Lamentations - విలాపవాక్యములు 1 | View All

1. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

2. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.

3. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక

4. సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.

5. దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి

6. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి.

7. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి.

8. యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది

9. దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.

10. దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది

11. దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.

12. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి.

13. పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.

14. కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.

15. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల నందరిని కొట్టివేసెను నా ¸యౌవనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం చెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు.
ప్రకటన గ్రంథం 14:20, ప్రకటన గ్రంథం 19:15

16. వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి.

17. ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని విరోధులైయుండ నియమించియున్నాడు యెరూషలేము వారికి హేయమైనదాయెను.

18. యెహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలును నా ¸యౌవనులును చెరలోనికిపోయి యున్నారు

19. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.

20. యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

21. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.

22. వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1-22 ఈ అధ్యాయంలోని ప్రతి వచనం హెబ్రీ అక్షరమాలలోని 22 అక్షరాలను ప్రథమాక్షరంగా కలిగి ఉండేటట్లు కూర్చబడింది. 

1:1-7 ఈ విభాగంలో రచయిత యెరూషలేము తరపున మాట్లాడుతున్నాడు.
యెరూషలేము నష్టాలు ఒకదాని తర్వాత మరొకటి పోగవుతుండగా పట్టణం ఒంటరిది కావడం రచయితను భావ సంచలనానికి గురిచేసింది. జనంతో నిండినది ఏకాకి కావడం (వ.1), మిత్ర రాజ్యా లు దూరం కావడం (వ.2), విశ్రమ స్థానాన్ని పోగొట్టుకోవడం (వ.3), సంతోషాన్ని కోల్పోవడం (వ.4), ఘనతను పోగొట్టుకోవడం (వ.5), ధైర్యాన్ని కోల్పోవడం (వ. 6), దైవారాధనకు దూరమైపోవడం (వ. 7, వాల్టర్ కైసర్), 

1:1 ఎట్లు అనే ఆశ్చర్యార్ధకంతో రచయిత ప్రారంభిస్తున్నాడు. బైబిల్ లోని వాక్యభాగాల్లో ఈ పదాన్ని విలాపాలకు, అంత్యక్రియలకు ఉపయోగించడం జరిగింది. ఇది యూదు వాడుకలో ఓయీ! అయ్యో! లాంటిది. పూర్వవైభవానికి, ప్రస్తుత స్థితికి మూడు వైరుధ్యాలు కనబడుతున్నాయి. ఇదివరకు యెరూషలేము జనభరితమైన పట్టణం, అన్యజనులలో ఘనతకెక్కినది, నగరాలన్నిటిలో రాజకుమార్తె వంటిది, ఇప్పుడు యెరూషలేము ఏకాకి, విధవరాలివంటిదాయెను, పన్ను చెల్లించే బానిస రాజ్యంగా మారింది. 

1:2 నగరంతో గతంలో మైత్రి కొనసాగించిన వారిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆదరించడంలేదు. వారందరూ నమ్మకద్రోహులు, అణచివేసే శత్రువులయ్యారు.

1:3 యుద్దం, క్షామం వలన కష్టనష్టాలు, ఫరో నెకోకు రాజైన నెబుకద్నెజరుకు చెల్లించే భారీ పన్ను, వీటికి తోడు చేదైన చెర అనుభవం. మొదలైన వాటన్నిటి వలన యూదా విశ్రాంతినొందక పోయింది. యూదాను తరుముతున్నవారు ఇరుకు చోట్ల దాన్ని పట్టుకుంటున్నారు. యూదావారు సుళువుగానే శత్రువులకు ఎరగా చిక్కుతున్నారు. 

1:4 జాతిని ఆవరించిన విషాదం ఇప్పుడు వారి మతానికి కేంద్రస్థానం అయిన సీయోనును సైతం ఆవరించింది. నియామక కూటములకు ఎవరును రాకపోవడం వలన పండుగలు జరగడం లేదు. అంతా పాడై నిర్జనమైపోయింది. 

1:5 యూదా అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు అని మొదటిసారిగా యెహోవా గురించి ఈ వచనం ప్రస్తావించింది.

1:6 తరుముతున్న వేటగాళ్లనుండి పారిపోతున్న దుప్పులవలె ఉన్నారు, మందను కాపాడడానికి ఎవరూ లేరు, యెరూషలేము ముట్టడి జరిగినప్పుడు ప్రాణభయంతో రాజైన సిద్కియా పారిపోయినట్టుగా. (2రాజులు 25:4) యూదా అధిపతులు దేశమును విడిచిపెట్టారు (2రాజులు 24:1,12; దాని 1:2). 

1:7 యెరూషలేము పేరు మొదటిసారిగా కనిపించే ఈ వచనం ఈ విభాగానికి ముగింపుగా ఉంది. అన్నిటికంటె ఘోరమైనది విరోధులు... దాని నపహాస్యము చేయడం. 

1:8-11 ఈ విభాగం యూదా దుఃఖానికి గల కొన్ని కారణాల్ని అన్వేషిస్తున్నది.. వీటిలో ముఖ్యమైనవి సిగ్గుకరమైన ప్రవర్తన (వ.8), అపవిత్రత (వ.9), నిషేధించబడినవారు పరిశుద్ధస్థలంలో ప్రవేశించడం (వ. 10), క్షామం (వ.11).

1:8 అన్నిటికంటె ఎక్కువ అవమానకరమైనది. వారు వస్త్రహీనులుగా చేయబడడం. ఇది సాధారణంగా వేశ్యల్ని శిక్షించడంలో భాగం (యెహె 16:35-39; 23:29), లేదా బందీలుగా చెరలోకి తీసుకొని వెళ్లేవారిని వస్తహీనులుగా చేసి తీసుకొని వెళ్లే అవమానకరమైన చర్యలు

1:9 యూదా తన కడవరి స్థితిని జ్ఞాపకము చేసికొనలేదు. పైగా, దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా రప్పిస్తానని చెప్పిన వాటిని ఆయన తప్పక చేస్తాడని వారు నమ్మలేదు (ద్వితీ 28:15-68). ఎంతో వింతగా హీనదశ చెందినది అన్నట్టుగా యూదా పతనం దానికే ఆశ్చర్యం కలిగించింది.

1:10 యూదా తనకు వైభవ కారణమైన వాటన్నిటిలో అత్యంత ప్రధానమైన దేవాలయాన్ని కోల్పోయింది. పరిశుద్దాలయంలోకి అన్యులకు ప్రవేశం లేదు, అయితే ఇప్పుడు అన్యజనులు అమర్యాదగా దేవాలయంలోకి ప్రవేశించి
తొక్కుతున్నారు.

1:11 ప్రజలు తమ ప్రాణసంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొంటున్నారు. ప్రశస్తమైన ఆభరణాలను అల్పమైన ఆహారపదార్థాల కోసం ఇచ్చివేస్తున్నారు. 

1:12-17 దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు వెల్లడి కావడంతో ఈ మొదటి విలాపంలోని రెండవ అర్ధభాగం ఇంకా తీవ్రతరమైంది. 

1:12 యూదాకు కలిగిన శ్రమవంటి శ్రమ ఎవరికైనా కలిగిందేమోనని చూడాలనీ, వారిపట్ల దయచూపించాలని వివిధ జాతుల ప్రజలకు విన్నవించడం కనబడుతున్నది. ఇది యెహోవా తన ఆగ్రహాన్ని చూపించిన మరొక ప్రచండ కోప దినము.

1:13-15 యెరూషలేము అనుభవించిన తీవ్రమైన శ్రమలను వర్ణించే నాలుగు గానుగలో వేసి తొక్కిన కు మరింత తీవ్రంగా వు కాదు గంభీరమైన రూపకాలంకార వర్ణనలు: (1) పరమునుండి... అగ్ని, (2) దాని పాదములను చిక్కించుకొను వల, (3) దాని మెడమీద జంతువుకు కట్టే కాడి, (4) ద్రాక్షపండ్లను ద్రాక్షగానుగలో వేసి తొక్కినట్టు తొక్కబడుట. ఒక్కొక్క దృశ్యం యెహోవా “ఉగ్రత దినాన్ని” (లాటిన్. డిఎస్ ఇరే) మరింత తీవ్రంగా వర్ణిస్తుంది. పైనుండి వచ్చిన అగ్ని దేవుని నుండి దిగి వచ్చిన అగ్ని కాక మరేమీ కాదు (ఆది 19:24; కీర్తన 11:6). అలాగే దేవుని నుండి వచ్చిన వల కూడా. ఇది మనిషి జీవనశైలికి పరీక్ష (కీర్తన 94:13; యిర్మీయా 50:24; యెహె 12:13; 17:20; 32:3; హో షేయ 7:12). ఇక్కడ కాడి యిర్మీయా అబద్ద ప్రవక్తయైన హనన్యాను ఎదుర్కోవడాన్ని గుర్తుకు తెస్తుంది. (యిర్మీయా 28), అదేరీతిగా, ద్రాక్షగానుగ అంతిమ తీర్పును సూచించే సాదృశ్యం (యెషయా 63:1-4; యిర్మీయా 6:9; యోవేలు 3:13; ప్రక 14:18-20; 19:13-15). 

1:16 శత్రువులు ప్రబలి ఉండడం. యిర్మీయా హృదయంలో తీవ్రమైన ఆవేదనకు కారణం.

1:17 మళ్లీ, ఈ అధ్యాయంలో నాల్గవసారి విలాపాన్ని తెలిపే మాటలు కనబడుతున్నాయి: సీయోనును ఆదరించువాడు లేక యుండెను.

1:18-22 ఇశ్రాయేలు. తనకెదురైన శ్రమకు బాధతో ప్రతిస్పందించడాన్ని వర్ణించే "మొదటి విలాపాన్ని హెబ్రీ అక్షరమాలలోని ఒక్కొక్క అక్షరంతో ప్రారంభించి వ.17 వరకు కొనసాగించిన తర్వాత, పద్దెనిమిదవ అక్షరంతో ఒక క్లుప్తమైన విరామాన్ని ఆరంభిస్తూ యెహోవా న్యాయస్థుడని యూదా " ఒప్పుకొని నీవు నాకు చేసినట్లు వారికి (యూదా శత్రువులు) చేయుము అని ఆయనను అడుగుచున్నట్లు చూపిస్తున్నాడు. 

1:18 యెహోవా న్యాయస్థుడు అని చెప్తూ యూదా, తన ఒప్పుకోలును ప్రారంభించింది. యూదా ప్రజలు ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసిరి. 

1:19 యూదాతో మైత్రిగా ఉన్నవారు (విటకాండ్రు) నమ్మకద్రోహం చేశారు. యూదా ప్రజలు ఆహారము వెదకబోయి ఏమీ దొరకక పట్టణములో ప్రాణము విడిచిపెట్టిన వారయ్యారు.

1:20-21 ఈ వచనాల్లో రెండు విన్నపాలు చేయబడ్డాయి: (1) అంత రంగంలో, గుండెలోతుల్లో యూదా అనుభవిస్తున్న మిక్కటమైన ఇబ్బందిని యెహోవా దృష్టించాలి (2) తనను అపహాస్యం చేస్తున్న ప్రజలకు యెహోవా ప్రతీకారం చేయాలి.

1:22. మనం మన శత్రువుల్ని సైతం ప్రేమించాలని యేసు మనకు బోధించినప్పటికీ (మత్తయి 5:44), యూదా మీద పడిన అన్యజనాల పైకి ఉగ్రత దిగి రావాలని యిర్మీయా విన్నపం చేయడంలో మనల్ని ఇబ్బందికి గురి చేసేది ఏమీ లేదు. యేసు ఎలాంటి ప్రేమ గురించి బోధించాడో అలాంటి ప్రేమను పాత నిబంధనలోని యిర్మీయా వంటి విశ్వాసులు సైతం చూపించాలి. అలాగని ఇది యిర్మీయా చెప్పినదానితో విభేదించదు. శత్రువులు వీరిని మనం ప్రేమించాలి, మన ప్రార్థనలో వీరిని దేవుని కప్పగించాలి. రెండవ రకం, ద్వేషించడం మాత్రమే కాదు, ద్వేషాన్ని చర్యల్లోను చూపిస్తారు. మన మీద, మన దేవుని మీద ద్వేషంతో రగిలిపోతారు. మనకు ప్రాణాపాయం కలిగిస్తారు. మనం నిర్మల :హృదయంతో శాంతిని కోరుకున్నప్పటికీ వారు ఇంకా అలాగే కొనసాగుతున్నట్లయితే వారిని మనం దేవునికి అప్పగించి వారిపై తీర్పును ఆయనకు వదిలివేయాలి (కీర్తన 139:19). 

Shortcut Links
విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |