Chronicles II - 2 దినవృత్తాంతములు 28 | View All

1. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సర ములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.

2. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను.

3. మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

4. అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

5. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలు రాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

6. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

7. పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.

8. ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారుల నేమి కుమార్తెల నేమి రెండు లక్షల మందిని చెరతీసికొని పోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.

9. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెనుఆల కించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్ప గించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.

10. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?

11. యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపట్టిన వీరిని విడచి పెట్టుడి.

12. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి

13. యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు జేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.

14. కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.

15. పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.

16. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

17. రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.

18. ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.

19. ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.

20. అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

21. ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.

22. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.

23. ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.

24. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను.

25. యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

26. అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

27. ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.బైబిల్ అధ్యయనం - Study Bible
28:1-4 ఆహాజు. యోతాము కుమారుడైన ఇతడు యూదాకు పన్నెండవ రాజు. ఖచ్చితమైన విగ్రహారాధికుడు. తనకు - తానుగా సిరియాకు దాసోహమయ్యాడు. ప్రజలలో ఎప్పుడూ ఎంతో కొంత విగ్రహారాధన ఉండేది. అయితే వారిలో కొందరు మాత్రం ఎల్లప్పుడూ యెహోవాకు నమ్మకస్తులుగా ఉండేవారు. అయితే ఇంతకు ముందు రోజుల్లో, అహాబు కుటుంబంతో సంబంధమున్న అవినీతిపరులు, విగ్రహారాధికులైన రాజులు ప్రజల వ్యతిరేకతను చవిచూశారు. యోవాషు కాలంనాటికి రాజు అనుసరించిన మతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంచేసే ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆహాజు సింహాసనాసీనుడయ్యే సమయానికి, రాజుతోపాటు ప్రజలు కూడా ఖచ్చితమైన విగ్రహారాధికులుగా మారిపోయారు. ఆహాజు తన సొంత కుమారులను అగ్నిలో దహించేంతగా బయలు దేవతారాధన చేశాడు. 

28:5-8 పెకహు: ఇతడు ఇశ్రాయేలు దేశానికి పద్దెనిమిదవ రాజు, ఇశ్రాయేలు దేశానికి చివరినుంచి రెండవరాజు. యూదాపై అతి పెద్ద విజయం సాధించాడు. కానీ దేవుని ఆజ్ఞకు స్పందించి బందీలుగా చెరపట్టుకున్న వారిని విడిచి పెట్టాడు. కారణాలు-వాటి ఫలితాలు అనే నమూనా దినవృత్తాంతముల గ్రంథంలో ప్రత్యేకంగా కనబడుతుంది. ఆహాజు దేవుణ్ణి విడిచిపెట్టాడు, అందుచేత సిరియా రాజు అతణ్ణి ఓడించి అనేకులను చెరపట్టుకుపోయాడు. తరవాత ఉత్తరాది ఇశ్రాయేలు దేశపు రాజైన పెకహు కూడా యూదారాజైన ఆహాజును ఓడించాడు. యూదావారు తమ దేవుడైన యెహోవాను విసర్జించినందున ఇదంతా జరిగిందని వృత్తాంతకారుడు వ్యాఖ్యానించాడు. యూదా సైన్యంలో లక్ష ఇరువదివేల మంది. ఒక్కనాడే హతులయ్యారు. అంటే ఆహాజుకు బహుశ సైన్యంలో సగంకంటే తక్కువమంది మాత్రమే మిగిలి వుంటారు. ఇదిగాక, ఆహాజు తన కుమారుడిని, సభా ముఖ్యుడిని, ప్రధానమంత్రిని పోగొట్టుకున్నాడు. పెకహు సైన్యం అతి పెద్ద సంఖ్యలో ప్రజలను చెరపట్టుకుని, వారిని ఇశ్రాయేలు దేశపు. ముఖ్యపట్టణమైన షోమ్రోనుకు తరలించారు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు ఆ సమయంలో బద్ద శత్రువులుగా ఉన్నా, వారు సహోదరులైన వారని వృత్తాంతకారుడు మనకు జ్ఞాపకం చేశాడు. 

28:9-11 మరొకసారి ఇలాంటి సన్నివేశంలో షోమ్రోనులో నివసించే ఓదేదు అనే పేరుగల ప్రవక్త ప్రత్యక్షమయ్యాడు. విజయంతో తిరిగి వస్తున్న ఇశ్రాయేలు సైన్యాన్ని ఎదుర్కొని దేవుడు జరిగించే దైవిక న్యాయం గూర్చిన కొన్ని సత్యాలు వారికి తెలియజేశాడు. తమ తోటివారైన హెబ్రీయులను వారు సంహరించడం దేవునికి అంగీకారంగా లేదు. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన ఇశ్రాయేలీయులను ఎన్నడూ బానిసలుగా చేసుకోకూడదు. అయితే పెకహు ఇలాంటి పథకమే వేశాడు. ఇశ్రాయేలు రాజు కూడా అపరాధులలో భాగస్తుడనీ, యూదావారు భరించిన శిక్షవంటిదే ఇశ్రాయేలీయులు కూడా ఎదుర్కోవాలనీ ఓదేదు వారిని హెచ్చరించాడు. 

28:12-15 ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి చెందిన కొందరు నాయకులు తాము చేయబోతున్న తప్పిదపు తీవ్రతను గుర్తించారు. వెంటనే ఇశ్రాయేలు సైన్యం తాము చెరపట్టుకున్న యూదావారిని విడిచి పెట్టింది. వారు యూదాదేశానికి తిరిగి వెళ్ళేలా : కొందరు ఆ వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించింది. ఆ తాము . చెరపట్టుకున్న వారికి అన్నపానములిచ్చి, వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి, బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి వారిని ఖర్జూరవృక్షములు గల పట్టణమగు యెరికో వరకు తోడుకుని వచ్చారు. అక్కడ వారిని విడిచి పెట్టి తిరిగివెళ్ళారు. 

28:16-21 యూదా రాజైన ఆహాజు తీవ్రమైన వత్తిడికి లోనయ్యాడు. అప్పటికే దేశం సిరియనులు, ఉత్తర ఇశ్రాయేలు చేతిలో ఓటమి పాలయ్యింది. ఇప్పుడు ఎదోమీయులు, ఫిలిపీయులు దండెత్తివచ్చి మరింత నష్టం కలిగించారు. అయితే ఆ సమయంలో ఆహాజు సహాయం కోసం దేవుని వైపు తిరగకుండా, తానే సొంతగా సమస్య పరిష్కరించుకోడానికి ప్రయత్నించాడు. తనకు భద్రత కలిగించాలని అష్నూరు రాజైన తిధత్పిలేసరు శరణుజొచ్చాడు. తన సంపద మొత్తం, మందిరముకు చెందిన సమస్తం అష్పూరు రాజుకు సమర్పించాడు. 
తిగత్పిలేసరు దమస్కును ఓడించాడు (ఆ పట్టణంపై దండెత్తాలని ముందే అనుకున్నాడు). కానీ తరవాత యెరూషలేముపై దండెత్తి తనకు కావలసినంత దోచుకున్నాడు. 

28:22-23 ఆహాజు మరొక పరిష్కారం వెదకాలని నిర్ణయించుకున్నాడు. అంతకు ముందు సిరియనులు అతడిని ఓడించారు, దమస్కువారు వారిని ఓడించారు కాబట్టి సిరియా రాజుల దేవతలు బలమైనవని భావించి, వాటిని పూజించడం ప్రారంభించాడు (25:14-15 నోట్సు చూడండి). ఇది మరొక వృథా ప్రయత్నం. 

28:24-25 ఆహాజుకు దేవునిపై కోపం వచ్చింది. ఈ చేతగాని అబద్దపు దేవతలను ప్రసన్నం చేసుకోడానికి అతడు ఒక పరిష్కారం వెదకాడు. నిజదేవుని మందిరము అంతా ఖాళీ చేసి, తలుపులను మూసివేయించి, విగ్రహారాధనకు అధికసంఖ్యలో బలిపీఠములు కట్టించాడు. ఇవి పూర్తిగా అసంబద్ధమైన పనులు. యెషయా 7-8 అధ్యాయాలలో నమోదు చేసివున్న సంఘటనల వివరణ గమనిస్తే వీటిని మనం కొంతవరకు అర్థం చేసుకోగలం. ఆహాజు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే స్థానంలో తనను తాను నిలుపుకున్నాడు. ఫలితం ఎలావున్నా దేవుణ్ణి గెలవనివ్వకూడదని అతడు అనుకున్నాడు. సిరియనులను నమ్మలేమని, వారితో పొత్తు కుదుర్చుకోవద్దని ప్రవక్తయైన యెషయా ఆహాజును ఖండితంగా హెచ్చరించాడు. అయితే ఆహాజు ఆ గద్దింపును తిరస్కరించాడు. దేవుడు రక్షిస్తాడని తెలుసుకోడానికి ఆయనను ఒక సూచన అడగాలని యెషయా ఆహాజుకు ఒక అవకాశం ఇచ్చాడు.
అయితే తప్పుడు భక్తిని పూర్తి వేషధారణతో ప్రదర్శించాలని ప్రయత్నించిన ఆహాజు, తాను దేవుని నుంచి ఒక సూచన అడిగేంత అహంకారము ఎన్నడూ చూపించనని యెషయా మాటలకు బదులు చెప్పాడు. అయితే యెషయా ఆ విషయం అంతటితో వదిలేయలేదు. అతడు అడగక పోయినా, సూచన అనుగ్రహించబడుతుందని ఆహాజుకు తెలియజేశాడు. రాబోయే కుమారుని గూర్చిన సూచన అతనికి తెలియజేశాడు (యెషయా 7:14). ఆహాజు చేసిన పనులకు త్వరలో రాబోయే ఫలితాలను సూచిస్తూ, ఆ కుమారుడు కరువు కాలంలో ఎదుగుతాడని తెలియజేశాడు. అంతేగాక దేవుడు తన ప్రజలతో కలసి ఉంటాడనే సత్యాన్ని ఆ కుమారుడు సూచిస్తాడని తెలియజేశాడు. ఆ విధంగా భవిష్యత్తులో రాబోయే రక్షకుని గురించి ముందుగానే చూపించాడు (మత్తయి 1:23). అంటే దేవుడు తన ప్రయత్నాలను తప్పకుండా తిప్పికొట్టడానికే నిర్ణయించుకున్నాడని ఆహాజు. అర్థం చేసుకోవాలి. అందుకే సిరియాతో చేసుకున్న ఒప్పందం బెడిసికొట్టినప్పుడు, యెషయా ప్రవచించిన విధంగానే ఆహాజు యెషయా సేవిస్తున్న దేవుని నిందించాడు. 

28:26-27 ఆహాజు మరణం గురించి వృత్తాంతకారుడు క్లుప్తంగా తెలియజేశాడు. జరిగిన వాస్తవాలే విషయాలను వెల్లడిచేశాయి. 


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |