “యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు” అని హన్నా 1సమూ 2:2లో ప్రకటించింది. 1రాజులు 8:23; యిర్మీయా 10:6-7 కూడా చూడండి. 

17:21 దేవుడు చేసిన కార్యాలను ప్రస్తావిస్తూ వాక్యానుసారమైన స్తుతి విధానంలో (16:8-36) దావీదు దేవుని స్తుతించాడు. 

17:23-26 దేవుడు వాగ్దానం చేసిన విషయాలే దావీదు మరలా దేవునికి ఒక విన్నపంగా తెలియజేస్తున్నట్లు తిరిగి పలకడం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దావీదు చేసిన ఈ ప్రార్థనలోని చివరి భాగంలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటగా, దేవుడు తనకోసం ఉద్దేశించిన ప్రణాళికకు అతడు విధేయత చూపించాడు. రెండవదిగా, దేవుడు తనకోసం ఉద్దేశించిందే తనకు కావాలని దేవునికి వెల్లడిచేశాడు. మూడవదిగా, మన ఆలోచనలు, కోరికలు దేవునివద్ద వ్యక్తంచేయడం ఎప్పుడూ తప్పు కాదని దావీదు తెలియజేస్తున్నాడు. మన విషయానికొస్తే, దేవుడు ఇప్పటికే తెలియజేసిన విషయాలు మనం సంతోషంగా అంగీకరిస్తున్నా లేదా ఆయన మనకు స్పష్టం చేస్తున్న విషయాలు అంగీకరించడానికి మనం సతమతమవుతున్నా, మన హృదయంలో ఉన్నది దేవునికి ఎల్లవేళలా విదితమే అని గ్రహించాలి. మన ఆలోచనలు, భావనలు ఆయనకు వినిపించే ధన్యత మనకుంది. 

17:27 దేవుని ఆశీర్వాదం రద్దు చేయబడనిది అని దావీదు పలికిన ధృవీకరణతో ఈ అధ్యాయం ముగుస్తుంది..



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |