Corinthians II - 2 కొరింథీయులకు 5 | View All

1. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
యోబు 4:19

2 కోరింథీయులకు 4:18 లో చెప్పిన అదృశ్యమైన శాశ్వత విషయాలు కొన్నింటిని పౌలు ఇక్కడ చర్చిస్తున్నాడు – ఒక శాశ్వత నివాసం (1-4), ప్రభువుతో కలిసి ఉండడం (వ 8), తీర్పు, ప్రతిఫలాలు (వ 10). వీటిపై అతడు దృష్టి నిలుపుకున్నాడు. “మనకు తెలుసు”– పౌలు ఇక్కడ చెప్తున్నది ఊహాగానం కాదు, దేవుడు వెల్లడించిన సత్యంపై ఆధారపడిన జ్ఞానం. భూమిమీద మన “నివాసమైన గుడారం” అంటే మన భౌతిక శరీరాలు అని పౌలు భావం (వ 4). అవి మరణిస్తాయి – అంటే క్రీస్తు రాకకు ముందే చావు వస్తేనన్నమాట (1 కోరింథీయులకు 15:51-52). అయితే దేవుడు నిర్మించే కట్టడం, ఎప్పటికీ ఉండే ఇల్లు, పరలోక సంబంధమైన నివాసం అంటే (వ 2) అర్థమేమిటి? దీని అర్థం గురించి వ్యాఖ్యాతల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది యోహాను 14:2 లో ఉన్న తండ్రి ఇల్లు కావచ్చు అని కొందరు అంటారు. హెబ్రీయులకు 11:10; హెబ్రీయులకు 13:14; ప్రకటన గ్రంథం 21:10-27; లూకా 16:9 కూడా చూడండి. అయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులకు లభించే పునర్జీవిత దేహాలు (1 కోరింథీయులకు 15:35-53) అని పౌలు భావం కావచ్చు. ఇప్పటి మన శరీరం “గుడారం” అయితే “ఇల్లు” అనేది పరలోకంలో మన మహిమ దేహం అనుకోవడానికి అవకాశం ఉంది.

2. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.

“మూలుగుతూ”– రోమీయులకు 8:23 చూడండి. అక్కడ మూలుగు మన శరీరాల విమోచన కోసం. ఇక్కడి అర్థం ఇదే కావచ్చు. “ధరించుకోవడం” అనే మాట కూడా ఒక వ్యక్తి, లేక వ్యక్తి ఆత్మ తొడుక్కునేది అనే అర్థాన్ని సూచిస్తున్నది గాని పరలోకంలో శాశ్వత నివాస స్థలం వంటి నగరాన్ని కాదు.

3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.

“దిగంబరంగా”అంటే ఇక్కడ శరీరం లేకుండా ఆత్మను సూచిస్తున్నట్టుంది.

4. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.

విశ్వాసులు మూలిగేది ఈ దేహాన్ని వదిలించుకోవాలని కాదు గాని కొత్త దేహం రావాలనే అని ఈ వచనం అర్థం అనిపిస్తుంది.

5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.

విశ్వాసులు దేవుని పనితనం, కొత్త సృష్టి (వ 17; ఎఫెసీయులకు 2:10). పరలోక సంబంధమైన నివాసాన్ని, అంటే పరలోకంలో ఉండేందుకు అనువైన దేహాన్ని మనకిచ్చే ఉద్దేశంతోనే ఆయన మనల్ని చేశాడు. యోహాను 6:39-40 చూడండి. “హామీ”– 2 కోరింథీయులకు 1:22 చూడండి. హామీ, లేక బయానా అంటే ఇంకా చాలా రావలసి ఉందన్నమాట. దేవుడెప్పుడైనా తన మనసు మార్చుకుని ఇచ్చిన బయానాను తిరిగి తీసేసు కుంటాడనుకొనే అవసరం ఎంతమాత్రం లేదు.

6. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము

పౌలుకు ఈ విషయం తెలియడం, నిబ్బరం కలగడం అంతా దేవుడు వెల్లడించిన దాన్ని బట్టే కలిగాయి. విశ్వాసులందరికీ ఇవి లభించవచ్చు. 1 కోరింథీయులకు 2:9-16 పోల్చి చూడండి. ఇప్పుడు మనం ఈ లోకంలో, శరీరంతో ఉన్నప్పుడు ప్రభువు మనతో లేడని పౌలు ఉద్దేశం కాదు. విశ్వాసులందరితో ఆయన ఉన్నాడని మనకు తెలుసు – 2 కోరింథీయులకు 13:5; మత్తయి 28:20; యోహాను 17:20-23. అయితే విశ్వాసులింకా ప్రభువును చేరలేదు – అంటే పరలోకంలో ఆయన సముఖంలో లేరు. వారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తారని పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు 1:23-24 చూడండి. లూకా 23:43; యోహాను 17:24 పోల్చి చూడండి.

7. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.

2 కోరింథీయులకు 4:18.

8. ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.

9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

విశ్వాసులు క్రీస్తు సన్నిధికి చేరి శాశ్వతంగా అక్కడుంటారు కాబట్టి, వారి జీవిత విధానంపై ఈ సత్యం గాఢమైన ప్రభావం చూపేదిగా ఉండాలి. తన జీవితంపై అలాంటి ప్రభావం చూపిందని పౌలు అంటున్నాడు. బ్రతికినా, చనిపోయినా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుకు సంతోషం కలిగించడమే అతని కోరిక. క్రీస్తుకు సంతోషం కలిగిద్దామనుకునేవారిలో తమను సంతోషపెట్టుకునే గురి ఉండదు. క్రీస్తు మహిమకోసం, ఇతరుల మేలుకోసం వారు బ్రతుకుతారు. వ 15; 1 కోరింథీయులకు 9:19-23; 1 కోరింథీయులకు 10:31. క్రీస్తుకు సంతోషం కలిగించాలని కోరనివారు దేవుని నిజ సేవకులు కాదు.

10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
కీర్తనల గ్రంథము 72:2-4, ప్రసంగి 12:14

రోమీయులకు 14:10-12; రోమీయులకు 2:6; 1 కోరింథీయులకు 3:13-15.

11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

“ప్రభువుపట్ల భయం”– రోమీయులకు 3:18; ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7. రాబోయే తీర్పును గురించిన ఆలోచనలు దీన్ని అతనికి గుర్తు చేశాయి. అతని పరిచర్యకు ఇది శక్తివంతమైన ఒక ప్రేరణ.

12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.

2 కోరింథీయులకు 1:12-14; 2 కోరింథీయులకు 3:1-3. ఈ వచనంలో మరోసారి కొరింతులో ఉన్న తన విరోధులను పౌలు ప్రస్తావిస్తున్నాడు (2 కోరింథీయులకు 11:13-15). అక్కడి విశ్వాసులు తన విషయం గర్వపడాలి – అంటే తాను నిజమైన రాయబారే అనీ దేవుని సత్యాన్ని ఉపదేశించేవాడే అనీ వారు నిశ్చయతతో నిశ్చింతగా ఉండాలి. అప్పుడు కేవలం బయటి విషయాలనుబట్టే అతిశయిస్తున్న దుర్బోధకులకు వారు జవాబు చెప్పగలుగుతారు.

13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.

అతని విరోధులు అతణ్ణి మతిలేనివాడు అన్నారా? కొన్నిసార్లు అతడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడని అక్కడి విశ్వాసులు తలంచారా? (మార్కు 3:21; అపో. కార్యములు 26:24; 1 కోరింథీయులకు 4:10 పోల్చి చూడండి.) తాను ఏదైనప్పటికీ, తన ప్రవర్తన వారికెలా కనిపించినప్పటికీ, అది దేవుని కోసం, వారికోసం గాని తనకోసం కాదు. ఇది వారు తెలుసుకోవాలని అతని ఉద్దేశం. యోహాను 2:17 పోల్చి చూడండి.

14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

అతని పరిచర్య వెనుక గల ప్రేరణ మరొకటి. ఇది వ 11లో ఉన్నదానికంటే గొప్పది. పౌలు చేసినదంతా దేవునికోసం, ఇతరుల మేలుకోసం ఎలా చేయగలుగుతున్నాడు? క్రీస్తు ప్రేమ తనకు తెలిసి ఉండడం, హృదయంలో అది అతనికి అనుభవం కావడం (రోమీయులకు 5:5) అతణ్ణి దేవుని పనికి పురిగొల్పే శక్తివంతమైన ప్రేరణ (లూకా 12:50 పోల్చి చూడండి). అందరు విశ్వాసుల్లో ఉన్నట్టుగానే క్రీస్తు అతనిలో ఉన్నాడు. అందువల్ల క్రీస్తు ప్రేమ అతనిలో ఉంది. అతడు క్రీస్తుకు పూర్తిగా లోబడి ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రేమక్కూడా పూర్తిగా లోబడి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తుపట్ల పౌలుకున్న ప్రేమ కాదు గాని మనుషులందరిపట్ల క్రీస్తుకున్న ప్రేమ. 1 యోహాను 4:10, 1 యోహాను 4:19 పోల్చి చూడండి. గలతియులకు 2:20 చూడండి. “అందరికోసమూ”– క్రీస్తు మనుషులందరి కోసమూ చనిపోయాడు. వారి పాపాల మూలంగా వారంతా చనిపోవలసి ఉంది. వారి స్థానంలో ఆయన చనిపోయాడు (వ 19; యోహాను 1:29; యోహాను 3:16; 1 తిమోతికి 2:6; హెబ్రీయులకు 2:9; 1 పేతురు 3:18; 1 యోహాను 2:2). అందువల్ల క్రీస్తు చనిపోయినప్పుడు దేవుని దృష్టిలో “అందరూ చనిపోయారు”, మానవజాతి ప్రతినిధికి ఏమి జరిగిందో మానవజాతి అంతటికీ ఇదే జరిగినట్టు లెక్క. అంటే మనుషులందరికీ పాపవిముక్తి లభించిందని అర్థం కాదు. క్రీస్తు వారికోసం చనిపోయినంత మాత్రాన మనుషులకు పాపవిముక్తి కలగదు – వారు దేవునితో సఖ్యపడాలి (వ 20), పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకముంచాలి (లూకా 13:3; యోహాను 3:36; యోహాను 8:24; అపో. కార్యములు 17:30); ఆయన మరణంలోకి వారు “బాప్తిసం” పొందాలి (రోమీయులకు 6:3). అలా కాని పక్షంలో ఎవరికీ పాపవిముక్తి లేదు. మనుషులందరినీ దేవుడు క్షమించే అవకాశాన్ని క్రీస్తు మరణం కల్పించింది. కానీ క్షమాపణ కోసం క్రీస్తుద్వారా ఆయనవైపు తిరిగినవారికే పాపవిముక్తి. “అందరికోసమూ చనిపోయాడు” అనే మాటకు వేరే అర్థం చెప్పారు కొందరు. అదేమంటే దేవుడు ఎన్నుకుని క్రీస్తుకు ఇచ్చినవారందరి (యోహాను 6:37; యోహాను 17:6) కోసం మాత్రమే ఆయన చనిపోయాడు. ఎక్కువమంది వ్యాఖ్యాతలు ఈ వివరణతో ఏకీభవిస్తారు. దేన్ని తీసుకున్నప్పటికీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. క్రీస్తు మరణం వల్ల కలిగిన శాశ్వత లాభాలు ఆయన్ను నమ్మినవారికి మాత్రమే కలుగుతాయి, మనుషు లందరికీ కాదు.

15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.

క్రీస్తు మరణంలో ఉన్న ఒక గొప్ప ఉద్దేశం ఇది. స్వప్రయోజనాలను చూసుకునే స్వార్థపూరితమైన వారి జీవితం నుంచి మనుషులను దారి మళ్ళించి వారు క్రీస్తుకే తమ హృదయాల్లో కేంద్ర స్థానంమిచ్చేలా చేయడమే. రోమీయులకు 14:9 కూడా చూడండి. పౌలు విషయంలో కలిగిన ఫలితం ఇదేనని మనం చూశాం (వ 9). మనలో కూడా ఇదే ఫలితం కనిపిస్తున్నదా? అలా కాకపోతే మనం అసలు క్రీస్తు నెరిగిన వారమేనా? మన నమ్మకం వాస్తవమైనదేనా? అని చూచుకోవలసి ఉంది. ఆయన మరణంలోకి “బాప్తిసం” పొందడమంటే ఆయన కొత్త జీవితంలోకి కూడా బాప్తిసం పొందడమే. దీని ఫలితం పూర్తిగా కొత్త జీవిత విధానం (వ 17; రోమీయులకు 6:4-7). మనిషి తన కోసమే జీవించడం అన్నిటికన్నా మహా విపత్తు, గొప్ప ఆపద. క్రీస్తు కోసం జీవించడం అన్నిటికన్నా ధన్యకరమైనది. మత్తయి 10:37-39; లూకా 9:23; లూకా 14:26 చూడండి.

16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.

క్రీస్తులో విశ్వాసి కాకమునుపు పౌలు ఆధ్యాత్మికమైన జ్ఞానమే లేకుండా క్రీస్తుతో సహా ఇతరులందరినీ బయటి విషయాలను బట్టే అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవాడు. యోహాను 8:15 పోల్చి చూడండి. అయితే క్రీస్తు మరణంలోని అర్థం తెలియడంవల్ల పైరూపాన్ని బట్టి అభిప్రాయ మేర్పరచుకునే అతని మనస్తత్వం మారిపోయింది. ప్రతి ఒక్కరినీ క్రీస్తుతో వారికున్న సంబంధం దృష్టితో చూడడం మొదలుపెట్టాడు.

17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
యెషయా 43:18-21

“కాబట్టి”– అనే పదం దీన్ని పై వచనాలకు జోడిస్తున్నది. క్రీస్తులో ఉన్న వ్యక్తి కొత్త సృష్టి. అందువల్ల సహజంగా క్రీస్తును గురించి, ఇతరుల గురించి, తన గురించి అతని అభిప్రాయం ఇంతకు ముందున్నట్టు ఉండదు. “క్రీస్తులో”– యోహాను 17:20-21; రోమీయులకు 6:3, రోమీయులకు 6:5; రోమీయులకు 8:1; 1 కోరింథీయులకు 1:1; 1 కోరింథీయులకు 12:12-13; ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4. “కొత్త సృష్టి”– అంటే ఆధ్యాత్మిక జన్మ (యోహాను 1:12-13; యోహాను 3:3-8; తీతుకు 3:5; 1 పేతురు 1:23). దాన్ని అనుభవించినవారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు. తమకోసం జీవించడం, లోకం దృష్టితో ఇతరులను, క్రీస్తును చూడడం అనే పాత ధోరణి మారిపోతుంది. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు సమసిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, కొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలో ప్రవేశిస్తాయి. ఇది పౌలువంటి గొప్పవారి విషయంలో మాత్రమే గాక క్రీస్తులో ఉన్న ఎవరి విషయంలోనైనా సత్యమేనని జాగ్రత్తగా గమనిద్దాం.

18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.

“దేవుని వల్లే”– యోహాను 1:13; ఎఫెసీయులకు 2:10; ఎఫెసీయులకు 4:24; యాకోబు 1:18 చూడండి. మనుషులు పాత అలవాట్లు మానుకుని కొత్త జీవితం ఆరంభించవచ్చు గానీ తమలో కొత్త జీవాన్ని సృష్టించుకోలేరు. ఇది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. మొదటి సృష్టిని చేయడం (ఆదికాండము 1:1) వారికెలా అసాధ్యమో ఇదీ అంతే అసాధ్యం. “సఖ్యపరచుకోవడం”– అంటే శత్రువులను మిత్రులుగా మార్చడం, శత్రుత్వానికీ, ఎడబాటుకూ ఉన్న కారణాన్ని తొలగించడం. పాపం మనుషుల్ని దేవునికి శత్రువులుగా చేసింది (రోమీయులకు 5:10; కొలొస్సయులకు 1:21). వారి పాపాల మూలంగా దేవుని కోపం వారిపై ఉంది (రోమీయులకు 1:18. దేవుని కోపం గురించి నోట్ సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36). మనుషులను తనతో సఖ్యపరచుకోవాలంటే వారిలో తనకు కోపం కలిగించినదాన్నీ, వారిని తనకు దూరం చేసేదాన్నీ దేవుడు పరిష్కరించాలి. లోక పాపాలకోసం బలి అర్పణంగా ఉండేందుకు తన కుమారుణ్ణి పంపడం ద్వారా ఆయన ఇది చేశాడు (వ 14 నోట్‌లో రిఫరెన్సులు). “క్రీస్తు ద్వారా” దేవుడు మనుషులను సఖ్యపరచుకున్నాడు. ఎఫెసీయులకు 2:16; కొలొస్సయులకు 1:20, కొలొస్సయులకు 1:22. ఇలా చేసి ఈ శుభవార్తను ప్రకటించేందుకు అన్ని వైపులకూ తన సేవకులను పంపుతున్నాడు. “సఖ్యపరిచే పరిచర్య మాకిచ్చాడు” అంటే అర్థం ఇదే.

19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.

ప్రకటించాలని దేవుడు తన సేవకులకు ఇచ్చిన “సఖ్య పరిచే పరిచర్య” ఇదే. వ 18లో పౌలు “దేవుడు మమ్ములను తనతో సఖ్యపరచుకున్నాడు” అన్నాడు. ఇప్పుడు దేవుడు “లోకాన్ని” తనతో సఖ్యపరచుకునే సంగతి గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఇది భూతకాలంలో ఉంది. యేసు క్రీస్తు మరణం ద్వారా తనకు, తన స్నేహాన్ని కోరిన ఏ వ్యక్తికైనా సరే అలాంటి శాశ్వత స్నేహం ఉండేందుకు పునాది వేశాడు. మనుషుల అపరాధాలు వారిమీద మోపకుండా, వాటిని క్రీస్తు మీద మోపాడు (వ 21; యోహాను 1:29; యెషయా 53:5-6). అంటే మనుషులంతా పాపవిముక్తి పొందుతారని అర్థం కాదు. అందరూ పాపవిముక్తి పొందేందుకు మార్గం సిద్ధమైందని దీని అర్థం. పాపవిముక్తి పొందాలంటే దేవుడు తమకోసం చేసిన దాన్ని మనుషులు స్వీకరించి, క్రీస్తులో నమ్మకం పెట్టుకోవాలి. అలా చేయకపోతే నశించిపోతారు (యోహాను 3:16, యోహాను 3:36).

20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
యెషయా 52:7

సఖ్యపరచడంలో దేవుని పాత్ర రెండు విధాలుగా ఉంది. మన పాపాలకోసం చనిపోయేందుకు ఆయన తన కుమారుణ్ణి పంపాడు, ఈ సత్యాన్ని ప్రకటించేందుకు తన సేవకులను నలుమూలలకూ పంపాడు. అయితే ఇందులో మనుషులు చేయవలసినది కూడా ఉంది – “దేవునితో సఖ్యపడండి”. అంటే క్రీస్తు ద్వారా దేవుడు చేసిన ఈ ఏర్పాటును ఉపయోగించు కోవాలి. అంటే పశ్చాత్తాపపడి క్రీస్తు శుభవార్తను నమ్మాలి. పౌలు (లేక శుభవార్తను ప్రకటించేందుకు దేవుడు పంపే వారెవరైనా) క్రీస్తుయొక్క దూత. దూత అంటే ఒకరికి లేక కొందరికి ప్రతినిధిగా వేరే చోటుకు వెళ్ళేవాడు. అతడు తన సొంత అధికారంతో ఎప్పుడూ మాట్లాడడు, ఏదీ చెయ్యడు. అతణ్ణి పంపినవాడు ఏది చెప్పాలంటే అది చెప్తాడు. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అయితే ఆయన పంపినవారు భూమిపై ఆయన పేరున మాట్లాడుతూ ఆయన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. క్రీస్తు వారిద్వారా పిలుస్తూ “వేడుకుంటూ” ఉన్నాడు. పాపవిముక్తి పొందండి అంటూ దేవుడు మనుషులనెలా బ్రతిమాలుతున్నాడో చూడండి. యెహెఙ్కేలు 18:30-32 పోల్చి చూడండి.

21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

ఇక్కడ గొప్ప సత్యాలు నాలుగున్నాయి. ఒకటి, క్రీస్తులో ఏ పాపం లేదు (యోహాను 8:46; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22; 1 యోహాను 3:5). రెండు, దేవుడాయన్ను పాపంగా చేశాడు – అంటే లోకమంతటి పాపాలను ఆయనపై మోపాడు. ఆ దోషాన్నీ ఆ శిక్షనూ క్రీస్తు భరించాడు. ఆయనే పాపమై ఉన్నట్టు దేవుడు పరిగణించాడు. మూడు, ఇది “మనకోసం” (వ 14; 1 పేతురు 3:18; 1 యోహాను 4:10). నాలుగు, ఇందులో దేవుని ఉద్దేశమేమిటంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతిన్యాయాలు కావాలని. ఇది వారిని నిర్దోషులుగా లెక్కించడం గురించి (రోమీయులకు 3:21-26 నోట్‌) చెప్తున్నది, క్రీస్తుతో ఐక్యత కలగడం గురించి (యోహాను 17:20-23; రోమీయులకు 6:3-8; ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4) చెప్తున్నది. దేవుని నీతిన్యాయాలు స్వయంగా క్రీస్తే (1 కోరింథీయులకు 1:30; రోమీయులకు 3:21-24; అపో. కార్యములు 3:14). విశ్వాసులు ఆయనతో ఐక్యత కలిగినవారు కాబట్టి ఆయనలో వారు న్యాయవంతులు, నీతిన్యాయాలయ్యారు. దేవుని ఎదుట క్రీస్తు ఏమిటో విశ్వాసులు కూడా దేవుని లెక్కకు అదే అయ్యారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians II - 2 కొరింథీయులకు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలుని ఆశ మరియు పరలోక మహిమ కోరిక. (1-8) 
విశ్వాసం ఉన్న వ్యక్తి ఈ జీవితాన్ని మించిన మరొక సంతోషకరమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నాడనే దృఢమైన హామీని కలిగి ఉండటమే కాకుండా, స్వర్గం నివాసం, విశ్రాంతి మరియు అభయారణ్యం వంటి దయ ద్వారా మంజూరు చేయబడిన ఆశాజనకమైన నిరీక్షణను కూడా పెంపొందించుకుంటాడు. మా తండ్రి నివాసంలో, అంతిమ నిర్మాత మరియు సృష్టికర్త అయిన దేవునిచే నిర్మించబడిన అనేక నివాసాలు వేచి ఉన్నాయి. రాబోయే అస్తిత్వం యొక్క ఆనందం దేవుడు తన పట్ల ప్రేమను కలిగి ఉన్నవారికి అందించిన సదుపాయం: శాశ్వతమైన భూసంబంధమైన నివాసాలకు భిన్నమైన శాశ్వత నివాసాలు, మన ఆత్మలు ప్రస్తుతం నివసించే మట్టితో కూడిన బలహీనమైన నివాసాలు, ధూళిలో వేయబడిన పునాదులతో కుళ్ళిపోతాయి. శారీరక రూపం ఒక భారమైన బరువు, మరియు జీవితం యొక్క కష్టాలు భారీ భారాన్ని కలిగి ఉంటాయి. అయినప్పటికీ, విశ్వాసులు పాపంతో నిండిన శరీరం యొక్క బరువుతో నిట్టూర్చి, లోపల నిరంతర మరియు అల్లకల్లోలమైన అవినీతితో పోరాడుతున్నారు. మృత్యువు మనలను భౌతిక ఆవరణను మరియు అన్ని ప్రాపంచిక సుఖాలను దూరం చేస్తుంది, ఈ విమానంలో మన కష్టాలను అంతం చేస్తుంది. అయితే, విశ్వసించే వారు స్తుతి వస్త్రాలు ధరించి, నీతి మరియు కీర్తి వస్త్రాలతో అలంకరించబడతారు. స్పిరిట్ అందించిన ప్రస్తుత దయ మరియు ఓదార్పులు శాశ్వతమైన దయ మరియు సౌకర్యాల ప్రతిజ్ఞగా పనిచేస్తాయి. దేవుడు తన ఆత్మ మరియు శాసనాల ద్వారా ఈ రాజ్యంలో మనతో ఉన్నప్పటికీ, మనం మరింత లోతైన ఐక్యత కోసం ఆరాటపడుతుండగా, ఆయనతో మనకున్న అనుబంధం అసంపూర్ణంగా ఉంటుంది. ఈ రాజ్యంలో విశ్వాసం మనకు మార్గదర్శి, అయితే తర్వాతి కాలంలో మనకు చూపు ఎదురుచూస్తుంది. మనం దృష్టితో జీవించే స్థితికి మారే వరకు విశ్వాసం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జీవితాన్ని నావిగేట్ చేయడం మా బాధ్యత మరియు ప్రయోజనం రెండూ. యేసు తన మహిమాన్వితమైన వ్యక్తిని బహిర్గతం చేసే సన్నిధిలో, భూసంబంధమైన పాత్ర నుండి విడిపోయినప్పుడు విశ్వాసుల ఆత్మల కోసం ఎదురుచూస్తున్న ఆనందాన్ని ఇది నిస్సందేహంగా వివరిస్తుంది. మనకు భూసంబంధమైన శరీరం మరియు ప్రభువుతో సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనపై దావా వేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, విశ్వాసి యొక్క ఆత్మతో సన్నిహిత సంబంధం కోసం ప్రభువు తీవ్రంగా వాదించాడు, "నేను ప్రేమించిన మరియు ఎంచుకున్న ఆత్మలలో మీరు ఒకరు, నాకు ఇవ్వబడిన వారిలో ఒకరు" అని ప్రకటిస్తాడు. మరణ భయంతో పోల్చినప్పుడు, ప్రభువు నుండి దూరంగా ఉండే అవకాశంతో విభేదించినప్పుడు అది ఏ ప్రాముఖ్యతను కలిగి ఉంది?

ఇది శ్రద్ధకు ఉత్తేజాన్నిచ్చింది. అతను కొరింథీయుల పట్ల ఉత్సాహంతో ప్రభావితం కావడానికి కారణాలు. (9-15) 
అపొస్తలుడు తనను మరియు ఇతరులను విధుల్లో నిమగ్నమవ్వమని ఉద్బోధించాడు, స్వర్గం యొక్క బాగా స్థాపించబడిన ఆశలు సోమరితనానికి లేదా పాపాత్మకమైన ఆత్మసంతృప్తికి దారితీయకూడదని నొక్కి చెప్పాడు. ప్రతి ఒక్కరూ రాబోయే తీర్పు గురించి ఆలోచించడం చాలా అవసరం, దీనిని తరచుగా "లార్డ్ యొక్క భయం" అని పిలుస్తారు. దుష్టత్వాన్ని ఆచరించే వారిపై ప్రభువు విధించే తీవ్రమైన పరిణామాలను గుర్తించి, అపొస్తలుడు మరియు అతని తోటి విశ్వాసులు యేసు ప్రభువుపై విశ్వాసం ఉంచడానికి మరియు ఆయన శిష్యులుగా జీవించడానికి ప్రజలను ప్రోత్సహించడానికి వివిధ వాదనలు మరియు ఒప్పందాలను ఉపయోగించారు. వారి ఉత్సాహం మరియు శ్రద్ధ దేవుని మహిమ మరియు చర్చి యొక్క సంక్షేమం కోసం కోరికతో నడిచింది.
అదేవిధంగా, మనపట్ల క్రీస్తు ప్రేమను సరిగ్గా ఆలోచించినప్పుడు మరియు సరిగ్గా అంచనా వేసినప్పుడు పోల్చదగిన ప్రతిస్పందనను పొందాలి. క్రీస్తు జోక్యానికి ముందు, ప్రతి ఒక్కరూ కోల్పోయారు, ఖండించారు, ఆధ్యాత్మికంగా మరణించారు మరియు తమను తాము రక్షించుకునే సామర్థ్యం లేకుండా పాపానికి బానిసలుగా ఉన్నారు. క్రీస్తు బలి మరణం లేకపోతే వారి శాశ్వతమైన దుఃఖం కొనసాగేది. పర్యవసానంగా, మన దృష్టి మన ఉనికి మరియు చర్యల యొక్క ఉద్దేశ్యంగా కాకుండా క్రీస్తును చేయడంపైనే ఉండాలి. క్రైస్తవుని జీవితం పూర్తిగా క్రీస్తుకు అంకితం కావాలి. విచారకరంగా, చాలామంది తమ కోసం మరియు ప్రపంచం కోసం మాత్రమే జీవించడం ద్వారా తమ విశ్వాసం మరియు ప్రేమ యొక్క నిష్కపటతను వెల్లడి చేస్తారు.

పునరుత్పత్తి యొక్క ఆవశ్యకత మరియు క్రీస్తు ద్వారా దేవునితో సయోధ్య. (16-21)
రూపాంతరం చెందిన వ్యక్తి తాజా సూత్రాలపై పనిచేస్తాడు, కొత్త ప్రమాణాల ద్వారా మార్గనిర్దేశం చేస్తాడు, కొత్త లక్ష్యాలను అనుసరిస్తాడు మరియు కొత్త సంఘంతో అనుబంధం కలిగి ఉంటాడు. విశ్వాసి లోతైన పునరుద్ధరణను అనుభవిస్తాడు; వారి హృదయాన్ని సరిగ్గా అమర్చడమే కాకుండా, వారు పూర్తిగా కొత్త హృదయాన్ని కలిగి ఉంటారు. అవి దేవుని చేతిపనులు, సద్గుణాల కోసం క్రీస్తు యేసులో రూపొందించబడ్డాయి. మనిషిగా ఉన్నప్పుడు, వారి స్వభావం మరియు ప్రవర్తన గణనీయమైన పరివర్తనకు లోనవుతాయి. ఈ పదాలు కేవలం బాహ్య సంస్కరణకు మించి విస్తరించాయి.
ఒకప్పుడు రక్షకునిలో ఎటువంటి ఆకర్షణను కనుగొనని వ్యక్తి, ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నాడు. హృదయం, ఒకసారి దేవునిపై శత్రుత్వంతో నిండిపోయి, రాజీపడుతుంది. పునరుత్పత్తి చేయని వ్యక్తి దేవుని న్యాయబద్ధమైన అసంతృప్తిని కలిగి ఉన్నప్పటికీ, సయోధ్య సాధ్యమవుతుంది. మన మనస్తాపం చెందిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సయోధ్యను తీసుకువచ్చాడు. దేవునిచే ప్రేరేపించబడిన లేఖనాలు, సయోధ్య సందేశంగా పనిచేస్తాయి, సిలువ ద్వారా శాంతి స్థాపించబడిందని మరియు దానిలో మనం ఎలా పాలుపంచుకోవాలో వెల్లడిస్తుంది.
దేవుడు సంఘర్షణలో ఏమీ కోల్పోకుండా మరియు శాంతిలో ఏమీ పొందనప్పటికీ, పాపులను వారి శత్రుత్వాన్ని పక్కనపెట్టి, అందించే మోక్షాన్ని స్వీకరించమని ఆయన వేడుకుంటున్నాడు. క్రీస్తు, పాపరహితుడు, పాపం పాత్రను ధరించాడు-పాపిగా కాదు, పాపం-అర్పణగా, పాపం కోసం త్యాగం చేశాడు. అంతిమ ఉద్దేశ్యం ఏమిటంటే, మనం ఆయనలో దేవుని నీతిగా మారడానికి, క్రీస్తు యేసులో కనుగొనబడిన విమోచన ద్వారా దేవుని కృప ద్వారా స్వేచ్ఛగా సమర్థించబడటానికి వీలు కల్పించడం.
మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన ప్రియమైన కుమారుడిని బలి ఇచ్చాడని పరిగణనలోకి తీసుకుంటే, ఎవరైనా అతని కోసం ఎక్కువ శ్రమ, శ్రమ లేదా ఓర్పు పెట్టుబడి పెట్టగలరా? వ్యక్తులు ఆయనలో దేవుని నీతిగా చేయడమే లక్ష్యం.



Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |