John - యోహాను సువార్త 10 | View All

1. గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.

2. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి.

3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.

4. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.

5. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

6. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

7. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను

8. గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.
యిర్మియా 23:1-2, యెహెఙ్కేలు 34:2-3

9. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
కీర్తనల గ్రంథము 118:20

10. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

11. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
కీర్తనల గ్రంథము 23:1, యెషయా 40:11, యెహెఙ్కేలు 34:15

12. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును.

13. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

14. నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

16. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
యెషయా 56:8, యెహెఙ్కేలు 34:23, యెహెఙ్కేలు 37:24

17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

19. ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

20. వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

21. మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

22. ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.

23. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా

24. యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.

25. అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

26. అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.

27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

28. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.

29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;

30. నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

31. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా

32. యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.

33. అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
లేవీయకాండము 24:16

34. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
కీర్తనల గ్రంథము 82:6

35. లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,

36. తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

37. నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,

38. చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.

39. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

40. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.

41. అనేకులు ఆయనయొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.

42. అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
10:1-42 ఈ చర్చలో ఇశ్రాయేలీయులకు సరైన ఆత్మీయ నిర్దేశం చేయడంలో విఫలమైన యూదా నాయకులను యేసు విమర్శించాడు. దానికి విరుద్ధంగా యేసు మంచి కాపరిలాగా తన గొట్టెలకోసం ప్రాణాన్ని ఇస్తున్నాడు. అధ్యా. 10 దీనికి ముందున్న అధ్యాయంలోని యూదా నాయకుల చట్టపరమైన సంకుచితత్వం, మొండితనం, దేవునిపట్ల ఉన్న కఠినత్వంపై వాఖ్యానాన్ని ఇస్తుంది. యేసు మంచి కాపరి మాత్రమే కాదు గాని విశ్వాసి సమృద్ధియైన, నిత్యజీవాన్ని కనుగొనే ద్వారం కూడా (వ.9-10). దీని తర్వాత ఉన్న చర్చ, ఆలయ ప్రతిష్ఠిత పండుగలో (వ.22-39) యేసును దేవదూషణ పేరుమీద రాళ్ళురువ్వి చంపడానికి చేసిన ప్రయత్నంతో ముగిసింది. దీని తర్వాత, బాప్తిస్మమిచ్చు యోహాను గురించిన చివరి ప్రస్తావనతో, అధ్యా. 5-10లో ఉన్న ఈ "పండుగల చక్రం", అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను యేసును గురించి సాక్ష్యమిచ్చే పరిచర్యతో ఆరంభమైన ఈ భాగమంతా (1:19-10:42) ముగుస్తుంది.

10:1 గొట్టెలదొడ్డి ఒక ఇంటి దగ్గర, చుట్టూ రాతిగోడ కట్టి, అనేక కుటుంబాలు తమ గొట్టెలను ఉంచిన, ఒక ఆవరణ అయి వుంటుంది (18:15), ద్వారము ను జీతానికి పనిచేసే ఒక కావలివాడు కాస్తుండవచ్చు (10:3). దొడ్డిలో ప్రవేశించడానికి దాని ద్వారపు రహస్య స్వభావంపై దొంగ దృష్టిపెట్టి ఉండవచ్చు, దోచుకొనువాడు హింసించడం మీద (లూకా 10:30,36) దృష్టి పెడతాడు. 

10:2 గొట్టెలకాపరి అధికార పూర్వకంగా గొట్టెలను కాచేవాడు. 

10:3-4 ద్వారపాలకుడు గురించి వ.1 నోట్సు చూడండి. గొట్టెల కాపరి తన సొంత గొట్టెలను పేరు పెట్టి పిలవడం, వాటిని వెలుపలికి నడిపించడం అనేవి మెస్సీయకు సంబంధించి సంఖ్యా 27:16-18 (ముఖ్యంగా వ.17)ను లేక యెహె 34:13ను సూచిస్తుండవచ్చు. ఐగుప్తునుండి ఇశ్రాయేలీయుల నిర్గమం కొన్నిసార్లు కాపరిని అనుసరిస్తున్న మందలాగా వర్ణించబడింది (కీర్తన 77:20; యెషయా 63:11,14ను కీర్తన 78:52తో పోల్చండి). పాత నిబంధన ప్రవచనాత్మక సాహిత్యం , అంత్యకాలంలో ఇలాంటి దేవుని ప్రజల విమోచనను ముందుగానే ఊహించింది (మీకా 2:12-13).

10:5-6 సాదృశ్యములోని అన్యులు యూదా నాయకులే. 

10:8,9 యేసు తనను తాను ద్వారము అని సూచించడం, కీర్తన 118:20 వంటి వాక్యభాగాలలోని మెస్సీయకు సంబంధించిన భాగాలను సూచిస్తుండవచ్చు (యోహాను 6:35,48; 10:1 నోట్సు చూడండి). నాకు ముందు వచ్చిన వారందరు అనే మాటలు, మెస్సీయలమని చెప్పుకొని, తమ అనుచరులకు స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేసి, దానికి బదులుగా వారిని సాయుధ పోరాటాలకు/ఉద్యమాలకు నడిపించిన వారిని సూచిస్తుండవచ్చు (అపొ.కా.5:36-37; 21:38). దొంగలు... దోచుకొనువారు, "తమను తాము పోషించుకుంటున్న" ఇశ్రాయేలు కాపరులను జ్ఞాపకం చేస్తుంది (యెహె 34:2-4; యోహాను 10:1 నోట్సు చూడండి). 

10:9 రక్షణకు యేసే ద్వారము (14:6తో పోల్చండి). పరలోకానికి ఒక ద్వారం నుండి ప్రవేశించడాన్ని గురించి కొ.ని. మరొక చోట చెబుతుంది (మత్తయి 7:7,13; 25:10; అపొ.కా. 14:22). లోపలికి పోవుచు బయటికి వచ్చుచు అనే మాటలు నిబంధనా పరిభాషను ప్రతిధ్వనిస్తూ, ముఖ్యంగా విధేయ తకు లభించే ఆశీర్వాదాన్ని సూచిస్తున్నాయి (ద్వితీ 28:6ను కీర్తన 121:8తో పోల్చండి). ఇది ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించిన యెహోషు వను గూర్చి మోషే వర్ణించడాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది (సంఖ్యా 27:1617). మేతను కనుగొనడం అనేది దేవుని పోషణకు నిశ్చయతను చూపుతుంది (1దిన 4:40: కీరన 23:2; యెషయా 49:9-10; యెహె 34:12-15).

10:10 ఇప్పుడే, ఇక్కడే సమృద్ధి జీవమిస్తాననే యేసు వాగ్దానం, యెహె 34:12-15, 25-31 వంటి పా.ని. వాక్యభాగాలను స్మరణకు తెస్తుంది. యోహాను 5:26 నోట్సు చూడండి. 

10:11 మంచికాపరి యేసే (6:35,48 నోట్సు చూడండి), తీర్పుకు గురయ్యే విశ్వాసఘాతకులైన కాపరులకు భిన్నంగా దేవుడు నిజమైన కాపరిగా ఉన్నాడని పా.ని. చూపిస్తుంది (యిర్మీయా 23:1-4; యెహె 34; జెకర్యా 11:4-17). దావీదు (లేక దావీదు సంతతివాడైన మెస్సీయ) కూడా మంచి కాపరిగా చూపబడ్డాడు (2 సమూ 5:2; కీర్తన 78:70-72; యెహె 37:24; మీకా 5:4). అలాగే మోషే కూడా (యెషయా 63:11ను కీర్తన 77:20తో పోల్చండి). గొట్టెల కొరకు తన ప్రాణము పెట్టు మంచి కాపరిగా యవ్వనుడైన దావీదు గుర్తుకొస్తాడు (1సమూ 17:34-37). ,

10:12-13 జీతగాడు గొట్టెలపట్ల శ్రద్ధ చూపకుండా, ప్రమాదంలో వాటిని విడిచి పారిపోతాడు. ఇశ్రాయేలు జీతగాళ్ళకు (యెహె 22:27), దేవుడు, ఆయన మెస్సీయకు మధ్య వ్యత్యాసం ఇక్కడ చెప్పబడింది. ఒక “మంచికాపరి"గా రాజైన దావీదు. తనకన్నా చాలా గొప్పవాడైన మెస్సీయకు ముంగుర్తుగా ఉన్నాడు (1సమూ 17:34-36). 10:14 గొట్టెల మంచి కాపరియైన యేసును గురించి వ.11 నోట్సు చూడండి. 

10:15 "యేసును ఎవరు ఎరుగుతారో వారు తండ్రిని కూడా ఎరుగుతారు, ఎవరు యేసును ప్రేమించి ఆయనను విశ్వసిస్తారో వారిని తండ్రి ప్రేమిస్తాడు” (హెర్మాన్ రిడ్డర్ బాస్). 

10:16 ఈ దొడ్డివి కాని వేరే గొట్టెలు అనే మాటలు అన్యజనులను సూచిస్తున్నాయి (యెషయా 56:8). తన సిలువ మరణం ద్వారా అన్యజనుల మధ్య తన పనిని యేసు ముందుగా దృష్టిస్తున్నాడు. మంద ఒక్కటియు గొట్టెలకాపరి ఒక్కడును అనే మాటలు యెహె 34:23; 37:24ను సూచిస్తున్నాయి. విశ్వాసులైన యూదులు, అన్యజనులు కలిసి ఒకే ఒక్క మెస్సీయ సమాజంగా ఐక్యపరచబడతారు.

10:17 తన ప్రాణాన్ని బలిగా అర్పించడాన్ని బట్టి యేసు తండ్రి ఆమోదాన్ని పొందడం కాదు, తండ్రికి విధేయత చూపడాన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. 

10:18 ఈ ఆజ్ఞ పొందితిననే మాటలు పా.ని.లో ఇశ్రాయేలుతో దేవుని అనుబంధాన్ని చూపించే, యేసుకు తండ్రితో ఉన్న సంబంధపు నిబంధనా పరిభాషను సూచిస్తున్నాయి. ఈ మాటలు, పరిస్థితులు చేజారిపోవడం వల్ల యేసు మరణించ లేదని పాఠకులకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన రావడానికి కారణం అదే (12:27 చూడండి). -

10:19-21 ప్రాచీన కాలంలో వెళ్లితనం/పిచ్చి, దయ్యపు పీడనలు తరచూ ఒకదానికి ఒకటి సంబంధించినదిగా భావించేవారు. గ్రుడ్డివారి కన్నులు తెరవడం అనే మాటలు, మంచికాపరి ఉపదేశాన్ని అధ్యా. 9 లోని గుడ్డివాన్ని స్వస్థపరచే సంభవంతో కలుపుతున్నాయి. దయ్యం పట్టినవాడు (ఇవి ఇంతకు ముందు చేసిన ఆరోపణలను జ్ఞాపకం చేస్తున్నాయి, 7:20 నోట్సు చూడండి), వెళ్లివాడు అనే ఆరోపణలు, యెహోవాయే గుడ్డివారికి చూపునిస్తాడు. (కీర్తన 146:8ను నిర్గమ 4:11తో పోల్చండి) అనే పా.ని. బోధతో విభేదిస్తున్నాయి. 

10:22 ఏడు రోజులుండే ఆలయ ప్రతిష్ఠిత పండుగ (దీనినే హనుక్కా అనీ దీపాల పండుగ అని పిలుస్తారు), క్రీ.పూ.167లో అంతియోకస్ ఎపిఫనెస్ అనే పాలకుడు యూదుల దేవాలయాన్ని అపవిత్రపరచిన కారణంగా క్రీ.పూ. 164 డిసెంబరులో అది తిరిగి పున:ప్రతిష్టించబడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సంతోషాన్నిస్తుంది. 

10:23 అది శీతకాలము అనే మాటలు డిసెంబరు నెలను సూచిస్తున్నాయి. 2:13 నోట్సు చూడండి. బహుశా శీతాకాలపు వాతావరణాన్ని బట్టి, యేసు బహిరంగ ప్రదేశంలో కాక, సొలొమోను మంటపము దగ్గర బోధించాడు. ఈ కట్టడం సొలొమోను సమయంలో కట్టబడిందని సాధారణంగా భావించేవారు (కానీ అది పొరపాటు). తరువాత ఇది ఆది సంఘం సమావేశమయ్యే స్థలంగా మారింది (అపొ.కా. 3:11; 5:12).

10:24-25 నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని అడగడం, తెలివిలేని ప్రశ్న అనిపిస్తుంది (లూకా 22:67). యేసు తాను మెస్సీయను అని చెప్తున్నాడని అర్థం చేసుకోకుంటే, ఆయన్ని చంపడానికి వారు మరలా మరలా ప్రయత్నించడం ఎందుకు? (యోహాను 5:18; 7:25; 8:59). నిజానికి తాను అలాగే చెప్పానని యేసు జవాబిచ్చాడు. యేసును గూర్చి సాక్ష్యమిస్తున్న ఆయన క్రియలు గురించి, 5:31-47 నోట్సు చూడండి.

10:26-29 అపహరించడం (వ. 28-29) అంటే బలవంతంగా లాక్కోవడం (వ.1 నోట్సు చూడండి). ఈ మాట, వ.12-13 లోని ప్రమాద సమయాలలో మందను విడిచి పారిపోయిన జీతగాని దృశ్యానికి భిన్నంగా ఉంది. దేవుని చేతిలో నుండి ఎవరూ దోచుకోలేరు అనే పా.ని. వ్యాఖ్యలను ఇది జ్ఞాపకం చేస్తుంది (యెషయా 43:13).

10:30 తాను, తండ్రి ఏకమై యున్నామనే యేసు ప్రకటన (వ. 33-38; 5:17-18తో పోల్చండి), షేమా అని పిలవబడే యూదుల ప్రాథమిక ఒప్పుకోలు (ద్వితీ 6:4)ను ప్రతిధ్వనిస్తూ, తాను దేవుడనని చెప్పినట్లయ్యింది. యేసు తండ్రితో ఏకంగా ఉండడం అనేది యేసు అనుచరులు ఐక్యంగా ఉండడానికి ఆధారం అని తరువాత చెప్పబడింది (యోహాను 17:22). 

10:31 దేవదూషణ చేశాడని యేసును రాళ్ళతో కొట్టడానికి చేసిన ప్రయత్నాన్ని గురించి, 5:18; 8:59 నోట్సు చూడండి. 

10:32 యేసు క్రియలు ఆయనను గూర్చి సాక్ష్యమివ్వడాన్ని గురించి 5:31-47 నోట్సు చూడండి. 

10:33 యేసుపై చేసిన ఆరోపణ, లేవీ 24:16పై ఆధారపడినట్లుగా కనిపిస్తుంది. (సంఖ్యా 15:30-31; మార్కు 14:61-64 తో పోల్చండి; యోహాను 8:59 నోట్సు చూడండి). 

10:34 మానవ న్యాయాధిపతులు ఒకవిధంగా "దైవములు" అని లేఖనాల్లో పిలవబడడానికి అవకాశం ఉంటే, అలాంటి బిరుదు ఆయనకు మరింత ఎక్కువగా తగినది అనేది కీర్తన 82:6 ఎత్తి చెప్పడంలో యేసు ఉద్దేశం. 


10:35 లేఖనము నిరర్థకము కానేరదు అనడంలో రాయబడిన దేవుని మాటలను (ఈ సందర్భంలో హెబ్రీ. లేఖనాలు; మత్తయి 5:18తో పోల్చండి) మీరకూడదనే ఆయన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు, ఆయన విరోధులలో అనేకులు (యూదులు) దేవుని వాక్య అధికారాన్ని ఎత్తిపట్టుకున్నారు. 

10:36 యేసు తన పనికోసం ప్రతిష్ఠ చేయబడినవాడు అనే మాట, ధర్మశాస్త్రమిచ్చిన మోషే, ప్రవక్తయైన యిర్మీయా, అహరోను సంతతివారైన యాజకులు నియమించబడినప్పటి భాషను ధ్వనిస్తుంది. 

10:37-38 యేసు క్రియలు ఆయనను గూర్చి సాక్ష్యమివ్వడం గురించి, 5:31-47 నోట్సు చూడండి.

10:39 యేసును పట్టుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం మొదటిదేమీ కాదు. 7:30 చూడండి. 

10:40-41 యోహాను... బాప్తిస్మమిచ్చు చుండిన స్థలము గురించి 1:28 నోట్సు చూడండి. 


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |