Revelation - ప్రకటన గ్రంథము 11 | View All

1. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
యెహెఙ్కేలు 40:3, యెహెఙ్కేలు 40:47, జెకర్యా 2:1-2

2. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
కీర్తనల గ్రంథము 79:1, యెషయా 63:18, దానియేలు 8:13, జెకర్యా 12:3

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
జెకర్యా 4:2-3, జెకర్యా 4:11, జెకర్యా 4:14

5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
2 సమూయేలు 22:9, 2 రాజులు 1:10, కీర్తనల గ్రంథము 97:3, యిర్మియా 5:14

6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
నిర్గమకాండము 7:17, నిర్గమకాండము 7:19, 1 సమూయేలు 4:8, 1 రాజులు 17:1

7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.
దానియేలు 7:3, దానియేలు 7:7, దానియేలు 7:21

8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
యెషయా 1:10

9. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనము లకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవము లను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.

10. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.
యెహెఙ్కేలు 37:5-10

11. అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
యెహెఙ్కేలు 37:5-10

12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
2 రాజులు 2:11

13. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
యెహోషువ 7:19, యెహెఙ్కేలు 38:19-20, దానియేలు 2:19

14. రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.
నిర్గమకాండము 15:18, కీర్తనల గ్రంథము 10:16, కీర్తనల గ్రంథము 22:28, దానియేలు 2:44, దానియేలు 7:14, ఓబద్యా 1:21, జెకర్యా 14:9

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి

17. వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
నిర్గమకాండము 3:14, యెషయా 12:4, ఆమోసు 4:13

18. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
కీర్తనల గ్రంథము 2:1, కీర్తనల గ్రంథము 46:6, కీర్తనల గ్రంథము 99:1, కీర్తనల గ్రంథము 115:13, దానియేలు 9:6, దానియేలు 9:10, ఆమోసు 3:7, జెకర్యా 1:6

19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
నిర్గమకాండము 9:24, నిర్గమకాండము 19:16, 1 రాజులు 8:1, 1 రాజులు 8:6, 2 దినవృత్తాంతములు 5:7, యెహెఙ్కేలు 1:13బైబిల్ అధ్యయనం - Study Bible
11:1-2 చేతికట్టవంటి కొలకట్ట ప్రస్తావన, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేయమనడం, యెహె 40:3,5ను జప్తికి తెస్తుంది. అక్కడ పూజించువారిని లెక్కపెట్టుము అనే మాటలు, దేవుని ప్రజలను గూర్చి మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి. ఆలయమునకు వెలుపటి ఆవరణము... అన్యులకు ఇవ్వబడింది. కాబట్టి దానికి కొలత అక్కరలేదు. యోహాను దేవాలయమును, ఆవరణను చూడడానికి యెరూషలేములో రెండవ దేవాలయము ఇంకా నిలిచివుండాల్సిన అవసరం లేదు. అన్యులు పరిశుద్ధ పట్టణమును... తొక్కుదురు అనే మాటలు, క్రీస్తు రెండవ రాకడకు ముందు “అన్యజనుల కాలములను" గురించి యేసు చెప్పిన మాటలను ప్రతిధ్వనిస్తుంది (లూకా 21:24). 

11:3-4 పేరు ప్రస్తావించబడని యిద్దరు సాక్షులు... వెయ్యిన్ని రెండువందల అరువది దినములు... ప్రభువు కోసం ప్రవచించడం అనేది వ.2; 13:5 లోని “నలువది రెండు నెలలకు" పూర్తి విరుద్ధంగా ఉంది. “వారు సాక్ష్యము చెప్పుట ముగించేవరకు” వారికి ఎవడూ హానిచేయలేడు. కాబట్టి (11:7), వారు యెరూషలేములోనే పరిచర్య చేస్తారు కాబట్టి అక్కడే మరణిస్తారు (వ. 8-10 నోట్సు చూడండి), అందువల్ల 1260 రోజుల కాలము, మృగము పాలించే మూడున్నర సంవత్సరాల కాలం (13:5) కాదు. ఈ 1260 రోజులు మృగము పాలనకు ముందే ఉంటాయి. ఎందుకంటే అతడు ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధి పొందడానికి ఈ సాక్షులను చంపడమే ఆధారం (11:7). ఈ సాక్షులు విలాపానికి, మారుమనస్సుకు గుర్తుగా ఉన్న (యోవేలు 1:13; యోనా 3:5-6) గోనెపట్ట ధరించుకొంటారు. రెండు ఒలీవ చెట్లును, దీపస్తంభములు జెకర్యా 4లోని ఊహాచిత్రాలు. జెకర్యా 4లో ఆ ఇద్దరు అధికారులైన జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, అక్కడ వారిపని దేవాలయ పునర్నిర్మాణం. యోహాను ఈ ఊహాచిత్రాన్ని వాడడానికి కారణం, ఆ అధ్యాయంలో ఉన్న: “శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను” (జెకర్యా 4:6) అనే కీలకమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని వ్యక్తీకరించడానికి కావచ్చు. 

11:5-6 ఎలాంటి భౌతిక హాని పొందనేరని వారుగా ఉండడమే కాక, ఈ ఇద్దరు సాక్షుల పరిచర్య, ఏలీయా, మోషేల పరిచర్యలోని గొప్ప అద్భుతాలను ప్రతిధ్వనిస్తాయి (మోషే, ఏలీయాలిద్దరూ మత్తయి 17:3లో రూపాంతరపు కొండమీద ప్రత్యక్షమయ్యారు). అగ్ని... వారి శత్రువులను... దహించివేయడం 2రాజులు 1:10-12లోని ఏలీయా పరిచర్యను గుర్తుచేస్తుంది. వారు ప్రవచింపు దినములు వర్షము కురువకపోవడం (మూడున్నర సంవత్సరాలు, వ.3), ఏలీయా ప్రవచించిన మూడున్నర సంవత్సరాల కరవును ప్రతిధ్వనిస్తుంది (1రాజులు 17:1; 18:1). నీళ్ళను రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకైన శక్తి, ఐగుప్తులో మోషే పరిచర్యను తలపిస్తుంది (నిర్గమ 7-11).

11:7 క్రూరమృగము, క్రీస్తు విరోధిగా వేరొకచోట ప్రవచింపబడినదిగా (దాని 7:20-21,25; 2థెస్స 2:9-11; 1యోహాను 2:18), ప్రక 13,17లో సాతానుచే రేపబడిన ప్రపంచాధినేత, ఇప్పుడు మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. దాని ఆరంభం, దయ్యపు మిడతల ఉనికి పట్టును (9:1-10), అలాగే సాతాను బంధింపబడే చోటును (20:1-3) అయిన అగాధము. వారి మూడున్నర సంవత్సరాల పరిచర్య పూర్తయినందువల్లనే, ఇద్దరు సాక్షులపై క్రూరమృగము యుద్ధము చేసి వారిని చంపగలిగింది. సాక్షుల మరణాన్ని గురించి, క్రూరమృగము విజయం సాధించినట్టుగా కనిపించే (వ.7-10) జయించి అనే మాట వాడడంలోని తమాషా ఏమిటంటే, హతసాక్షులైన ఈ సాక్షులు, మరలా జీవించడం (వ.11-12).

11:8-10 మహాపట్టణమనే మాట సామాన్యంగా ప్రకటన గ్రంథంలో మహా బబులోనును (17:18; 18:10), అలాగే సొదొమ (దాని లైంగిక అపవిత్రతను బట్టి చెడ్డపేరు గలిగింది), ఐగుప్తు (దేవుని ప్రజలు బానిసలుగా ఉన్న ప్రదేశం)లను సూచిస్తుంది. ఈ కాలంలో యెరూషలేము నివాసుల దుష్టత్వమును ఇది చూపుతుంది. ఇద్దరు సాక్షుల దారుణమైన మరణం, వారికి సరైన సమాధి జరగకపోవడం, వారు మరణించడాన్ని బట్టి ఎన్నిక కానీ “భూనివాసుల" ఆనందం (13:8; 17:7-8 నోట్సు చూడండి) ఆ దుష్టత్వాన్ని కనపరుస్తుంది. క్రూరమృగము చేతిలో మరణించిన నేపథ్యంలో ఆ సాక్షులను ప్రవక్తలు అని కూడా పిలవడం, వారిని తమ విశ్వాసాన్నిబట్టి మరణించి, ప్రకటన గ్రంథంలో ఘనపరచబడిన (వ. 18; 16:6; 18:20,24) మిగిలిన ప్రవక్తల సరసన చేర్చింది.

11:11-12 మూడు దినములన్నరయైన పిమ్మట అనే మాటలు యేసు మూడవ దినమున తిరిగి లేచిన (1కొరింథీ 15:4) విషయంతో పోల్చడానికి ఉద్దేశించబడింది. జీవాత్మ, యెహె 37:5,10లోని "ఎండిన ఎముకల లోయ"లో ఇశ్రాయేలు పునరుజ్జీవనం పొందడాన్ని బహుశా ప్రతిధ్వనిస్తూ,
ప్రక 11:13లో ... ఇశ్రాయేలీయులందరి మారుమనస్సుకు - రంగాన్ని సిద్ధపరుస్తుండవచ్చు. మిగుల భయము మంచిదే కావచ్చు, ఎందుకంటే “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట" జ్ఞానమునకు మూలము (సామె 1:7). ఇక్కడికి ఎక్కి రండని (4:1తో పోల్చండి) అనే మాటలను శ్రమకాలం మధ్యలో సంఘం ఎత్తబడడాన్ని గూర్చి చెబుతున్నాయని కొందరు వ్యాఖ్యాతలు భావిస్తారు. ఈ వాక్యభాగంలో మాత్రం అది ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రమే సూచిస్తుంది.

11:13 ఇద్దరు సాక్షుల మరణాన్ని గురించి సంతోషించడం నుండి (వ.7-10), వారు పునరుత్థానం పొందడం; తరువాత వచ్చిన గొప్ప భూకంపములో ప్రాణాలకోసం అల్లాడడం వరకు అన్నీ ఒక్క గడియలో మారిపోతాయి. నాశనం, మరణం విస్తరిస్తుండగా, ఇద్దరు సాక్షుల మరణం, వారి పునరుత్థానం, ఆరోహణం చూసిన అనేకులలోని భయం కాస్తా విశ్వాసంగా మారిపోతుంది. 14:6-7లో ఇంకా భూమిమీద సజీవులుగా ఉన్నవారికి “నిత్య సువార్త ప్రకటించబడడానికి సరియైన స్పందన : “భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి”. ఇది యూదులు ఎక్కువగా ఉన్న యెరూషలేములో జరిగినందున, “ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు” (రోమా 11:25-26) అనే పౌలు ప్రవచనం ఇప్పుడు నెరవేరి ఉండవచ్చు. కొందరైతే దీనిని ప్రభువును ప్రజలు నిజమైన విశ్వాసంతో కాక - తాత్కాలికంగా గుర్తించే “అత్యవసర పరిస్థితినిబట్టి మారుమనస్సు పొందడం” అని వ్యాఖ్యానిస్తారు. 

11:14 "8:13 లో చెప్పిన మూడు శ్రమలలలో రెండవ శ్రమ ఇప్పుడు  గతించిపోయింది. మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నందున, అది బహుశా ఏడవ బూరకు సంబంధించింది కావచ్చు అనేది స్పష్టం (వ.15-19 నోట్సు చూడండి). 

11:15-19 ఏడవ... బూర అనే మాటలలోని చివరిది అనే భావం, కొందరు వ్యాఖ్యాతలు ఇది క్రీస్తు రెండవరాకడ వచ్చే సమయం అని ఆలోచించేలాచేసింది. తరువాతి అధ్యాయాలు వేరే దృక్కోణంనుండి రెండింతలు దాన్ని జ్ఞాపకం చేసుకునేలా చేస్తాయి. “సంగ్రహణ" దృక్కోణంలో, ముద్రలు, బూరలు, పాత్రలు మూడూ ఒకే తీర్పులను వేర్వేరు దృక్కోణాలనుండి చెప్పినవే అంటారు. అయితే అలాంటి విధానం అవసరంలేదు, ఎందుకంటే ఏడవ బూర ఏడు క్రోధ పాత్రలపై కమ్మి, ఏడవ పాత్ర మరలా క్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటును చూపిస్తుంది. ఈ దృక్కోణం, మెరుపులు, ఉరుములు, ధ్వనులు, భూకంపములు, గొప్ప వడగండ్లు అనే ఏడవ బూరకు సంబంధించిన విషయాలు భూమిమీద పోయబడడానికి సిద్ధంగా ఉన్నాయి గాని ఏడవ పాత్ర పోయబడేంతవరకు (16:18,21) కుమ్మరించబడ లేదనే సత్యంచేత సమర్ధించబడుతుంది.
ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునా యెను అనే మాటలు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు: (1) ఈ సమయానికి భూమిమీద క్రీస్తు పరిపాలన అప్పటికే మొదలైపోయిందనీ, 20:4-6లో మరలా ఈలోకంపై మన ప్రభువు రాజ్యం వివరణ వచ్చేంతవరకు అధ్యా,12-19 లు పుస్తకంలోని మొదటి భాగంలో ఇప్పటికే చూసేసినవనీ. (2) “ఆయెను” అనే భూతకాల పదం ఉపయోగించడంవల్ల, భవిష్యత్తును గురించిన విషయం భూతకాలంలో నిశ్చయంగా చెప్పబడింది. (అంటే “తప్పకుండా ఆయనవి . అయిపోతాయి"). (3) పరలోకంలో నిజమైంది, భూమిమీద కూడా నిజమౌతుంది. "నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక" మత్తయి 6:10-11), లేక (4) పరలోకం కాలరహితమైన దృక్పధాన్ని కలిగి వుంటుంది, అది ఈ లోకానికి భిన్నమైనది (ఉదా: అంతిమతీర్పు సమయంలో (ప్రక 20:11-15) “ప్రతివాని మోకాలును... వంగునట్లును.... ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనును (ఫిలిప్పీ 2:10-11) అనే మాటలు జరగడానికి ముందే, పరలోకం దృష్టిలో ప్రక 5:13లోనే విశ్వంలోని “ప్రతి జీవి” దేవునిని, గొట్టిపిల్లను స్తుతిస్తాయి. మొదటి దానికంటే, చివరి మూడింటిలో ఏదైనా ఒక వివరణ సరియైనది కావచ్చు.

11:16-18 యిరువది నలుగురు పెద్దలు గురించి 4:3-4 ... నోట్సు చూడండి. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా... అంటే ప్రస్తుతం ఉనికిలో ఉన్నవాడు మాత్రమే కాక, నిత్యము ఉనికి గలిగి వున్నవాడు అని అర్థం. నీవు... యేలుచున్నావు అంటే: (1) ఏదొక భావంతో దేవుని రాజ్యం ఈ లోకంలో ఇప్పటికే ఉన్నది అని కావచ్చు (1:9) లేక (2) పరలోకంలో పాలించే దేవుని శక్తి, చివరిలోని తన కోపము అనే క్రోధపాత్రలు కుమ్మరించడడం వల్ల కనపరచబడుచు . (15:1-19:5), ఆ భాగానికి ముందున్న విరామం (అధ్యా. 12-14) తరువాత వెంటనే భూమిమీదికి రాబోతుంది. అని కావచ్చు. మృతులు తీర్పు పొందుటకు దేవుని ప్రజలకు తగిన ఫలమునిచ్చుటకు (2కొరింథీ 5:10), భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును (బహుశా “భూనివాసులకు"; 3:10; 46:9-11; 8:13 నోట్సు చూడండి) సమయము క్రీస్తు తిరిగివచ్చిన తర్వాత వస్తుంది (20:11-15).

11:19 నిబంధన మందసము ప్రత్యక్షపు గుడారములోని “అతి పరిశుద్ధ స్థలము”లో (నిర్గమ 40:3), దేవాలయములో (1రాజులు 6:19) ఉండేది. బబులోనీయులు దాడిచేసినపుడు అది నాశనమైపోయింది. (2దిన 36:19), ఇప్పుడు అది పరలోకంలోని “అతిపరిశుద్ధ స్థలము"లో కనిపించింది. 


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |