Corinthians II - 2 కొరింథీయులకు 5 | View All

1. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
యోబు 4:19

2. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.

3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.

4. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.

5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.

6. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము

7. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.

8. ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.

9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
కీర్తనల గ్రంథము 72:2-4, ప్రసంగి 12:14

11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.

13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.

14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.

16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.

17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
యెషయా 43:18-21

18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.

19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.

20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
యెషయా 52:7

21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-10 ఈ మధ్యనే మరణంతో సమీపానుభవం (1:8-9) పొందిన పౌలు “మరణమైన వెంటనే మన స్థితి” లేక శరీర మరణం, దాని పునరుత్థానాల మధ్య విశ్వాసుల స్థితి ఏమిటో లేఖనాల నుండి సవిస్తరంగా బోధించాలని ప్రేరేపణ పొంది ఉంటాడు. అందువల్లే దాని గురించి ఈ భాగంలో ప్రస్తావించాడు. 

5:1 మనం శరీరంలో ఉనికి కలిగి వుండడాన్ని పౌలు భూమిమీద మన గుడారమైన యీ నివాసము అంటున్నాడు. పునరుత్థాన శరీరాన్ని నివాసము లేక మరొక గొప్ప కట్టడము అంటున్నాడు. హెబ్రీ పత్రిక రచయిత కూడా పరలోకాన్ని “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము” తో పోల్చాడు (హెబ్రీ 11:10). 

5:2 దిగంబరులము అనే మాట దేహం నుండి వేరు కావడం గురించి సూచిస్తుంది. శరీరం నుండి వేరైన మానవ ఆత్మ లేక ప్రాణం గురించి కొన్ని మతవ్యవస్థలలో కోరదగిన స్థితిగా తలుస్తారు. కానీ లేఖనాలలో ఇది కోరదగినదిగా ఎన్నడూ భావించబడలేదు. పౌలు ఈ ఆలోచననే ఇక్కడ పంచుకుంటున్నాడు. మూల్గుచున్నాము గురించిన పౌలు అనుభవాలకు
వేసుకున్నట్లు ఉంటుంది (పరలోకము నుండి వచ్చు మన నివాసము దీని పైని ధరించుకొన నపేక్షించుచు).

5:3-4 మరణించిన క్రైస్తవుల మధ్యంతర స్థితి, దేహరహిత స్థితి ఎలా ఉంటుంది అనేదానికన్నా పునరుత్థాన శరీరపు చివరి స్థితి ఎలా ఉంటుంది అనేదానికి పౌలు ప్రాధాన్యతనిచ్చాడు. 

5:5 సరైన సిద్ధపాటు లేకుండా పునరుత్థాన జీవితం అసాధ్యం . ఈ వచనం దేవుని సార్వభౌమత్వాన్ని నొక్కిచెబుతుంది. ఆత్మ అను సంచకరువు గురించి 1:22; “సంచకరువు గురించి కొ.ని.లో ఇతర సందర్భాలు ఎల్లప్పుడూ పరిశుద్దాత్మతో కలిపి ఉండడం గురించి ఎఫెసీ 1:14 చూడండి. రక్షణారంభం దేవుని వ్యక్తిత్వాన్ని (పరిశుద్ధాత్మ) స్వీకరించడం. రక్షణ లక్ష్యం దేవుని వ్యక్తిత్వాన్ని పూర్తిగా, ఎల్లప్పుడూ ఆస్వాదించడం (ప్రక 22:4).

5:6-8 ఈ జీవితానికీ, మధ్యంతర స్థితికీ పౌలు మూడు వైరుధ్యాలను గమనించాడు. శరీరంతో శరీరం లేకుండా ఈ భూమిమీద, విశ్వాసం ద్వారా వెలిచూపు ద్వారా, ప్రభువుకు దూరంగా ప్రభువుతో నివసించడం. పరిశుద్ధులు శరీరంలో జీవించినంత కాలం, వారు క్రీస్తును కేవలం విశ్వాసంతోనే గ్రహిస్తారు. పౌలు విధానంలో సజీవులైన విశ్వాసులను క్రీస్తు “లో” ఉన్నవారుగా లేక ప్రభువులో ఉన్నవారుగా చెప్పేవాడు, కానీ మరణించిన విశ్వాసులను గురించి క్రీస్తు “తో" లేక ప్రభువుతో ఉన్నవారని చెప్పేవాడు. అంటే విశ్వాసం ప్రభువుతో సహవాసంలో కళ్ళారా చూడగలిగినదిగా మారడం అన్నమాట.

5:9-10 దేహమందున్నను దేహమును విడిచినను అంటే మంటి దేహంతో ఉన్నా లేక దేహరహితంగా ఉన్నా అని అర్థం. మృతులైన నీతిమంతులు ఎదుట అనుకూలమైన తీర్పును పొందడం ఆ కావచ్చు.. విశ్వాసులకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనగా “న్యాయ పీఠము"ను గురించి రోమా 14:10, మిగిలిన కొ.ని. సందర్భాలను చూడండి. బైబిల్ బోధించే ప్రకారం క్రైస్తవులు విశ్వాసమును బట్టి రక్షింపబడతారు, కానీ మంచివైనను సరే చెడ్డవైనను సరే వారు చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతారు. ఇది బహుమతులు నిర్ణయించే తీర్పే గాని నిత్యము ఉండే చోటును గురించి కాదు. ముఖ్యంగా 1కొరింథీ. 3:10-15 చూడండి. 

5:11-12 ప్రభువు విషయమైన భయము. అనేది. క్రీస్తు విశ్వాసి క్రియలకు తీర్పు తీర్చే న్యాయాధిపతి కాబట్టి ఆయనకు గౌరవం, భయం చూపాలి అని వివరిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి యుండుట అనేది పా.వి.లో ఒక ప్రాముఖ్యమైన జ్ఞాన అంశం (సామె 1:7), దీనిని కొ.ని. విశ్వాసులు మరచిపోకూడదు. (అపొ.కా.9:31; ప్రక 15:4). క్రీస్తు నియమించిన అపొస్తలులను గౌరవించాల్సిన విధానంలో ఈ భయమును గురించి కొరింథీయులకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. తాను భయపడే ప్రభువు ఎదుట, తాను పరిచర్య చేసే ప్రజల యెదుట పౌలు ఉద్దేశాలు నిరోషంగా ఉన్నాయి. 

5:13-14 పౌలు విరోధులు, బహుశా అతడు భక్తి విషయంలో అస్థిరుడు అనేవారేమో (అపొ.కా. 26:24). క్రీస్తు ప్రేమ తనను బలవంతం చేయడం వలన అతడు “వెట్టివాడయ్యేటంతగా” తీవ్రమైన అపొస్తలిక పరిచర్యలోకి వచ్చాడు. మరొకపక్క కొరింథీయుల మధ్య అతని పరిచర్య ఎన్నడూ పిచ్చివాడి పనిలాగా లేదు (1కొరింథీ 2:1-5). నిజానికి, తన “మూడవ ఆకాశము”ను గురించిన దర్శనాన్ని అతడు ఈ పత్రికలో తరువాత చెప్పేటంత వరకు పద్నాలుగు సంవత్సరాలపాటు (12:1-10) రహస్యంగానే ఉంచుకున్నాడు. పౌలు ప్రకటనలోని ప్రధాన సందేశం యూదుల మెస్సీయ పాపులైన అందరి కొరకు... మృతిపొందెను అనేదే (1కొరింథీ 15:3). యేసు యొక్క ప్రత్యామ్నాయ మరణంలో యూదులు, అన్యజనులు కూడా ఇమిడి ఉన్నారు (ప్రక 7:9). సువార్తను నమ్మిన పాపులు పాపానికి మరణించి, ఒక నూతన జీవమార్గంలో నడవడానికి క్రీస్తుతో కూడ తిరిగి లేచారు. 

5:15 జీవించువారు అన్న మాట ఇప్పుడు ఆధ్యాత్మికంగా సజీవులై వున్న విశ్వాసులను సూచిస్తుంది. (ఎఫెసీ 2:4-6). క్రీస్తు మరణ పునరుత్తాన పరిచర్య విశ్వాసికి మరణ, నూతన జీవం పరిచర్యకు మాదిరిగా మారింది. పౌలు కూడా దీనికి వ్యక్తిగతంగా మాదిరి చూపాడు.

5:16 శరీరరీతిగా అనే మాట దీని మూలమైన గ్రీకు మాటకు సరైన అర్థం. ప్రతి పరిస్థితికి సంబంధించి రెండు భిన్నమైన దృక్పధాలుంటాయి: లోక సంబంధమైనది, దైవికమైనది. లోక సంబంధమైన దృక్కోణం క్రీస్తును సిలువ వేయడానికీ, క్రీస్తు అనుచరులను పౌలు హింసించడానికి నడిపించింది. దమస్కు దారిలో దైవిక ప్రత్యక్షతా ప్రకాశం పౌలు మీద పడిన తర్వాత, అతడు క్రీస్తును శరీరరీతిగా... ఇక మీదట ఆయనను ఆలాగు ఎరుగని రీతిలోకి మారిపోయాడు (అపొ.కా.9 అధ్యా.).

5:17-18 క్రీస్తునందున్న యెడల అనే మాటలు ఆయనతో ఏకమై ఉండడాన్ని సూచిస్తున్నాయి. యథార్థమైన మారుమనస్సు జీవితాన్ని రూపాంతరపరచడం ఆరంభిస్తుంది గాని పాత స్వభావాన్ని బాగుచేయడం ద్వారా కాదు. విశ్వాసులలో నివసించే పరిశుద్ధాత్మ దైవికమైన ఆధ్యాత్మిక జీవాన్ని సృష్టించడం ద్వారా (రోమా 8:8-10), అవి క్రొత్త వాయెను. ఈ సత్యాన్ని కొ.ని.లో ఇతర భాగాలు "కొత్తగా జన్మించడం” లేక “తిరిగి జన్మించడం" అనే మాటలతో చెబుతాయి (యోహాను 3:3-8; తీతు 3:5; 1పేతురు 1:23). దేవునికి శత్రువులైనవారు, ఆయనతో సమాధానపరచబడి ఇప్పుడు మిత్రులయ్యారు. పాపంపై దేవుని ఉగ్రత, ఆయన కుమారుని మరణం ద్వారా సంతృప్తి చెందింది. పాపులు, ఎవరైతే ఇంతకు ముందు దేవుని మహిమకన్నా స్వంత ఇష్టాలకు ప్రాధాన్యత నిచ్చినవారు (రోమా 1:21; 3:23) ఇప్పుడు దేవునిని తమ అత్యధిక ఐశ్వర్యంగా (2కొరింథీ 4:6) ఇష్టపడడం ఆరంభించారు. ఈ సమాధానపరచు పరిచర్య కు, అంటే ఈ సువార్తకు ప్రతినిధిగా ఉండడం పౌలు ప్రత్యేక బాధ్యత. అయితే ఈ పని ఈ పరిచర్యను పొందిన వారందరికీ చెందుతుంది. 

5:19-21 క్రీస్తు చేసింది. దేవుడు చేసినట్లే. క్రీస్తు మరణం ముఖ్యంగా లోకాన్ని, అంటే పాపులైన మానవులను ప్రభావితం చేసింది. (దుష్టులైన పరలోక జీవులకు మాత్రం ఆ విధంగా సమాధానపరచే ఏ మార్గమూ ఏర్పాటు చేయబడలేదు). 
క్రీస్తు మరణం దేవుని నీతిని ఎత్తిచూపుతుంది. పాపమెరుగని ఆయనపై అక్రమం మోపబడింది. దాని బదులుగా ఆయన యందున్న వారికందరికీ దేవుని నీతి ఆపాదించబడింది. సమాధాన వాక్యమును క్రీస్తు రాయబారులు ప్రకటించినపుడే ఇతరులకు తెలుస్తుంది. సువార్త ప్రకటించమని యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ సమాధాన పరచబడిన మానవులకే గాని దేవదూతలకు అప్పగించబడలేదు (మత్తయి 28:18-20). 


Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |